Wildlife photographer of the Year
-
‘‘అందమైన లోకమని.. రంగు రంగులుంటాయని...’’ (ఫొటోలు)
-
మంచు పాన్పు
చలికాలపు రాత్రి నిద్రొస్తే మనమంతా బిర్రుగా ముసుగు తన్నిపడుకుంటాం. కానీ ఈ మంచు ఎలుగుబంటి మాత్రం సుఖమనిన ఇదియెగాద అనుకుంటూ మంచుపాన్పుపై హాయిగా నిద్రపోయింది. ఐస్‌బర్గ్‌పై ఎలుగు నిద్రపోతున్న ఫొటోను బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ నీమా సరిఖానీ తీశారు. ఈ ఫొటో.. పీపుల్స్ ఛాయిస్ సంస్థ చేపట్టిన ఓటింగ్‌లో పాల్గొన్న వేలాది మందికి తెగ నచ్చేసింది. దీంతో నీమాను పీపుల్స్ ఛాయిస్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో సత్కరించారు. నార్వేకు చెందిన స్వాల్బార్డ్ ద్వీపసమూహంలో ఉత్తర ధృవానికి అత్యంత సమీప ఐస్‌బర్గ్‌ల వద్ద ఈ ఫొటోను తీశారు. -
మబ్బుల మధ్య చేపలు.. ఎన్నున్నాయో చూశారా..!
నీటిలో ఉండాల్సిన చేపలు నింగిలో మబ్బుల మధ్య ఎగురుతున్నట్లు.. ఏదో స్వర్గంలో ఉన్నట్లు కనిపిస్తోంది కదూ.. ఈ చిత్రాన్ని ఫిన్లాండ్కు చెందిన టీనా టోర్మెనెన్ హోంకాలెంపీ సరస్సులో తీశారు. ‘అండర్‌వాటర్ వండర్ల్యాండ్’లా టోర్మెనెన్ అభివర్ణిస్తున్న ఈ ఫొటో ప్రతిష్టాత్మక ‘వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ పోటీలో ఎన్నదగిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. వివిధ విభాగాల్లో విజేతలను అక్టోబర్ 11న ప్రకటిస్తారు. ఆ మేఘాల్లా కనిపిస్తున్నవి ఒకరకమైన నాచు అట. ముందు ఫొటోలోని చేపలు స్వర్గంలో విహరిస్తున్నట్లు కనిపిస్తుంటే.. ఇవేమో.. వందలాదిగా నిర్జీవంగా శ్మశానంలో ఉన్నట్లుగా పడి ఉన్నాయి.. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన మన్నెపురి శ్రీకాంత్ తీశారు. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్లో ఎన్నదగిన ఫొటోల్లో ఇది కూడా ఉంది. అసలు ఎన్నున్నాయో చూశారా.. ఒకేచోట ఇన్ని పెద్ద చేపలు.. వీటిని చూసి ఆశ్చర్యపోయే.. కాకినాడ ఫిష్ మార్కెట్ భారీతనాన్ని చూపించడానికి ఆయన డ్రోన్ ద్వారా ‘వన్డే క్యాచ్’ పేరుతో ఈ చిత్రాన్ని క్లిక్‌మనిపించారు. (క్లిక్: మంచుతెరలు.. సూర్యోదయం అందాలు అదుర్స్.. ఎక్కడంటే!) -
పదేళ్ల బాలుడికి అంతర్జాతీయ యంగ్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అవార్డు..!!
బెంగళూరుకు చెందిన 10 యేళ్ల విద్యున్ ఆర్ హెబ్బర్ అనే బాలుడు 2021 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘యంగ్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ అందుకున్నాడు. ఈ బాలుడు తీసిన తలకిందులుగా ఉన్న సాలెగూడు ఫొటోకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఈ ఫొటో బ్యాక్ గ్రౌండ్లో ప్రకృతి రంగులు అందంగా అద్దినట్టు అద్భుతంగా తీశాడు. దీనిని డోమ్ హోమ్ అని అంటారు. తన ఇంటి సమీపంలో ఉన్న వీధుల్లో, పార్కుల్లో నివసించే జీవులను ఫోటో తీయడం ఇష్టమని, ఎనిమిదేళ్ల వయసులో ఈ పోటీలో మొదటిసారి పాల్గొన్నానని హెబ్బర్ మీడియాకు తెలిపాడు. కాగా లండన్‌కి చెందిన మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ 1965 నుంచి ఈ కాంపిటీషన్‌ను నిర్వహిస్తోంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నేచర్ ఫొటోగ్రఫీ కాంపిటీషన్‌గా పేర్కొంటారు. ఈ ఈవెంట్‌కి 95 దేశాల నుంచి దాదాపుగా 50,000ల ఎంట్రీలు అందాయి. 19 కేటగిరీల్లో నిర్వహించిన పోటీలో విజేతల ఫలితాలను మంగళవారం ప్రకటించారు. విజేతల్లో మన దేశం తరపున విద్యున్ ఆర్ హెబ్బర్ అవార్డు అందుకోవడం దేశానికే గర్వకారణం. చదవండి: Helath Tips: కాఫీ తాగే అలవాటుందా? నిద్రలేమి, యాంగ్జైటీ, చిరాకు.. -
స్నేక్గారూ.. స్మైల్ ప్లీజ్..
పాము నవ్వడం మీరెప్పుడైనా చూశారా.. లేదా.. ఇప్పుడు చూసేయండి.. జంతువులకు సంబంధించిన ఫన్నీ ఫొటోలు తీసేవారి కోసం ఏటా కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పురస్కారాలను ఇస్తారు. ఈ ఏడాది మొత్తం7 వేల ఎంట్రీలు రాగా.. అందులోని 42 చిత్రాలను ఫైనలిస్టులుగాజ్యూరీ ఎంపిక చేసింది. (చదవండి: Viral Video: సిగ్గు విడిచిన పాము!) అందులోనిదే ఈ వైన్ స్నేక్ ఫొటో.. దీన్ని భారత్‌కు చెందిన ఆదిత్య తీశారు. ‘ఆ పాము దగ్గరికి ఎవరైనా వెళ్తే.. బెదిరించడానికి ఇలా నోరు పెద్దగా తెరుస్తుంది. కానీ ఆ రోజున బెదిరించడానికి నోరు తెరిచినా.. చూడ్డానికి నవ్వుతున్నట్లుగా వచ్చింది’ అని ఆదిత్య చెప్పారు. లాఫింగ్ స్నేక్‌తో పాటు మిగతా ఫోటోలను కూడా చూడండి. పైడ్ స్టార్లింగ్ మండే మార్నింగ్ మూడ్ ఫోటో బై ఆండ్రూ మేయెస్, దక్షిణాఫ్రికా పెంగ్విన్ల సరదా ఆటలు ఫోటో బై కరోల్ టేలర్, యూకే ఈత నేర్చుకుందువుగాని పద అంటున్న ఒట్టర్ ఫోటో బై చీ కీ టీయో, సింగపూర్ జిరాఫీపై సవారీ చేస్తున్న కోతి ఫోటో బై డిర్క్-జాన్ స్టీహౌవర్, నెదర్లాండ్స్ భారతీయ ఊసరవెల్లి రాజసం ఫోటో బై గురుమూర్తి కే, ఇండియా కోతి బావా సరదా తీరింది ఫోటో బై కెన్ జన్సాన్, యూకే వామప్స్ చేస్తున్న కంగారు ఫోటో బై లీ స్కాడెన్, ఆస్ట్రేలియా నా అనుమతి లేకుండా నా ఫోటో తీస్తావా అంటున్న రూబీ క్రౌన్డ్ కింగ్లెట్ ఫోటో బై పాట్రిక్ డిర్లామ్, అమెరికా నా డ్యాన్స్ ఎలా ఉందంటున్న కొండముచ్చు ఫోటో బై సరోష్ లోధి, భారతదేశం ఆడపులి రాజసం ఫోటో బై సిద్ధాంత్ అగర్వాల్, భారతదేశం బాల్డ్ ఈగిల్ ఫోటో బై డేవిడ్ ఎప్లీ, అమెరికా డోంట్ వర్రీ.. బీ హ్యాపీ అంటున్న తూనీగ ఫోటో బై క్సెల్ బాకర్, జర్మనీ సేద దీరుతున్న బాబూన్ ఫోటో బై క్లెమెన్స్ గినార్డ్, ఫ్రాన్స్ -
Cheetah Brothers: భయం వీడాయి.. ఒక్కటై దూకాయి
2020 జనవరి.. కెన్యాలోని మాసాయ్ మారా నేషనల్ రిజర్వులో ఒకటే కుండపోత. తాలేక్ నది అయితే.. ఉగ్రరూపం దాల్చింది.. గతంలో ఎన్నడూ లేనంత రీతిలో పోటెత్తింది.. అలాంటి టైంలో ఒడ్డుకు అటు వైపున ఐదు చీతాలు.. ఆదుర్దాగా అటూ ఇటూ తిరుగుతున్నాయి.. ఎందుకంటే.. ఈ నదిని దాటాలనుకుని ప్రయత్నించిన జంతువులను.. అయితే వరద మింగేస్తుంది.. లేదా నదిలోని భయంకరమైన మొసళ్లు మింగేస్తాయి.. కానీ ఎలాగైనా నదిని దాటాలి.. ఎందుకంటే.. ఒడ్డుకు ఆవల వాటి రాజ్యముంది.. ఆ ఐదుగురు స్నేహితులు పాలించే సామ్రాజ్యముంది.. భయం వీడాయి.. ఒక్కటై దూకాయి.. వరద ఉధృతిని తట్టుకున్నాయి.. కలిసికట్టుగా నదిని దాటాయి.. ► ఈ చీతాల సాహసకృత్యాన్ని బుద్దిలినీ డిసౌజా అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించారు. ఈ చీతాలు లోకల్‌గా ఫేమస్ అని.. ప్రపంచంలో ఎక్కడా ఇలా ఐదు మగ చీతాలు ఫ్రెండ్స్‌గా లేదా గుంపుగా కలిసిలేవని డిసౌజా తెలిపారు. ‘గ్రేట్ స్విమ్’ పేరిట డిసౌజా తీసిన ఈ చిత్రం ప్రఖ్యాత ‘వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ పోటీలో తుది జాబితాకు ఎంపికైంది.. విభాగాలవారీగా విజేతల వివరాలను ఆక్టోబర్ 12న ప్రకటిస్తారు. -
అప్పుడే తెల్లారిందా..
దీని బద్దకం చూశారా.. అచ్చం మనలాగే.. తెల్లారే లేవడానికి తెగ ఇబ్బంది పడుతున్నట్లు.. కెన్యాలోని మాసాయ్ మారా జాతీయ రిజర్వు పార్కులో ఈ బద్దకిష్టి సివంగి చిత్రాన్ని జర్మనీకి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ స్టీఫెన్ ట్యూంగ్లెర్ తీశారు. నేషనల్ హిస్టరీ మ్యూజి యంతో కలిసి బీబీసీ వారు నిర్వహిస్తున్న వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ -2014లో పీపుల్స్ చాయిస్ అవార్డు కోసం పోటీ పడే ఫొటోల తుది జాబితాకు ఈ చిత్రమూ ఎంపికైంది. ఆన్లైన్ ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. డ