వేడిలో... చల్లని కబురు | Shruti Haasan confirmed for Ajith Kumar's next | Sakshi
Sakshi News home page

వేడిలో... చల్లని కబురు

Published Tue, Apr 7 2015 11:12 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

వేడిలో... చల్లని కబురు - Sakshi

వేడిలో... చల్లని కబురు

 డేట్స్ లేవన్న కారణంతో నాగార్జున, కార్తీల మల్టీస్టారర్ నుంచి తప్పుకుని ఆ చిత్ర నిర్మాతలైన పి.వి.పి. సంస్థ వారిని కోర్టు గడప తొక్కేలా చేశారు శ్రుతీహాసన్. దాంతో, ప్రస్తుతానికి ఏ ఇతర సినిమాలు ఒప్పుకోకుండా కోర్టు ఆంక్షలు విధించింది. ఆ విషయంలో రాజీ కుదిరిందో, లేదో కానీ, శ్రుతికి మాత్రం ఓ బంపర్ ఆఫర్ తగిలింది.  తమిళ సూపర్‌స్టార్ అజిత్ హీరోగా నటించనున్న సినిమాలో ఆమె చాన్స్ కొట్టేశారు. తెలుగు తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన తెలుగు వ్యక్తి ఏఎం రత్నం ఈ సినిమాకు నిర్మాత. సిరుతై శివ  దర్శకుడు. ఆంక్షల మాట ఎలా ఉన్నా, ఈ సినిమా వార్త తెలిశాక అజిత్ పక్కన నటించే తొలి చాన్స్ కొట్టేసిన శ్రుతీ లక్కీయే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement