శాంసంగ్ కు మరో 'పేలుడు' తలనొప్పి | new Samsung Note 7 exploded, says Chinese user | Sakshi
Sakshi News home page

శాంసంగ్ కు మరో 'పేలుడు' తలనొప్పి

Published Tue, Sep 27 2016 8:52 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

శాంసంగ్ కు మరో 'పేలుడు' తలనొప్పి

శాంసంగ్ కు మరో 'పేలుడు' తలనొప్పి

ఇప్పటికే చాలా ప్రాంతాల్లో దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్ల ఘటనలు చోటుచేకోవడంతో ఆ ఫోన్లపై కొన్ని ప్రదేశాల్లో ఆంక్షలు విధించారు. తాజాగా జరిగిన అలాంటి ఘటనతో శాంసంగ్ కంపెనీకి తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. తన కొత్త మొబైల్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలిందంటూ చైనాకు చెందిన ఓ యువకుడు ఫిర్యాదుచేశాడు.

హుయ్ అనే యువకుడు గత శనివారం నోట్ 7 మొబైల్ కొన్నానని, అయితే ఆదివారం చార్జింగ్ పెట్టగా మొబైల్ పేలిపోయిందట. ఈ విషయాన్ని మంగళవారం నాడు స్థానిక మీడియాకు వెల్లడించాడు. బ్యాటరీ లోపం కారణంగా పేలుళ్లు తలెత్తుతున్నాయన్న ఆరోపణలతో అమెరికా, దక్షిణకొరియా, ఇతర దేశాలలో అమ్మకాలు జరిగిన దాదాపు 2.5 మిలియన్ల గెలాక్సీ నోట్ 7 మొబైల్స్ ను శాంసంగ్ కంపెనీ రీకాల్ చేసిన విషయం తెలిసిందే. గత వారం రెండు పేలిన మొబైల్స్ విషయంపై కంపెనీ దర్యాప్తు చేసింది. ఆ రెండు హ్యాండ్ సెట్లను చైనా ఆన్ లైన్ మార్కెట్ నుంచి కొనుగోలు చేశారని, అయితే వాతావరణంలోని వేడి, ఇతర కారణాల వల్ల అవి పేలినట్లు చెబుతున్నారు.

బాధితుడు హుయ్ ను కలిసిన శాంసంగ్ సిబ్బంది అతడికి ఆ హ్యాండ్ సెట్ ఖర్చుతో పాటు ఫోన్ పేలుడులో ధ్వంసమైన అతడి లాప్ టాప్ ను తమకిచ్చేస్తే అందుకు తగిన పరిహారాన్ని చెల్లించుకుంటామని తెలిపారు. కస్టమర్ హుయ్ మాత్రం.. ఈ విషయంపై శాంసంగ్ అధికారికంగా ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. గెలాక్సీ నోట్ 7 హ్యాండ్ సెట్ ను తమకు అందిస్తే పేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు కూడా వీలుంటుందని శాంసంగ్ మరో ప్రకటనలో తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement