శాంసంగ్ కు అమెరికా భారీ షాక్ | US officially recalls Samsung Galaxy Note 7 | Sakshi
Sakshi News home page

శాంసంగ్ కు అమెరికా భారీ షాక్

Published Fri, Sep 16 2016 10:45 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

శాంసంగ్ కు అమెరికా భారీ షాక్ - Sakshi

శాంసంగ్ కు అమెరికా భారీ షాక్

వాషింగ్టన్: కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీకి అమెరికా భారీ షాక్ ఇచ్చింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ఫోన్ వాడొద్దని అధికారికరంగా అమెరికా ప్రకటించింది. గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ఫోన్ లోని బ్యాటరీ పేలుతుందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమెరికా వినియోగదారుల ఉత్పత్తి భద్రత కమిషన్ రీకాల్ నోటీసు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15లోపు కొన్న గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ఫోన్లను వాడొద్దని ఆదేశించింది. ఈ ఫోన్లను ఎక్కడైతే కొన్నారో అక్కడకు తీసుకెళ్లి కొత్త బ్యాటరీలు వేయించుకోవాలని  సూచించింది. అవసరమైతే ఫోన్ కూడా మార్చుకోవచ్చని తెలిపింది.

గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ఫోన్ లోని బ్యాటరీ పేలుడుకు సంబంధించి 92 ఘటనలు నమోదయ్యాయి. 26 బ్యాటరీలు కాలిపోయినట్టు ఫిర్యాదులు వచ్చాయి. కారు, గ్యారేజ్ లో మంటలు వచ్చి ఆస్తి నష్టం జరిగినట్టు 55 ఫిర్యాదులు అందాయి. ఆగస్టులో విడుదలైప్పటి నుంచి 25లక్షల గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ఫోన్లు అమ్ముడుపోయాయి. కాగా, వినియోగదారులకు అసౌకర్యం కలిగించినందుకు శాంసంగ్ క్షమాపణ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement