Tortoise
-
విశాఖ జూకు కొత్త అతిథులు
ఆరిలోవ (విశాఖజిల్లా): విశాఖలో ఇందిరాగాంధీ జూ పార్కుకు కొద్దిరోజుల్లో మరికొన్ని కొత్త వన్యప్రాణులను తీసుకురావడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్నింటిని తీసుకురావడానికి సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా (సీజెడ్ఏ) అనుమతులు లభించాయి. మరికొన్నింటిని తీసుకురావడానికి అనుమతులు రావాల్సి ఉంది.కొన్నాళ్లుగా ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు ఇతర జూ పార్కుల నుంచి కొత్త జంతువులు, అరుదైన పక్షులను అధికారులు తరచు తీసుకొస్తున్నారు. గత నెల 27న కోల్‌కతాలోని అలీపూర్ జూ పార్కు నుంచి జంతుమారి్పడి విధానం ద్వారా జత జిరాఫీలు, రెండుజతల ఏషియన్ వాటర్ మానిటర్ లిజర్డ్స్, జత స్కార్లెట్ మకావ్ (రంగురంగుల పక్షి)లను ఇక్కడకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయా వన్యప్రాణులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మరికొన్ని వన్యప్రాణులను కొద్ది రోజుల్లో తీసుకురానున్నారు. బెంగళూరు జూ నుంచి మిలటరీ మెకావ్, రెడ్‌నెక్డ్ వాలిబీ, స్వైరల్ మంకీస్, మార్మోసెట్ మంకీస్, గ్రీన్ వింగ్ మెకావ్లను నెలరోజుల్లో తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటి కోసం జూలో ప్రత్యేకంగా ఎన్క్లోజర్లు సిద్ధం చేశారు. జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్ టార్టోయిస్లు జర్మనీ నుంచి 12 అలైబ్రొ జాయింట్ టార్టోయిస్లను విశాఖ జూకు తీసుకురానున్నారు. ఈ జాతి తాబేళ్ల జీవితకాలం వంద సంవత్సరాలు. ఇవి అరుదైనవి. మనదేశంలో ఇవి అరుదుగా కనిపిస్తాయని అధికారులు చెబుతున్నారు. వాటిని ఇక్కడకు తీసుకురావడానికి సీజెడ్ఏ అధికారుల అనుమతి లభించింది. వీటిని ఇక్కడకు తీసుకొస్తే వందేళ్ల వాటి జీవితకాలంలో ఆ జాతి సంతతి వృద్ధి చెందుతుంది. ఇతర జూ పార్కుల నుంచి జంతుమారి్పడి ద్వారా కొత్త వన్యప్రాణులను ఇక్కడకు తీసుకురావడానికి ఎక్కువగా అవకాశాలు కలుగుతాయని అధికారులు ఆశిస్తున్నారు. వీటితోపాటు అహ్మదాబాద్ జూ పార్కు నుంచి వివిధ రకాల అరుదైన పక్షులను తీసుకొచ్చేందుకు సీజెడ్ఏకి ప్రతిపాదనలు పంపించారు. అవికూడా వస్తే విశాఖ జూకి మరింత కొత్తదనం లభించనుంది.త్వరలోనే కొత్త వన్యప్రాణులు విశాఖ జూకి ఒకటి, రెండునెలల్లో కొత్త వన్యప్రాణులను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెంగళూరు జూ నుంచి మీర్కాట్, రెడ్‌నెక్డ్ వాలబీ, స్వైరల్ మంకీస్, మర్మోసెట్స్, గ్రీన్ వింగ్డ్ మకావ్ తదితర జాతులతో పాటు జర్మనీ నుంచి అలైబ్రొ జాయింట్ టోర్టోయిస్లను ఇక్కడికి తీసుకురావడానికి సీజెడ్ఏ అనుమతులు లభించాయి. అహ్మదాబాద్ జూ నుంచి మరికొన్ని అరుదైన పక్షులను తీసుకురావడానికి సీజెడ్ఏకి ప్రతిపాదనలు పంపించాం. సీజెడ్ఏ అనుమతులు వచ్చిన వెంటనే వాటిని తీసుకొస్తాం. గతనెలలో లీపూర్ జూ నుంచి ఇక్కడకు తీసుకొచ్చిన జిరాఫీలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. జూలో అరుదైన వన్యప్రాణులను అందుబాటులో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. – డాక్టర్ నందనీ సలారియా, జూ క్యూరేటర్, ఇందిరాగాంధీ జూ పార్కు, విశాఖపట్నం -
ఈ తాబేలు వయసు ఎంతో చెప్పగలరా?
భూమ్మీద అత్యంత పురాతన కాలం నాటి జంతువులు ఇప్పటికీ ఇంకా బతికే ఉన్నాయంటే నమ్ముతారా?. నో ఛాన్స్ అంతరించిపోయే ఉంటాయని కచ్చితంగా చెబుతాం. అది అబద్ధం... నేనింకా బతికే ఉన్నానంటోంది ఈ తాబేలు. దీని వయసెంతో వింటే కచ్చితంగా షాకవ్వుతారు. ఎందుకంటే ఇది డైనసర్ల కాలం నుంచి ఉంది. ఒకరకరంగా చెప్పాలంటే జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల కాలం నుంచి ఉన్న జీవిగా ఈ తాబేలుని పేర్కొనవచ్చు. ఆ తాబేలు ఎక్కడ ఉంది? దానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం! ఈ తాబేలు పేరు జోనాథన్. ఇది బ్రిటన్‌లోని సెయింట్ హెలెనాలో ఉంది. ఆ ద్వీపానికి చేరుకునేటప్పటికే ఈ తాబేలు వయసు 50 ఏళ్లు. అప్పటికే పూర్తిగి పరిణితి చెంది ఉంది. అందువల్ల ఇది సుమారు 1832లో జన్మించాడని చెబుతుంటారు దీని సంరక్షకులు. లేదా అంతకంటే పెద్దవాడైనా అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పడది తన 191వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఇప్పుడూ దీన్నే చూస్తే పురాతన కాలం నాటి కొన్ని జీవులు ఇంకా బతికే ఉన్నాయని ఒప్పుకుంటారు కదూ. అయితే తాబేలు జీవిత కాలం 60 నుంచి 150 ఏళ్లు. ఐతే కొన్ని మాత్రం 200 ఏళ్ల వరకు జీవిస్తాయని చాలా మంది చెబుతుంటారు. బహుశా ఈ జోనాథన్ తాబేలు కూడా ఆ కోవకు చెందిందేనేమో!. అయితే అలాంటి తాబేలు భారత్‌లోని కొలకతాలో కూడా ఉందట. దాని పేరు అద్వైత. ఇది ఏకంగా 255 ఏళ్లు జీవించినట్లు చెబుతున్నారు. తాబేలుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు శిరచ్ఛేదం చేసిన తాబేలు చనిపోదట. తల నరికిన 23 రోజుల వరకు బతికిన సందర్భాలు కూడా ఉన్నాయట. చైనా వాళ్లు దీన్ని దీర్ఘాయువుకి చిహ్నంగా భావిస్తారట. అంతేగాదు తాబేలు మెదడును శస్త్రచికిత్స ద్వారా తొలగించిన మరణించదట. పైగా మెదడును తొలగించిన ఆరు నెలల వరకు కూడా బతికే ఉంటుందట The world’s oldest living land animal - the Seychelles giant tortoise named Jonathan - has just celebrated his 191st birthday. His age is an estimate, based on the fact that he was fully mature when he arrived on the island in 1882.pic.twitter.com/t4hpd73KsE — Massimo (@Rainmaker1973) December 4, 2023 (చదవండి: దెయ్యాలకు బోజనం పెట్టే పండుగ గురించి విన్నారా?) -
చీతాతో ఫుడ్ షేర్ చేసుకున్న తాబేలు.. తెగ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కొన్ని వీడియోలు అందరినీ తెగ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఈ వీడియోలలో కొందరి విచిత్ర విన్యాసాలే కాదు.. వినూత్న ఆవిష్కరణలు కూడా కనిపిస్తుంటాయి. వీటికితోడు ఇక జంతువులకు సంబంధించిన వీడియోలకు కొదవేలేదు. వాటికి వచ్చే వ్యూస్‌కు అంతేలేదు. తాజాగా ఒక వీడియో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చీతా, తాబేలు ఎంతో స్నేహపూర్వకంగా ఆహారం తింటుండటాన్ని చూడవచ్చు. ఎక్స్(ట్విట్టర్)లో షేర్ అయిన ఈ వీడియోలో రెండు విభిన్నజాతులకు చెందిన జంతువులు కలివిడిగా ఉండటాన్ని చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. చిరుతలు వేగానికి, చురుకుదనానికి పెట్టిందిపేరు. అలాగే అది మాంసాహారి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక తాబేళ్ల విషయానికొస్తే ఇవి సాధారణంగా శాకాహార జంతువులు. నిదానంగా సాగే కార్యకలాపాలకు ప్రతీక. అయితే ఈ వీడియోలో విభిన్న స్వభావాలు కలిగిన ఈ రెండు జంతువులు ఒకే పాత్రలోని ఆహారాన్ని ప్రశాంతంగా తింటుడటాన్ని గమనించవచ్చు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 60 వేల వీక్షణలు దక్కాయి. లెక్కలేనన్ని కామెంట్లు వస్తున్నాయి. ఈ విచిత్ర స్నేహం చూసి కొందరు నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతుండగా, మరికొందరు దీనివెనుకగల కారణం తెలుసుకోవాలనుకుంటున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి? Cheetah & tortoise share food. Those who give their food give their heart. 📽️Carson Springs Wildlife pic.twitter.com/kf4agZCXOZ — Hakan Kapucu (@1hakankapucu) August 31, 2023 -
పూర్తిగా అంతరించే ప్రమాదంలో పలు జాతులు! దొంగచాటుగా ఓడల్లో ఎగుమతి! పాపం ఈ తాబేళ్లు!
World Tortoise Day 2023: తాబేలు కుందేలు కథ మనందరికీ తెలిసినదే! తాబేలు తాపీగా నడుస్తుంది. కుందేలు చెంగు చెంగున దూకుతూ వేగంగా పరుగులు తీస్తుంది. కుందేలు తాబేలుతో పరుగు పందేనికి దిగింది. తాపీ నడకల తాబేలును చివరిక్షణంలోనైనా ఓడించగలనని, గెలుపు తనదే అనుకుంది కుందేలు. మితిమీరిన ఆ ఆత్మవిశ్వాసంతోనే ఒక చెట్టు కిందకు చేరి హాయిగా కునుకు తీసింది. నిద్ర నుంచి కుందేలు కళ్లు తెరిచి చూసే సరికి నిరంతర శ్రమను నమ్ముకున్న తాబేలు తాపీగా గమ్యాన్ని చేరుకుంది. ఈ కథలో తాబేలు గెలిచింది. ఇది ప్రాచీనకాలం నాటి గ్రీకు కథ. ఇందులోని నీతి విశ్వజనీనమైనది కావడంతో అనువాదాల ద్వారా ప్రపంచమంతటా పాకింది. మనదేశంలో తాబేలును కూర్మావతారానికి ప్రతిరూపంగా పూజిస్తారు. ప్రపంచంలోని పలు ఇతర దేశాల్లోనూ తాబేలును ఆరాధించే ఆచారాలు ఉన్నాయి. అయినా, ప్రస్తుత ప్రపంచంలో తాబేళ్లు మనుగడ కోసం సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. పూర్తిగా అంతరించే ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, నదులు, చెరువులు, బావుల్లో మనుగడ సాగించే తాబేళ్లలో 356 జాతులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా– అంటే, 187 జాతులు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ సంగతిని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్’ (ఐయూసీఎన్) వెల్లడించింది. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, వీటిలోని పలు జాతులు ఈ శతాబ్ది ముగియక మునుపే పూర్తిగా అంతరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రమాదం అంచుల్లో ఉన్న తాబేళ్ల జాతులను, అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్న తాబేళ్ల జాతులను తన ‘రెడ్ లిస్ట్’లో చేర్చింది. తాబేళ్లలో కొన్నిజాతులు మంచినీటి తాబేళ్లు, మరికొన్ని జాతులు సముద్రపు తాబేళ్లు. సముద్రపు తాబేళ్లలో దాదాపుగా అన్నీ ప్రమాదం అంచుల్లో ఉన్నట్లు ‘వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్’ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) గుర్తించింది. ‘భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న జంతుజాతుల్లో తాబేళ్లు కూడా ఉన్నాయి. వీటిని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోకపోతే ఇవి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది’ అని ఐయూసీఎన్లోని తాబేళ్ల అధ్యయన బృందం అధిపతి క్రేగ్ స్టాన్ఫోర్డ్ చెబుతున్నారు. గంగా బ్రహ్మపుత్ర నదుల పరివాహక ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా తాబేళ్ల మనుగడ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా, ఇప్పటికీ మన దేశంలోనే తాబేళ్ల జాతుల వైవిధ్యం అత్యధికంగా కనిపిస్తుంది. భారత్ నుంచి బంగ్లాదేశ్ వరకు వ్యాపించి ఉన్న గంగా బ్రహ్మపుత్ర నదుల పరివాహక ప్రాంతంలో ఏకంగా 41 జాతుల తాబేళ్లు మనుగడ సాగిస్తున్నాయి. ఒకే ప్రాంతంలో ఇన్ని జాతుల తాబేళ్లను ప్రపంచంలో మరెక్కడా చూడలేం. వాతావరణ మార్పులు, జల కాలుష్యం, ఆవాసాల క్షీణత వంటివి తాబేళ్ల మనుగడకు కొంతవరకు ముప్పు కలిగిస్తున్నా, అక్రమ వేట వాటికి అన్నింటి కంటే ఎక్కువగా ముప్పు కలిగిస్తోంది. మాంసం కోసం తాబేళ్లను ఇష్టానుసారం వేటాడుతున్నారు. ఆహారం కోసమే కాకుండా, సంప్రదాయ ఔషధాల తయారీలోనూ తాబేలు మాంసం, గుడ్లు, ఇతర శరీర భాగాలను వినియోగిస్తారు. చైనాలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. తాబేలు మాంసం వినియోగంలో చైనాదే ప్రపంచంలో అగ్రస్థానం. చైనా, థాయ్‌లాండ్ తదితర దేశాల్లో తాబేళ్లను పెంచుకునే అలవాటు కూడా ఉంది. దొంగచాటుగా ఓడల్లో ఎగుమతి చైనా తర్వాత ఆఫ్రికా దేశాలు కూడా తాబేలు మాంసాన్ని, గుడ్లను గణనీయంగానే వినియోగిస్తున్నాయి. తాబేళ్లను వినియోగించే ప్రాంతాలకు ఎగుమతులు చేసేందుకు దక్షిణ అమెరికా దేశాల్లో యథేచ్ఛగా వేట కొనసాగుతోందని, తాబేళ్ల పరిరక్షణలో యూరోపియన్ యూనియన్‌లోని దేశాలే కొంత మెరుగ్గా ఉన్నాయని ఐయూసీఎన్ చెబుతోంది. తాబేళ్లు తిండి, నీరు లేకపోయినా నెలల తరబడి బతకగలవు. అక్రమ రవాణాదారులు వీటిని వేటగాళ్ల నుంచి కొనుగోలు చేసి, గిరాకీ ఎక్కువగా ఉండే దేశాలకు దొంగచాటుగా ఓడల్లో ఎగుమతి చేస్తుంటారు. తాబేళ్లు ఇటూ అటూ కదిలి తప్పించుకోకుండా ఉండేందుకు, వాటిని తల్లకిందులుగా పెట్టెల్లో బంధించి రవాణా చేసే పద్ధతి చాలా క్రూరమైనదని ప్రపంచవ్యాప్తంగా జంతుప్రేమికులు గగ్గోలు పెడుతున్నా, వివిధ దేశాల్లో తాబేళ్ల అక్రమ రవాణా మాత్రం ఆగకుండా సాగుతూనే ఉంది. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న తాబేళ్ల జాతులు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశాల్లో మన భారత్ మూడో స్థానంలో ఉంది. చైనా, వియత్నాం మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. మన దేశంలో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న కొన్ని జాతుల తాబేళ్లు: నార్తర్న్ రివర్ టెరాపిన్: ఇది మంచినీటి తాబేలు. పశ్చిమబెంగాల్లోని సుందర్బన్స్ అటవీ ప్రాంతంలో కనిపిస్తుంది. ∙రెడ్ క్రౌన్డ్ రూఫ్ టర్టల్: ఇది అత్యంత అరుదైన మంచినీటి తాబేలు. చంబల్‌లోయలోని చంబల్ ఘరియాల్ జాతీయ అభయారణ్య ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది. ∙ఇండియన్ స్టార్ టార్టాయిస్: ఇది భారత్, పాకిస్తాన్, శ్రీలంకల్లోని కొద్దిపాటి నీటి వనరులు ఉన్న పొడినేలల్లోను, పొదలతో నిండి ఉన్న చిట్టడవుల్లోను కనిపిస్తుంది. ఎక్కువగా అక్రమ రవాణాకు గురవుతున్న తాబేలు జాతుల్లో ఇదొకటి. ∙బ్లాక్ పాండ్ టర్టల్: ఎక్కువగా చెరువులు, పెద్దపెద్ద బావుల్లో కనిపిస్తుంది. భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో ఇది కొంత అరుదుగా కనిపిస్తుంది. దీన్ని స్పాటెడ్ పాండ్ టర్టల్ అని కూడా అంటారు. ఇండియన్ నేరోహెడెడ్ సాఫ్ట్‌షెల్ టర్టల్: ఇది ఎక్కువగా గంగా పరివాహక ప్రాంతంలో కనిపిస్తుంది. నదిలోని చేపలు, కప్పలు, ఇతర కీటకాలు దీని ప్రధాన ఆహారం. బ్లాక్ సాఫ్ట్‌షెల్ టర్టల్: ఇది భారత్, బంగ్లాదేశ్‌లలో దిగువ బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కొందరు చెరువుల్లో కూడా ఈ జాతి తాబేళ్లను పెంచుతుంటారు. ఆసియన్ జెయింట్ టార్టాయిస్: భారత్ సహా ఆసియా ప్రధాన భూభాగంలో ఉన్న దేశాల్లో కనిపిస్తుంది. భారత్, బంగ్లాదేశ్, ఇండోనేసియా, మలేసియాల్లో కొంత ఎక్కువగా అడవులు, కొండలు ఉండే ప్రాంతాల్లో కనిపిస్తుంది. దీనిని ఆసియన్ ఫారెస్ట్ టార్టాయిస్ అని, మౌంటెయిన్ టార్టాయిస్ అని కూడా అంటారు. ఈ జాతి తాబేళ్లు చాలా భారీగా పెరుగుతాయి. ఈ జాతి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లు ఐయూసీఎన్ గుర్తించింది. తాబేళ్ల విశేషాలు తాబేళ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవి రకరకాల పరిమాణాల్లో, రంగుల్లో ఉంటాయి. వీటిలో కొన్ని ఇట్టే అరచేతిలో ఇమిడిపోయేలా ఉంటాయి. ఇంకొన్ని కొండల్లా పెరుగుతాయి. సజావుగా బతకనిస్తే వీటిలో కొన్ని శతాబ్దాల ఆయుర్దాయంతో బతుకుతాయి. ఇంకొన్నిటి ఆయుర్దాయం పట్టుమని పదేళ్ల వరకే ఉంటుంది. తాబేళ్లలో ఉన్న వైవిధ్యం మరే జంతుజాతిలోనూ కనిపించదు. కోట్లాది ఏళ్లుగా మనుగడ సాగిస్తున్న తాబేళ్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.. అతిచిన్న తాబేలు అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత చిన్న తాబేలును గత ఏడాది కనుగొన్నారు. న్యూఆర్లీన్స్ తీరం వద్ద తచ్చాడుతున్న ఈ తాబేలును లూసియానా తీర పరిరక్షక దళానికి చెందిన శాస్త్రవేత్తలు పట్టి తెచ్చి మీడియా ముందు ప్రదర్శించారు. ఇది కెంప్స్ రిడ్లే జాతికి చెందిన తాబేలు. ఈ జాతి తాబేళ్లు దాదాపు రెండడుగుల పొడవు వరకు పెరుగుతాయి. అయితే లూసియానాలో శాస్త్రవేత్తలకు దొరికిన తాబేలు పూర్తిగా ఎదిగినా, దీని పరిమాణం ఆరంగుళాల లోపే ఉండటం విశేషం. అతిపెద్ద తాబేలు ప్రపంచంలోనే అతిపెద్ద తాబేలు సీషెల్స్‌లోని బర్డ్స్ ఐలాండ్‌లో ఉంది. ఇది ఆసియన్ జెయింట్ టార్టాయిస్ జాతికి చెందినది. సాధారణంగా ఈ జాతి తాబేళ్లు మూడున్నర నుంచి నాలుగు అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఇది నాలుగు అడుగుల ఐదంగుళాల పొడవు, మూడడుగుల నాలుగంగుళాల వెడల్పు, రెండడుగుల మూడంగుళాల ఎత్తుతో ప్రపంచంలోనే అతిపెద్ద తాబేలుగా గిన్నిస్ రికార్డుకెక్కింది. ఆలివ్‌రిడ్లే వలస ప్రయాణం ఆలివ్‌రిడ్లే తాబేళ్లు సముద్రపు తాబేళ్లు. ఇవి ఎక్కువగా పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని ఉష్ణమండల ప్రాంతాల్లో ఉంటాయి. భారత్, జపాన్, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, మైక్రోనేసియా తదితర తీరాల్లో ఇవి కనిపిస్తుంటాయి. వీటిది విస్తారమైన సామ్రాజ్యం. ఒకప్పుడు ఇవి చాలా విరివిగా కనిపించేవి. ఇష్టానుసారంగా వేటాడుతుండటంతో వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. గుడ్లు పెట్టేకాలంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు అనువైన తీరాలను వెతుక్కుంటూ వలస వెళతాయి. గుడ్లు పెట్టడం కోసం ఇవి మన దేశం, ఒడిశాలోని కేంద్రపడా జిల్లా గహిర్మథా తీరానికి, గంజాం జిల్లాలోని రుషికుల్యా నదీముఖద్వారానికి పెద్దసంఖ్యలో చేరుకుంటాయి. ఈ కాలంలో కర్ణాటకలోని హొన్నవర్ తీరానికి, తమిళనాడులోని కోరమండల్ తీరానికి, శ్రీలంక తీరాలకు కూడా ఇవి చేరుకుంటాయి. ఏటా ఫిబ్రవరి చివరి వారం నుంచి ఇక్కడకు వీటి రాక మొదలవుతుంది. గుడ్లు పొదిగిన తర్వాత పిల్లలతో కలసి మే మొదటి వారం వరకు సముద్రంలో వీటి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. వీటికి ట్యాగులు తొడగడం ద్వారా పరిశోధకులు వీటి రాకపోకల తీరుతెన్నులను అధ్యయనం చేయగలుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య 1978 నాటికి కోటికి పైనేగా ఉండేది. తర్వాతి కాలంలో వేటగాళ్ల తాకిడి పెరగడంతో 2008 నాటికి 8.52 లక్షలకు పడిపోయింది. వీటి పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా, అక్రమంగా వీటి వేట కొనసాగుతూనే ఉంది. ఆలయాల్లో కూర్మావతారం తాబేలును పూజించడం మన దేశంలో శతాబ్దాలుగా ఆచారంగా వస్తోంది. కృతయుగంలో శ్రీమహావిష్ణువు కూర్మావతారం దాల్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మథనంలో దేవదానవులు కవ్వంగా ఎంపిక చేసుకున్న మంధర పర్వతం మునిగిపోకుండా ఉండటానికి శ్రీమహావిష్ణువు కూర్మరూపం దాల్చి, తన వీపుపై ఆ పర్వతాన్ని మోశాడని పురాణాల కథనం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మ క్షేత్రం ఉంది. కూర్మావతారానికి గల అత్యంత అరుదైన పురాతన ఆలయం ఇది. పదకొండో శతాబ్దిలో దీనిని నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణంలో గుంపులు గుంపులుగా తాబేళ్లు యథేచ్ఛగా సంచరిస్తూ కనిపిస్తాయి. కూర్మావతార ఆలయాల్లో ఇది అత్యంత ప్రసిద్ధమైనది. చిత్తూరు జిల్లా సముద్రపల్లెలోని కూర్మవరదరాజ ఆలయంలోను, కర్ణాటకలోని గవిరంగాపుర క్షేత్రంలోని రంగనాథ స్వామి ఆలయంలోనూ శ్రీమహావిష్ణువు కూర్మావతార రూపంలో పూజలు అందుకోవడం కనిపిస్తుంది. ఇతర దేశాల్లో కూర్మారాధన ప్రాచీనకాలం నుంచి పలు ఇతర దేశాల్లోనూ కూర్మారాధన ఉంది. ప్రాచీన నాగరికతలు పరిఢవిల్లిన పలు దేశాల్లో తాబేలును సుదీర్ఘాయుర్దాయానికి, సహనానికి, సరళ స్వభావానికి, తెలివితేటలకు ప్రతీకగా భావిస్తారు. తాబేలును అదృష్టానికి సంకేతంగా నమ్ముతారు. తాబేళ్లను గురించి ఎన్నో పురాణగాథలు ఉన్నాయి. తాబేలు తన వీపు మీద భూగోళాన్ని మోస్తుందనే పురాణగాథ కూడా ప్రచారంలో ఉంది. భూగోళాన్ని మోస్తున్న రూపంలో పురాతన తాబేలు శిల్పాలు, చిత్రాలు చైనా ప్రాంతంలో కనిపిస్తాయి. చైనీస్ సంప్రదాయ శాస్త్రమైన ‘ఫెంగ్ షుయి’లో తాబేలుకు విశిష్టమైన స్థానం ఉంది. ‘ఫెంగ్ షుయి’ తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలసి వస్తుందని చైనా ప్రజలు నమ్ముతారు. ఈ నమ్మకం ఇటీవలి కాలంలో ఇతర దేశాలకూ పాకడంతో దేశదేశాల్లో ‘ఫెంగ్ షుయి’ బొమ్మల వ్యాపారం లాభసాటిగా సాగుతోంది. ఆఫ్రికా దేశాల్లోనూ తాబేలు గురించి అనేక పురాణగాథలు ఉన్నాయి. ప్రాచీన ఈజిప్టులో తాబేలును ‘షెటా’ పేరుతో ఆరాధించేవారు. తాబేలు రూపంలోని తయారుచేసిన మట్టిపలకలను ప్రాచీన ఈజిప్షియన్లు అలంకరణ రంగులు కలుపుకోవడానికి ఉపయోగించేవారు. తవ్వకాల్లో బయటపడిన ఈ తాబేలు ఆకారం పలకలను ‘జూమోఫిక్ ప్యాలెట్’గా శాస్త్రవేత్తలు పేరుపెట్టారు. ఇవి క్రీస్తుపూర్వం నాలుగువేల ఏళ్ల నాటివని గుర్తించారు. మెసపటోమియా నాగరికతలో సుమేరియన్ల జలదేవత, జ్ఞానదేవత అయిన ‘ఎంకి’ ఒక సందర్భంలో భారీ తాబేలును సృష్టించిందనే పురాణగాథ ఉంది. ‘ఎంకి’కి సంబంధించిన గాథలను, శాసనాలను తాబేలు ఆకారంలోని శిలలపై లిఖించేవారు. ఈ శిలలను ‘కుందురు’ అంటారు. వీటిని ‘ఎంకి’ దేవతకు ప్రతీకగా నాటి ప్రజలు భావించేవారు. పురాతన గ్రీకు, రోమన్ నాగరికతల్లోనూ తాబేలు ఆరాధన ఉండేది. తాబేలు బొమ్మలతో కూడిన ముద్రలను, నాణేలను వారు విరివిగా ఉపయోగించేవారు. ప్రాచీన గ్రీకునగరం ఏజినాకు తాబేలు సంకేతంగా ఉండేది. ప్రాచీన గ్రీకు శృంగారదేవత ‘ఏఫ్రోడైట్’ తన పాదాన్ని తాబేలుపై ఆనించి ఉండే శిల్పాలు కూడా బయటపడ్డాయి. ఇండోనేసియా, మలేసియా, వియత్నాం, తైవాన్, జపాన్ తదితర ఆసియన్ దేశాల్లోనూ పురాతన కాలం నుంచి తాబేలు ఆరాధన ఉంది. మలేసియాలో కొబ్బరాకులతో తాబేలు బొమ్మలను తయారు చేసి ఇళ్లలో వేలాడగట్టుకుంటారు. వీటిని ‘కెటుపాట్ పెన్యు’ అంటారు. ఇళ్లల్లో వీటిని వేలాడదీస్తే దుష్టశక్తులు ఇంట్లోకి అడుగుపెట్టవని వారు నమ్ముతారు. ఇక జపాన్‌లో ‘గెన్–బు’ అనే నల్లతాబేలు క్యోటో నగరాన్ని శత్రువుల నుంచి దుష్టశక్తుల నుంచి కాపాడుతుందని నమ్ముతారు. ∙∙∙ సముద్ర తీరాల్లోని జీవవైవిధ్యాన్ని మెరుగు చేయడంలోను, ఇసుక తిన్నెలను తమ గుడ్ల పెంకుల్లోని పోషకాలతో నింపడంలోను తాబేళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సముద్రంలో జెల్లీఫిష్ జనాభా అదుపు తప్పకుండా అరికట్టడంలోనూ తాబేళ్ల పాత్ర కీలకం. ముఖ్యంగా ‘లెదర్‌బ్యాక్ సీ టర్టల్’ జాతికి చెందిన తాబేళ్లు జెల్లీఫిష్నే ప్రధాన ఆహారం చేసుకుని బతుకుతాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో తాబేళ్లు తమదైన పాత్ర పోషిస్తాయి. తాబేళ్లను కాపాడుకుంటే పర్యావరణం మరింత సురక్షితంగా ఉంటుంది. -
కడలిలో కచ్ఛప నగరం
సౌదీ అరేబియా కడలిలో నగర నిర్మాణాన్ని తలపెట్టింది. తాబేలు ఆకారంలోని భారీ ఓడను నిర్మించి, దానిని తేలియాడే నగరంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ తేలియాడే నగరానికి ‘పాంజీయోస్’ అని పేరు పెట్టింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తలపెట్టిన ఈ నౌకానగర నిర్మాణానికి సౌదీ ప్రభుత్వం 8 బిలియన్ డాలర్లు (రూ.65,388 కోట్లు) ఖర్చు చేస్తోంది. దీని నిర్మాణం పూర్తయితే, ఇందులో అరవైవేల మంది నివాసం ఉండటానికి వీలు ఉంటుంది. ఇందులోని శరీర భాగంలో అరవై నాలుగు అపార్ట్మెంట్లు ఉంటాయి. రెక్కల భాగంలో లగ్జరీ విల్లాలు, పర్యాటకుల కోసం హోటళ్లు ఉంటాయి. దీని వెడల్పు 610 మీటర్లు, పొడవు 550 మీటర్లు. ఇటాలియన్ స్టూడియో ‘లజారినీ’కి చెందిన ఆర్కిటెక్ట్‌లు, డిజైన్ ఇంజనీర్లు ఈ భారీ నిర్మాణానికి రూపకల్పన చేశారు. దీనిపైన హెలికాప్టర్లు ల్యాండ్ కావడానికి కూడా ప్రత్యేకమైన చోటు ఉండటం విశేషం. ఇది సముద్రంలో గంటకు ఐదు నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. పర్యాటకుల సౌకర్యం కోసం ఇతర ఓడలు, పడవలు దీని ఒడ్డున నిలపడానికి కూడా వెసులుబాటు ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.ఈ ఏడాది ప్రారంభిస్తున్న దీని నిర్మాణం పూర్తి కావడానికి ఎనిమిదేళ్లు పడుతుందని ‘లజారినీ’ ప్రతినిధులు చెబుతున్నారు. -
వీడి వయసు 190 ఏళ్లు.. యుద్ధాలతో పాటు ఎన్నో చూశాడు
ఈ భూమ్మీద అత్యంత వయసు గల జీవి ఏదో తెలుసా?.. పోనీ అధిక కాలం బతికే జీవిగా పేరు దేనికి ఉందో తెలుసా?.. తాబేలు! అవును.. తాబేలు గూటికి చెందిన జోనాథన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మగ తాబేలు వయసు.. అక్షరాల 190 సంవత్సరాలు. తద్వారా ప్రస్తుతానికి ఈ భూమ్మీద అత్యధిక వయసున్న ప్రాణిగా జోనాథన్ పేరు రికార్డుల్లోకి ఎక్కింది!. ► ఇక.. సౌత్ అట్లాంటిక్‌లోని మారుమూల ద్వీపం సెయింట్ హెలెనాలో జోనాథన్‌కు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ► ఈ ప్రాంతంలోనే ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్.. తన ఆఖరిరోజుల్ని ఇక్కడే గడిపి 1821లో కన్నుమూశారు. ► 1832లో ఇది గుడ్డు నుంచి బయటకు వచ్చి ఉంటుందని.. దానిపై ఉండే డొప్ప ఆధారంగా వయసుపై ఓ అంచనాకి వచ్చారు పరిశోధకులు. ► తూర్పు ఆఫ్రికా దేశం సీషెల్స్ నుంచి యాభై ఏళ్ల వయసులో జోనాథన్ను.. యూకే ఓవర్సీస్ సరిహద్దులకు తీసుకొచ్చారు. జోనాథన్(ఎడమ వైపు ఉన్న తాబేలు) ► 1882లో యాభై ఏళ్ల వయసున్న ఈ తాబేలును.. సర్ విలియమ్ గ్రే విల్సన్‌కు కానుకగా అందించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఆ ద్వీపానికి గవర్నర్ అయ్యారు. ► అప్పటి నుంచి సెయింట్ హెలెనా గవర్నర్ అధికార భవనంలోని మొక్కల సంరక్షణ కేంద్రంలో ఇది సేదతీరుతోంది. ► జోనాథన్ బాగోగులు చూసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయక్కడ. తోడు కోసం ఓ ఆడ తాబేలును కూడా తీసుకొస్తారు. ► జోనాథన్ పుట్టినరోజు వేడుకలు ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. అంతేకాదు.. దాని ఫేవరెట్ ఫుడ్(పండ్లు) అందించడంతో పాటు ప్రత్యేక కేక్‌ను సిద్ధం చేశారు. జోనాథన్ పేరు మీద ఓ స్టాంప్‌ను సైతం విడుదల చేయబోతున్నారు. ► ప్రపంచంలోనే అత్యధిక వయసు ఉన్న భూప్రాణిగా జోనాథన్ పేరు ఈ ఏడాది మొదట్లోనే గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. అయితే.. అత్యంత వయస్కురాలైన తాబేలుగా మాత్రం ఈ నెలలోనే ఘనత సాధించింది. ► జోనాథన్ కళ్ల ముందే ప్రపంచ యుద్ధాలు జరిగాయి. రాజులు-రాణులు పోయారు. బ్రిటిష్ రాజ్యమైతే చేతులూ మారింది. కానీ, జోనాథన్ మాత్రం వాడి స్వేచ్ఛా జీవితాన్ని స్వేచ్ఛగా ఆస్వాదిస్తూ ఉన్నాడు. ► ఇంకా వాడు ఎక్కువ కాలం బతకాలన్నది సెయింట్ హెలెనా అధికారుల కోరిక. ఒకవేళ.. వయసురిత్యా సమస్యలతో కన్నుమూసినా.. దాని పైడొప్పను భద్రంగా పదిలపరుస్తామని అధికారులు చెప్తున్నారు. :::వెబ్‌డెస్క్ ఇదీ చదవండి: రష్యాకు లక్ష, మాకు 13 వేలు! -
తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలిన డిప్యూటీ స్పీకర్ సతీమణి
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో తాబేళ్ల సంరక్షణకు చర్యలు చేపట్టారు. తాబేళ్లను సంరక్షించడం ద్వారా పునరుత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఆలీవ్ రిడ్లే సముద్రపు తాబేళ్ల పిల్లలను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సతీమణి రమాదేవి సముద్రంలోకి శుక్రవారం వదిలారు. జల కాలుష్యం నివారణలో తాబేళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని కోన రమాదేవి పేర్కొన్నారు. తాబేళ్ల గుడ్ల సేకరణ, సంరక్షణ, వాటి పునరుత్పత్తి కేంద్రాన్ని బాపట్ల సూర్యలంకలో రాష్ట్ర అటవీ శాఖ ఏలూరు జోన్ అవనిగడ్డ అటవీ రేంజ్ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. చదవండి: (ప్రతి గ్రామానికీ గుడి, బడి, ఆసుపత్రి అవసరం: ఆర్.నారాయణమూర్తి) -
పర్యావరణ నేస్తాలు ఆలివ్ రిడ్లేలు
విజయనగరం పూల్‌బాగ్: ఆలివ్‌రిడ్లేలుగా పిలిచే సముద్ర తాబేళ్లకు పర్యావరణ నేస్తాలుగా పేరుంది. తీరప్రాంతంలో పరిశ్రమలు అధికం కావడం, సముద్రంలో పెద్దబోట్లు తిరుగుతుండడంతో వీటి మనుగడ కష్టంగా మారింది. అలాంటి సమయంలో అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు తాబేళ్ల సంరక్షణకు శ్రీకారం చుట్టి తీరం వెంబడి పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆరేళ్ల కాలంలో 1,52,232 గుడ్లను సేకరించారు. 1,22,658 తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలారు. జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని 28 కిలోమీటర్ల మేర సముద్రతీరంలో 2014వ సంవత్సరంలో విజయనగరం అటవీశాఖ వన్యప్రాణి విభాగం 10 ఆలివ్‌రిడ్లే పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసింది. పెంపకం ఎలా చేపడతారంటే? ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో సముద్రంలోని ఆడ తాబేలు తీరానికి చేరుకుని గుడ్లు పెడుతుంది. వాటిని నక్కలు, అడవి పందులు ధ్వంసం చేయకుండా అటవీశాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. తాబేళ్ల పునరుత్పత్తికి ఏ ప్రాంతం అనుకూలమో ముందుగా గుర్తిస్తారు. ఆప్రాంతంలో మిని హ్యాచరీలు ఏర్పాటు చేసి అందులో రెండు నుంచి మూడు అడుగుల సైజు గుంతలు తవ్వి గుడ్లు ఉంచుతారు. గుంతల్లో ఉంచిన గుడ్లనుంచి పిల్లలు బయటకు వచ్చేందుకు 45 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. డిసెంబర్ నుంచి జూన్ వరకు ఉత్పత్తికేంద్రాల ద్వారా తాబేళ్లను అభివృద్ధి చేస్తారు. ఈ ప్రక్రియకు ట్రీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సహకరిస్తోంది. ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెట్టిన గుడ్లును సురక్షిత ప్రాంతాల్లో ఉంచి 25మంది కాపలాదారులను నియమించారు. చంపినా, తిన్నా నేరమే తాబేళ్లను వేటాడి చంపినా, వాటి గుడ్లను తిన్నా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఇవి గుడ్లు పెట్టే సమయంలో తీరం వెంబడి 500 మీటర్ల పరిధిలో పర్యావరణానికి హాని కలిగించే పనులు చేపట్టకూడదు. పర్యావరణ పరిరక్షణకు ఏం చేస్తాయంటే? తాబేళ్లు సముద్రంలోని పాచి, మొక్కలు, వివిధ రకాల వ్యర్థ పదార్థాలను తింటూ జలాలు కలుషితం కాకుండా చేస్తాయి. దీంతో తీరప్రాంతాల్లో నివశించే ప్రజలకు సముద్రపు గాలి సోకడం వల్ల అంటు వ్యాధులు రావని అధికారులు చెబుతున్నారు.సముద్రంలో ఆక్సిజన్ పెంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. అడ్డదిడ్డంగా ఉండే సీ గ్రాస్‌ను తాబేళ్లు తినడంతో సీ గ్రాస్ బెడ్ ఏర్పడుతుంది. దీంతో సముద్రంలో ఉన్న జీవరాశులు బెడ్‌పై గుడ్లు పెట్టి సంతాన ఉత్పత్తి చేస్తాయి. ఈ మేరకు మత్స్య సంపద పెరుగుతుంది. ఇదీ ప్రత్యేకత ఆలివ్‌రిడ్లే సుమారు 45 కిలోల బరువు, మూడడుగుల పొడవు, ఒకటిన్నర అడుగు వెడల్పు ఉంటుంది. పుట్టిన పిల్ల మూడు సెంటీమీటర్ల పొడవు, అరంగుళం వెడల్పు ఉంటుంది. ఆడ తాబేలు ఒడ్డుకు వచ్చి 60 నుంచి 150 వరకు గుడ్లు పెడుతుంది. మగ తాబేలు 25–30 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆడ తాబేలు 30–32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే బయటకు వస్తాయి. ఆడ తాబేళ్లు పిల్లలుగా ఉన్నప్పుడు ఏ తీరం నుంచి సముద్రంలోకి వెళ్తాయో పెద్దయ్యాక అదే తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. తాబేలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవిస్తుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆలివ్‌రిడ్లేలను సంరక్షించే బాధ్యతను తీసుకున్నాం. తాబేళ్ల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. భోగాపురం, పూసపాటిరేగ మండలంలోని సముద్ర తీర ప్రాంతంలో 1,69,509 గుడ్లను సేకరించి పునరుత్పత్తి కేంద్రాల ద్వారా 1,38,738 పిల్లలను ఉత్పత్తిచేసి సముద్రంలో విడిచిపెట్టాం. కాంపా బయోడైవర్సిటీ స్కీం ద్వారా వచ్చిన నిధులతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. – ఎస్ వెంకటేష్, జిల్లా అటవీఅధికారి, విజయనగరం -
దున్నపోతు చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో
సాధారణంగా కొన్ని సందర్భాల్లో సాటి మనుషులే.. తోటివారు ఆపదలో ఉన్నప్పుడు మనకేందుకులే అని వదిలేస్తారు. అయితే, ఒక మూగ జీవి మాత్రం ఆపదలో ఉన్న సాటి జీవికి సహయం చేసి మనుషులు తమ ప్రవర్తనను మార్చుకోవాలనే సందేశాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, దున్నపోతులు కొన్ని సందర్భాల్లో కోపంగా ప్రవర్తిస్తుంటాయి. ఆ సమయంలో వాటికి ఎదురుగా ఎవరున్నా కోపంతో పైకి ఎత్తి కిందపడేస్తాయి. కొన్ని చోట్ల దున్నపోతుల పోటీలను నిర్వహిస్తుంటారు. వీటిలో వాటిని ఎరుపు వస్త్రం చూపించి, దాన్ని రెచ్చగొట్టేలా చేసి.. లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ ఆటలో ఒక్కొసారి అనుకొని సంఘటనలు చోటు చేసుకున్నవిషయం మనకు తెలిసిందే. అయితే, ఇక్కడ మాత్రం.. ఒక దున్నపోతు తనకు ఎదురుగా ఉన్న ఒక జీవిని.. కోపంగా కుమ్మకుండా ప్రశాంతంగా దాని ప్రాణాలను కాపాడింది. వివరాలు.. ఈ వీడియోలో ఒక నలుపు రంగు దున్నపోతు, దాని ముందు ఒక తాబేలు ఉన్నాయి. పాపం.. తాబేలు ఇసుకలో నడుచుకుంటూ వెళ్లి బోర్లాపడింది. ఎంత ప్రయత్నించిన పైకి లేవలేకపోయింది. అప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. దీన్ని గమనించిన ఒక దున్నపోతు.. వెంటనే అక్కడికి వెళ్లి తన కొమ్ములతో తాబేలుకు ఆనించి.. పైకి లేచేలా చేసింది. దీంతో ఈ సంఘటనను చూస్తున్న అక్కడి వారంతా అభినందిస్తు కేకలు వేశారు. అయితే, దీన్ని గతంలో మనస్కామ్రాన్ అనే టిక్ టాక్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. కొందరు మనుషుల కంటే నోరులేని జీవాలే నయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. Buffalo saved a tortoise by flipping him over.. 🎥 IG: sanamkamran pic.twitter.com/DpHAbsk2eA — Buitengebieden (@buitengebieden_) December 16, 2021 -
వేమనపల్లి ప్రాణహిత తీరంలో ఏళ్లనాటి డైనోసార్ శిలాజాలు
కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన ఎన్నో జీవజాతులు పరిణామ క్రమంలో కాలగర్భంలో కలిసిపోయాయి. అలాంటి వాటిలో ప్రముఖంగా చెప్పుకునే రాకాసి బల్లులు ఒకప్పుడు మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలోని ప్రాణహిత తీరం వెంబడి రారాజులుగా వెలుగొందాయి. వేమనపల్లిలో గుర్తించిన డైనోసార్ శిలాజాన్నే ప్రస్తుతం హైదరాబాద్‌లోని మ్యూజియంలో భద్రపర్చారు. దీంతోపాటు నత్తగుళ్లలు, చేప, వృక్ష, తాబేలు శిలాజాలను శాస్త్రవేత్తలు ఇక్కడ కనుగొన్నారు. వీటి ప్రాముఖ్యతను గుర్తించిన కొందరు చరిత్రకారులు తీరం వెంబడి తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత వీటి ఉనికిని పట్టించుకోకపోవడంతో అధికవర్షాలు, కబ్జాల కారణంగా మట్టిలో కలిసిపోతున్నాయి. సాక్షి, వేమనపల్లి(బెల్లంపల్లి)ఆదిలాబాద్: వేమనపల్లి మండలంలోని రాజారం, మంగెనపల్లి, దస్నాపూర్, సుంపుటం, ప్రాణ హిత ప్రాంతాల్లో 16 కోట్ల ఏళ్ల క్రితం నాటి ఎన్నో రకాల శిలాజాలు ఇప్పటికీ విసిరేసిన ట్లు పడి ఉన్నాయి. 1925లో మలాన్ అనే జర్మ న్ శాస్త్రవేత్త కోటసారస్గా పిలిచే డైనోసార్ (రాకాసి బల్లి), ఫైసా అనే నత్తగుళ్ల, చేప, వృక్ష, తాబేలు ఆకృతుల్లో ఉన్న శిలాజాలను గు ర్తించారు. ఆ ఆనవాళ్ల ఆధారంగా 1970–85 మధ్య జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో యాదగిరి అనే శాస్త్రవే త్త స్థానిక కూలీల సాయంతో తవ్వకాలు జరి పారు. అప్పట్లో గుర్తించిన డైనోసార్ శిలాజా న్ని హైదరాబాద్‌లోని బిర్లా మ్యూజియానికి తరలించారు. వీటితోపాటు మండలాన్ని ఆనుకుని ఉన్న మత్తడి ఒర్రె, ప్రాణహిత తీరం వెంట విభిన్న ఆకృతుల శిలాజాలు ఉన్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో సేకరించిన వృక్ష శిలాజాలు అటవీశాఖ సంరక్షణ వేమనపల్లి, రాజారాం పరిసరాల్లో దొరికిన శి లాజాల రక్షణకు అట వీ శాఖ ప్రత్యేక చర్యలు తీ సుకుంది. మూడు సంవత్సరాల క్రితం డీఎఫ్ఓ గా పనిచేసిన ప్రభాకర్‌రావు వృక్ష, తాబేలు శి లాజాలను బొక్కలగుట్ట గాంధారి వనం, హైదరాబాద్ మ్యూజియానికి తరలించారు. సతీశ్బక్షి అనే జియాలజిస్ట్ ఈ ప్రాంతంలో దొరికే శిలాజాలపై పరిశోధనలు చేశారు. నత్తగుల్ల, వృక్ష, దారు, చేప శిలాజ అవశేషాలను పరిశోధనల నిమిత్తం తీసుకెళ్లారు. ఇటీవల ఔత్సాహిక పరిశోధకుడు సముద్రాల సునీల్ బృందం కూడా శిలాజ ఆనవాళ్లు, ఇతర అంశాలపై వేమనపల్లిలో పరిశోధనలు నిర్వహించారు. ప్రాణహిత తీరంలో నత్తగుళ్లు, తాబేళ్ల శిలాజాలు ఫాసిల్ పార్క్‌లతో రక్షణ.. మన దేశంలో హిమాచల్ ప్రదేశల్లోని శివాలిక్ ఫాసిల్ పార్కు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని సల్కాన్ ఫాసిల్ పార్కు, గుజరాత్‌లోని ఇంద్రోడా ఫాసిల్ పార్కు, మధ్యప్రదేశ్‌లోని మాండ్లే ప్లాంట్ ఫాసిల్స్ నేషనల్ పార్కు, తమిళనాడులోని సతనూర్ నేషనల్ ఫాసిల్ పార్కులు ఉన్నాయి. మన రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో మాత్రమే జియాలజికల్ పార్కులు ఉన్నాయి. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచా తాలూకాలో సైతం శిలాజ ఆనవాళ్లు గుర్తించి, వర్తమాన్ ఫాసిల్ పార్కు ఏర్పాటుచేశారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ప్రాణాహిత, గోదావరి బేసిన్లో ఉన్న వడోధామ్లో సారోపోడ్స్ సరీసృపాలు, వృక్షజాతుల శిలాజ జాడలు వెలుగుచూశాయి. దీంతో అక్కడి ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని వడ్ధామ్ ఫాసిల్ పార్కుగా మార్చింది. ఇది కొండపల్లి గ్రామానికి సరిహద్దుగా ఉండడంతో స్థానిక వృక్షశిలాజాలు కూడా వాటి కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. అరుదుగా ఉండే ఫాసిల్ వుడ్స్ కొండపల్లి ప్రాంతాన్ని, రాకాసి బల్లులు, ఇతర పురాతన జంతుజాలం తిరిగిన వేమనపల్లిని ఫాసిల్ పార్కుగా తీర్చిదిద్దాలని పరిశోధకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొండపల్లి అటవీప్రాంతంలో వృక్షశిలాజం, వృక్షశిలాజాలను పరిశీలిస్తున్న కలెక్టర్ చంపాలాల్(ఫైల్) కోట్ల ఏళ్ల నాటి జీవజాతులు పెంచికల్పేట్ మండలం కొండపల్లి అటవీప్రాంతంలో 15 ఎకరాల్లో విస్తరించి ఉన్న కోనిఫర్ జాతికి చెందిన వృక్ష శిలాజాలను 2014లో అటవీశాఖ అధికారులు కనుగొన్నారు. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని అటవీప్రాంతంలో ఆరున్నర కోట్ల ఏళ్ల నాటి శిలాజాలను గుర్తించారు. వర్షాలకు చిన్నవాగు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు పది అడుగుల లోతులో ఉన్న వీటి ఉనికి బయటపడింది. ఇందులో కొన్ని 10 నుంచి 25 అడుగుల పొడవు ఉంటే మరికొన్ని 50 అడుగుల వరకు పొడవు ఉన్నాయి. సంరక్షణ అందరి బాధ్యత శిలాజ సంపద సంరక్షణ విషయంలో అందరూ భాగస్వాములు కావాలి. అటవీశాఖ ఆధ్వర్యంలో గతంలో వృక్ష, ఇతర శిలాజాలను వెలికితీయించాం. వాటిని మంచిర్యాల గాంధారి వనంలో సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచాం. వీటి సంరక్షణకు ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాలు వస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. – బాబుపటేకర్, డీఆర్ఓ, వేమనపల్లి సంరక్షణ అందరి బాధ్యత 40 ఏళ్ల కింద మంగెనపల్లి జంగట్ల రాక్షసి బల్లి బొక్కలు ఉన్నాయంటే త వ్వకాల కోసం కూలీ పనులకు వెళ్లాం. పెద్దసార్లు వచ్చి రాజారాం, మంగెనపల్లికి చెందిన కూలీలను తీసుకెల్లారు. తవ్వకాల్లో దొరికిన వాటిని హైదరాబాద్‌కు తీసుకెళ్లిండ్లు. అప్పట్లో జీపుల్లో వచ్చి తవ్వకాలు జరిపించేవాళ్లు. సర్కారు పట్టింపు చేసి వాటిని బయటకు తీయాలే. – పాలే శంకర్, వేమనపల్లి -
తాబేలును చుట్టేస్తూ.. మొప్పలతో భయపెడుతూ..
గుండ్రంగా తిరుగుతున్న బుజ్జి బుజ్జి పారదర్శక (గ్లాస్) చేపల మధ్య అమాయకంగా చూస్తున్న ఆకుపచ్చ తాబేలు భలే బాగుంది కదా. అమీ జాన్ అనే మహిళా ఫొటోగ్రాఫర్ ఆస్ట్రేలియా సముద్ర తీరంలో తీసిన చిత్రమిది. ‘‘సముద్రంలో డైవింగ్ చేస్తుండగా.. ఓ చోట పెద్ద సంఖ్యలో గ్లాస్ చేపలు కనిపించాయి. దగ్గరికి వెళ్లి చూస్తే.. అవన్నీ ఓ పెద్ద తాబేలు చుట్టూ వలయంలా తిరుగుతున్నాయి. వెంటనే క్లిక్‌మనిపించా..’’ అని అమీజాన్ తెలిపింది. ప్రఖ్యాత ఓసియన్ ఫొటోగ్రఫీ అవార్డ్స్–2021లో ఈ ఫొటో ఓవరాల్‌గా ప్రథమ బహుమతి కొట్టేసింది. ‘నా జోలికి వస్తే ఖబడ్దార్..’ అన్నట్టుగా భయపెడుతున్నది ఓ చేప పిల్ల. ఎదిగీ ఎదగని (లార్వా) దశలో ఉన్న కస్క్ ఈల్ రకం చేప ఇది. ఆ సమయంలో దాని రెక్కలు, మొప్పలు ఇలా వేలాడుతూ, కాంతికి మెరుస్తూ ఉంటాయి. శరీరం కూడా చాలా వరకు పారదర్శకంగా ఉండి, అవయవాలన్నీ బయటికి కనిపిస్తుంటాయి. సముద్రపు లోతుల్లో జీవించే ఈ అరుదైన చేపపిల్లను స్టీవెన్ కోవాక్స్ అనే ఫొటోగ్రాఫర్ చిత్రీకరించారు. ఈ ఫొటోకు ఓసియన్ ఎక్స్‌ప్లోరేషన్ విభాగంలో రెండో బహుమతి వచ్చింది. పై ఫొటోలు రెండూ చేపలవి అయితే.. ఈ ఫొటో వాటిని వేటాడి తినే సముద్ర పక్షులది. గాల్లో వేగంగా ఎగురుతూనే ఉన్నట్టుండి ఒక్కసారిగా గంటకు 60 కిలోమీటర్లకుపైగా వేగంతో సముద్రంలోకి డైవ్ చేసి, వేగంగా దూసుకెళ్లడం వీటి ప్రత్యేకత. ఈ పక్షులు అంత వేగంగా, అదీ సముద్రంలో డైవ్ చేసేప్పుడు ఇలా ఫొటో తీయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ ఫొటో తీసిన మహిళా ఫొటోగ్రాఫర్ హెన్లీ స్పీర్స్కు ఓసియన్ ఫొటోగ్రఫీ అవార్డ్స్‌లో ఓవరాల్‌గా రెండో బహుమతి వచ్చింది. -
ఊహించని పరిణామం: ఇలాంటి వేటను అస్సలు చూసి ఉండరు!
Giant Tortoise Hunt Small Birds Video: తాబేలు-కుందేలు కథ గుర్తింది కదా!. కుందేలు బద్ధకం కలిసొచ్చి.. నత్తనడకతోనే పరుగు పందెంలో విజయం సాధిస్తుంది తాబేలు. అటుపై తాబేలు కథలెన్నో వాటిపై సింపథినీ, అదొక సాధు జీవి అనే మార్క్‌ను మనుషులకు క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో.. ఆ మార్క్‌ను పూర్తిగా చెరిపిపడేయడం ఖాయం. సాధారణంగా సెచెల్లెస్ తాబేళ్లు శాఖాహార జీవులు. అలాంటిది ఈ భారీ ఆడ తాబేలు.. ఇలా వేటాడింది. తూర్పు ఆఫ్రికా సెచెల్లెస్ దీవుల సముదాయంలోని ఫ్రెగేట్ ఐల్యాండ్‌లో కిందటి నెలలో ఈ వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఐల్యాండ్‌లో మూడు వేలకు పైగా తాబేళ్లు ఉన్నాయి. జీవావరణంలో మొట్టమొదటిసారి ఇలాంటి దాడిని చూడడమని పరిశోధకులు తేల్చేశారు. సెచెల్లెస్ తాబేళ్ల నుంచి కచ్చితంగా ఇది ఊహించని పరిణామమేనని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ జువాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జస్టిన్ గెర్లాచ్ చెబుతున్నారు. సెచెల్లెస్ తాబేళ్లలో ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రవర్తన పెరిగి ఉండొచ్చని ఆయన అంచనా వేస్తూ రాసిన కథనం.. కరెంట్బయాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. కరోనా ప్రభావం! తాబేళ్లకు కోపం, చికాకు వచ్చినప్పుడు దాడులు చేయడం సహజం. అయితే ఈ మధ్యకాలంలో పక్షుల గూడుల నుంచి పడిపోయిన పిల్లలను, గుడ్లను సెచెల్లెస్ తాబేళ్లు తింటున్నాయనే ప్రచారాలు వినిపించాయి. అయితే చాలామంది పరిశోధకులు ఈ కథనాలను నమ్మలేదు. ప్రస్తుతం ఈ వీడియో బయటకు రావడంతో అది నిజమనే ఓ అంచానికి వచ్చారు. కరోనా ప్రభావం వల్ల తాబేళ్ల జనాభా విపరీతంగా పెరగడం, వాటికి సరైన ఆహారం అందకపోవడం, గుడ్ల కోసం కావాల్సిన కాల్షియం దొరక్కపోవడం.. తదితర కారణాల వల్ల ఇవి ఇలా క్రూరంగా తయారై ఉంటాయని, అయితే వాటిని జీవన విధానానికి విరుద్ధంగా ప్రవర్తించే క్రమంలో అవి మనుగడ కొనసాగించగలవా? లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం పరిశీలన తప్పదని ప్రముఖ హెర్పటాలజిస్ట్ జేమ్స్ గిబ్స్ చెప్తున్నారు. చదవండి: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం! -
ఇదేం ఫ్యామిలీరా బాబు..కట్నంగా 21 గోర్లు గల తాబేలు ,నల్ల కుక్క కావాలంట!
పూణె: వరకట్నం అడగడం చట్టప్రకారం నేరమని చెప్తున్నా అమ్మాయిలకి, వారి కుటుంబ సభ్యులకి ఈ సమస్య తప్పట్లేదు. ఇప్పటికీ వరకట్న ఆత్మహత్యలు, వేధింపులు అప్పుడప్పుడు మనం వార్తల్లో వింటూనే ఉంటాం. సాధారణంగా వరకట్నం అంటే ఆస్తులు, డబ్బులు అడుగుతుంటారు. అయితే వెరైటీ కోరికలు కోరి వరకట్నంగా తీర్చమన్నారు ఓ కుటుంబ సభ్యలు. చివరికి కుటుంబమంతా కటకటలాపాలయ్యారు. ఈ ఘటన మహరాష్ట్రలోని ఔరంగాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 10న రామనగర్ ప్రాంతంలోని ఒక హాలులో ఓ జంటకు నిశ్చితార్థం అయ్యింది. యువతి కుటుంబం నిశ్చితార్థానికి ముందే 2 లక్షల నగదు, 10 గ్రాముల బంగారం వరకట్నంగా ఇచ్చారు. అయితే, నిశ్చితార్థం తరువాత అబ్బాయి కుటుంబ సభ్యులు వారి వింత కోరికల జాబితాను బయట పెట్టారు. ఆ లిస్ట్ చూస్తే ఇలాంటివి కూడా అడుగుతారా అనిపించేలా ఉన్నాయి. అందులో 21 గోర్లు గల తాబేళ్లు, ఒక నల్ల లాబ్రడార్ కుక్క, ఒక బుద్ధ విగ్రహం, సమై లాంప్‌స్టాండ్, రూ.10 లక్షలు ఇవ్వాలంటూ యువతి కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. ఇవి ఇస్తేనే వివాహం తర్వాత ఉద్యోగం వస్తుందని వాళ్లని నమ్మించారు. అనంతరం యువతి కుటుంబం ఈ కోరికలను తీర్చలేకపోవడంతో ఈ పెళ్లిని వరుడి కుటుంబసభ్యులు రద్దు చేశారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో వారిని అరెస్టు చేశారు. -
అంతరించిదనుకుంటే.. 100 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రత్యక్షం
ఓ అరుదైన తాబేలు. పేరు ఫెర్నాన్‌డినా జెయింట్. అంతరించిపోయింనుకున్నారు. కానీ మళ్లీ వందేళ్ల తర్వాత దర్శనమిచ్చింది. దీంతో శాస్త్రవేత్తలను ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ భూమిపై ఉన్న అనేక జీవజాతుల్లో జరిగిన అనేక మార్పులకు తాబేలు జాతి ప్రత్యక్ష సాక్షి అని శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. ఒకప్పుడు ఈ జాతి తాబేళ్లు అనేక ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవి. అయితే ఇవి క్రమంగా అంతరించిపోయాయి. దీంతో ఈ జాతి తాబేలు ఇక పూర్తిగా అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు భావించారు. అయితే 2019 చివరలో ఈక్విడార్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలాపెగాస్ ద్వీపంలో ఈ తాబేలు కనిపించింది. ఇప్పుడు మళ్లీ కనిపించిన ఫెర్నాన్‌డినా జెయింట్ తాబేలును 1906లో ఆఖరిసారి చూసినట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే ఇది ఫెర్నాన్‌డినా తాబేలా? కాదా? అనే విషయం శాస్త్రవేత్తలకు తెలియలేదు. దీంతో డీఎన్ఏ పరీక్షలకు పంపించగా తాజాగా ఫలితాలు వచ్చాయి. ఈ పరీక్షల్లో 2019లో దొరికినది ఫెర్నాన్‌డినా తాబేలేనని తేలడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: వైరల్: తేనెటీగలతో సాహసం.. 21 మిలియన్ల వ్యూస్!) -
అలా అయితేనే ఆడ తాబేళ్లు పుడతాయి!
క్షీర సాగర మథనం నిర్విఘ్నంగా పూర్తి కావడానికి శ్రీమహావిష్ణువు కూర్మరూపంలో అవతరించగా.. ఆ రూపాన్ని మరెక్కడా లేని తీరులో మూలవిరాట్టుగా ప్రతిష్టించి అర్చిస్తున్న విశిష్టత మన జిల్లాలో గోచరిస్తుంది. ఆధ్యాత్మిక భావానికి పరాకాష్టగా కూర్మనాథుడి ఆరాధనను చెప్పుకుంటే.. ఈ కాలంలో అందుకు ఏమాత్రం తీసిపోని మరో మానవీయ సేవ తీరప్రాంతంలో నిర్విఘ్నంగా సాగిపోతోంది. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతతిని పరిరక్షించడానికి.. వాటి గుడ్లను సేకరించి.. ప్రత్యేకించి పొదిగించి.. మళ్లీ సముద్రంలో లక్షలాది చిరుజీవులను విడిచిపెట్టే గొప్ప ప్రయత్నం నిరతం సాగుతోంది. అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్ చేస్తున్న ఈ మంచి ప్రయత్నం సముద్రం చేయూతతో ప్రశంసనీయ రీతిలో నడుస్తోంది. వజ్రపుకొత్తూరు రూరల్: అరుదైన ఉభయచర జీవుల్లో ఆలివ్ రిడ్లే తాబేలు ఒకటి. జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశ సముద్ర జలాల్లో అధికంగా కనిపించే ఈ రకమైన కూర్మాలు కేవలం గుడ్లు పెట్టేందుకు మన సముద్ర తీరానికి చేరుకుంటాయి. రాత్రి సమయంలో తీరంలోని ఇసుక తిన్నెల్లో గుడ్లు పెట్టి సముద్ర జలాల్లోకి జారుకుంటాయి. భద్రంగా కాపాడుతూ.. జిల్లాలోని 193 కి.మీ. విశాల సముద్ర తీర ప్రాంతం ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతతికి నిలయంగా నిలుస్తోంది. 16 హ్యచరీలు(తాబేళ్ల సంరక్షణ కేంద్రాలు)ను అటవీ శాఖ అధికారులు, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు సంయుక్తంగా ఏర్పాటు చేసి అరుదైన తాబేళ్లకు జీవం పోస్తున్నారు. ఇవి అంతరించిపోకుండా జిల్లా వ్యాప్తంగా 41 మంది వలంటీర్లను నియమించి వారి ద్వారా గుడ్లను సేకరిస్తున్నారు. తల్లి తాబేళ్లు ఇసుక తిన్నెలలో పెట్టిన గుడ్లు.. పక్షులు, జంతువులు, దొంగల బారిన పడకుండా సురక్షితంగా భద్రపరుస్తున్నారు. రాత్రి సమయం కీలకం.. ఏటా జనవరి నుంచి మార్చి వరకు తల్లి తాబేళ్లు గుడ్లు పెట్టే సమయం. రాత్రి 2 నుంచి వేకువజాము 5.30 గంటలలోపు తీరానికి చేరుకుని ఇసుక తిన్నెలలో బొరియలు చేసి గుడ్లును పెట్టి సముద్రంలోకి జారుకుంటాయి. ఒక్కో తాబేలు 30–140 వరకు గుడ్లు పెడతాయి. 28–30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొదిగిన పిల్లలు మగ తాబేళ్లుగా.. 30–32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొదిగినవి ఆడ తాబేళ్లుగా పుడతాయి. ఇక జిల్లా వ్యాప్తంగా 16 హ్యాచరీలు ఉన్నాయి. వజ్రపుకొత్తూరు సెక్షన్: వజ్రపుకొత్తూరు, మెట్టూరు బారువ సెక్షన్: కళింగపట్నం, గడ్డివూరు, బట్టి గల్లూరు, బారువ, ఇసకలపాలెం కవిటి సెక్షన్: డొంకూరు, చేపల కపాసుకుద్ది, బట్టివానిపాలెం శ్రీకాకుళం సెక్షన్: కొచ్చెర్ల, కనుగులవానిపేట టెక్కలి సెక్షన్: గుళ్లవాని పేట, కుందివానిపేట, మేఘవరం, భావనపాడు తీరాలలో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 25 లక్షల పిల్లలను సంరక్షించాం.. సముద్ర తాబేళ్ల సంతతిని పెంచడానికి కృషి చేస్తున్నాం. అటవీ శాఖతో కలిసి మా ట్రీ ఫౌండేషన్ పని చేస్తూ తాబేళ్లను సంరక్షిస్తున్నాం. గత పదేళ్లగా దాదాపు 25 లక్షల బుల్లి తాబేళ్లలను సురక్షితంగా సముద్రంలో విడిచి పెట్టాం. – కోడ సోమేష్, ట్రీ ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్ సంరక్షణకు ప్రత్యేక చర్యలు ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. హ్యచరీల వద్ద ప్రత్యేకంగా నియమించిన వలంటీర్ల ద్వారా వేలాది సంఖ్యలో తాబేళ్ల గుడ్లను సేకరిస్తున్నాం. వలంటీర్లకు నెలకు రూ.9,200 గౌరవ వేతనం అందిస్తున్నాం. – రజనీకాంతరావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కాశీబుగ్గ రేంజ్ -
పాపం తాబేలు.. పరుగెత్తలేక దొరికిపోయింది!
తాబేలు.. చిట్టి పొట్టి అడుగులు వేసుకుంటా బుజ్జిబుజ్జిగా నడిచే జీవి. మెల్లగా నడిచేవారిని తాబేలులాగే ఏంటా నడక అంటారు. అది ఎంత మెల్లగా నడుస్తుందంటే.. దాదాపు రెండున్నర నెలల్లో ఒక మైలు దూరం కూడా వెళ్లలేనంత. అవును.. 68 కిలోల ఓ తాబేలు, 74 రోజుల్లో మైలు దూరం కూడా పరుగెత్తలేకపోయింది. ఫలితంగా తిరిగి తన యజమాని దగ్గరకు వచ్చి బంధీ అయింది. వివరాల్లోకివెళితే.. అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలోని యాష్లాండ్ సిటీకి చెందిన లిన్ కోల్ అనే మహిళ సోలొమాన్ అనే తాబేలును పెంచుకుంటోంది. 15 ఏళ్ల వయసు గల ఆ తాబేలు రెండు నెలల క్రితం కనిపించకుండా పోయింది. దీంతో లిన్ కోల్ ఆందోళనకు గురై.. తాబేలు కనిపించడం లేదనే స్టిక్కర్లను చుట్టుపక్కల ఏర్పాటుచేసింది. కొద్ది రోజుల పాటు చుట్టు పక్కల వెతికినా ఫలితం లేకపోయింది. (చదవండి : బాక్స్ ఓపెన్ చేస్తే.. అనుకోని అతిథి) అయితే 74 రోజుల తరువాత లిన్ కోల్ ఇంటి సమీపంలోని ఓ వ్యాలీ కన్స్ట్రక్షన్ సైట్ వద్ద ఓ వ్యక్తికి తాబేలు కనిపించింది. వెంటనే లిన్ కోల్‌కు ఫోన్ చేసి ఆమె ఇంటికి వచ్చి మరీ ఆ వ్యక్తి తాబేలును అందజేశాడు. అయితే ఈ 74 రోజుల్లో అది కేవలం ఒక మైలు దూరం కూడా వెళ్లకపోవడం విశేషం. తన తాబేలు దొరకడం ఎంతో ఆనందంగా ఉందని.. తన పెంపుడు తాబేలును మళ్లీ చూస్తానని అనుకోలేదని లిన్ కోల్ పేర్కొంది. యజమానికి ఆనందం ఉన్నప్పటీకీ.. తాబేలుకి మాత్రం పరుగెత్తలేక దొరికిపోయానన్న బాధ ఉండే ఉంటుంది. -
చిలుకూరు ఆలయంలోకి తాబేలు
మొయినాబాద్(చేవెళ్ల): చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఆదివారం అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలోని శివాలయంలోకి కూర్మం(తాబేలు) ప్రవేశించింది. ఇది కోవిడ్–19ని జయించడానికి శుభసూచికంగా భావిస్తున్నామని ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ పేర్కొన్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణంలో ఉన్న సుందరేశ్వరస్వామి ఆలయం(శివాలయం)లోకి ఆదివారం తెల్లవారు జామున తాబేలు వచ్చింది. అర్చకుడు సురేష్ ఆత్మారాం ఆలయం తలుపు తెరిచేసరికి శివలింగం పక్కన తాబేలు ఉండడాన్ని గమనించారు. ఈ విషయాన్ని అర్చకుడు రంగరాజన్‌కు తెలియజేయడంతో ఆయన వచ్చి పరిశీలించారు. స్వామివారికి అభిషేకం నిర్వహించి స్వామివారితోపాటు కురుమూర్తి(తాబేలు)కి సైతం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు రంగరాజన్ మాట్లాడుతూ.. చిలుకూరు బాలాజీ సన్నిధిలోని శివాలయంలోకి కురుమూర్తి ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తుందన్నారు. వెంకటేశ్వరస్వామి అనుగ్రహంతో త్వరలో కరోనా వైరస్‌ను అంతంచేసే అమృతం లభిస్తుందని సూచిస్తున్నట్లుగా ఉందని చెప్పారు. -
తాబేలు ఆకారంలో ఆలుగడ్డ
నెన్నెల: మండల కేంద్రంలోని వడ్లవాడకు చెందిన మోసీన్ అనే కారు డ్రైవర్ ఇంట్లో అ చ్చం తాబేలు ఆకారంలో ఉన్న ఆలుగడ్డ చూపరును ఆకట్టుకుంటుంది. పది రోజుల క్రితం దుకాణంలో రెండు కిలోల ఆలుగడ్డలు తీసుకొచ్చి ఇంట్లో ఉంచామని అందులో కొన్ని ఆలుగడ్డలు మొలకెత్తాయి. ఒక ఆలుగడ్డ మాత్రం తాబేలు ఆకారంలో కనిపించిందని మోసీన్ తెలిపారు. ఆలుగడ్డకు ముందు భాగంలో తలలాగా ఒక పిలక, వెనుక భాగంలో ఇరువైపుల రెండు పిలకలు, మధ్య భాగంలో కాళ్ల వలె రెండు పిలకలు వచ్చాయని అన్నారు. దీంతో ఆలుగడ్డ అచ్చం తాబేలులా కనిపిస్తుందని తెలిపారు. -
వస్తా..వెళ్లొస్తా..తల్లినై మళ్లొస్తా..
ఇక్కడే పుట్టాను..ఎక్కడో పెరుగుతాను..మళ్లీ ఇక్కడికే వచ్చి పిల్లల్ని కంటాను..అంటూ ఇప్పుడే భూమిని చీల్చుకుని బయటపడిన తాబేలు పిల్లలు తల్లి దగ్గరికి చేరేందుకు ప్రయాణం మొదలు పెట్టాయి. పుడమి తల్లిని చీల్చుకుని భూమిపైకి వచ్చి స్వచ్ఛమైన బుడి అడుగులు వేసుకుంటూ సోదరులు, స్నేహితులతో కలిసి తన తల్లి దగ్గరకి చేరేందుకు గుంపులు గుంపులుగా లక్షలాది తాబేలు పిల్లలు సముద్రంలో కలిసిన దృశ్యం కనువిందు చేస్తోంది. బరంపురం: రెండు రోజులుగా వరుసగా గంజాం జిల్లాలోని రుశికుల్యా నది బంగాళాఖాతం ముఖద్వారం తీరాన పుర్ణబొందా, గొకురకుధా, పనిగొండా ప్రాంతంలో భూమి నుంచి అరుదైన తాబేలు పిల్లలు బయటకు రావడంతో సాగర తీర ప్రదేశం ఒక్కసారిగా అందంగా మారింది. గుడ్ల నుంచి బయటికి వచ్చిన తాబేలు పిల్లలకు ప్రకృతి అందాలు, స్వచ్ఛమైన గాలి స్వాగతం పలుకుతున్నాయి. గత జనవరి చివరివారం నుంచి ఫిబ్రవరి 2వ వారం వరకు ఇక్కడ తల్లి తాబేళ్లు గుడ్లు పెట్టిన సుమారు 5 లక్షల పిల్లలు ఇప్పటి వరకు సుమారు 3 లక్షలకి పైగా రికార్డ్ స్థాయిలో భూమి నుంచి బయటికి వచ్చి బుడి బుడి అడుగులు వేసుకుంటూ సాగరంలో కలుస్తున్నాయి. రక్షణగా ఫారెస్ట్ గార్డ్స్ తాబేలు పిల్లల రక్షణ కోసం సుమారు 200 మంది ఫారెస్ట్ గార్డులు, 200 మంది వలంటరీస్ను జిల్లా అటవీ శాఖ అధ్వర్యంలో నియమించారు. వారు రాత్రంతా తీరంలో ఉండి భూమి నుంచి బయటకి వచ్చిన తాబేలు పిల్లలను బకెట్లలో సేకరించి సముద్రంలోకి వదులుతున్నారు. నదికి అటువైపు బోట్లలో ఫారెస్ట్ గార్డ్స్, వలంటీర్లు కలిసి సముద్ర తీరం వైపు వెళ్లి తాబేలు పిల్లలను వేలాదిగా సముద్రంలో విడిచిపెడుతున్నారు. తీరంలో ప్రత్యేకంగా తాబేలు పిల్లలు ఎటు వెళ్లకుండా వలలు ఏర్పాటు చేశారు. వల నుంచి తాబేలు పిల్లలను సేకరించి సముద్రంలోకి వదులుతున్నారు. తాబేలు పిల్లలను కాకులు, గద్దలు ఎత్తుకెళ్లకుండా ఫారెస్ట్ గార్డ్లు బాంబులు పేలుస్తున్నారు. వేళ్లే ముందు తాబేలు పిల్లలు పిల్లగా వెళ్తూ..తల్లినై తిరిగి ఇదే స్థలానికి వస్తానని పుడమి తల్లిని ముద్దాడి మరీ వెళ్తున్నట్లు పిల్ల తాబేలు ముచ్చట గొల్పుతున్నాయి. -
స్ట్రాబెర్రీ.. రుచి అదిరింది..!!
సాక్షి, ప్రత్యేకం : రష్యాకు చెందిన కిర్బీ(తాబేలు)కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తొలిసారి స్ట్రాబెర్రీ రుచిని ఆస్వాదిస్తున్న కిర్బీ వీడియోను దాని యజమాని ఆన్లైన్లో పోస్టు చేశారు. తాబేలుకు స్ట్రాబెర్రీని రుచి చూపించడంపై మాట్లాడిన ఆమె తాబేలు జీర్ణ వ్యవస్థ 'తీపి పదార్థాలు'ను అరయించుకోలేదని చెప్పారు. అందుకే కెర్బీ కొన్ని సార్లు పండును రుచి చూసి వదిలేసిందని తెలిపారు. ప్రస్తుతం కిర్బీ వయసు నాలుగు సంవత్సరాలను చెప్పకొచ్చారు. రష్యా తాబేళ్లు ఐదు నుంచి పది ఇంచ్‌ల పొడవు మాత్రమే పెరుగుతాయి. 40 ఏళ్ల పాటు జీవిస్తాయి. -
భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య
బొమ్మనహాళ్: మండలంలోని ఉంతకల్లు గ్రామంలో బెస్త హనుమంతు (30) అనే వ్యక్తి భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపంతో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ శ్రీరాంశ్రీనివాస్ సోమవారం తెలిపారు. వివరాలు.. హనుమంతుకు మతిస్థిమితం లేక భార్య సరస్వతిని వేధించేవాడు. ఆమె భరించలేక పుట్టింటికి వెళ్లింది. అయితే ఆయన ఒంటరిగా జీవితాన్ని గడపలేక రెండు రోజుల క్రితం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని రాయదుర్గం ప్రభుత్వ ఆసుప్రతికి తరలించి పోస్టుమార్టం చేయించినట్లు ఎస్ఐ తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గలాపగస్ లో మరో భారీ తాబేలు!
తాబేళ్లలో ఇంచుమించుగా అన్నింటి జీవితకాలం వంద ఏళ్లకు పైనే ఉంటుంది. అయితే వాటిల్లో జెయింట్ టార్టాయిస్లు అయితే ఏకంగా రెండు వందల ఏభై ఏళ్లు కూడా బతుకుతాయి. తాజాగా సైంటిస్టులు ఫసిఫిక్ మహా సముద్రంలోని గాలాపగస్ దీవుల్లో ఓ భారీ తాబేలు జాతి ఉన్నట్లుగా గుర్తించారు. నెమ్మదిగా కదిలే సరీసృపాల సమూహాల్లో మరొక రకమైన ఈ తాబేలు.. శాంటా క్రజ్ ద్వీపంలో ఇంతకు ముందున్న తాబేళ్ళ జాతికి భిన్నంగా, వైవిధ్యంగా ఉన్నట్లు గుర్తించారు. వీటి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు జన్యు సమాచారాన్ని సేకరిస్తన్నారు. ఈ ద్వీప సమూహంలో ఉన్న మొత్తం 15 తాబేళ్ళ జాతుల్లో నాలుగు అంతరించిపోగా ఇది 15 వ జాతిగా సైంటిస్టులు చెప్తున్నారు. గాలాపగస్ రిటైర్డ్ పార్క్ రేంజర్... చెలోనాయిడిస్ డాన్ ఫాస్టియో అని ఈ కొత్త జాతికి పేరు పెట్టారు. గాలాపగస్ లో నివసించే భారీ తాబేళ్ళు 250 కేజీల వరకు బరువుండి, వందేళ్ళకంటే ఎక్కువకాలం బతుకుతాయి. అయితే శాంటా క్రూజ్ ద్వీపంలో ఉన్న రెండు అతిపెద్ద తాబేళ్ళు ఒకే జాతికి చెందినవిగా ఉన్నప్పటికీ, అవి జన్యు పరీక్షల్లో తేడాలు ఉన్నట్లు తేలిందని ఈ క్వెడార్ పర్యావరణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్తగా కనుగొన్న జాతులను తూర్పు శాంటా క్రుజ్ తాబేళ్ళుగా పిలుస్తారని, ఇవి ద్వీపంలోని తూర్పువైపు నివపిస్తాయని, అయితే ఇతర ద్వీపాల్లోని అతిపెద్ద తాబేళ్ళతో పోలిస్తే వీటిలో విభిన్నమైన జన్యువులు ఉన్నట్లు గుర్తంచారు. ఈ అతిపెద్ద తాబేలు యొక్క షెల్ ఆకారం మాత్రం ఇతర జాతులకంటే మరింత కుదించినట్లుగా ఉందని, యేల్ విశ్వవిద్యాలయం జీవశాస్త్రవేత్త గిసెల్లా కాక్సియాన్ అన్నారు. 250 దాకా ఉన్న ఈ భారీ తాబేళ్ళ జాతుల పరిరక్షకులు, వీటి జాతులు అంతరించిపోకుండా, వీటికి హాని కలగకుండా పునరుద్ధరించడానికి సహాయపడగలరని వీరు ఆశతో ఉన్నారు. ఇతర తాబేళ్ళకంటే ఎక్కువగా.. రెండువేలకు పైగా అతిపెద్ద తాబేళ్ళ జాతులు ఈద్వీపంలో నివసిస్తున్నట్లు వీరు చెప్తున్నారు. గాలాపగస్ ద్వీపంలో 1830 నాటికే జెయింట్ టార్టాయిస్ ఉన్నట్లు ప్రముఖ బ్రిటిష్ అధ్యయన వేత్త ఛార్లెస్ డార్విన్ అధ్యయనాల వల్ల తెలుస్తోంది. 16వ శతాబ్దం కన్నా ముందు గాలాపాగస్లో తాబేళ్ల సంఖ్య రెండున్నర లక్షల వరకు ఉండేదిట. అయితే 17వ శతాబ్దం నుంచి వీటిని వేటాడి తినే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అంతేకాదు, ఈ దీవుల్లో ఉండే ఒక జాతి ఎలుకలు తాబేళ్ల గుడ్లను తినేస్తుండేవట. ఇటువంటి అనేక కారణాలతో 1970 కల్లా ఈ భారీ తాబేళ్ల సంఖ్య కేవలం 3000కు చేరింది. -
ఘనంగా తాబేళ్ళ ఉత్సవాలు!
-
పోలీసులను పరుగు పెట్టించిన తాబేలు
తాబేలును పట్టుకోవడానికి పోలీసులు ఛేజింగ్ చేయాల్సి వచ్చిందంటే.. ముక్కున వేలేసుకుని నవ్వుకోవాల్సిందే. అయితే అమెరికాలో ఓ తాబేల్ ను పట్టుకోవడానికి అక్కడి పోలీసులు చిన్న ఛేజింగ్ చేయాల్సి వచ్చిందట. అమెరికాలోని అల్హంబ్రా నగరంలో 150 పౌండ్లున్న తాబేల్ రోడ్డుపై తిరుగుతూ పోలీసులకు కనిపించింది. అయితే తాబేలు అంత సులువుగా పోలీసుల చేతికి చిక్కకపోవడం కథలో ఓ ట్విస్ట్. రోడ్డుపైన తిరుగుతూ కనిపించిన తాబేల్ పట్టుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు చిన్నపాటి ఛేజింగ్ చేయాల్సి వచ్చిందని అల్హంబ్రా పోలీసుల విభాగం ఫేస్ బుక్ లో వెల్లడించింది. చివరకు లాస్ ఎంజెలెస్ కౌంటీ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎనిమల్ కేర్ అండ్ కంట్రోల్ వారికి అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు, తాబేలు లో వేగం ఎవరిది? తాబేల్ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కాని తాబేలు కంటే పోలీసులు వేగంగా పరిగెత్తి పట్టుకున్నారు. దాని బరువు 150 పౌండ్లు ఉంది. అని ఫేస్ బుక్ లో వెల్లడించారు.