మిగతా అన్నీ సీజన్‌లలో కంటే శీతాకాలం బరువు తగ్గడం చాలా సవాలుగా ఉంటుంది. ఓ పక్క ముసుగుతన్ని పడుకోమనేలా చలి గజగజలాడిస్తుంది. దీంతో ఎలాంటి వ్యాయామాలు, వర్క్ అవుట్‌లు కుదరవు. ఓ రెండు రోజులు సీరియస్‌గా చేసినా..చలికి లేవలేక నానా పాట్లు. అందులోనూ ఈ శీతాకాలం శరీరం బద్ధకంగా తయారయ్యి కొవ్వుకూడా పొట్ట, తొడల్లోకి చేరిపోతుంది. బరువు తగ్గడం అటుంచి పెరిగే సూచనలే ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడూ ఈ స్ట్రాబెర్రీలు ఎంతగానో ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకుంటే శీతాకాలంలో సులభంగా బరువు తగ్గొచ్చు. శరీరంలో ఉన్న కొవ్వుని తగ్గించడంలో సహాయడపతాయి. ఒకరకంగా చెప్పాలంటే శీతాకాలంలో ఈ స్ట్రాబెర్రీలు ఆరోగ్యాకి చాలా ప్రత్యేకమైన పండ్లు అని చెప్పొచ్చు. వీటివల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం!.
కేలరీలు తక్కువ ఫైబర్ అధికం: స్ల్రాబెర్రీల్లో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. దాదాపు వంద గ్రాముల స్ట్రాబెర్రీల్లో కేవలం 32 కేలరీలే ఉంటాయి. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల దీన్ని ఆహారంగా తీసుకుంటే ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ వచ్చి అతిగా తినాలనే కోరిక ఆటోమేటిగ్గా తగ్గుతుంది.
అధిక నీటి కంటెంట్: వీటిలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా దీన్ని ఆహారంగా తీసుకుంటే తిన్న సంతృప్టికలిగి ఎక్కువ కేలరీల ఉన్న ఆహారం తగ్గించడానికి సహాయపడుతుంది.
విటమిన్లు, ఖనిజాలు సమృద్ధి: కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, స్ట్రాబెర్రీల్లో కావల్సినన్నీ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రధానంగా విటమిన్ సీ ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందించడానికి, ఐరన్ శోషణలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి స్ట్రాబెర్రీలు తగిన పోషకాహారాన్ని అందిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్: స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుంచి రక్షించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారిస్తుంది, బరువుని అదుపులో ఉంచుతుంది.
ఇక ఈ స్ట్రాబెర్రీల్లో ఉండే సహజమైన తీపి, సంతృప్తికరమైన రుచిని అందిస్తాయి. ప్రాసెస్ చేసిన స్వీట్ల కంటే ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మీ రోజువారి ఆహారంలో వీటిని చేర్చడం వల్ల అవసరమైన పోషకాల తోపాటు తీపి తినేలనే కోరికను తగ్గిస్తుంది. ఈ స్ట్రాబెర్రీలు ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గేందుకు ఉపయోగపడటమే గాక కేలరీల లోటుని భర్తిచేసేలా శరీరానికి అవసరమైన సమతుల్య ఆహారాన్ని కూడా అందిస్తాయి.
(చదవండి: ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా కడపుబ్బా నవ్వించే డాక్టర్!)
Comments
Please login to add a commentAdd a comment