![Womans Rejection Of Ministers Free Sugar Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/10/sugar5.jpg.webp?itok=lbNWB7ww)
సాక్షి, యశవంతపుర: ఏదైనా ఉచితంగా ఇస్తామంటే ఎవరైనా ఎగబడతారు, పైగా తమకు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలని బతిమాలతారు. కానీ బాగలకోట జిల్లా బీళగిలో మంత్రి మురుగేశ్ నిరాణి అనుచరులు ఉచితంగా పంచిన చక్కెరను ఒక మహిళ ఇంటి బయట పడేసింది. ఈ వీడియో సోషల్ వీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి మద్దతుదారులు బీళగిలో ఇంటింటికీ ఉచితంగా కొంత పంచదారను పంచారు.
కార్యకర్తలు ప్యాకెట్లను ఆమె ఇంట్లోకి తీసుకెళ్లి ఇవ్వగా, వద్దని తిరస్కరించింది. లేదు, తీసుకోవాల్సిందేనని వాటిని ఇంట్లో పెట్టి వెళ్లిపోయారు. ఆమె ప్యాకెట్లను తీసి ఇంటి బయట పడేసింది. ఆమె నిజాయితీని చూసిన నెటిజన్లు అభినందించారు. ఈ వీడియోను యల్లప్ప హెగ్డే అనే సామాజిక కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
(చదవండి: పెళ్లికి వెళ్లి వస్తూ మృత్యు ఒడికి.. )
Comments
Please login to add a commentAdd a comment