Funny reactions
-
నీకో నమస్కారం సామీ..బ్లూటిక్ తిరిగిచ్చేయ్! బిగ్‌బీ ఫన్నీ ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ఖాతాల బ్లూటిక్ మాయం కావడంతో ప్రముఖులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ముఖ్యంగా వెరిఫికేషన్ ఫీజు చెల్లించిన తరువాత కూడా బ్లూటిక్ మాయం కావడంతో ఒకింత అవమానంగా భావించారు. అంతేకాదు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలంతా ట్విటర్ చర్యతో షాక్ అవుతున్నారు. దీంతో మా బ్లూటిక్ మాకు కావాలంటూ డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ట్వీట్ వైరల్‌గా మారింది. (ఇదీ చదవండి: Twitter Down: ట్విటర్ డౌన్, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!) హే ట్విటర్! మీరు వింటున్నారా?సబ్స్క్రిప్షన్ సేవ కోసం చెల్లించాను. కాబట్టి దయచేసి నా పేరు ముందుండే బ్లూటిక్‌ను తిరిగి ఇచ్చేయండి. తద్వారా నేనే అమితాబ్ అని ప్రజలకు తెలుస్తుంది. చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. కాళ్లపై పడాలా? అంటూ బిగ్‌బీ ఫన్నీగా ట్విట్ చేశారు. దీంతో యూజర్లు ఫన్నీ రిప్లైలను పోస్ట్ చేసారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) " సహనం ఉంటేనే బ్లూ టిక్’’ అని ఒకరు, మూడు నాలుగురోజులు ఆగండి అని ఇంకొకరు కామెంట్ చేశారు. మిస్టర్ బచ్చన్, మస్క్ విదేశీయుడు, ఎవరి మాటా వినడు. మీరు కొన్ని రోజులు వేచి ఉండాలని ఇంకొకరు వ్యాఖ్యానించారు. అంతేకాదు "బచ్చన్ సాహెబ్ ఉ అంగ్రేజ్ హో కేహు కా నహీ సునత్ హో, అంటూ బిగ్‌బీ స్టయిల్లోనే మరొకరు సమాధానం ఇచ్చారు. అలాగే నటి ఖుష్బూ కూడా తాను సబ్ స్క్రైబ్ చేసుకున్నప్పటికీ ట్విటర్ బ్లూటిక్ పోయిందని ట్వీట్ చేశారు. T 4623 - ए twitter भइया ! सुन रहे हैं ? अब तो पैसा भी भर दिये हैं हम ... तो उ जो नील कमल ✔️ होत है ना, हमार नाम के आगे, उ तो वापस लगाय दें भैया , ताकि लोग जान जायें की हम ही हैं - Amitabh Bachchan .. हाथ तो जोड़ लिये रहे हम । अब का, गोड़वा 👣जोड़े पड़ी का ?? — Amitabh Bachchan (@SrBachchan) April 21, 2023 My account says subscription will end on 17th March 2024, yet it says canceled. I have paid for a year. Why does it stand canceled @TwitterBlue ??? pic.twitter.com/1BZpOm10aY — KhushbuSundar (@khushsundar) April 21, 2023 సినీ స్టార్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కంపెనీలు, బ్రాండ్లు, వార్తా సంస్థలు ఇలా ఏ ఖాతానూ మస్క్ వదిలిపెట్టలేదు. బాలీవుడ్ స్టార్లు షారూఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, నటుడు ప్రకాశ్ రాజ్, టాలీవుడ్ హీరో చిరంజీవితోపాటు క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఖాతాల్లో బ్లూటిక్ ఎగిరిపోయింది. అలాగే హీరోయిన్లు సమంత, అలియా భట్ లతో పాటు రాజకీయ నాయకుల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, మమతా బెనర్జీ, యూపీ యోగి ఆదిత్యనాథ్‌తోపాటు పలు మీడియా సంస్థలు కూడా బ్లూటిక్‌ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. As of now, this is my blue tick verification! 😬 https://t.co/BSk5U0zKkp pic.twitter.com/OEqBTM1YL2 — Sachin Tendulkar (@sachin_rt) April 21, 2023 -
బావా.. బ్యాక్సైడు దేఖో..! పో.. ఇక నీకు నాకు కటిఫ్..!
చూడు కొంగ బావా.. ముందు చూపు ఉండాలి.. కానీ.. అప్పుడప్పుడు వెనుక వైపు కూడా ఓ లుక్కేసుకోవాలి.. ఇప్పుడు చూడు ఏమైందో.. ఇంతకీ ఏమైంది.. ఏమో మరి.. ఈ ఫొటో తీసిన జీన్ జాక్వస్(ఫ్రాన్స్) ఆ విషయాన్ని చెప్పలేదు మరి.. కొంగను మింగేస్తున్నట్లు ఉన్న ఈ నీటి గుర్రం ఫొటో కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ 2022 అవార్డుల్లో ‘స్పెక్ట్రం ఫొటో క్రీచర్స్ ఆఫ్ ద ఎయిర్’ విభాగంలో మొదటి ప్రైజును గెలుచుకుంది.. ఏ విషయంలో గొడవొచ్చిందో తెలియదు గానీ.. ఇక నుంచి నీకు నాకు కచ్చి అని అనేసుకున్నాయి ఈ రెండు పెంగ్విన్లు.. ఆ సమయంలో అక్కడే ఉన్న జెన్నిఫర్ హాడ్లీ అనే ఫొటోగ్రాఫర్ ఈ సీన్‌ను క్లిక్‌మనిపించారు. రెండింటి మధ్య మళ్లీ ఫ్రెండ్షిప్ కోసం జెన్నిఫర్ ట్రై చేశారు గానీ.. వర్కవుట్ కాలేదట. అయితే, ఈ ఫొటో మాత్రం వర్కవుట్ అయింది. కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పోటీల్లో పీపుల్స్ చాయిస్ అవార్డును కైవసం చేసుకుంది. -
దాంతో ఫొటో ఏంది మమ్మీ.. భయమైతుంది ప్లీజ్ వెళ్లిపోదాం డాడీ..
అనుకోకుండానే కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఫేమస్ అవుతారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫ్యామిలీ చెందిన వీడియో చక్కర్లు కొడుతోంది. వారితోపాటు ఓ సీల్ చేసిన ఫన్నీ చేష్టలు సైతం నెటిజన్లను తెగనవ్విస్తున్నాయి. అయితే, వీడియో ప్రకారం.. ఓ థీమ్ పార్క్ ఓ ఫ్యామిలీ వెళ్లింది. ఈ క్రమంలో వాటర్ పార్క్ వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఓ జంట రెడీ అయ్యింది. ఇంతలో జంతువుల ట్రైనర్.. సీల్‌ను నీటిలోకి వెళ్లాలని ఆదేశించాడు. ఈ క్రమంలో ఫొటోలు దిగేందుకు వారు ఓ కుర్చీపై కూర్చుకున్నారు. తర్వాత ట్రైనర్.. సీల్‌ను ఫొటోలకు ఫోజులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసి ఫొటోలు తీసేందుకు వెళ్లాడు. Family photography 🐬 pic.twitter.com/bjEabbUvl5 — Homestays & Villas (@thehomestays) September 25, 2022 ఇక, ఫొటోలు తీస్తున్న క్రమంలో సీల్ ఇచ్చిన స్టిల్స్ హైలైట్ అని చెప్పవచ్చు. అచ్చం మనుషులు చేసినట్టుగానే ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ సమయంలో ఫొటో తీస్తున్న వైపు చూడాలని బుడ్డోడొకి పేరెంట్స్ చెబుతున్నప్పటికీ.. పిల్లోడు మాత్రం సీల్‌ను చూసి భయపడినట్టు ఫేస్ పెట్టాడు. మమ్మీ, డాడీ.. ప్లీజ్ ఇంక ఫొటోలు చాలు ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అన్నట్టుగా వారి వైపు చూశాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
కడుపుబ్బ నవ్విస్తున్న క్రికెటర్ల పొరపాట్లు
-
నెటిజన్లకు ఫన్నీగా గెలాక్సీ నోట్7
గెలాక్సీ నోట్7.. ఇప్పటివరకు రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్లలన్నింటిలో బెస్ట్, మోస్ట్ పవర్ఫుల్ ఫోన్‌గా శాంసంగ్ మార్కెట్లోకి విడుదల చేసింది. రిలీజైన కొన్ని రోజుల్లోనే హాట్ కేకులా అమ్ముడుపోయిన ఈ ఫోన్, ఒక్కసారిగా టైమ్ బాంబుగా మారిపోయింది. బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ఇటు శాంసంగ్‌కు, అటు వినియోగదారులకు వణుకు పుట్టించింది. లి-అయాన్ బ్యాటరీలకు సంబంధించిన తప్పుడు బ్యాచ్‌ను ఈ ఫ్లాగ్‌షిప్‌లో వాడటమే దీనికి ప్రధాన కారణం. ఈ ఘటనలపై వెంటనే స్పందించిన శాంసంగ్ గెలాక్సీ ఫోన్లను రీకాల్ చేయడం ప్రారంభించింది. కొత్త ఫోన్లతో గెలాక్సీ నోట్7ను రీప్లేస్ చేసింది. ఈ ఫోన్‌ను విమానంలో ప్రయాణించేటప్పుడు వాడకూడదంటూ పలు దేశ విమానయాన సంస్థలు సీరియస్ వార్నింగ్‌లు కూడా ఇచ్చాయి. అత్యంత ప్రమాదకరమైన ఫోన్‌గా అభివర్ణించాయి. వీరందిరి కంటే వేగంగా ఈ ఘటనలపై ఇంటర్నెట్ స్పందించింది. ఫన్నీ జోక్స్, ఇమేజెస్‌తో నెటిజన్లను కడుపుబ్బా నవ్వించింది. శాంసంగ్ గెలాక్సీ నోట్7పై ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఫన్నీ జోక్స్ ఏమిటో మీరు ఓసారి తిలకించండి....