Comedy Wildlife Photography Awards 2021: Laughing Snake and Other Finalist Year - Sakshi
Sakshi News home page

స్నేక్‌గారూ.. స్మైల్‌ ప్లీజ్‌..

Published Sun, Sep 5 2021 11:24 AM | Last Updated on Sun, Sep 5 2021 2:13 PM

Comedy Wildlife Photo Awards Laughing Snake And Other Finalist From This Year - Sakshi

కామెడీ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీ పురస్కారాలకు ఎంపికైన వైన్‌ స్నేక్‌ ఫోటో

పాము నవ్వడం మీరెప్పుడైనా చూశారా.. లేదా.. ఇప్పుడు చూసేయండి.. జంతువులకు సంబంధించిన ఫన్నీ ఫొటోలు తీసేవారి కోసం ఏటా కామెడీ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీ పురస్కారాలను ఇస్తారు. ఈ ఏడాది మొత్తం7 వేల ఎంట్రీలు రాగా.. అందులోని 42 చిత్రాలను ఫైనలిస్టులుగాజ్యూరీ ఎంపిక చేసింది. (చదవండి: Viral Video: సిగ్గు విడిచిన పాము!)

అందులోనిదే ఈ వైన్‌ స్నేక్‌ ఫొటో.. దీన్ని భారత్‌కు చెందిన ఆదిత్య తీశారు. ‘ఆ పాము దగ్గరికి ఎవరైనా వెళ్తే.. బెదిరించడానికి ఇలా నోరు పెద్దగా తెరుస్తుంది. కానీ ఆ రోజున బెదిరించడానికి నోరు తెరిచినా.. చూడ్డానికి నవ్వుతున్నట్లుగా వచ్చింది’ అని ఆదిత్య చెప్పారు. లాఫింగ్‌ స్నేక్‌తో పాటు మిగతా ఫోటోలను కూడా చూడండి.


పైడ్ స్టార్లింగ్ మండే మార్నింగ్‌ మూడ్‌ ఫోటో బై ఆండ్రూ మేయెస్, దక్షిణాఫ్రికా


పెంగ్విన్ల సరదా ఆటలు ఫోటో బై కరోల్ టేలర్, యూకే


ఈత నేర్చుకుందువుగాని పద అంటున్న ఒట్టర్‌ ఫోటో బై చీ కీ టీయో, సింగపూర్


జిరాఫీపై సవారీ చేస్తున్న కోతి ఫోటో బై డిర్క్-జాన్ స్టీహౌవర్, నెదర్లాండ్స్‌


భారతీయ ఊసరవెల్లి రాజసం ఫోటో బై గురుమూర్తి కే, ఇండియా


కోతి బావా సరదా తీరింది ఫోటో బై కెన్‌ జన్సాన్‌, యూకే


వామప్స్‌ చేస్తున్న కంగారు ఫోటో బై లీ స్కాడెన్, ఆస్ట్రేలియా


నా అనుమతి లేకుండా నా ఫోటో తీస్తావా అంటున్న రూబీ క్రౌన్డ్‌ కింగ్‌లెట్‌ ఫోటో బై పాట్రిక్ డిర్లామ్, అమెరికా


నా డ్యాన్స్‌ ఎలా ఉందంటున్న కొండముచ్చు ఫోటో బై సరోష్ లోధి, భారతదేశం


ఆడపులి రాజసం ఫోటో బై సిద్ధాంత్ అగర్వాల్, భారతదేశం


బాల్డ్ ఈగిల్ ఫోటో బై డేవిడ్ ఎప్లీ, అమెరికా


డోంట్‌ వర్రీ.. బీ హ్యాపీ అంటున్న తూనీగ ఫోటో బై క్సెల్ బాకర్, జర్మనీ


సేద దీరుతున్న బాబూన్‌ ఫోటో బై క్లెమెన్స్ గినార్డ్, ఫ్రాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement