Wildlife Photography
-
రమణీయం.. ఛాయాచిత్రం
గుంటూరు మెడికల్: నాడి పట్టి రోగాలను నయం చేయటంలో నిత్యం బిజీగా ఉండే గుంటూరుకు చెందిన ఓ వైద్యుడు వైల్డ్ ఫొటోగ్రఫీలో అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకుని గుంటూరు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఒకపక్క జనరల్ ఫిజీషియన్‌గా రోగుల ప్రాణాలు కాపాడుతూ.. మరో పక్క అడవుల్లో సంచరించే క్రూర మృగాల కదలికలను తన కెమెరాతో క్లిక్‌మనిపించి బ్రిటిష్ రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ వారి ఏఆర్పీఎస్ ఫెలోషిప్‌ను అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 22 ఎంట్రీలు ఈ ఫెలోషిప్‌కు పోటీపడగా కేవలం నాలుగు మాత్రమే సొసైటీ ఆమోదం పొందాయి. వాటిలో భారత దేశం నుంచి ఫెలోషిప్ పొందిన ఏకైక వ్యక్తిగా డాక్టర్ నరేంద్ర వెంకటరమణ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఏఆర్పీఎస్ ఫెలోషిప్ అందుకున్న ఏకైక వ్యక్తిగా డాక్టర్ వెంకటరమణ రికార్డు సృష్టించారు. ఏడేళ్లుగా కెమెరాతో గురి.. డాక్టర్ నరేంద్ర వెంకటరమణ మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అడవుల్లో రాయల్ బెంగాల్ టైగర్‌పై చిత్రీకరించిన డాక్యుమెంటరీకి అంతర్జాతీయ అవార్డు లభించింది. డాక్టర్ వెంకటరమణ ఏడు సంవత్సరాలు మూడు తరాలకు చెందిన 80 పులుల ఫొటోలు తీసి అంతర్జాతీయ పోటీలకు పంపించగా, న్యాయ నిర్ణేతలు ఆ ఫొటోలకు మంత్ర ముగ్ధులై ఆయనకు సాహస ఫొటోగ్రఫీకి అవార్డు ప్రకటించారు. డాక్టర్ వెంకటరమణ గత 15 ఏళ్లుగా వన్య ప్రాణుల చాయాచిత్రాలు తీసేందుకు ఆఫ్రికా, కెన్యా, టాంజానియా దేశాలతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోని వన్య ప్రాణుల కేంద్రాలను సందర్శించి, జంతువుల జీవన విధానం, వివిధ దశల్లో వాటి పెరుగుదల, కలిసి మెలిసి జీవించే దృశ్యాలు, వేటాడే దృశ్యాలు తీశారు. చిన్ననాటి నుంచే ఆసక్తి.. డాక్టర్ నరేంద్ర వెంకటరమణ తండ్రి డాక్టర్ గోపాలరావు రైల్వేలో మెడికల్ సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి. దీంతో ఒక పక్క తండ్రి మాదిరిగా వైద్యుడు అవ్వాలనే లక్ష్యంతో డాక్టర్ కోర్సు అభ్యసిస్తూనే 2000 సంవత్సరం నుంచి ఫొటోగ్రఫీలో సైతం మెలకువలు నేర్చుకున్నారు. కర్నాటకు చెందిన డీఎన్ఏ పెరుమాళ్, కేరళ రాష్ట్రానికి చెందిన ప్రవీణ్ మోహన్‌దాస్‌ల వద్ద శిష్యుడిగా చేరి వైల్డ్ ఫొటోగ్రఫీలో మెలకువలు నేర్చుకున్నాడు. ఏడాదికి ఒకసారి ప్రకృతితో మమేకం అయ్యేందుకు అడవులకు వెళ్లి జంతువులు, పక్షుల ఫొటోలను తన కెమెరా కళ్లతో బంధిస్తున్నారు. చేతితో చిత్రాలు గీసే కల్చర్ ఆర్ట్‌లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు. గిటారు, కీబోర్డు, డ్రమ్స్, వాయించడంతోపాటు ఫ్లూట్తో పలు గీతాలను ఆలపించడంతో సైతం నైపుణ్యం ఉంది. అందుకున్న డిగ్రీలు, అవార్డులు... ఫొటోగ్రఫీలో డాక్టర్ వెంకటరమణ నైపుణ్యాన్ని గుర్తించిన అమెరికా దేశంలోని పలు సంస్థలు డిగ్రీలను అందజేశాయి. ఇంగ్లండ్‌కు చెందిన ఏఆర్పీఎస్, అమెరికాకు చెందిన ఎంఐఐసీఎస్, ఈయూఎస్పీఏ, ఆ్రస్టేలియాకు చెందిన ఏఏపీఎస్, ఇండియాకు చెందిన ఏఐఐపీసీ సంస్థలు, అసోసియేట్ ఆఫ్ ఇంటర్నేషన్ కొలీగ్స్ సొసైటీ, అసోసియేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్ ఫొటోగ్రఫీ అకాడమీ, ఫెలో ఆఫ్ ఇంటర్నేషనల్ కొలీగ్స్ సొసైటీ ఫొటోగ్రఫీలో మాస్టర్ డిగ్రీలను, ఫెలోషిఫ్లను అందించాయి. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫొటోగ్రఫీ కౌన్సిల్ ఢిల్లీ, కేరళ సొసైటీ బెటర్ ఆర్ట్ ఫౌండేషన్, ఏపీ ఫొటోగ్రఫీ అకాడమీ, పలు జాతీయ సంస్థల నుంచి 15కు పైగా అవార్డులను, ఇంటర్నేషనల్ యాక్సిటెన్సీ 200లకు డాక్టర్ వెంకటరమణ అవార్డు అందుకున్నారు. -
అట్లుంటది మన యాక్టింగ్.. పోలా అదిరిపోలా!
ఈ కోతికి కొంచెం యాక్టింగ్ పిచ్చి.. ఎప్పటికైనా సినిమాల్లో స్టార్ అయిపోవాలని కలలుగంటోంది..పైగా.. చావు సీన్లలో యాక్ట్ చేయడంలో స్పెషలైజేషన్ కూడా ఉంది. ఎంతలా అంటే యాక్టింగా.. లేక నిజంగానే చచ్చిందా అన్నది సాటి కోతులు కూడా కనిపెట్టలేవు. ఫొటోగ్రాఫర్ ఫెడ్రికా(ఇటలీ) కూడా చనిపోయిందనే అనుకున్నారు. ఇంతలో ఎవరు కట్ అన్నారో తెలియదుగానీ.. చటుక్కున లేచి కూర్చుందట. కామెడీ వైల్డ్ లైఫ్ అవార్డ్స్ జ్యూరీ మెచ్చిన చిత్రమిది. ఇట్స్ ఏ గోల్.. ఈ గద్ద.. మెస్సీ ఫ్యాన్ అట. ఈ మధ్యే ఫిఫా వరల్డ్ కప్ చూసొచ్చింది. అప్పటి నుంచీ ఇదే వరుస. గోల్ మీద గోల్ కొట్టేస్తోంది. ఏమో.. ఎప్పుడైనా తమ గద్దల్లోనూ ఫుట్ బాల్ పోటీపెడితే.. పనికివస్తుందని ఇప్పటి నుంచే తెగ ప్రాక్టీస్ చేస్తోంది. జియా చెన్ తీసిన ఈ చిత్రం కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పోటీల్లో అమేజింగ్ ఇంటర్నెట్ పోర్ట్‌ఫోలియో పురస్కారాన్ని గెలుచుకుంది. సాక్షి సెంట్రల్‌డెస్క్ -
బావా.. బ్యాక్సైడు దేఖో..! పో.. ఇక నీకు నాకు కటిఫ్..!
చూడు కొంగ బావా.. ముందు చూపు ఉండాలి.. కానీ.. అప్పుడప్పుడు వెనుక వైపు కూడా ఓ లుక్కేసుకోవాలి.. ఇప్పుడు చూడు ఏమైందో.. ఇంతకీ ఏమైంది.. ఏమో మరి.. ఈ ఫొటో తీసిన జీన్ జాక్వస్(ఫ్రాన్స్) ఆ విషయాన్ని చెప్పలేదు మరి.. కొంగను మింగేస్తున్నట్లు ఉన్న ఈ నీటి గుర్రం ఫొటో కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ 2022 అవార్డుల్లో ‘స్పెక్ట్రం ఫొటో క్రీచర్స్ ఆఫ్ ద ఎయిర్’ విభాగంలో మొదటి ప్రైజును గెలుచుకుంది.. ఏ విషయంలో గొడవొచ్చిందో తెలియదు గానీ.. ఇక నుంచి నీకు నాకు కచ్చి అని అనేసుకున్నాయి ఈ రెండు పెంగ్విన్లు.. ఆ సమయంలో అక్కడే ఉన్న జెన్నిఫర్ హాడ్లీ అనే ఫొటోగ్రాఫర్ ఈ సీన్‌ను క్లిక్‌మనిపించారు. రెండింటి మధ్య మళ్లీ ఫ్రెండ్షిప్ కోసం జెన్నిఫర్ ట్రై చేశారు గానీ.. వర్కవుట్ కాలేదట. అయితే, ఈ ఫొటో మాత్రం వర్కవుట్ అయింది. కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పోటీల్లో పీపుల్స్ చాయిస్ అవార్డును కైవసం చేసుకుంది. -
అన్ కండిషనల్ లవ్
మాఫియా దాడిలో తన వారందరినీ పోగొట్టుకుందా గొరిల్లా. రెండు నెలల పసికందుగా నేషనల్ పార్క్ రేంజర్‌కు దొరికింది. ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నాడు రేంజర్ ఆండ్రే బవుమా. 13 ఏళ్లపాటు కంటికిరెప్పలా కాపాడాడు. ఆ నిస్వార్థ ప్రేమకు ప్రతిరూ పం ఈ చిత్రం. అనారోగ్యంతో ఉన్న ఆ గొరిల్లా తన ఆఖరి గడియ ల్లోనూ రేంజర్‌ను వదిలిపెట్టలేదు. అతని ఒడిలోనే శాశ్వతంగా కన్ను మూసింది. కాంగోలోని విరుంగా నేషనల్ పార్క్‌లో ఫొటో జర్నలిస్ట్ బ్రెంట్ స్టిర్టన్ తీసిన ఈ చిత్రం... ఫొటో జర్నలిజం కేటగిరీలో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్–2022 అవార్డును దక్కించుకుంది. -
స్నేక్గారూ.. స్మైల్ ప్లీజ్..
పాము నవ్వడం మీరెప్పుడైనా చూశారా.. లేదా.. ఇప్పుడు చూసేయండి.. జంతువులకు సంబంధించిన ఫన్నీ ఫొటోలు తీసేవారి కోసం ఏటా కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పురస్కారాలను ఇస్తారు. ఈ ఏడాది మొత్తం7 వేల ఎంట్రీలు రాగా.. అందులోని 42 చిత్రాలను ఫైనలిస్టులుగాజ్యూరీ ఎంపిక చేసింది. (చదవండి: Viral Video: సిగ్గు విడిచిన పాము!) అందులోనిదే ఈ వైన్ స్నేక్ ఫొటో.. దీన్ని భారత్‌కు చెందిన ఆదిత్య తీశారు. ‘ఆ పాము దగ్గరికి ఎవరైనా వెళ్తే.. బెదిరించడానికి ఇలా నోరు పెద్దగా తెరుస్తుంది. కానీ ఆ రోజున బెదిరించడానికి నోరు తెరిచినా.. చూడ్డానికి నవ్వుతున్నట్లుగా వచ్చింది’ అని ఆదిత్య చెప్పారు. లాఫింగ్ స్నేక్‌తో పాటు మిగతా ఫోటోలను కూడా చూడండి. పైడ్ స్టార్లింగ్ మండే మార్నింగ్ మూడ్ ఫోటో బై ఆండ్రూ మేయెస్, దక్షిణాఫ్రికా పెంగ్విన్ల సరదా ఆటలు ఫోటో బై కరోల్ టేలర్, యూకే ఈత నేర్చుకుందువుగాని పద అంటున్న ఒట్టర్ ఫోటో బై చీ కీ టీయో, సింగపూర్ జిరాఫీపై సవారీ చేస్తున్న కోతి ఫోటో బై డిర్క్-జాన్ స్టీహౌవర్, నెదర్లాండ్స్ భారతీయ ఊసరవెల్లి రాజసం ఫోటో బై గురుమూర్తి కే, ఇండియా కోతి బావా సరదా తీరింది ఫోటో బై కెన్ జన్సాన్, యూకే వామప్స్ చేస్తున్న కంగారు ఫోటో బై లీ స్కాడెన్, ఆస్ట్రేలియా నా అనుమతి లేకుండా నా ఫోటో తీస్తావా అంటున్న రూబీ క్రౌన్డ్ కింగ్లెట్ ఫోటో బై పాట్రిక్ డిర్లామ్, అమెరికా నా డ్యాన్స్ ఎలా ఉందంటున్న కొండముచ్చు ఫోటో బై సరోష్ లోధి, భారతదేశం ఆడపులి రాజసం ఫోటో బై సిద్ధాంత్ అగర్వాల్, భారతదేశం బాల్డ్ ఈగిల్ ఫోటో బై డేవిడ్ ఎప్లీ, అమెరికా డోంట్ వర్రీ.. బీ హ్యాపీ అంటున్న తూనీగ ఫోటో బై క్సెల్ బాకర్, జర్మనీ సేద దీరుతున్న బాబూన్ ఫోటో బై క్లెమెన్స్ గినార్డ్, ఫ్రాన్స్ -
వెలుగు ఛాయల అడవి చుక్క.
ఫ్రేమ్‌ని కాస్త వైడ్ చేసింది ఐశ్వర్య. మిణుగురులలోకి నక్షత్రాలు వచ్చి చేరాయి. పచ్చని పాలపుంత విచ్చుకుంది. కడలి నురుగై కాంతి పరచుకుంది. టాపిక్‌కి కరెక్టు సెట్టింగ్. ఫొటో తీసి పోటీకి పంపింది. అండ్ ది అవార్డ్ గోస్ టు.. ఐశ్వర్య! వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీలో తొలి భారతీయ మహిళా విజేత! వెలుగు ఛాయల అడవి చుక్క. ఫొటోగ్రఫీలో ఐశ్వర్యకు వచ్చిన అవార్డులను, ఆమె ప్రతిభా విశేషాలను చెప్పుకోవడం మొదలు పెడితే ఆ మహారణ్యంలో ఎక్కడో దారి తప్పుతాం. లేదంటే, ఎంతకూ తరగని ఒక ఫొటో అల్బమ్‌ను రోజంతా తిప్పుతూ కూర్చోవడమే. ఇంతా చేసి ఈ అమ్మాయి వయసు ఇరవై మూడు! ఇప్పుడు ఇంకొక ఘనత. ‘వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ! ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల నుంచి 50 వేల మంది పోటీకి ఎంట్రీలను పంపితే ఐశ్వర్య తీసిన ‘లైట్స్ ఆఫ్ ప్యాషన్’ ఫొటో దగ్గర జడ్జీల కళ్లన్నీ ఆగిపోయాయి! వండర్ఫుల్ అన్నారు. పదివేల పౌండ్ల ప్రైజ్ మనీ. అవుట్‌స్టాండింగ్ అన్నారు. ట్రోఫీ. కంగ్రాచ్యులేషన్స్ అన్నారు. ప్రత్యేక ప్రశంశాపటం. పదివేల పౌండ్లంటే సుమారు పది లక్షల రూపాయలు. ఒక మంచి కేనన్ కెమెరా కొనడానికి అయ్యే ఖర్చుకు మాత్రమే ఆ మొత్తం సమానం అయినది కావచ్చు. కానీ, లండన్‌లోని ‘నేచురల్ హిస్టరీ మ్యూజియం’ నుంచి చిన్న గుర్తింపునైనా పొందడం వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లకు చిన్న వయసులోనైనా జీవిత సాఫల్య పురస్కారమే! పోటీలో విజేత ఎంపిక అంత టఫ్‌గా ఉంటుంది. ఫొటోలు తియ్యమని వాళ్లిచ్చే థీమ్ కూడా ఫ్రేమ్‌లో ఎలా ఇమడ్చాలో తెలియని విధంగా ఉంటుంది! ‘వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్–2020’ విజేతగా ఐశ్వర్యను నిలబెట్టిన ఫొటో ‘లైట్స్ ఆఫ్ ప్యాషన్’. బిహేవియర్ : ఇన్‌వెర్టిబ్రేట్స్.. ఇదీ నేచురల్ హిస్టరీ మ్యూజియం ఈ ఏడాది ఇచ్చిన ఫొటోగ్రఫీ పోటీ థీమ్. భూమి మీద కానీ, గాలిలో గానీ, నీటి మీద గానీ కనిపించే వెన్నెముక ఉండని ప్రాణుల నడవడికను ఫొటో తియ్యాలి! టాపిక్ వినగానే.. పోటీకి ఉత్సాహపడుతున్న ‘వైల్డ్’ ఫొటోగ్రాఫర్ల మెడలలోని కెమెరాలు సగానికన్నా ఎక్కువ తక్కువగా చేతుల్లోంచి కిందికి వాలిపోతాయి. మిగిలిన వాళ్లలో ఐశ్వర్య ఉండనే ఉంటారు. పన్నెండేళ్ల వయసు నుంచి అరణ్యాలను చూస్తోంది ఐశ్వర్య. అరణ్యాలలోని ఇన్‌వెర్టిబ్రేట్స్ నడవడికల్ని చూడలేదా?! ఈ పోటీ కోసం మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లోని భందర్దరా అడవుల్లోకి రాత్రిపూట వెళ్లి అక్కడి మిణుగురులను (ఫైర్‌ఫ్లైస్) ఎంపిక చేసుకుంది ఐశ్వర్య. అవి ఒక చెట్టునిండా ఉన్నాయి. చెట్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఫ్రేమ్‌లోకి చెట్టును, మిణుగురులను తీసుకుంది. ఊహు.. ఇలాక్కాదు అనుకుంది. ఫ్రేమ్‌ని కొంచెం వైడ్ చేసింది. మరికొంచెం చేసింది. నక్షత్రాలను, ఆకాశాన్నీ ఫ్రేమ్‌లోకి లాక్కుంది. ఇక చూడండి. అదొక పాలపుంత. చుక్కల భ్రమణం. ఆ ఫొటోకి ‘లైట్స్ ఆఫ్ ప్యాషన్’ అని పేరు పెట్టి పోటీకి పంపించింది. మోహన కాంతులు అని! అంతే. అవార్డు గ్రహీతగా ఆమె ఫొటో క్లిక్ మంది. గత మంగళవారం లండన్ నుంచి వర్చువల్‌గా (స్క్రీన్‌పై) జరిగిన వేడుకలో విజేతగా ఐశ్వర్య పేరును ప్రకటించింది ‘నేచురల్ హిస్టరీ మ్యూజియం’. ఐశ్వర్య వైల్డ్‌లైఫ్ మీద, ఆడపులుల మీద కొన్ని డాక్యుమెంటరీలు కూడా తీసింది. మాస్ మీడియాలో పట్టభద్రురాలు. పుట్టింది, ఉంటున్నదీ ముంబైలో. తండ్రి శ్రీధర్ రంగనాథన్ బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీలో సభ్యుడు. తండ్రితోపాటు అరణ్య పర్యటనలకు వెళుతుండేది ఐశ్వర్య. అలా ఆమెకు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ మీద ఆసక్తి ఏర్పడింది. తల్లి రాణి సపోర్ట్ కూడా ఉంది. -
పులికి, గద్దకు పురస్కారం!
సాక్షి, హైదరాబాద్/జన్నారం: వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా (డబ్ల్యూసీఎస్) జాతీయ స్థాయిలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో తెలంగాణ అటవీశాఖకు రెండు అవార్డులు దక్కాయి. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ‘‘బెస్ట్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫ్స్–2020’’పేరుతో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రానికి ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. ఆదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖర రావు.. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని తిప్పేశ్వర్ అభయారణ్యంలో తీసిన రాయల్ బెంగాల్ టైగర్ ఫొటో రెండవ, జన్నారం డివిజనల్ అధికారి సిరిపురపు మాధవరావు.. కవ్వాల్ అభయారణ్యంలో తీసిన అరుదైన జాతి గద్ద ఫొటో(క్రెస్టెడ్ హాక్ ఈగల్) మూడవ స్థానంలో నిలిచాయి. ప్రథమ అవార్డును అసోంలోని కజిరంగ నేషనల్ పార్క్‌లో ఆసియా జాతి ఏనుగు ఫొటో తీసిన అక్షదీప్ బారువా(చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, లోయర్ అసోం జోన్) గెలుచుకున్నారు. నాలుగు, ఐదు అవార్డులు వరుసగా రాహుల్ సింగ్ సికర్వార్(ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్–మధ్యప్రదేశ్) తీసిన ఆసియా జాతి సింహం ఫొటో, అయాన్ పాల్(ఇన్స్పెక్టర్–కస్టమ్స్ డివిజన్, గువాహటి) తీసిన రెడ్ పాండా ఫొటోకు లభించాయి. కాగా, కవ్వాల్ పులుల అభయారణ్యంలోని జన్నారం అటవీ డివిజన్లో తీసిన వివిధరకాల వన్యప్రాణులు, పక్షుల ఫొటోలను డబ్ల్యూసీఎస్ ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు అభినందనలు తెలియజేయడం విశేషం. అవార్డులు సాధించిన రాష్ట్ర అధికారులను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. చాలా ఆనందంగా ఉంది.. కవ్వాల్ పులుల అభయారణ్యంలో ప్రధానంగా వన్యప్రాణుల సంరక్షణపై దృష్టి ఉండేది. నేను వచ్చిన తర్వాత ఇక్కడ వన్యప్రాణులతో పాటు పక్షుల సందడీ గమనించా. బర్డ్ ఫెస్టివల్ సందర్బంగా కొందరు నిపుణులు ఇక్కడికి వచ్చి అరుదైన ఫొటోలు తీశారు. వారిని చూసి మేము కూడా ఇక్కడి పక్షులు, వన్యప్రాణుల ఫొటోలు కొన్ని తీశాం. అందులో నేను తీసిన ఫొటో జాతీయ స్థాయిలో ఎంపికవడం ఆనందంగా ఉంది. – మాధవరావు, ఎఫ్‌డీవో, జన్నారం -
నరకం అంటే ఇదేనేమో...
సాక్షి, కోల్‌కతా : ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో ఈ మధ్యే బంకుర జిల్లాలో చోటు చేసుకుంది. సమీపంలోని అడవి నుంచి జన సంద్రంలోకి వచ్చేందుకు యత్నించిన ఏనుగును, దాని గున్నను అక్కడి గ్రామస్తులు ఇలా చెదరగొడుతున్నారన్న మాట. ఓ తల్లి ఏనుగు, ఓ పిల్ల ఏనుగును చెదరగొట్టేందుకు బాణా సంచా, తారా జువ్వలను ప్రజలను కాల్చారు. అయితే ఆ మంటలు వాటి మీద పడిపోగా.. ఆ వేడికి తాళలేక ఇదిగో ఇలా బాధతో రోదిస్తూ పరిగెడుతున్నాయి. ఆసమయంలో అక్కడే ఉన్న విప్లవ్ హజ్రా అనే ఓ వైల్డ్ ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోను క్లిక్ మనిపించాడు. అంతేకాదు ఆ ఫోటోను ఈ యేడు శాంక్చరీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అవార్డుల పోటీకి పంపించగా.. హెల్ ఈజ్ హియర్ (నరకం ఇక్కడే ఉంది) అన్న ట్యాగ్ లైన్‌తో ఆ ఫోటోకు అవార్డు కూడా దక్కింది. ఈ విషయాన్ని శాంక్చురీ ఏషియా తమ అధికారిక ఫేస్బుక్ లో ప్రకటించింది. అస్సాం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఇలా ఏనుగుల దాడుల వ్యవహారం సర్వసాధారణంగా మారిపోయింది. ఇది ఈ ఒక్కనాటి సమస్య కాదు. పట్టణీకరణ పేరిట అడవులను నరక్కుంటూ పోవటంతో అవి ఎటువెళ్లాలో తెలీక ఇలా గ్రామాల వైపు దూసుకొస్తున్నాయి. తమ మనుగడ కోసం కొందరు చేసే యత్నానికి మూగ ప్రాణులు బలౌతున్నాయని జంతు ప్రేమికుల ఆరోపణ. ఆశ్రయం ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లే క్రమంలో అవి వేటగాళ్ల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి కూడా. 2014 నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా సుమారు 84 ఏనుగులు ఇలా మృత్యువాత పడ్డాయని గణాంకాలు చెబుతుండగా.. ఆ సంఖ్య ఎక్కువే ఉండొచ్చని బంకులా జిల్లా ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోపై పలువురు తమ శైలిలో స్పందిస్తున్నారు. -
లెన్స్ అండ్ లైఫ్...
యాభై ఏళ్ల కిందట క్లిక్‌మనే కెమెరాను చూసి ముచ్చటపడ్డారు. తోటివాళ్ల కెమెరాతో ఆ చిట్టి చేతులు తీస్తున్న అద్భుతాలు చూసిన అతడి తల్లి మైమరిచిపోయింది. అందుకే ఏడో తరగతిలోనే కుర్రాడికి మంచి కెమెరా కొనిచ్చింది. అంతే అప్పటి నుంచి ఆ కెమెరా క్లిక్‌మంటూనే ఉంది. ప్రకృతితో పెనవేసుకున్న అనుబంధం.. అత డిని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ వైపు నడిపించింది. కొండల్లో, కోనల్లో, అడవుల్లో సంచరిస్తూ.. అక్కడ పరుచుకున్న ప్రక ృతిని తన కెమెరాతో ఒడిసిపట్టారు. అక్కడ సంచరిస్తున్న జంతుజాలాన్ని తన ఫొటోగ్రఫీ మాయాజాలంతో అందంగా చూపించారు. వీటన్నింటితో పాటు ప్రముఖ దినపత్రికల్లో పనిచేస్తున్న ఎంతోమంది ఫొటోగ్రాఫర్లకు ఓనమాలు నేర్పిన మాదిరెడ్డి రాంగోపాల్‌తో ఈ వారం లెన్స్ అండ్ లైఫ్...