
నెటిజన్లకు ఫన్నీగా గెలాక్సీ నోట్7
గెలాక్సీ నోట్7.. ఇప్పటివరకు రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్లలన్నింటిలో బెస్ట్, మోస్ట్ పవర్ఫుల్ ఫోన్గా శాంసంగ్ మార్కెట్లోకి విడుదల చేసింది. రిలీజైన కొన్ని రోజుల్లోనే హాట్ కేకులా అమ్ముడుపోయిన ఈ ఫోన్, ఒక్కసారిగా టైమ్ బాంబుగా మారిపోయింది.దీంతో గెలాక్సీ నోట్7పై నెట్ లో ఫన్నీ రియాక్షన్స్ హల్చల్ చేస్తున్నాయి...
ఈ ఘటనలపై వెంటనే స్పందించిన శాంసంగ్ గెలాక్సీ ఫోన్లను రీకాల్ చేయడం ప్రారంభించింది. కొత్త ఫోన్లతో గెలాక్సీ నోట్7ను రీప్లేస్ చేసింది. ఈ ఫోన్ను విమానంలో ప్రయాణించేటప్పుడు వాడకూడదంటూ పలు దేశ విమానయాన సంస్థలు సీరియస్ వార్నింగ్లు కూడా ఇచ్చాయి. అత్యంత ప్రమాదకరమైన ఫోన్గా అభివర్ణించాయి. వీరందిరి కంటే వేగంగా ఈ ఘటనలపై ఇంటర్నెట్ స్పందించింది. ఫన్నీ జోక్స్, ఇమేజెస్తో నెటిజన్లను కడుపుబ్బా నవ్వించింది. శాంసంగ్ గెలాక్సీ నోట్7పై ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఫన్నీ జోక్స్ ఏమిటో మీరు ఓసారి తిలకించండి....








