Samsung Galaxy Note 7
-
ఆ ఫోన్‌ను వెనక్కిచ్చేసి ఐఫోన్ కొంటున్నారు!
గెలాక్సీ నోట్7 పేలుళ్ల దెబ్బతో శాంసంగ్‌కు తీవ్ర ప్రతికూలతే ఏర్పడిందని పలు రిపోర్టులొచ్చాయి. అయితే గెలాక్సీ నోట్7 రీకాల్ తర్వాత మార్కెట్లలో శాంసంగ్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం రీసెర్చ్ సంస్థ ఐడీసీ ఓ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేలో సగం మంది గెలాక్సీ నోట్7 యూజర్లు, తమ ఫోన్లను నగదుకు వెనక్కి ఇచ్చేసి, ఆ క్యాష్తో ఆపిల్ ఐఫోన్లను కొంటున్నారని తేలింది. 17 శాతం యూజర్లు మాత్రమే వేరే శాంసంగ్ డివైజ్ తీసుకుంటున్నారని తెలిసింది. దీంతో శాంసంగ్‌కు తలెత్తిన గెలాక్సీ నోట్7 సంక్షోభం వల్ల ఆ కంపెనీ కొంతమంది విధేయులను కోల్పోవాల్సి వస్తుందని ఐడీసీ పేర్కొంది. మొత్తం 1,082 మంది ఆన్లైన్ కస్టమర్లతో ఐడీసీ ఈ సర్వే చేపట్టింది. వారిలో 507 మంది శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఓనర్స్, 347 మంది గతంలో శాంసంగ్ యూజర్లు, 228 మంది శాంసంగ్ కాని యూజర్లు, 24 మంది ప్రస్తుత నోట్7 యూజర్లు ఉన్నారు. అయితే భవిష్యత్తులో వచ్చే శాంసంగ్ ఫోన్లు కొనుక్కునే వాటిపై ఈ గెలాక్సీ సంక్షోభం ఉండదని చాలామంది చెప్పినట్టు తెలిపింది. స్మార్ట్‌ఫోన్ కాని ఇతర శాంసంగ్ ఉత్పత్తులపైనే ఈ ప్రభావం చూపదని పేర్కొన్నారు. రీకాల్ ప్రాసెస్‌లో కంపెనీ కస్టమర్లతో చాలా విధేయతతో ప్రవర్తిస్తుందని ఈ సర్వేలో తెలిసింది. ఆశ్చర్యకరంగా మరో విషయమేమిటంటే 13 శాతం మందికి అసలు శాంసంగ్ రీకాల్ ప్రక్రియనే తెలియదని తేలింది. బ్యాటరీ పేలుళ్ల ఘటనతో శాంసంగ్ కంపెనీ ఆ ఫోన్లను రీకాల్ చేస్తూ.. వాటి స్థానంలో కస్టమర్లకు క్యాష్ లేదా గెలాక్సీ ఎస్7/ఎస్ 7 ఎడ్జ్‌లను ఆఫర్ చేస్తోంది. ఆ ఫోన్ల రీకాల్ చేపట్టి, ఉత్పత్తులనూ నిలిపివేసింది. ఎట్టిపరిస్థితుల్లో తమ ఫోన్లను వాడొద్దని ఆ కంపెనీనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
శాంసంగ్ నోట్ 7 యూజర్లకు గుడ్ న్యూస్!
దక్షిణ కోరియా స్మార్ట్ ఫోన్ మేకింగ్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ కు గెలాక్సీ నోట్ 7 మంటలు ఎన్నో నష్టాలను తెచ్చిపెట్టింది. తమ ఫోన్లను(గెలాక్సీ నోట్ 7) విమానాల్లో మాత్రం అసలు వాడవద్దని, స్విచ్ఛాఫ్ చేయడం ఉత్తమమని ఇటీవల ప్రకటించిన ఆ కంపెనీ తాజాగా మరో పద్ధతిని పాటిస్తోంది. విమానాలలో అమెరికాకు వెళ్తున్న, అమెరికా నుంచి ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికుల వద్ద గెలాక్సీ నోట్ 7 ఉంటే వాటిని రీప్లేస్ చేసేందుకు ఎయిర్ పోర్టుల్లో కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసింది. పేలుతున్న ఆ మోడట్ మోబైల్స్ కు బదులుగా వేరే స్టార్ట్ ఫోన్స్ ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అమెరికాలో విమాన ప్రయాణాల్లో ఈ మోడల్ పై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అమెరికాలో కొన్ని ప్రముఖ విమానాశ్రయాల్లో మాత్రమే తమ సెంటర్స్ ఏర్పాటు చేశామని, అయితే ఆ ఎయిర్ పోర్టుల జాబితాను ప్రస్తుతం వెల్లడించలేకపోతున్నట్లు శాంసంగ్ వెల్లడించింది. శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 రీస్లేస్ సెంటర్ ఏర్పాటు చేశారని అక్కడి మీడియా ప్రతినిధి సెర్గియో క్వింటానా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దక్షిణకోరియా మీడియాల కథనం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని అత్యంత రద్దీ ఉండే ఎయిర్ పోర్టుల్లో కూడా శాంసంత్ కొన్ని స్టార్ట్ ఫోన్ రీప్లేస్ సెంటర్స్ ఏర్పాటు చేసిందని తెలుస్తోంది. ఒకవేళ యూజర్లు తమ మనీ రీఫండ్ చేయమని అడిగినా, కొత్త స్మార్ట్ ఫోన్ కొనుకోలు చేసినా వాటికి సంబంధి కంపెనీ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తంచేయదని శాంసంగ్ ప్రతినిధి తెలిపారు. Samsung has a team of representatives at SFO to help customers with the Note7 phone. It's banned from US flights. pic.twitter.com/2IiEcg6hsU — Sergio Quintana (@svqjournalist) 17 October 2016 -
మా ఫోన్లు వాడకండి.. స్విచాఫ్ చేసేయండి
ఎవరైనా సరే సాధారణంగా తమ ఫోన్లు అద్భుతంగా పనిచేస్తాయని, వాటినే వాడాలని వినియోగదారులను ఊదరగొడుతుంటారు. కానీ, శాంసంగ్ కంపెనీ మాత్రం తమ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను ఎవరూ వాడొద్దని, వాటిని స్విచాఫ్ చేసేయాలని చెబుతోంది. ''వినియోగదారులు ఒరిజినల్ గెలాక్సీ నోట్ 7 ఉన్నా, మార్చుకున్నది ఉన్నా కూడా దాన్ని వెంటనే స్విచాఫ్ చేసేయండి. ఆ ఫోన్ వాడకండి'' అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి ఇచ్చిన ఫోన్లు కూడా పేలుతున్నట్లు సమాచారం రావడంతో మరింత అప్రతిష్ఠ మూటగట్టుకోకుండా.. వెంటనే వాటన్నింటినీ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని టాప్ కంపెనీలు ఇప్పటికే నోట్ 7 ఫోన్ల అమ్మకాలను నిలిపివేశాయి. కొన్ని ప్రధాన విమానయాన సంస్థలు తమ విమానాల్లో ఈ ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలోని ఒక ప్రయాణికుడు తాజాగా మార్చుకున్న ఫోన్ తీసుకెళ్తుండగా దాంట్లోంచి కూడా మంటలు రావడంతో విమానం నుంచి అందరినీ దింపేయాల్సి వచ్చింది. దాంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన శాంసంగ్ తలపట్టుకుంది. వెంటనే ఆ ఫోన్ల అమ్మకాలు ఆపేయాలని ప్రధాన మార్కెటింగ్ సంస్థలన్నింటినీ కోరింది. అసలు సమస్య బ్యాటరీలో ఉందని భావించి, వెంటనే బ్యాటరీలు మార్చి ఇచ్చినా కూడా మళ్లీ అదే సమస్య తలెత్తుతోంది. దాంతో ఇప్పుడు మళ్లీ పరిశోధనలలో పడింది. గత రెండు నెలల్లో శాంసంగ్ తన ఫోన్ల అమ్మకాలు ఆపేయడం ఇది రెండోసారి. యాపిల్ ఐఫోన్‌కు దీటుగా ఉండేలా ఈ ఫోన్‌ను ఆగస్టు నెలలో శాంసంగ్ కంపెనీ మార్కెట్లలోకి విడుదల చేసింది. దానికి ప్రీబుకింగ్స్ భారీగా ఉండటంతో తొలుత సరఫరా చేయలేనంత పరిస్థితి ఏర్పడింఇ. కానీ, అది మార్కెట్లోకి వచ్చిన కొన్ని వారాల్లోనే సోషల్ మీడియాలో ఇందులోని సమస్యల గురించి బాగా ప్రచారం జరిగింది. బ్యాటరీలలో సమస్యలు ఉన్నాయని దాదాపు 25 లక్షల ఫోన్లను వెనక్కి తీసుకుని, వాటి బ్యాటరీలు మార్చి మళ్లీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా సమస్య అలాగే ఉండటంతో ఇక ప్రస్తుతానికి ఆ ఫోన్ వాడకం ఆపేయమనడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఏమీ లేకుండా పోయింది. -
అమితాబ్ కు శాంసంగ్ షాక్!
ముంబై: బ్యాటరీ పేలుళ్లతో వినియోగదారులను భయపెడుతున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కు తలనొప్పిగా మారింది. ఈ స్మార్ట్ ఫోన్ తో ఎదురవుతున్న ఇబ్బందులను ‘బిగ్ బి’ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన ఫోన్ పూర్తిగా చార్జింగ్ ఎక్కడం లేదని ఆయన తెలిపారు. ‘నేను శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ వాడుతున్నాను. ఎప్పుడు చార్జింగ్ పెట్టినా 60 శాతంకు మించి ఎక్కడం లేదు. 100 శాతం చార్జింగ్ ఎప్పుడు అవుతుంది? శాంసంగ్ వెంటనే స్పందించాల’ని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. దీనిపై అభిమానుల నుంచి వెంటనే స్పందన వచ్చింది. గెలాక్సీ నోట్ 7 పేలిపోయే ప్రమాదం ఉందని, వెంటనే ఆ ఫోన్ మార్చాలని వికాస్ సింగ్ అనే అభిమాని ట్వీట్ చేశాడు. బ్యాటరీలో సమస్య తలెత్తడంతో 25 లక్షల ఫోన్లను శాంసంగ్ రీకాల్ చేసింది. అమితాబ్ ట్వీట్ పై శాంసంగ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆయనకు కొత్త ఫోన్ ఇస్తుందో, బ్యాటరీ మారుస్తుందో వేచి చూడాల్సిందే. కాగా, భారత విమానాల్లో ఉపయోగించే శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లపై విధించిన నియంత్రణలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ రోజే ఎత్తివేసింది. T 2395 -I have Samsung Note 7. Battery charge restricted to 60%. When will it allow me to go 100 ? Mr Samsung please respond ! zara jaldi ! pic.twitter.com/VVkzPqXh1j — Amitabh Bachchan (@SrBachchan) 30 September 2016 -
స్మార్ట్ దిగ్గజాలను ఏడు నెంబర్ ఏడిపిస్తోందా?
స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలకు ఏడు నెంబర్ ఏడిపిస్తోందా? అసలు అచ్చికి రావడం లేదా? అంటే అవుననే అనిపిస్తోంది.ఇటీవలే శాంసంగ్ తాజా స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్7 పేలుడు ఘటనలు మార్కెట్లో తీవ్ర సంచలనం రేపగా.. ఇప్పడు అదే బాటలో మరో దిగ్గజం ఆపిల్‌కు షాక్ తగిలిందట. ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ కలర్ మోడల్ పేలిపోయిందని వార్తలు బయటికి పొక్కాయి. ఎప్పుడూ ఒకరినొకరు కాఫీ చేసుకుంటూ స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని ఏలే ఈ రెండు దిగ్గజాలు ఏడు నెంబర్‌తో తాజా ఫ్లాగ్‌షిప్‌లను విడుదల చేశాయి. కానీ ఈ రెండింటికి ఏడు నెంబర్ షాకిస్తూ పేలుడు ఘటనలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే గెలాక్సీ నోట్7 పేలుళ్ల సమస్య శాంసంగ్‌కు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. శాంసంగ్ గెలాక్సీ నోట్7 బ్యాటరీ లోపంతో పేలిపోగా, ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ మోడల్ సరియైన కారణాలు వెల్లడికాలేదు. ఈ ఫోన్‌ను ఆర్డర్ చేసుకున్న వినియోగదారుని దగ్గరికి పేలిపోయిన ఫోన్ డెలివరీ అయింది. ఆర్డర్‌ను అందుకుని బాక్స్ తెరిచిచూడగానే పేలిపోయిన ఫోన్‌ను గుర్తించినట్టు వినియోగదారుడు పేర్కొన్నాడు.ఫ్యాక్టరీ నుంచి డెలివరీ అయ్యే మధ్యలో ఈ పేలుడు సంభవించి ఉంటుందని ఫోన్ యజమాని చెబుతున్నాడు. ఆపిల్ ఈ విషయంపై ఇప్పటికీ బహిరంగంగా ఎలాంటి కామెంట్ చేయలేదు.కానీ విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్‌ను ఆర్డర్ చేసుకున్న వినియోగదారుడు రీప్లేస్మెంట్ కోసం ఆపిల్ సంస్థను ఆశ్రయించాడు. ప్రస్తుతం పేలిపోయిన ఐఫోన్ 7 ప్లస్ బ్లాక్ కలర్ మోడల్ ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. -
శాంసంగ్ కు మరో 'పేలుడు' తలనొప్పి
ఇప్పటికే చాలా ప్రాంతాల్లో దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్ల ఘటనలు చోటుచేకోవడంతో ఆ ఫోన్లపై కొన్ని ప్రదేశాల్లో ఆంక్షలు విధించారు. తాజాగా జరిగిన అలాంటి ఘటనతో శాంసంగ్ కంపెనీకి తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. తన కొత్త మొబైల్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలిందంటూ చైనాకు చెందిన ఓ యువకుడు ఫిర్యాదుచేశాడు. హుయ్ అనే యువకుడు గత శనివారం నోట్ 7 మొబైల్ కొన్నానని, అయితే ఆదివారం చార్జింగ్ పెట్టగా మొబైల్ పేలిపోయిందట. ఈ విషయాన్ని మంగళవారం నాడు స్థానిక మీడియాకు వెల్లడించాడు. బ్యాటరీ లోపం కారణంగా పేలుళ్లు తలెత్తుతున్నాయన్న ఆరోపణలతో అమెరికా, దక్షిణకొరియా, ఇతర దేశాలలో అమ్మకాలు జరిగిన దాదాపు 2.5 మిలియన్ల గెలాక్సీ నోట్ 7 మొబైల్స్ ను శాంసంగ్ కంపెనీ రీకాల్ చేసిన విషయం తెలిసిందే. గత వారం రెండు పేలిన మొబైల్స్ విషయంపై కంపెనీ దర్యాప్తు చేసింది. ఆ రెండు హ్యాండ్ సెట్లను చైనా ఆన్ లైన్ మార్కెట్ నుంచి కొనుగోలు చేశారని, అయితే వాతావరణంలోని వేడి, ఇతర కారణాల వల్ల అవి పేలినట్లు చెబుతున్నారు. బాధితుడు హుయ్ ను కలిసిన శాంసంగ్ సిబ్బంది అతడికి ఆ హ్యాండ్ సెట్ ఖర్చుతో పాటు ఫోన్ పేలుడులో ధ్వంసమైన అతడి లాప్ టాప్ ను తమకిచ్చేస్తే అందుకు తగిన పరిహారాన్ని చెల్లించుకుంటామని తెలిపారు. కస్టమర్ హుయ్ మాత్రం.. ఈ విషయంపై శాంసంగ్ అధికారికంగా ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. గెలాక్సీ నోట్ 7 హ్యాండ్ సెట్ ను తమకు అందిస్తే పేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు కూడా వీలుంటుందని శాంసంగ్ మరో ప్రకటనలో తెలిపింది. -
నెటిజన్లకు ఫన్నీగా గెలాక్సీ నోట్7
గెలాక్సీ నోట్7.. ఇప్పటివరకు రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్లలన్నింటిలో బెస్ట్, మోస్ట్ పవర్ఫుల్ ఫోన్‌గా శాంసంగ్ మార్కెట్లోకి విడుదల చేసింది. రిలీజైన కొన్ని రోజుల్లోనే హాట్ కేకులా అమ్ముడుపోయిన ఈ ఫోన్, ఒక్కసారిగా టైమ్ బాంబుగా మారిపోయింది. బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ఇటు శాంసంగ్‌కు, అటు వినియోగదారులకు వణుకు పుట్టించింది. లి-అయాన్ బ్యాటరీలకు సంబంధించిన తప్పుడు బ్యాచ్‌ను ఈ ఫ్లాగ్‌షిప్‌లో వాడటమే దీనికి ప్రధాన కారణం. ఈ ఘటనలపై వెంటనే స్పందించిన శాంసంగ్ గెలాక్సీ ఫోన్లను రీకాల్ చేయడం ప్రారంభించింది. కొత్త ఫోన్లతో గెలాక్సీ నోట్7ను రీప్లేస్ చేసింది. ఈ ఫోన్‌ను విమానంలో ప్రయాణించేటప్పుడు వాడకూడదంటూ పలు దేశ విమానయాన సంస్థలు సీరియస్ వార్నింగ్‌లు కూడా ఇచ్చాయి. అత్యంత ప్రమాదకరమైన ఫోన్‌గా అభివర్ణించాయి. వీరందిరి కంటే వేగంగా ఈ ఘటనలపై ఇంటర్నెట్ స్పందించింది. ఫన్నీ జోక్స్, ఇమేజెస్‌తో నెటిజన్లను కడుపుబ్బా నవ్వించింది. శాంసంగ్ గెలాక్సీ నోట్7పై ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఫన్నీ జోక్స్ ఏమిటో మీరు ఓసారి తిలకించండి.... -
గెలాక్సీ నోట్ 7 ఎలా రీప్లేస్ చేసుకోవాలి?
చార్జింగ్ పెడుతున్నపుడు బ్యాటరీ పేలుతున్న ప్రమాదాలతో శాంసంగ్ భారీ సంకోభంలో చిక్కుకుంది. దీంతో తన కొత్త స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ను ప్రపంచవ్యాప్తంగా రీకాల్ చేస్తోంది. ఈ నేపపథ్యంలో అమెరికా కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ యూజర్లకు కొన్ని సూచనలు చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కొన్నవారు రీప్లేస్ లేదా రిఫండ్ చేసుకోవాలని కోరింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలిన ఘటనలు 92 నమోదయ్యాయని తెలిపింది. వీటిల్లో 26 కాలిన ఘటనలు, 55 ఆస్తినష్టం ఘటనలు రిపోర్ట్ చేసింది. అమెరికా పది లక్షల ఫోన్లను రీకాల్ చేయనున్నట్టు, ఇక్కడి అమ్మకాల్లో 97 శాతం ఎఫెక్ట్ అయినట్టు అమెరికాలోని శాంసంగ్ అధికారులు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఇప్పటికే శాంసంగ్ నోట్ 7ను సొంతం చేసుకున్నవారు రిప్లేస్ మెంట్ లేదా రిఫండ్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం ముందుగా ఫోన్ ఐఎంఈఐ నెంబరును గమనించాలి. దీన్ని http://samsung.com/us/note7recall అనే వెబ్ సైట్ లో నమోదు చేయాలి. లేదా హాట్ లైన్ నెంబరు 1-844-365-6197 కాల్ చేసి వివరాలు అందించాలి. పూర్తిగా నగదు వాపసు కోరవచ్చు. లేదంటే మరో గెలాక్సీ నోట్ 7గానీ, ఎస్7 , ఎస్7 ఎడ్జ్ గానీ రీప్లేస్ అడగవచ్చు. లేదంటే వినియోగదారులు కొనుగోలు చేసిన రీటైల్ స్టోర్లలోగానీ, బెస్ట్ బై లాంటి ఆన్ లైన్ లో కొనుగోలుచేస్తే ఆయా వ్యాపార కేంద్రాలను సంప్రదించాలి. శాంసంగ్ నుంచి డైరెక్ట్ కొన్నవారు నేరుగా కంపెనీని సంప్రదించాల్సి ఉంటుంది. కాగా గ్లోబల్ గా ఈ ఫోన్లను రీకాల్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన శాంసంగ్ యూజర్లను క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. -
శాంసంగ్ కు అమెరికా భారీ షాక్
వాషింగ్టన్: కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీకి అమెరికా భారీ షాక్ ఇచ్చింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ వాడొద్దని అధికారికరంగా అమెరికా ప్రకటించింది. గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ లోని బ్యాటరీ పేలుతుందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమెరికా వినియోగదారుల ఉత్పత్తి భద్రత కమిషన్ రీకాల్ నోటీసు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15లోపు కొన్న గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ఫోన్లను వాడొద్దని ఆదేశించింది. ఈ ఫోన్లను ఎక్కడైతే కొన్నారో అక్కడకు తీసుకెళ్లి కొత్త బ్యాటరీలు వేయించుకోవాలని సూచించింది. అవసరమైతే ఫోన్ కూడా మార్చుకోవచ్చని తెలిపింది. గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ లోని బ్యాటరీ పేలుడుకు సంబంధించి 92 ఘటనలు నమోదయ్యాయి. 26 బ్యాటరీలు కాలిపోయినట్టు ఫిర్యాదులు వచ్చాయి. కారు, గ్యారేజ్ లో మంటలు వచ్చి ఆస్తి నష్టం జరిగినట్టు 55 ఫిర్యాదులు అందాయి. ఆగస్టులో విడుదలైప్పటి నుంచి 25లక్షల గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ఫోన్లు అమ్ముడుపోయాయి. కాగా, వినియోగదారులకు అసౌకర్యం కలిగించినందుకు శాంసంగ్ క్షమాపణ చెప్పింది. -
శాంసంగ్‌కు అక్కడ కూడా ఎదురుదెబ్బ
ఇస్లామాబాద్ : బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ఓ వైపు సంస్థను, మరోవైపు యూజర్లను వణికిస్తున్న శాంసంగ్ తాజా స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్7కు పాకిస్తాన్‌లోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అనేక దేశాల విమాన సంస్థలు తమ విమానాల్లో ఈ ఫోన్ వాడకాన్ని నిషేధించగా.. తాజాగా పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థలు(పీఐఏ) కూడా గెలాక్సీ నోట్7పై నిషేధాజ్ఞలు విధించాయి. బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో విమానాల్లో ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్టు అధికారులు ఆదివారం ఆదేశాలు జారీచేశారు. విమానాల్లో వినియోగదారులు గెలాక్సీ నోట్7 స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని, ప్యాసెంజర్లు అసలు ఈ ఫోన్‌ను తీసుకురావద్దని, చెక్-ఇన్ లగేజీల్లో కూడా కనిపించవద్దని పీఐఏ యూజర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రయాణికుల సురక్షిణార్థమే ఈ ఆదేశాలు జారీచేస్తున్నట్టు పీఐఏ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. భారత విమానాల్లో ఈ ఫోన్లు వాడొద్దంటూ అధికార డిజీసీఏ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. భారత ఎయిర్ లైన్స్, ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ అలాగే అమెరికాకు చెందిన అమెరికన్ ఎయిర్ లైన్ రెగ్యులేటర్ ,ది ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ ( ఎఫ్ఎఎ)లు ఈ ఫోన్‌పై ఇప్పటికే సంచలన నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఆదివారం పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థల అధికారులు కూడా ఈ ఫోన్ పై ప్రయాణికులకు నిషేధాజ్ఞలు జారీ చేశారు. తాజా నిషేధాజ్ఞలతో శాంసంగ్ కంపెనీ షేర్లు భారీగా కుప్పకూలుతున్నాయి. ఈ ఫోన్ వినియోగం అత్యంత ప్రమాదకరమైనదిగా యూఎస్ రెగ్యులేటరీ పేర్కొంటూ, వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలనే ఆదేశాల జారీ అనంతరం కంపెనీ షేర్లు మూడు వారాల కనిష్టానికి పడిపోయాయి. ఇటీవలే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా లాంచ్ చేసిన ఈ ఫోన్ బ్యాటరీలు పేలుళ్ల సంఘటనలతో సంస్థకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలించింది. మరోవైపు యూజర్లకు చెమటలు పట్టించింది. లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే సప్లైను మించి డిమాండ్‌లో దూసుకుపోయిన ఈ ఫోన్లు, తాజా ఘటనలతో అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. కంపెనీ ఇప్పటికే 2.5 మిలియన్ ఫోన్లను రీకాల్ చేసినట్టు ప్రకటించింది. చార్జ్ చేస్తున్నప్పుడు లేదా కాల్ ఆన్షర్ చేస్తున్నప్పుడు ఈ ఘటనలు సంభవిస్తున్నాయని యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సెప్టెంబర్ 19లోపు గెలాక్సీ నోట్7లన్నింటినీ రిప్లేస్ చేస్తామని శాంసంగ్ ప్రకటించింది. -
ఆ మొబైళ్లను విమానాల్లోకి అనుమతించం:డీజీసీఏ
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల చరిత్రలోనే తొలిసారిగా భావిస్తున్న నిషేధాన్ని శాంసంగ్ కంపెనీ ఎదుర్కొంటోంది. ప్రయాణ సమయంలో విమానాల్లోకి శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 మొబైల్ ఫోన్లను అనుమతించబోమని విమానయానానికి సంబంధించి భారత్ లో అత్యున్నత సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, సింగపూర్ సహా పలు దేశాల విమాయనయాన సంస్థలు ఈ మోడల్ ఫోన్లను నిషేధించాయి. గత నెలలో విడుదలైన గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పేలిపోతున్న ఘటనలు ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వివిధ దేశాల్లో ఇప్పటివరకు నోట్ 7 మొబైళ్లు పేలిపోయిన ఉదంతాలు కనీసం 35 నమోదయ్యాయి. బ్యాటరీల్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే పేలుళ్లు సంభవిస్తున్నాయన్న శాంసంగ్.. ఒక సిరీస్‌కు చెందిన గెలాక్సీ నోట్ 7 మొబైళ్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఆస్ట్రేలియాలో పేలిన శాంసంగ్ గెలాక్సీ నోట్-7) డీజీసీఏ ఉత్తర్వుల్లోనూ ఈ మొబైల్ ను నిషేధిస్తున్నట్లు కచ్చితంగా పేర్కొన్నప్పటికీ ఒక మినహాయింపు ఇచ్చింది. మొబైల్ ను స్విచ్ ఆఫ్ చేస్తే మాత్రమే బోర్డింగ్ కు అనుమతిస్తామని చెప్పింది. గతవారం ఆస్ట్రేలియాలో ఓ వ్యక్తి.. హోటల్ గదిలో గెలాక్సీ నోట్ 7 మొబైల్ కు చార్జింగ్ పెట్టి నిద్రిస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది. రీకాల్ చేసిన మోడళ్ల స్థానంలో కొత్త వాటిని అందిస్తామని శాంసగ్ ఇప్పటికే చెప్పింది. ముందు జాగ్రత్త చర్యలుగా సదరు మొబైల్ కు చార్జింగ్ పెట్టేటప్పుడు తప్పనిసరిగా స్విచ్ ఆఫ్ చేయాలని పేర్కొంది. (గెలాక్సీ యూజర్లకు షాకిచ్చిన ఎయిర్‌లైన్స్) -
గెలాక్సీ యూజర్లకు షాకిచ్చిన ఎయిర్‌లైన్స్
సిడ్నీ : శాంసంగ్ గెలాక్సీ నోట్7 యూజర్లకు ప్రముఖ ఎయిర్ లైన్సు సంస్థ ఆస్ట్రేలియన్ క్వాంటాస్ షాకిచ్చింది. విమాన ప్రయాణంలో గెలాక్సీ నోట్7 స్మార్ట్ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ వల్ల వస్తున్న బ్యాటరీ పేలుళ్ల సమస్యను సాకుగా చూపుతూ విమానంలో ఈ ఫోన్‌ను వాడటం కాని చార్జ్ కాని చేయకూడదని గురువారం ఆదేశించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలన్నింటిలో ఈ ఆదేశాలను పాటించాలని, అదేవిధంగా క్వాంటస్ డిస్కౌంట్ క్యారియర్ జెట్స్టార్కు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఏవియేషన్ అథారిటీ నిబంధనలను సడలింపు చేశాక, 2014లో క్వాంటాస్, దాని ప్రత్యర్థి కంపెనీ వర్జిన్ ఆస్ట్రేలియాలు విమానంలో ఫోన్ల వాడకాన్ని అనుమతి ఇచ్చాయి. ప్లేన్ నేవిగేషన్ ఈక్విప్మెంట్కు ఆటంకం కలుగుతుందనే కారణంతో టాక్సింగ్, టేక్-ఆఫ్, ల్యాండింగ్ సమయంలో ఫోన్ల వాడకంపై రెగ్యులేటర్లు నిషేధం విధించాయి. కానీ తర్వాత ఎయిర్ లైన్సు ఫోన్ల వాడకానికి అనుమతి కల్పించాయి. ప్రస్తుతం బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో క్వాంటాస్ మళ్లీ విమానంలో గెలాక్సీ నోట్7ల వాడకాన్ని నిషేధించింది. బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో తీవ్ర ఇరకాటంలో పడ్డ శాంసంగ్ గ్లోబల్‌గా షిప్ చేసిన 2.5 మిలియన్ యూనియట్ల గెలాక్సీ నోట్7లను రీకాల్ చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్ల ఘటనలు సంస్థ గౌరవానికి భంగం వాటిల్లుస్తున్నాయని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో కూడా శాంసంగ్ తన తాజా ఫ్లాగ్‌షిప్‌లను రీకాల్ చేస్తోంది. శాంసంగ్ పూర్తిగా వీటిని రీకాల్ చేసేవరకు ఈ ఫోన్లను విమానంలో వాడకూడదని క్వాంటాస్ పేర్కొంది.