
ఈ కోతికి కొంచెం యాక్టింగ్ పిచ్చి.. ఎప్పటికైనా సినిమాల్లో స్టార్ అయిపోవాలని కలలుగంటోంది..పైగా.. చావు సీన్లలో యాక్ట్ చేయడంలో స్పెషలైజేషన్ కూడా ఉంది. ఎంతలా అంటే యాక్టింగా.. లేక నిజంగానే చచ్చిందా అన్నది సాటి కోతులు కూడా కనిపెట్టలేవు. ఫొటోగ్రాఫర్ ఫెడ్రికా(ఇటలీ) కూడా చనిపోయిందనే అనుకున్నారు. ఇంతలో ఎవరు కట్ అన్నారో తెలియదుగానీ.. చటుక్కున లేచి కూర్చుందట. కామెడీ వైల్డ్ లైఫ్ అవార్డ్స్ జ్యూరీ మెచ్చిన చిత్రమిది.
ఇట్స్ ఏ గోల్..
ఈ గద్ద.. మెస్సీ ఫ్యాన్ అట. ఈ మధ్యే ఫిఫా వరల్డ్ కప్ చూసొచ్చింది. అప్పటి నుంచీ ఇదే వరుస. గోల్ మీద గోల్ కొట్టేస్తోంది. ఏమో.. ఎప్పుడైనా తమ గద్దల్లోనూ ఫుట్ బాల్ పోటీపెడితే.. పనికివస్తుందని ఇప్పటి నుంచే తెగ ప్రాక్టీస్ చేస్తోంది. జియా చెన్ తీసిన ఈ చిత్రం కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పోటీల్లో అమేజింగ్ ఇంటర్నెట్ పోర్ట్‌ఫోలియో పురస్కారాన్ని గెలుచుకుంది.
సాక్షి సెంట్రల్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment