అంతరించిదనుకుంటే.. 100 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రత్యక్షం | Fernandina Giant Tortoise Found Alive After 100 Years | Sakshi
Sakshi News home page

అంతరించిదనుకుంటే.. 100 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రత్యక్షం

Published Sun, Jun 6 2021 7:36 PM | Last Updated on Sun, Jun 6 2021 8:12 PM

Fernandina Giant Tortoise Found Alive After 100 Years - Sakshi

ఓ అరుదైన తాబేలు. పేరు ఫెర్నాన్‌డినా జెయింట్‌. అంతరిం‍చిపోయిం‍నుకున్నారు. కానీ మళ్లీ వందేళ్ల తర్వాత దర్శనమిచ్చింది. దీంతో శాస్త్రవేత్తలను ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ భూమిపై ఉన్న అనేక జీవజాతుల్లో జరిగిన అనేక మార్పులకు తాబేలు జాతి ప్రత్యక్ష సాక్షి అని శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. ఒకప్పుడు ఈ జాతి తాబేళ్లు అనేక ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవి. అయితే ఇవి క్రమంగా అంతరించిపోయాయి. దీంతో ఈ జాతి తాబేలు ఇక పూర్తిగా అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు భావించారు.

అయితే 2019 చివరలో ఈక్విడార్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలాపెగాస్‌ ద్వీపంలో ఈ తాబేలు కనిపించింది. ఇప్పుడు మళ్లీ కనిపించిన ఫెర్నాన్‌డినా జెయింట్‌ తాబేలును 1906లో ఆఖరిసారి చూసినట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే ఇది ఫెర్నాన్‌డినా తాబేలా? కాదా? అనే విషయం శాస్త్రవేత్తలకు తెలియలేదు. దీంతో డీఎన్‌ఏ పరీక్షలకు పంపించగా తాజాగా ఫలితాలు వచ్చాయి. ఈ పరీక్షల్లో 2019లో దొరికినది ఫెర్నాన్‌డినా తాబేలేనని తేలడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

(చదవండి: వైరల్‌: తేనెటీగలతో సాహసం.. 21 మిలియన్ల వ్యూస్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement