బావా.. బ్యాక్‌సైడు దేఖో..! పో.. ఇక నీకు నాకు కటిఫ్‌..! | Comedy Wildlife Photography Awards 2022 Funny Viral Pics | Sakshi
Sakshi News home page

బావా.. బ్యాక్‌సైడు దేఖో..! పో.. ఇక నీకు నాకు కటిఫ్‌..!

Published Tue, Jan 3 2023 5:06 PM | Last Updated on Tue, Jan 3 2023 6:22 PM

Comedy Wildlife Photography Awards 2022 Funny Viral Pics - Sakshi

చూడు కొంగ బావా.. ముందు చూపు ఉండాలి.. కానీ.. అప్పుడప్పుడు వెనుక వైపు కూడా ఓ లుక్కేసుకోవాలి.. ఇప్పుడు చూడు ఏమైందో.. ఇంతకీ ఏమైంది.. ఏమో మరి.. ఈ ఫొటో తీసిన జీన్‌ జాక్వస్‌­(ఫ్రాన్స్‌) ఆ విషయాన్ని చెప్పలేదు మరి.. కొంగను మింగేస్తు­న్న­ట్లు ఉన్న ఈ నీటి గుర్రం ఫొటో కామెడీ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీ 2022 అవార్డుల్లో ‘స్పెక్ట్రం ఫొటో క్రీచర్స్‌ ఆఫ్‌ ద ఎయిర్‌’ విభాగంలో మొదటి ప్రైజును గెలుచుకుంది..

ఏ విషయంలో గొడవొచ్చిందో తెలియదు గానీ.. ఇక నుంచి నీకు నాకు కచ్చి అని అనేసుకున్నాయి ఈ రెండు పెంగ్విన్‌లు.. ఆ సమయంలో అక్కడే ఉన్న జెన్నిఫర్‌ హాడ్లీ అనే ఫొటోగ్రాఫర్‌ ఈ సీన్‌ను క్లిక్‌మనిపించారు. రెండింటి మధ్య మళ్లీ ఫ్రెండ్‌షిప్‌ కోసం జెన్నిఫర్‌ ట్రై చేశారు గానీ.. వర్కవుట్‌ కాలేదట. అయితే, ఈ ఫొటో మాత్రం వర్కవుట్‌ అయింది. కామెడీ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రఫీ పోటీల్లో పీపుల్స్‌ చాయిస్‌ అవార్డును కైవసం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement