సోషల్ మీడియోలో ఫేమస్ అవ్వడం కోసం ఇటీవల చాలా విన్నూతనమైన రీతిలో వీడియోలు చేసి పెడుతుంటారు. అలాంటి ఒక్కోసారి వినోదంగానే కాక విషాదమైన ఉదంతాలు ఉన్నాయి. అలాగే మరికొన్ని పనులు మన ఊహకు కూడా అందకుండా కటకటాల పాలు చేస్తాయి. అట్లాంటి సంఘటనే ఒక దేశంలో జరిగింది.
(చదవండి: ఎర్త్‌షాట్ ప్రైజ్ గెలుచుకున్న భారత్)
ఇక్కడొక వ్యకి ఒక దుకాణం దగ్గర కెళ్లి కొన్ని వస్తువులు కొనుగోలు చేసి నేరుగా తన స్నేహితుడి కారు వద్దకు వస్తూ షర్ట్‌లోంచి ఒక తుపాకీ తీసి రకరకాలుగా ప్రదర్శిస్తాడు. ఆ తర్వాత కొన్ని డబ్బులు జేబులోంచి తీసి వాటిని రోడ్డుపై ఒక్కొక్కొటిగా విసిరుతాడు. అంతే ఒక్కసారిగా పోలీసులు వచ్చి గన్‌లు పట్టుకుని చుట్టుముట్టేస్తారు. వెంటనే అతను చేతులు పైకెత్తి లొంగిపోవడం తదనంతరం పోలీస్ అధికారి వచ్చి సంకెళ్లు వేయడం అంతా చకచకా జరిగిపోతాయి.
అచ్చం సినిమాలోని సీన్ల మాదిరిగా వెంటవెంటనే జరిగిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు వినోదం కాస్త వికటించడం అంటే ఇదేనేమో అంటూ రకరకాలుగా ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి.
(చదవండి: 9 గంటల్లో 51 పబ్‌లు చుట్టి.. ప్రతీ పబ్‌లోనూ డ్రింక్ తీసుకుని)
Comments
Please login to add a commentAdd a comment