న్యూఢిల్లీ:ఇటీవల భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సన్నిహితుడు మహఫుజ్ ఆలం సోషల్ మీడియా వేదికగా ఇటీవల భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
‘బంగ్లాదేశ్ ప్రభుత్వం వద్ద మేం ఈ విషయాన్ని లేవనెత్తాం. ఆలం పోస్టును తర్వాత తొలగించారు. బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బంగ్లా ప్రజలు, తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలను పెంపొందించుకునేందుకు భారత్ ఆసక్తితో ఉన్నప్పటికీ ఇలాంటి చర్యలు నిరాశ కలిగిస్తున్నాయి’ అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. భారత్‌లోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలంటూ ఆలం కొన్ని రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టి కొన్ని రోజుల తర్వాత తొలగించాడు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు..2200 కేసులు
కాగా, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్కడ హిందువులపై దాడులకు సంబంధించి ఏకంగా 2200 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. షేక్‌హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత హిందువులపై దాడులు పెరిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment