Ocean Photography Awards 2021: Finalists Photo, Special Story In Telugu - Sakshi
Sakshi News home page

Ocean Photography Awards 2021: తాబేలును చుట్టేస్తూ.. మొప్పలతో భయపెడుతూ..

Published Sun, Sep 26 2021 10:27 AM | Last Updated on Sun, Sep 26 2021 1:54 PM

Ocean Photography Awards 2021: Ocean Under Mysterious World Amazing Photos - Sakshi

గుండ్రంగా తిరుగుతున్న బుజ్జి బుజ్జి పారదర్శక (గ్లాస్‌) చేపల మధ్య అమాయకంగా చూస్తున్న ఆకుపచ్చ తాబేలు భలే బాగుంది కదా. అమీ జాన్‌ అనే మహిళా ఫొటోగ్రాఫర్‌ ఆస్ట్రేలియా సముద్ర తీరంలో తీసిన చిత్రమిది. ‘‘సముద్రంలో డైవింగ్‌ చేస్తుండగా.. ఓ చోట పెద్ద సంఖ్యలో గ్లాస్‌ చేపలు కనిపించాయి. దగ్గరికి వెళ్లి చూస్తే.. అవన్నీ ఓ పెద్ద తాబేలు చుట్టూ వలయంలా తిరుగుతున్నాయి. వెంటనే క్లిక్‌మనిపించా..’’ అని అమీజాన్‌ తెలిపింది. ప్రఖ్యాత ఓసియన్‌ ఫొటోగ్రఫీ అవార్డ్స్‌–2021లో ఈ ఫొటో ఓవరాల్‌గా ప్రథమ బహుమతి కొట్టేసింది.

‘నా జోలికి వస్తే ఖబడ్దార్‌..’ అన్నట్టుగా భయపెడుతున్నది ఓ చేప పిల్ల. ఎదిగీ ఎదగని (లార్వా) దశలో ఉన్న కస్క్‌ ఈల్‌ రకం చేప ఇది. ఆ సమయంలో దాని రెక్కలు, మొప్పలు ఇలా వేలాడుతూ, కాంతికి మెరుస్తూ ఉంటాయి. శరీరం కూడా చాలా వరకు పారదర్శకంగా ఉండి, అవయవాలన్నీ బయటికి కనిపిస్తుంటాయి. సముద్రపు లోతుల్లో జీవించే ఈ అరుదైన చేపపిల్లను స్టీవెన్‌ కోవాక్స్‌ అనే ఫొటోగ్రాఫర్‌ చిత్రీకరించారు. ఈ ఫొటోకు ఓసియన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగంలో రెండో బహుమతి వచ్చింది.

పై ఫొటోలు రెండూ చేపలవి అయితే.. ఈ ఫొటో వాటిని వేటాడి తినే సముద్ర పక్షులది. గాల్లో వేగంగా ఎగురుతూనే ఉన్నట్టుండి ఒక్కసారిగా గంటకు 60 కిలోమీటర్లకుపైగా వేగంతో సముద్రంలోకి డైవ్‌ చేసి, వేగంగా దూసుకెళ్లడం వీటి ప్రత్యేకత. ఈ పక్షులు అంత వేగంగా, అదీ సముద్రంలో డైవ్‌ చేసేప్పుడు ఇలా ఫొటో తీయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ ఫొటో తీసిన మహిళా ఫొటోగ్రాఫర్‌ హెన్లీ స్పీర్స్‌కు ఓసియన్‌ ఫొటోగ్రఫీ అవార్డ్స్‌లో ఓవరాల్‌గా రెండో బహుమతి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement