phone explode
-
ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాతుండగా పేలిన ఫోన్.. వ్యక్తి మృతి..
భోపాల్: ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కాల్స్ మాట్లాడొద్దని నిపుణులు ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మధ్యప్రదేశ్ బాద్నగర్ తహసీల్దార్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. దయారామ్ బరోద్ అనే 68 ఏళ్ల వ్యక్తి ఫోన్ బ్యాటరీ డౌన్ కావడంతో ఛార్జింగ్ పెట్టాడు. అప్పుడే కాల్ వచ్చింది. ఛార్జింగ్ ప్లగ్ తీయకుండా అలాగే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. దీంతో ఫోన్ పేలిపోయింది. పేలుడు ధాటికి దయారామ్కు తల, మొహం, ఛాతీపై తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు సమయంలో దయారామ్ అతని స్నేహితుడు దినేశ్‌తో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఒకరి అంత్యక్రియలకు హాజరయ్యే విషయంపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో దయానంద్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. కాల్ సడన్‌గా కట్ కావడంతో దినేశ్ దయారామ్కు మళ్లీ ఫోన్ చేశాడు. కానీ కాల్ కలవలేదు. దీంతో ఏం జరిగి ఉంటుందా అని దగ్గర్లోనే ఉన్న దయారామ్ ఇంటికి వెళ్లిన అతడు షాక్ అయ్యాడు. తీవ్ర గాయాలపాలై దయానంద్ అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఇతని భార్య మరణం తర్వాత ఒంటరిగా జీవిస్తున్నట్లు దినేశ్ చెప్పాడు. ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు ఛార్జర్ స్విచ్ బోర్డుకు కనెక్ట్ అయ్యే ఉన్నట్లు ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు. అయితే అతను ఏ కంపెనీ ఫోన్ ఉపయోగించాడనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడినప్పుడు ఓవర్‌హీట్ వల్ల అది పేలిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటరీ రెడ్ మార్క్‌లో ఉన్నప్పుడు ఇలా చేయడం చాలా డేంజర్ అని సూచించారు. చదవండి: హత్రాస్ సామూహిక అత్యాచారం కేసు.. ముగ్గురు నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించిన యూపీ కోర్టు -
పేలిన స్మార్ట్‌ఫోన్.. సీఈఓ మృతి
న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ పేలడంతో ఓ కంపెనీ సీఈఓ మృత్యువాత పడ్డారు. మలేషియాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మలేషియా పత్రికల కథనం ప్రకారం.. క్రాడిల్ ఫండ్ కంపెనీకి నజ్రీన్ హసన్(45) సీఈఓ. ఆయన వద్ద బ్లాక్‌బెర్రీ, హువాయ్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. అయితే ఇంటివద్ద తన గదిలో ఛార్జింగ్ పెట్టిన ఫోన్లలో ఒకటి అకస్మాత్తుగా పేలిపోవడంతో నజ్రీన్ మృతిచెందాడని ఆయన బంధువు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫోన్ పేలడంతో దాని భాగాలు మెడ వెనుక భాగం, తలలోనూ గట్టిగా గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమై సీఈఓ మృతిచెందారు. అయితే ఏ ఫోన్ పేలిందో కచ్చితమైన సమాచారం తమవద్ద లేదని పోలీసులు తెలిపారు. ఫోన్ పేలిన తర్వాత రూములో అలుముకున్న దట్టమైన పొగవల్ల ఊపిరాడక కొంత సమయానికే నజ్రీన్ హసన్ చనిపోయారని చెప్పారు. అందరు భావిస్తున్నట్లు అగ్నిప్రమాదం వల్ల ఆయన మరణించలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. క్రాడిల్ ఫండ్ అనేది మలేషియాకు చెందిన సంస్థ. వ్యాపారరంగంలోకి అడుగుపెట్టే నూతన సంస్థలకు ఆర్థికంగా సహకారం అందిస్తుంది. గత 15 ఏళ్లుగా నజ్రీన్ హసన్ క్రాడిల్ ఫండ్‌లో సేవలందిస్తూ ఎంతో మంది కొత్త వ్యాపారవేత్తలకు ఆదర్శంగా నిలిచారు. వ్యాపారవేత్త నజ్రీన్‌కు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. -
శాంసంగ్ కు మరో 'పేలుడు' తలనొప్పి
ఇప్పటికే చాలా ప్రాంతాల్లో దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్ల ఘటనలు చోటుచేకోవడంతో ఆ ఫోన్లపై కొన్ని ప్రదేశాల్లో ఆంక్షలు విధించారు. తాజాగా జరిగిన అలాంటి ఘటనతో శాంసంగ్ కంపెనీకి తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. తన కొత్త మొబైల్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేలిందంటూ చైనాకు చెందిన ఓ యువకుడు ఫిర్యాదుచేశాడు. హుయ్ అనే యువకుడు గత శనివారం నోట్ 7 మొబైల్ కొన్నానని, అయితే ఆదివారం చార్జింగ్ పెట్టగా మొబైల్ పేలిపోయిందట. ఈ విషయాన్ని మంగళవారం నాడు స్థానిక మీడియాకు వెల్లడించాడు. బ్యాటరీ లోపం కారణంగా పేలుళ్లు తలెత్తుతున్నాయన్న ఆరోపణలతో అమెరికా, దక్షిణకొరియా, ఇతర దేశాలలో అమ్మకాలు జరిగిన దాదాపు 2.5 మిలియన్ల గెలాక్సీ నోట్ 7 మొబైల్స్ ను శాంసంగ్ కంపెనీ రీకాల్ చేసిన విషయం తెలిసిందే. గత వారం రెండు పేలిన మొబైల్స్ విషయంపై కంపెనీ దర్యాప్తు చేసింది. ఆ రెండు హ్యాండ్ సెట్లను చైనా ఆన్ లైన్ మార్కెట్ నుంచి కొనుగోలు చేశారని, అయితే వాతావరణంలోని వేడి, ఇతర కారణాల వల్ల అవి పేలినట్లు చెబుతున్నారు. బాధితుడు హుయ్ ను కలిసిన శాంసంగ్ సిబ్బంది అతడికి ఆ హ్యాండ్ సెట్ ఖర్చుతో పాటు ఫోన్ పేలుడులో ధ్వంసమైన అతడి లాప్ టాప్ ను తమకిచ్చేస్తే అందుకు తగిన పరిహారాన్ని చెల్లించుకుంటామని తెలిపారు. కస్టమర్ హుయ్ మాత్రం.. ఈ విషయంపై శాంసంగ్ అధికారికంగా ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. గెలాక్సీ నోట్ 7 హ్యాండ్ సెట్ ను తమకు అందిస్తే పేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు కూడా వీలుంటుందని శాంసంగ్ మరో ప్రకటనలో తెలిపింది.