ముంబై: ఆన్‌లైన్‍లో విద్వేషాలు, బెదిరింపులకు దూరంగా ఉండాలని నెటిజన్లకు పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పిలుపునిచ్చారు. కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు సవాళ్లను ఎదుర్కొంటున్నారని, ఇది ఒకరికి ఒకరు సాయంచేసుకోవాల్సిన సమయమని తెలిపారు. కానీ జనాలు ఆన్‌లైన్ వేదికగా పరస్పర దూషణలతో మనస్సులు గాయపరుచుకుంటున్నారు అన్నారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ లేఖ పోస్ట్ చేశారు.
‘ఈ ఏడాది ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సవాళ్లతో కూడుకున్నది. నెటిజన్లు తొందరపాటు నిర్ణయాలతో, దురుసుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఒకరిని ఒకరు కిందకు లాగే సమయం కాదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నెగిటివిటికి దూరంగా ఉండటంతో పాటు ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలి' అని పేర్కొన్నారు. ఇది సవాళ్లతో నిండిని సంవత్సరమని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరి పట్ల మరొకరికి దయ, అవగాహన, సహనం అవసరం అని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం అందరం కలసికట్టుగా.. ఏకతాటి పైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అసలు తాను ఆన్‌లైన్‌లో గడిపేది చాలా తక్కువ సమయమన్నారు. ద్వేషం, వ్యతిరేకతలను పక్కన పెట్టి, ఇది అందరికీ మంచి చేసే ప్రదేశంగా మారుతుందని రతన్ టాటా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరలవుతోంది. (మరో ఫేక్ న్యూస్ : రతన్ టాటా ఆందోళన)
Comments
Please login to add a commentAdd a comment