అజిత్ కెమెరాలో...శ్రుతీహాసన్ అందాలు | Ajith Captures Shruti Haasan's Beauty in His Camera | Sakshi
Sakshi News home page

అజిత్ కెమెరాలో...శ్రుతీహాసన్ అందాలు

Published Tue, Jul 14 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM

అజిత్ కెమెరాలో...శ్రుతీహాసన్ అందాలు

అజిత్ కెమెరాలో...శ్రుతీహాసన్ అందాలు

ఈ హీరో... కెమేరా వీరుడు
హీరో అజిత్‌కు ఎప్పట్నుంచో ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ముందు అవుట్‌డోర్ ఫొటోగ్రఫీ ప్రాక్టీస్ చేశారు. కొన్ని కెమెరాలు కూడా కొనుక్కున్నారు. అవుట్‌డోర్ ఫొటోగ్రఫీ నేర్చుకున్నాక, ఇన్‌డోర్ ఫొటోగ్రఫీ మొదలుపెట్టారు. షూటింగ్ లొకేషన్‌లో కెమెరామ్యాన్ దగ్గర టిప్స్ తీసుకుంటుంటారు. ఖాళీ సమయంలో లైటింగ్ గురించి తెలుసుకుంటుంటారు. దీన్నిబట్టి ఫొటోగ్రఫీ మీద ఆయనకెంత మక్కువ ఉందో ఊహించవచ్చు. ఆ మక్కువతోనే ఫారిన్ షూటింగ్‌లో శ్రుతీహాసన్‌కి ఫోటోలు తీశారు. దెబ్బకు శ్రుతి ఫ్లాటై పోయారు.

ఆ రోజు ఎప్పటిలానే హీరో అజిత్, హీరోయిన్ శ్రుతీహాసన్ షూటింగ్ లొకేషన్‌కు వెళ్లారు. నటించాల్సిన సన్నివేశాలేంటో తెలుసుకుని, చిత్రీకరణలో పాల్గొన్నారు. అజిత్‌లో మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి పాకశాస్త్ర ప్రవీణుడు కూడా ఉన్నాడు.  మామూలుగా తాను ఏ సినిమాలో నటించినా అది పూర్తయ్యేలోపు అజిత్ స్వయంగా బిర్యానీ వండి, చిత్రబృందానికి వడ్డిస్తారు. ఆయన చేతి బిర్యానీ రుచి చూసినవాళ్లు ‘విందు బ్రహ్మాండం’ అంటుంటారు. ఏ.ఎం. రత్నం నిర్మాతగా శ్రుతీహాసన్‌తో చేస్తున్న తమిళ చిత్రం (ఇంకా టైటిల్ ఖరారు కాలేదు) బృందానికి కూడా బిర్యానీ రుచి చూపించారు అజిత్.

తాజాగా, అజిత్‌లో మంచి ఫొటోగ్రాఫర్ కూడా ఉన్నాడని ప్రూవ్ అయ్యింది. ఈ కెమెరా నైపుణ్యాన్ని శ్రుతిహాసన్ మీదే ప్రదర్శించారు అజిత్. ఇటలీలోని మిలన్‌లో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలో షాట్ గ్యాప్‌లో సరదాగా కెమెరామ్యాన్ నుంచి కెమెరా తీసుకుని, శ్రుతీహాసన్ ఫొటోలు తీశారు అజిత్. నలుపు, తెలుపు ఫొటోలతో పాటు రకరకాల రంగుల చిత్రాలు తీసి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. చెయ్యి తిరిగిన ఫొటోగ్రాఫర్ తీసినట్లున్న ఆ ఫొటోలను శ్రుతీహాసన్ నెట్‌లో పోస్ట్ చేశారు. ‘‘నా అభిమాన హీరోల్లో అజిత్ సార్ ఒకరు. ఆయన మంచి చెఫ్... చక్కని ఫొటోగ్రాఫర్. నన్నెంతో అద్భుతంగా ఫొటో తీశారు. ఆయనకు ధన్యవాదాలు. ఇవి దాచుకోదగ్గ ఫొటోలు’’ అని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement