
సాక్షి, ప్రత్యేకం : రష్యాకు చెందిన కిర్బీ(తాబేలు)కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తొలిసారి స్ట్రాబెర్రీ రుచిని ఆస్వాదిస్తున్న కిర్బీ వీడియోను దాని యజమాని ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు. తాబేలుకు స్ట్రాబెర్రీని రుచి చూపించడంపై మాట్లాడిన ఆమె తాబేలు జీర్ణ వ్యవస్థ 'తీపి పదార్థాలు'ను అరయించుకోలేదని చెప్పారు.
అందుకే కెర్బీ కొన్ని సార్లు పండును రుచి చూసి వదిలేసిందని తెలిపారు. ప్రస్తుతం కిర్బీ వయసు నాలుగు సంవత్సరాలను చెప్పకొచ్చారు. రష్యా తాబేళ్లు ఐదు నుంచి పది ఇంచ్‌ల పొడవు మాత్రమే పెరుగుతాయి. 40 ఏళ్ల పాటు జీవిస్తాయి.