
వెయ్యి పదాలలో చెప్పలేని భావం.. ఒక్క ఫొటోతో చెప్పవచ్చట.. ఇది కూడా అలాంటిదే.. చిన్న మంచు ఫలకంపై ఎలుగుబంటి ముడుచుకుని పడుకున్న ఈ చిత్రం.. చూడ్డానికి మామూలుగా కనిపిస్తోంది కదూ.. అయితే నిశితంగా పరిశీలిస్తే.. ప్రకృతికి మనిషి చేస్తున్న కీడును ఈ చిత్రం తెలియజెప్పుతోంది.. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్.. దాని వల్ల మంచు ఖండాలు కరుగుతున్న తీరుకు ఇది అద్దం పడుతోంది.. అందుకే ఈ చిత్రానికి పర్యావరణంలో జంతువుల కేటగిరీలో ఇంటర్నేషనల్ గోల్డెన్ టర్టిల్ ప్రథమ పురస్కారం లభించింది. మరెక్ జకోవ్‌స్కి ఈ చిత్రాన్ని తీశారు.
మనిషి ప్రకృతికి చేస్తున్న మరో నష్టం.. ప్లాస్టిక్ కాలుష్యం.. అందుకు సముద్రాలనూ మనం వదిలిపెట్టడం లేదు.. అందుకు నిదర్శనమే ఈ చిత్రం. ఇది మాల్స్‌లో ఇచ్చే ప్లాస్టిక్ నెట్. ఇప్పుడు ఈ చేపకు మృత్యుపాశంగా మారింది.. అలాంటి నెట్‌లో చిక్కుకుని బయటపడటానికి ఇబ్బందులు పడుతున్న ఈ మత్స్యం చిత్రాన్ని పాస్క్వేల్ వాజెల్లో అనే ఫొటోగ్రాఫర్ తీశారు. హ్యూమన్స్ అండ్ నేచర్ కేటగిరీలో ద్వితీయ బహుమతిని గెలుచుకుంది ఈ చిత్రం.
ఒకరిది ఆకలి ఆరాటం, మరొకరిది బతుకు పోరాటం. పర్వతపు మేకపిల్లను వేటాడుతున్న తోడేలు చిత్రాన్ని తీసిన ఫొటోగ్రాఫర్ హయువాన్ టాంగ్. జంతువుల ప్రవర్తన కేటగిరీలోప్రథమ బహుమతిని గెలుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment