కొండ నాలుకకు మందేస్తే...ఉన్న నాలుక ఊడిపోయనట్ల’యింది ఓ వ్యక్తి పరిస్థితి. కొత్త బీఎమ్‌డబ్ల్యూ కార్ కొన్న ఆ వ్యక్తి దాన్ని పూజ చేసి ప్రారంభిద్దామనుకున్నాడు. అదే అతడి కొంప కాదు కాదు కారును ముంచింది. పూజ చేసి వెలిగించిన అగరుబత్తి కాస్త కారుకు కూడా అంటుకోవడంతో 50 లక్షల రూపాయల విలువ చేసే కొత్త బీఎమ్‌డబ్ల్యూ కారు చూస్తుండగానే మంటల్లో కాలిపోయింది. దీనికి సంబంధిన వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.