లెన్స్ అండ్ లైఫ్...
యాభై ఏళ్ల కిందట క్లిక్‌మనే కెమెరాను చూసి ముచ్చటపడ్డారు. తోటివాళ్ల కెమెరాతో ఆ చిట్టి చేతులు తీస్తున్న అద్భుతాలు చూసిన అతడి తల్లి మైమరిచిపోయింది. అందుకే ఏడో తరగతిలోనే కుర్రాడికి మంచి కెమెరా కొనిచ్చింది. అంతే అప్పటి నుంచి ఆ కెమెరా క్లిక్‌మంటూనే ఉంది. ప్రకృతితో పెనవేసుకున్న అనుబంధం.. అత డిని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ వైపు నడిపించింది.
కొండల్లో, కోనల్లో, అడవుల్లో సంచరిస్తూ.. అక్కడ పరుచుకున్న ప్రక ృతిని తన కెమెరాతో ఒడిసిపట్టారు. అక్కడ సంచరిస్తున్న జంతుజాలాన్ని తన ఫొటోగ్రఫీ మాయాజాలంతో అందంగా చూపించారు. వీటన్నింటితో పాటు ప్రముఖ దినపత్రికల్లో పనిచేస్తున్న ఎంతోమంది ఫొటోగ్రాఫర్లకు ఓనమాలు నేర్పిన మాదిరెడ్డి రాంగోపాల్‌తో ఈ వారం లెన్స్ అండ్ లైఫ్...