Amitabh Bachchan's Funny Tweet On Blue Tick Leaves Internet In Splits - Sakshi
Sakshi News home page

నీకో నమస్కారం సామీ..బ్లూటిక్‌ తిరిగిచ్చేయ్‌! బిగ్‌బీ ఫన్నీ ట్వీట్‌ వైరల్‌ 

Published Fri, Apr 21 2023 7:19 PM | Last Updated on Fri, Apr 21 2023 8:42 PM

Amitabh Bachchan Funny Tweet On Blue Tick Leaves Internet In Splits - Sakshi

సాక్షి, ముంబై: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ ఖాతాల బ్లూటిక్‌ మాయం కావడంతో ప్రముఖులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ముఖ్యంగా వెరిఫికేషన్‌ ఫీజు చెల్లించిన తరువాత కూడా బ్లూటిక్‌ మాయం కావడంతో ఒకింత అవమానంగా భావించారు. అంతేకాదు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలంతా ట్విటర్‌ చర్యతో షాక్‌ అవుతున్నారు. దీంతో మా బ్లూటిక్‌ మాకు కావాలంటూ డిమాండ్‌  చేయడం మొదలు పెట్టారు.  ముఖ్యంగా  బాలీవుడ్‌  సీనియర్‌ నటుడు  అమితాబ్‌ బచ్చన్‌ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

(ఇదీ  చదవండి: Twitter Down: ట్విటర్‌ డౌన్‌, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!)

హే ట్విటర్! మీరు వింటున్నారా?సబ్‌స్క్రిప్షన్ సేవ కోసం చెల్లించాను. కాబట్టి దయచేసి నా పేరు ముందుండే బ్లూటిక్‌ను తిరిగి  ఇచ్చేయండి. తద్వారా నేనే అమితాబ్ అని ప్రజలకు తెలుస్తుంది. చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. కాళ్లపై పడాలా?  అంటూ బిగ్‌బీ  ఫన్నీగా ట్విట్‌ చేశారు.  దీంతో యూజర్లు ఫన్నీ రిప్లైలను పోస్ట్ చేసారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా)

" సహనం ఉంటేనే బ్లూ టిక్’’ అని ఒకరు, మూడు నాలుగురోజులు ఆగండి అని ఇంకొకరు కామెంట్‌ చేశారు. మిస్టర్ బచ్చన్, మస్క్ విదేశీయుడు, ఎవరి మాటా వినడు. మీరు కొన్ని రోజులు వేచి ఉండాలని  ఇంకొకరు వ్యాఖ్యానించారు. అంతేకాదు "బచ్చన్ సాహెబ్ ఉ అంగ్రేజ్ హో కేహు కా నహీ సునత్ హో, అంటూ బిగ్‌బీ స్టయిల్‌లోనే  మరొకరు సమాధానం ఇచ్చారు. అలాగే నటి ఖుష్బూ కూడా తాను సబ్‌ స్క్రైబ్‌ చేసుకున్నప్పటికీ ట్విటర్‌ బ్లూటిక్‌ పోయిందని ట్వీట్‌ చేశారు.

సినీ స్టార్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కంపెనీలు,  బ్రాండ్‌లు, వార్తా సంస్థలు ఇలా ఏ ఖాతానూ మస్క్‌ వదిలిపెట్టలేదు.  బాలీవుడ్‌ స్టార్లు షారూఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, నటుడు ప్రకాశ్‌ రాజ్‌, టాలీవుడ్‌ హీరో చిరంజీవితోపాటు క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఖాతాల్లో బ్లూటిక్‌ ఎగిరిపోయింది. అలాగే హీరోయిన్‌లు సమంత, అలియా భట్‌ లతో పాటు రాజకీయ నాయకుల్లో కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్‌, మమతా బెనర్జీ, యూపీ యోగి ఆదిత్యనాథ్‌తోపాటు పలు మీడియా సంస్థలు కూడా  బ్లూటిక్‌ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement