Strawberry
-
లాభాల సిరి స్ట్రాబెర్రీ
గత రెండేళ్లుగా వాతావరణ పరిస్థితులు అనుకూలించక నష్టపోయిన స్ట్రాబెర్రీ రైతులకు ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించాయి. దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో అన్నిఖర్చులు పోనూ ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని రైతులు పేర్కొన్నారు. సేంద్రియ విధానంలో పండించడం వల్ల కొనుగోలు చేసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. సాక్షి,పాడేరు: అల్లూరి జిల్లా మన్యం ప్రాంతంలో స్ట్రాబెర్రీ పండ్ల సీజన్ ప్రారంభమైంది. పర్యాటక సీజన్ కావడంతో మంచి ఆదరణ నెలకొంది. అరకులోయ, లంబసింగి ప్రాంతాల్లో 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. కొంతమంది మైదాన ప్రాంత రైతులు గిరిజనుల వద్ద భూములు లీజుకు తీసుకుని చింతపల్లి మండలం లంబసింగి ప్రాంతంలో పండిస్తున్నారు. అరకులోయలోని పెదబల్లుగుడ సమీపంలో ఎకరా విస్తీర్ణంలో గిరిజన రైతులే స్వయంగా స్ట్రాబెర్రీని పండిస్తున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో పండ్ల దిగుబడి ఆశాజనకంగా ఉంది. అరకులోయ, లంబసింగి, రాజుపాకల ప్రాంతాల్లో స్ట్రాబెర్రీ పండ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించకుండా పండించడం వల్ల పండ్లకు మంచి డిమాండ్ ఉంది. 200 గ్రాములు రూ.100 అరకులోయ, లంబసింగి ప్రాంతాల్లో రైతులు, వ్యాపారులు 200 గ్రాముల పండ్లను రూ.100కు విక్రయిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో పండ్ల వ్యాపారులకు వారు ఇదే పండ్లను రూ.90కు అమ్ముతున్నారు. విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు లంబసింగి ప్రాంతం నుంచి ప్రతిరోజు ఎగుమతి అవుతోంది. ఎకరానికి రూ.2లక్షల ఆదాయం ఎకరాకు మూడు వేల కిలోల వరకు దిగుబడి వస్తోందని రైతులు తెలిపారు. అన్ని ఖర్చులు పోను ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని వారు వివరించారు. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉందని రాజుపాకలు ప్రాంతానికి చెందిన రైతు సత్యనారాయణ తెలిపారు. అనుకూలించిన వాతావరణం స్ట్రాబెర్రీ సాగుకు ఈఏడాది వాతావరణం అనుకూలంగా ఉంది. గత రెండేళ్లు అధిక వర్షాల కారణంగా పంటకు నష్టం వాటిల్లింది. ఈసారి మాత్రం పూత బాగుంది. పండ్ల సైజు కూడా పెద్దదిగా ఉండడంతో మరింత ఇష్టంగా తింటున్నారు. గిరిజన రైతులు సాగు చేపట్టేందుకు ముందుకు వస్తే ప్రోత్సహిస్తాం. హెక్టార్‌కు రూ.50వేల వరకు ఆర్థిక ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. – రమేష్ కుమార్‌రావు, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి, పాడేరు -
శీతాకాలంలో స్ట్రాబెర్రీలు తినొచ్చా?
మిగతా అన్నీ సీజన్లలో కంటే శీతాకాలం బరువు తగ్గడం చాలా సవాలుగా ఉంటుంది. ఓ పక్క ముసుగుతన్ని పడుకోమనేలా చలి గజగజలాడిస్తుంది. దీంతో ఎలాంటి వ్యాయామాలు, వర్క్ అవుట్లు కుదరవు. ఓ రెండు రోజులు సీరియస్‌గా చేసినా..చలికి లేవలేక నానా పాట్లు. అందులోనూ ఈ శీతాకాలం శరీరం బద్ధకంగా తయారయ్యి కొవ్వుకూడా పొట్ట, తొడల్లోకి చేరిపోతుంది. బరువు తగ్గడం అటుంచి పెరిగే సూచనలే ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడూ ఈ స్ట్రాబెర్రీలు ఎంతగానో ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకుంటే శీతాకాలంలో సులభంగా బరువు తగ్గొచ్చు. శరీరంలో ఉన్న కొవ్వుని తగ్గించడంలో సహాయడపతాయి. ఒకరకంగా చెప్పాలంటే శీతాకాలంలో ఈ స్ట్రాబెర్రీలు ఆరోగ్యాకి చాలా ప్రత్యేకమైన పండ్లు అని చెప్పొచ్చు. వీటివల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం!. కేలరీలు తక్కువ ఫైబర్ అధికం: స్ల్రాబెర్రీల్లో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. దాదాపు వంద గ్రాముల స్ట్రాబెర్రీల్లో కేవలం 32 కేలరీలే ఉంటాయి. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల దీన్ని ఆహారంగా తీసుకుంటే ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ వచ్చి అతిగా తినాలనే కోరిక ఆటోమేటిగ్గా తగ్గుతుంది. అధిక నీటి కంటెంట్: వీటిలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా దీన్ని ఆహారంగా తీసుకుంటే తిన్న సంతృప్టికలిగి ఎక్కువ కేలరీల ఉన్న ఆహారం తగ్గించడానికి సహాయపడుతుంది. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధి: కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, స్ట్రాబెర్రీల్లో కావల్సినన్నీ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రధానంగా విటమిన్ సీ ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందించడానికి, ఐరన్ శోషణలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి స్ట్రాబెర్రీలు తగిన పోషకాహారాన్ని అందిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్: స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుంచి రక్షించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా నివారిస్తుంది, బరువుని అదుపులో ఉంచుతుంది. ఇక ఈ స్ట్రాబెర్రీల్లో ఉండే సహజమైన తీపి, సంతృప్తికరమైన రుచిని అందిస్తాయి. ప్రాసెస్ చేసిన స్వీట్ల కంటే ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మీ రోజువారి ఆహారంలో వీటిని చేర్చడం వల్ల అవసరమైన పోషకాల తోపాటు తీపి తినేలనే కోరికను తగ్గిస్తుంది. ఈ స్ట్రాబెర్రీలు ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గేందుకు ఉపయోగపడటమే గాక కేలరీల లోటుని భర్తిచేసేలా శరీరానికి అవసరమైన సమతుల్య ఆహారాన్ని కూడా అందిస్తాయి. (చదవండి: ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా కడపుబ్బా నవ్వించే డాక్టర్!) -
Summer Drinks: దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్.. పోషకాలెన్నో! రోజుకో గ్లాస్ తాగితే
Summer Drink- Pomegranate Strawberry Juice: స్ట్రాబెరీలో విటమిన్ సి, కె, పీచుపదార్థం, ఫోలిక్ యాసిడ్, మ్యాంగనీస్, పొటా షియం పుష్కలంగా ఉంటాయి. ఇక, దానిమ్మగింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఇ, కె, ఫోలేట్, పొటాషియం ఉంటాయి. కాబట్టి దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్‌తో పై పోషకాలన్నీ శరీరానికి అంది.. జీర్ణక్రియ సక్రమంగా జరగడంతోపాటు, అధిక రక్తపీడనం నియంత్రణలో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఖనిజ పోషకాలు శరీరంలోని మలినాలను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్ తయారీకి కావలసినవి: ►దానిమ్మ గింజలు –రెండు కప్పులు ►స్ట్రాబెరీలు – ఆరు ►రాక్‌సాల్ట్ – టీస్పూను ►జీలకర్రపొడి – అరటీస్పూను ►నీళ్లు – పావు కప్పు ►ఐస్ క్యూబ్స్ – పది. దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్ తయారీ: ►స్ట్రాబెరీలను శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగాలి. ►బ్లెండర్లో దానిమ్మ గింజలు, స్ట్రాబెరీ ముక్కలు, రాక్ సాల్ట్‌ను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని వడగట్టి జ్యూస్‌ను విడిగా తీసుకోవాలి. ►ఇప్పుడు జ్యూస్‌లో జీలకర్రపొడి, ఐస్‌క్యూబ్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. జ్యూస్ మరింత రుచిగా ఉండాలంటేæ తేనెను కలుపుకోవచ్చు. ►తాజాగా ఉన్న స్ట్రాబెరీ, దానిమ్మ గింజలతో చేసే ఈడ్రింక్ మంచి రిఫ్రెషింగ్ జ్యూస్‌గా పనిచేస్తుంది. ►దీనిలో పంచదార వేయకపోవడం, వీగన్, గులెటిన్ ఫ్రీ కూడా కాబట్టి ఉపవాసంలో ఉన్నవారు కూడా ఈ జ్యూస్‌ను నిరభ్యంతరంగా తాగవచ్చు. వేసవిలో ట్రై చేయండి: Banana Milkshake: బరువు తగ్గాలా.. తియ్యటి పెరుగు, చల్లని పాలు.. ఇది తాగితే! Carrot Apple Juice Health Benefits: రోజుకొక గ్లాసు ఈ జ్యూస్ తాగారంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు -
ఈ సైజు స్ట్రా బెర్రీని ఎప్పుడైనా చూశారా ?
Guinness World Record for being the world's heaviest strawberry: మీరు ఏ సైజ్ స్ట్రాబెర్రీని చూసి ఉంటారు.. ఈ ఫొటోలోని సైజుదైతే ఎట్టి పరిస్థితుల్లోనూ చూసి ఉండరు.. ఎందుకంటే.. ప్రపంచంలో ఈ స్థాయి సైజుది ఇదొక్కటే ఉంది. 18 సెంటీమీటర్ల పొడవున్న ఈ పండు బరువు 289 గ్రాములు. అందుకే ప్రపంచంలోనే అత్యంత బరువైన స్ట్రాబెర్రీగా దీన్ని గిన్నిస్ బుక్‌వారు గుర్తించారు. ఇజ్రాయెల్‌కు చెందిన స్ట్రాబెర్రీ పండ్ల వ్యాపారి ఏరియల్ చాహీ తోటలో పండిన పండు ఇది. ఇప్పటివరకూ జపాన్‌కు చెందిన కోజీ నాకో అనే ఆయన పండించిన 250 గ్రాముల బరువున్న స్ట్రాబెర్రీదే రికార్డు. ఆ రికార్డును ఇది బద్దలుకొట్టింది. (చదవండి: ఏకే 47 గన్‌తో సైనిక కసరత్తులు చేస్తున్న 79 ఏళ్ల బామ్మ!) -
స్ట్రాబెర్రీ గర్ల్‌గా మారుమోగుతున్న గుర్లీన్ చావ్లా
2021 సంవత్సరపు మొదటి ‘మన్ కీ బాత్’లో నరేంద్ర మోడీ గుర్లీన్ చావ్లాను ప్రస్తావించారు. ‘ఆమె బుందేల్‌ఖండ్ ఆశాజ్యోతి’ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో వ్యవసాయం దుర్భరంగా ఉంది. ఉష్ణోగ్రత ఎక్కువ. వానలు, నీటివసతి తక్కువ. అలాంటి చోట సంప్రదాయ పంటలే కష్టం. కాని లా చదువుతున్న 23 ఏళ్ల గుర్లిన్ లాక్డౌన్లో తన ఊరు ఝాన్సీ వచ్చి ఊరికే ఉండకుండా తండ్రి పొలంలో స్ట్రాబెర్రీ వేసింది. విజయవంతంగా పండించింది. ‘స్ట్రాబెర్రీ గర్ల్’గా ఇవాళ ఆమె పేరు ఉత్తరప్రదేశ్‌లో మారుమోగుతోంది. లాక్డౌన్ ఎవరికి ఏం హాని చేసినా బుందేల్ఖండ్కి ఒక మేలు చేసింది. ఒక లా చదివే అమ్మాయి– గుర్లిన్ చావ్లా అక్కడ స్ట్రాబెర్రీ పంటను పండించి ఆదాయం గడించవచ్చని రైతులకు అర్థమయ్యేలా చేసింది. నిజంగా ఇది అనూహ్యమైన విషయమే. ఎందుకంటే స్ట్రాబెర్రీ 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఎండలు కాసే చోట పండదు. నీటి వసతి కూడా ఉండాలి. బుందేల్‌ఖండ్‌లో ఉష్ణోగ్రత ఎక్కువే అయినా నీరు తక్కువే అయినా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని గుర్లిన్ ఈ ఘనత సాధించింది. అందుకే ఇప్పుడు ఆమె అక్కడ ‘స్ట్రాబెర్రీ గర్ల్’గా ఖ్యాతి పొందింది. ఇంటి పంటతో మొదలు గుర్లిన్ చావ్లాది బుందేల్‌ఖండ్ (ఉత్తరప్రదేశ్ దక్షిణాది ప్రాంతం)లో ఝాన్సీ. పూనెలో లా చదువుతోంది. లాక్డౌన్లో కాలేజీ మూతపడటంతో ఇంటికి చేరుకుంది. ఇంట్లో తండ్రి టెర్రస్ మీద ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండించడం గమనించి ఎలాగూ ఖాళీగా ఉంది కనుక తోటపనిలో పడింది. రసాయనాలు లేని తాజా కూరగాయలు ఇంట్లోనే దొరుకుతున్నాయి అని అర్థం చేసుకుంది. ‘ఇలాంటి ఆరోగ్యకరమైన కూరగాయలు ఝాన్సీలో ప్రతి ఒక్కరూ తినే వీలు కల్పించాలి కదా’ అని తండ్రితో అంది. తండ్రి ‘అదంత సులభం కాదు తల్లీ’ అని గుర్లిన్తో అనేవాడు. స్ట్రాబెర్రీలను కోస్తున్న గుర్లీన్ చావ్లా మార్చిన స్ట్రాబెర్రీ ఒకరోజు గుర్లిన్ 20 స్ట్రాబెర్రీ మొలకలను తెచ్చి తన ఇంటి డాబా మీద ఉన్న తోటలో నాటింది. కోకోపీట్ ఉన్న మట్టికుండీలలో వాటిని వేసింది. ‘ఇవి బతకవు’ అని అందరూ అన్నారు. ‘కాని ఆ మొక్కలు బతికాయి. ఇంకా ఆశ్చర్యంగా కాయలు కూడా కాశాయి. అవి సైజులు చిన్నగా, జ్యూస్ తక్కువగా ఉన్నా రుచిగా ఉన్నాయి. అరె... వీటిని పొలంలో ఎందుకు పండించకూడదు అనుకుంది గుర్లిన్. తండ్రితో పోరు పెట్టడం మొదలెట్టింది. తండ్రికి ఝాన్సీ దాపునే నాలుగున్నర ఎకరాల పొలం ఉంది. అందులో సేద్యం ఏమీ చేయడం లేదు. ఝాన్సీ ఉత్సాహం చూసి ‘కావాలంటే అందులో ట్రై చెయ్’ అన్నాడు తండ్రి. లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది గుర్లిన్. 2020 అక్టోబర్‌లో సేంద్రియ పద్ధతి ద్వారా ఒకటిన్నర ఎకరాలో స్ట్రాబెర్రీ పంట వేసింది. ఈ విషయం రైతులకు వింత వార్త అయ్యింది. కాని గుర్లిన్కు తెలుసు.. తాను ఎలాగైనా విజయం సాధిస్తానని. పది వేల కిలోల దిగుబడి... జనవరి నెల వచ్చేనాటికి స్ట్రాబెర్రీని పండించడంలో మెళకువలన్నీ తెలుసుకుంది గుర్లిన్. ‘ఈ సీజన్లో పది వేల కిలోల దిగుబడిని ఆశిస్తున్నాను. ఇప్పుడు రోజూ కాయను కోసి మార్కెట్లో కిలో 250 రూపాయలకు అమ్ముతున్నాను’ అని చెప్పిందామె. ఆమె పొలంలో స్ట్రాబెర్రీ కాయ పెద్దదిగా కాయడమే కాదు రంగులో, జ్యూస్‌లో మరింత ఫలవంతంగా ఉంది. ‘రైతులు ఒక పంట ఒకే పద్ధతిలో పోకుండా భిన్నంగా ఆలోచిస్తే ఇలాంటి విజయాలు సాధించవచ్చు’ అని కూడా గుర్లిన్ అంది. అంతే కాదు ఒకవైపు స్ట్రాబెర్రీ వేసి మరోవైపు మిగిలిన మూడు ఎకరాల్లో ఆమె సేంద్రియ పద్ధతిలో బెంగళూరు మిర్చి, టొమాటో, కాలిఫ్లవర్ పండిస్తోంది. ‘చదువుకున్న యువత కూడా సేద్యం చేయడానికి ఆసక్తిగా ఉంది. కాకపోతే ప్రభుత్వం నుంచి వారికి సపోర్ట్ కావాలి’ అని గుర్లిన్ అంది. స్ట్రాబెర్రీ అంబాసిడర్ జనవరి 16 నుంచి ఝాన్సీలో ‘స్ట్రాబెర్రీ ఫెస్టివల్’ జరుగుతోంది. ప్రభుత్వమే దానిని నిర్వహిస్తోంది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో స్ట్రాబెర్రీని ప్రోత్సహించడానికి చేస్తున్న ఈ ఉత్సవానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గుర్లిన్‌ను ‘స్ట్రాబెర్రీ అంబాసిడర్’గా ప్రకటించారు. అంతే కాదు ప్రధాని మోడి తన మన్ కీ బాత్‌లో గుర్లిన్‌ను ప్రస్తావించారు. దాంతో గుర్లిన్పై ప్రశంసలు కురుస్తున్నాయి. భవిష్యత్తులో ఈమె కథా ఒక బయోపిక్ అయినా ఆశ్చర్యపోవాల్సింది లేదు. – సాక్షి ఫ్యామిలీ -
తినడం మొదలుపెడితే ఒక్కటి కూడా మార్కెట్‌కు వెళ్లదు
రాంచీ: ఎంఎస్ ధోని ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత రైతుగా మారిన సంగతి తెలిసిందే. రాంచీలోని తన వ్యవసాయక్షేత్రంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తూ బిజీగా మారిపోయాడు. తాజాగా శుక్రవారం తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తన తోటలో పండిన స్ట్రాబెరీని రుచి చూస్తూ వీడియోనూ షేర్ చేశాడు. కాగా ఆ వీడియోకు ధోని పెట్టిన క్యాప్షన్ వైరల్ అవుతుంది.(చదవండి: ఆసీస్ క్రికెటర్‌పై షేన్ వార్న్ అసభ్యకర వ్యాఖ్యలు) ఇంతకీ ధోని పెట్టిన క్యాప్షన్ ఏంటంటే.. ' నా పొలంలోని స్ట్రాబెరీలను నేను తినడం మొదలుపెడితే మార్కెట్‌కు ఒక్క పండు కూడా వెళ్లేలా లేదు' అంటూ సెటైరిక్ పద్దతిలో కామెంట్ చేశాడు. తన తోటలో పండిన స్రాబెరీ చాలా రుచిగా ఉన్నాయని.. తనకు బాగా నచ్చడంతో అన్ని తానే తినేస్తానేమోనని ఉద్దేశంతో క్యాప్షన్ పెట్టినట్లుగా తెలుస్తుంది.ధోని షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(చదవండి: ఆసీస్‌పై రోహిత్ సెంచరీ సిక్సర్ల రికార్డు) రాంచీ శివార్లలోని శంబో గ్రామంలోని తన 43 ఎకరాల ఫామ్ హౌస్‌లో ధోనీ 10 ఎకరాల్లో టమోటా, క్యాబేజీ, బొప్పాయి, ఇతర పంటలను పండిస్తున్నాడు. ధోనీ ఫామ్ కూరగాయలకు స్థానికంగా మంచి డిమాండ్ రావడంతో వీటిని గల్ఫ్‌లో మార్కెట్ చేసేందుకు ఫామ్ ఫ్రెష్ ఏజెన్సీతో జార్ఖండ్ వ్యవసాయ శాఖ సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే.ఇక గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని.. ఐపీఎల్ 2020 సీజన్ మాత్రం ఆడాడు. కానీ మునపటి సత్తా చాట లేకపోయాడు. View this post on Instagram A post shared by M S Dhoni (@mahi7781) -
కరోనా ఎఫెక్ట్ : ఆవులకు స్ట్రాబెరీల దానా
ముంబై : కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు విధించిన లాక్డౌన్ ఓ రైతు పాలిట శాపమైంది. రవాణా వ్యవస్థ నిలిచిపోవటంతో చేతికొచ్చిన స్ట్రాబెరీ పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక పశువులకు దానాగా వేస్తున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సతారా జిల్లాలోని దేర్‌వాడి గ్రామానికి చెందిన అనిల్ సాలుంఖీ అనే వ్యక్తి తన రెండెకరాల పొలంలో స్ట్రాబెరీలను సాగుచేశాడు. పంట చేతికొచ్చిన నేపథ్యంలో కరోనా వైరస్ అతడి కడుపు కొట్టింది. కరోనా వ్యాప్తి అడ్డుకునేందుకు విధించిన 21రోజుల యావద్దేశ లాక్డౌన్ కారణంగా పంటను అమ్ముకోవటానికి రవాణా సౌకర్యాలు లేక చేలోనే మిగిలిపోయింది. ( నెల్లూరులో అత్యధికంగా కరోనా కేసులు ) ఏం చేయాలో తెలియక, పంటను వృధా చేసుకోవటం ఇష్టం లేక, మనసు చంపుకుని దాన్ని పశువులకు దానాగా వేస్తున్నాడు. దీనిపై అనిల్ స్పందిస్తూ.. ‘‘ రూ. 2,50,000 ఖర్చుపెట్టి పంట వేశా. 8 లక్షలు వస్తుందని ఆశ పెట్టుకున్నా. ఇప్పుడు పెట్టుబడి డబ్బులు కూడా రాలేదు. యాత్రికులు, ఐస్ క్రీమ్ తయారు చేసే కంపెనీలు స్ట్రాబెరీలను ఎక్కువగా కొంటారు. ఇప్పుడ ఆ పరిస్థితి లేద’’ని ఆవేదన వ్యక్తం చేశాడు. ( కరోనా : తండ్రి అంత్యక్రియలకు కూడా.. ) కొద్దిరోజుల క్రితం బెంగళూరుకు చెందిన ఓ రైతు తను పండించిన ద్రాక్ష పంటను కొనే దిక్కులేక దాన్ని అడవి పాలు చేశాడు. ఐదు లక్షలు ఖర్చు పెట్టి పండించిన పంటను ఎలా అమ్మాలో తెలియక ఈ నిర్ణయానికి వచ్చాడు. చుట్టుపక్కలి గ్రామాల ప్రజలను ఉచితంగా పళ్లను తీసుకుపోమని ఆహ్వానించినా కొద్దిమంది మాత్రమే ముందుకు రావటం గమనార్హం. -
స్ట్రాబెర్రీ.. తియ్యటి దిగుబడి
అమెరికా, యూరప్ దేశాల్లో కనిపించే స్ట్రాబెర్రీ పండ్లు హుబ్లీ వద్ద విరగ్గాస్తున్నాయి. ఎర్రగా నిగనిగలాడుతూ చూడగానే ఉల్లాసం కలిగించే పండ్లు ఒక బంజరు భూమిలో పండడం వెనుక శ్రమ,ఉత్సాహం దాగున్నాయి. శశిధర అనే సివిల్ ఇంజనీరు మహారాష్ట్రలో చూసి తమ ఊళ్లోనూ స్ట్రాబెర్రీల సాగుతో ఆదర్శంగా నిలిచారు. సాక్షి, బళ్లారి: ఆయన సివిల్ ఇంజనీర్. వ్యవసాయంపై మక్కువతో వినూత్న పంటలు సాగుచేస్తూ నేలతల్లి సేవలో పులకిస్తున్నారు. హుబ్లీ నగరానికి చెందిన సివిల్ ఇంజనీర్ శశిధర మహారాష్ట్రలో పనిచేస్తున్న సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో స్ట్రాబెర్రీ పండ్ల తోటలను పండించడం చూశారు. అక్కడ అవగాహన పెంచుకుని అక్కడే పొలం కౌలుకు తీసుకుని స్ట్రాబెర్రీ పండించారు. మంచి దిగుబడులు రావడంతో స్వంత ప్రాంతం హుబ్లీ చుట్టుపక్కల ఎక్కడైనా భూమి తీసుకుని స్ట్రాబెర్రీ పండించాలని ఆలోచించి మహారాష్ట్ర తిరిగి వచ్చారు. ఎకరాతో ఆరంభం కలఘటిగి తాలూకా హుల్లంబి గ్రామంలో రాళ్లతో కూడిన ఆరు ఎకరాల బంజరు భూమిని ఎంపిక చేసుకున్నారు. ఇక సాగుకు ఉపక్రమించారు. తొలుత స్ట్రాబెర్రీని గడ్డలను తీసుకుని వచ్చి తన పొలంలోనే నర్సరీ చేసుకుని, ఒక ఎకరంలో 25వేల మొక్కలను నాటేందుకు సిద్ధం చేసుకున్నారు. డ్రిప్ వ్యవసాయ పద్ధతిని అలవరుచుని, ఒక ఎకరా పొలంలో స్ట్రాబెర్రీ మొక్కలను నాటారు. 45 రోజులకే ఎర్రగా నిగనిగలాడే స్ట్రాబెర్రీలు పండడంతో రైతు శశిధర ఆనందానికి అవధుల్లేవు. క్రమంగా మరికొన్ని ఎకరాలకు పంటను విస్తరించారు. బంజరు భూముల్లో ఎవరికి అంతుపట్టని విధంగా ఆమెరికాలో పండించే స్ట్రాబెర్రీని పండిస్తున్న సివిల్ ఇంజనీర్ శశిధర పలువురు రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. నిత్యం 20 మంది కూలీలకు ఉపాధిని కల్పిస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. కేజీ రూ. 100-400 ఒక కేజీ పండ్లు 100 నుంచి రూ.400 వరకు వరకు అమ్ముడుపోతున్నాయని శశిధర సంతోషంగా చెప్పారు. మార్కెట్లో కూడా మంచి గిరాకీ ఉందని, ఇంజనీర్ వృత్తి కంటే వ్యవసాయం చేయడం సంతృప్తినిస్తుందని, ప్రతి నిత్యం తన కుమారులు, భార్య పొలంలో పనిచేస్తుంటారని తెలిపారు. ఒక ఎకరం స్ట్రాబెర్రీతో పాటు మరో ఐదు ఎకరాల్లో వివిధ రకాలు కూరగాయాలు, పంటలను పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్నానన్నారు. రోజుకు రూ.8 వేల ఆదాయం మొక్కలు నాటిన 45 రోజుల్లో పండ్లు కాశాయన్నారు. 11 నెలలుగా మంచి ఆదాయం వచ్చిందన్నారు. ప్రతి రోజు కూలీలు ఖర్చులు పోను రూ.8 వేల వరకు ఆదాయం వస్తోందని శశిధర తెలిపారు. దీంతో పాటు ఎలాంటి రసాయనిక మందులు, పురుగులు మందులు వాడడం లేదన్నారు. పలువురు రైతులు తన పొలం సందర్శించి, సలహాలు అడుగుతూ ఉంటారన్నారు. అందరూ శశిధర మాదిరిగా కృషిచేస్తే వ్యవసాయం పండుగే అవుతుంది. -
సాగనివ్వకండి బ్యూటిప్
వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై చర్మం సాగుతుంటుంది. దాంతో మనసు ఎంత ఉత్సాహంగా ఉరకలేస్తున్నా, ఎదుటి వారికి మాత్రం ముడతలను చూడగానే మీ వయసు ఇట్టే తెలిసి పోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి. స్ట్రాబెర్రీ: ఈ పండ్లలో చర్మాన్ని బిగుతుగా చేసే గుణం ఉంటుంది. ఇది 100 శాతం నేచురల్ ట్రీట్మెంట్. 5–6 స్ట్రాబెర్రీలను తీసుకొని గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో కొద్దిగా శనగపిండి వేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే సరి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ముడతలు తగ్గుతాయి. గుడ్డు తెల్లసొన, పెరుగు: ముడతలు మటుమాయం చేయడానికి గుడ్డు బాగా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్ఫూన్ పెరుగులో రెండు గుడ్ల తెల్ల సొనను వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖంపై ఉన్న మడతల వద్ద, మెడకు అప్లై చేయాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతూ ముడతలు తగ్గుతాయి. బియ్యం పిండి: చర్మంపై ముడతలను తొలగించేందుకు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ లేదా గ్రీన్ టీ పోసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 20–30 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. -
హెల్దీ ట్రీట్
ఫ్రూట్ అండ్ లెట్యూస్ సలాడ్ కావలసినవి: లెట్యూస్ ఆకులు (దీనికి బదులుగా తరిగిన క్యాబేజీ ఆకులను వాడుకోవచ్చు) – 1 కప్పు బొప్పాయి ముక్కలు – అర కప్పు ద్రాక్ష – అర కప్పు ఆరెంజ్ తొనలు – అర కప్పు జామపండు ముక్కలు – అర కప్పు స్ట్రాబెర్రీలు – అర కప్పు పుచ్చకాయ ముక్కలు – అర కప్పు బాదం పప్పు పలుకులు – టేబుల్‌స్పూన్ డ్రెస్సింగ్కోసం... నిమ్మరసం – టేబుల్ స్పూన్ తేనె – 2 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి – 2 ఉప్పు – తగినంత తయారి: 1. డ్రెస్సింగ్ కోసం చెప్పిన పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసి కలపాలి. 2. పండ్ల ముక్కలన్నీ ఒక పాత్రలో తీసుకుని, డ్రెస్సింగ్ మిశ్రమం వేసి కలపాలి. 3. సలాడ్ కప్పులో లెట్యూస్ ఆకులు వేసి, పైన డ్రెస్సింగ్ చేసిన పండ్లముక్కలను వేసి సర్వ్ చేయాలి. కప్పు సలాడ్‌లో పోషకాలు: క్యాలరీలు : 103కి.క్యా కొవ్వు : 2.5 గ్రా. పిండిపదార్థాలు : 18.7 గ్రా. విటమిన్ : 30.7 గ్రా. -
యవ్వనకాంతి
పండ్లు, కూరగాయలు, వాటి నుంచి వచ్చే నూనెలను సౌందర్య లేపనాలుగా ఉపయోగిస్తే చర్మం యవ్వనకాంతితో మెరిసిపోతుంది. విటమిన్ –సి సహజసిద్ధమైన యాంటీ ఏజింగ్ కాంపౌండ్స్ గల స్ట్రాబెర్రీ మాస్క్ వల్ల రెట్టింపు అందాన్ని పొందవచ్చు. ఎండకు కమిలిన, మృతకణాలున్న చర్మాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చి యవ్వనకాంతిని పెంచుతుంది. ఓ కప్పు తాజా స్ట్రాబెర్రీలు మిక్సర్‌లో మెత్తగా బ్లెండ్ చేయాలి. దీంట్లో కప్పు పెరుగు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మెత్తటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి లేదా రెండువారాలకు ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవచ్చు. చర్మం ముడతలు పడనివ్వని యాంటీ ఏజింగ్ కాంపౌండ్స్ దానిమ్మలో పుష్కలం. యాంటీయాక్సిడెంట్స్, విటమిన్–సి సమృద్ధిగా ఉన్న దానిమ్మ ఓట్స్ లేదా పెరుగుతో కలిపి మేలైన ఫేస్ ప్యాక్ తయారవుతుంది. మృతకణాలను తొలగించడమే కాదు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలు, కప్పు ఓట్స్ కలిపి మిక్సర్‌లో వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకొని, 2 టేబుల్ స్పూన్ల తేనె, 2 టేబుల్ స్పూన్ల మజ్జిగ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఐదు నిమిషాలు ఉంచి, కడిగేయాలి. -
స్ట్రాబెర్రీలతో ఎన్నో మేళ్లు!
కంటికి మేలు కలగాలంటే క్యారట్ తినాలి. ఫోలిక్ యాసిడ్ కోసం గర్భవతులు పాలకూర తినాలి. ఇలా వేర్వేరుగా తినకుండా అన్ని ప్రయోజనాలూ ఒకేదానిలో ఉండాలంటే... స్ట్రాబెర్రీ తినాలి. ఇటీవల స్ట్రాబెర్రీల వల్ల కలిగే అనేక ప్రయోజనాలపై నిర్వహించిన అధ్యయనంలో తెలిసిన అంశాలివి... మంచి చూపు కోసం: వయసు పెరుగుతున్న కొద్దీ చూపునకు సంబంధించిన కొన్ని మార్పులు వచ్చి కంటిచూపు కాస్త తగ్గుతుంది. ఈ సమస్యను ఏజ్ రిలేటెడ్ విజన్ లాస్ లేదా ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్ అంటుంటారు. ఈ సమస్యను తగ్గించడానికి స్ట్రాబెర్రీల్లోని విటమిన్–సి బాగా ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఈ అధ్యయన ఫలితాలను ‘ఆర్కైవ్స్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీ’లో ప్రచురించారు. క్యాన్సర్ నివారణ : స్ట్రాబెర్రీల్లోని యాంథోసయనిన్, ఎలాజిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లతో చాలా క్యాన్సర్లు నివారితమవుతాయని తేలింది. ఈ విషయం ‘జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ’లో ప్రచురితమైంది. గర్భవతుల కోసం: గర్భధారణ ప్లాన్ చేసుకున్న స్త్రీలకు, గర్భం వచ్చిందని తెలిసిన మహిళలకు డాక్టర్లు రాసే ముఖ్యమైన పోషకం ఫోలిక్ యాసిడ్. ఇది పుట్టబోయే పిల్లల్లో వెన్ను సంబంధిత లోపమైన స్పైనాబైఫిడా వంటి సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు... ఫోలిక్ యాసిడ్ ఎర్రరక్తకణాలు వృద్ధిచెందడానికి, మూడ్స్‌ను మెరుగుపరచే సెరటోనిన్ వంటి మెదడు రసాయనాలు స్రవించడానికి కూడా ఉపయోగపడుతుంది. స్ట్రాబెర్రీలతోనూ ఫోలిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు వచ్చే ప్రయోజనాలే స్ట్రాబెర్రీలతో కలుగుతయంటున్నారు పరిశోధకులు. అయితే స్ట్రాబెర్రీస్ కొందరిలో అలర్జీలను కలిగిస్తాయి. అవి సరిపడని వారిలో ఎగ్జిమా, చర్మం మీద దద్దుర్లు, తలనొప్పి, నిద్రలేమి కలిగే అవకాశం ఉన్నందున స్ట్రాబెర్రీలతో అలర్జీ వచ్చే వారు మాత్రం వీటి నుంచి దూరంగా ఉండాలి. -
కొబ్బరి ఐస్‌క్రీమ్
కొబ్బరి ఐస్‌క్రీమ్ అంటే సరదాగా ఉంది కదూ. మనకు కోన్ ఐస్‌క్రీమ్, బాల్ ఐస్ క్రీమ్‌లాంటివి తెలుసు. కొబ్బరి ఐస్‌క్రీమ్ అంటే ఏమిటో తెలీదు కదా. బెంగళూరులోని వెంకట రమణ దేవాలయం దగ్గర, సీతారామ కావత్ అనే 60 సంవత్సరాల వ్యక్తి కనిపెట్టిన కొత్త రకం ఐస్ క్రీమ్ ఇది. ఆయన దగ్గర మంగళూరు కొబ్బరిబొండాలు తాగిన తరవాత, ఆ బొండాన్ని మధ్యకు చీల్చి, లేత కొబ్బరిని ఒకే దానిలోకి తీసి, అందులో మనకు కావలసిన ఫ్లేవర్ ఐస్‌క్రీమ్, (వెనిలా, స్ట్రాబెర్రీ, బటర్‌స్కాచ్) రకరకాల పండ్ల (అరటి, ద్రాక్ష, దానిమ్మ, పైనాపిల్) ముక్కలు వేసి మళ్లీ పైన కొద్దిగా ఐస్‌క్రీమ్ వేసి, ఆప్యాయంగా అందిస్తాడు. ఇది ఆయనే కనిపెట్టాడు. ఈ ఐస్‌క్రీమ్ ఖరీదు, అరవై రూపాయలు మాత్రమే. -
స్ట్రాబెర్రీ మసాజ్
పది స్ట్రాబెర్రీ కాయలు, రెండు టేబుల్ స్పూన్ల ఆప్రికాట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్, రెండు టీ స్పూన్ల రాతి ఉప్పు తీసుకుని అన్నింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి పది నిమిషాల తర్వాత చర్మాన్ని సున్నితంగా మర్దన చేస్తే ఆరిన మిశ్రమంతోపాటు చర్మంలోని మురికి, మృతకణాలు పోతాయి. తర్వాత మామూలుగా స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే రెండు వారాల్లోనే చర్మసౌందర్యంలో వచ్చిన మార్పును గమనించవచ్చు. -
స్ట్రాబెర్రీ.. రుచి అదిరింది..!!
సాక్షి, ప్రత్యేకం : రష్యాకు చెందిన కిర్బీ(తాబేలు)కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తొలిసారి స్ట్రాబెర్రీ రుచిని ఆస్వాదిస్తున్న కిర్బీ వీడియోను దాని యజమాని ఆన్లైన్లో పోస్టు చేశారు. తాబేలుకు స్ట్రాబెర్రీని రుచి చూపించడంపై మాట్లాడిన ఆమె తాబేలు జీర్ణ వ్యవస్థ 'తీపి పదార్థాలు'ను అరయించుకోలేదని చెప్పారు. అందుకే కెర్బీ కొన్ని సార్లు పండును రుచి చూసి వదిలేసిందని తెలిపారు. ప్రస్తుతం కిర్బీ వయసు నాలుగు సంవత్సరాలను చెప్పకొచ్చారు. రష్యా తాబేళ్లు ఐదు నుంచి పది ఇంచ్‌ల పొడవు మాత్రమే పెరుగుతాయి. 40 ఏళ్ల పాటు జీవిస్తాయి. -
స్ట్రాబెర్రీలతో మెదడుకు చురుకుదనం
స్ట్రాబెర్రీలను చాలామంది ఇష్టంగా తింటారు. వీటిలో విటమిన్లు, ఖనిజలవణాలు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి ఇవి సహజంగా మేలు చేస్తాయని, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. స్ట్రాబెర్రీలు కలిగించే మరో ప్రయోజనం కూడా తాజా పరిశోధనల్లో వెలుగులోకి వచ్చింది. స్ట్రాబెర్రీలు మెదడుకు చురుకుదనం ఇస్తాయని, వయసు మళ్లిన దశలోనూ మెదడు పనితీరు మందగించకుండా ఉంచుతాయని కాలిఫోర్నియాలోని సాల్క్స్ సెల్యులర్ న్యూరోబయాలజీ లాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ల్యాబ్‌లో ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో స్ట్రాబెర్రీల వల్ల మెదడులో కలిగే సానుకూల మార్పులను గుర్తించారు. స్ట్రాబెర్రీలను తీసుకుంటున్నట్లయితే వార్ధక్యంలో మెదడు పనితీరు మందగించడం వల్ల వచ్చే అల్జీమర్స్ వ్యాధి, ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు చాలావరకు తగ్గుతాయని వారు తేల్చి చెబుతున్నారు. -
స్లిమ్ కేక్స్
ఏడాదంతా బాగా తిన్నాం... ఫుల్లుగా లాగించాం... 2016లో పదహారణాల ఫ్యాట్ కుమ్మేశాం. 2017 వస్తోంది! సన్నగా, నాజూగ్గా అవ్వాలని అందరికీ ఉంది. కానీ, దానికి కేక్ అడ్డం కాకూడదు కదా! కండపట్టకుండా పిండేయండి. కేక్ బెండు తీయండి. 2017లో కేకుల కేక! స్లిమ్ కేక్... ఎంజాయ్! ఆరెంజ్ ఆల్మండ్ కేక్ కావల్సినవి: ఉప్పులేని బటర్ – 50 గ్రాములు (కరిగించాలి), ఆరెంజ్ జిస్ట్ (పై తొక్కను సన్నగా తరిగినది) – టేబుల్ స్పూన్, క్యాస్టర్ షుగర్ – కప్పు, గుడ్లు – 2, సెల్ఫ్రైజింగ్ ఫ్లోర్/గోధుమపిండి – కప్పు, గసగసాలు – 2 టేబుల్ స్పూన్లు, వెన్న తీసిన పాలు – పావు కప్పు, షుగర్ ఫ్రీ షుగర్ – తగినంత, బాదంపప్పు పలుకులు – పావు కప్పు తయారీ: ∙అవెన్ని 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వేడి చేయాలి. కేక్ బేకింగ్ బౌల్ అడుగున నూనెను స్ప్రే చేసి, పైన బేకింగ్ పేపర్ పరవాలి. దీనిపైన కూడా వంటనూనెను స్ప్రే చేయాలి. ఒక గిన్నెలో బటర్, ఆరెంజ్ జిస్ట్, పంచదార, గిలక్కొట్టిన గుడ్లసొన, పిండి, గసగసాలు, పాలు పోసి బాగా కలపాలి. ∙దీంట్లో బాదంపప్పు పలుకులు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో పోసి 35–40 నిమిషాలు బేక్ చేయాలి. కేక్ బయటకు తీసి, తర్వాత ప్లేట్లోకి తీయాలి. ∙చివరగా పంచదార పొడి, వెనిలా ఎక్స్ట్రాక్ట్, పాలను కలిపి బాగా గిలక్కొట్టి, కేక్ టాప్ మీద సెట్ చేయాలి. ఆరెంజ్ ముక్కలతో అలంకరించాలి. బనానా స్లి్పట్ కేక్ కావల్సినవి: లైట్ వెనిలా స్పాంజ్ కేక్ – 1, అయిదు గుడ్డుల్లోని తెల్ల సొన, 3 గుడ్ల పసుపు సొన, సెల్ఫ్రైజింగ్ ఫ్లోర్/గోధుమపిండి – అర కప్పు, బేకింగ్ పౌడర్ – టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, వెనిలా ఎక్స్ట్రాక్ట్ – 2 టీ స్పూన్లు, పంచదార – అర కప్పు, వెన్నతీసిన పాలు – ఒకటిన్నర కప్పు, ఫ్యాట్ ఫ్రీ షుగర్ – పావు కప్పు, షుగర్ ఫ్రీ విప్డ్ క్రీమ్ – కప్పు, అరటిపండ్లు – 2 (పలచని ముక్కలుగా కట్ చేయాలి), స్ట్రాబెర్రీలు (పెద్దవి) – 4, షుగర్ ఫ్రీ చాకోలెట్ సిరప్ – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ఒక గిన్నెలో గుడ్ల తెల్లసొన, పసుపుసొన వేసి బాగా గిలకొట్టాలి. బేకింగ్ పాన్‌లో నూనె స్ప్రే చేయాలి. అడుగున బేకింగ్ పేపర్ పరవాలి. ఆ పేపర్‌పై కూడా నూనె స్ప్రే చేయాలి. ∙మరొక గిన్నెలో పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి జల్లించాలి. ∙అవెన్‌ను 350 డిగ్రీల వద్ద∙ప్రీ హీట్ చేయాలి. వెనిలా, గుడ్డులోని పసుపు సొన కలిపి 5 నిమిషాలు మిక్సీలో బ్లెండ్ చేయాలి. దీంట్లో పావు కప్పు పంచదార వేసి, కరిగేంతవరకు గిలకొట్టాలి. దీంట్లో పూర్తి గుడ్ల మిశ్రమం పోసి కలపాలి. ∙బేక్ బౌల్లో స్పాంజ్ కేక్ పెట్టి, గరిటతో పాన్‌లో మీద పిండి మిశ్రమం వేయాలి. ∙గిలకొట్టిన గుడ్లసొన ఆ పిండి మీద మరో లేయర్‌గా పోయాలి. తర్వాత గిలకొట్టిన పావు కప్పు షుగర్ ఫ్రీ షుగర్ వేయాలి. దీనిని12 నిమిషాలు బేక్ చేయాలి. బయటకు తీసి వెంటనే బేకింగ్ పేపర్ చివర్లను పట్టుకొని వదులు చేయాలి. ప్లేట్లోకి తీసుకొని కట్ చేసి, ఫ్రిజ్‌లో పెట్టి, 10 నిమిషాల తర్వాత బయటకు తీసి విపింగ్ క్రీమ్ పైన రాయాలి. ∙ దీన్ని 2 గంటల సేపు ఫ్రిజ్‌లో ఉంచి తీయాలి. పేపర్‌టవల్ తీసేసి, కేక్ స్లైసులుగా కట్ చేయాలి. తర్వాత సన్నగా కట్ చేసిన అరటిపండు ముక్కలను, స్ట్రా బెర్రీల స్లైసులను, షుగర్ ఫ్రీ చాకోలెట్ సిరప్‌తో అలంకరించాలి. ఛీజ్ చెర్రీ కేక్ కావల్సినవి: క్యారమెల్ కుకీస్ – 250 గ్రాములు, బటర్ – 40 గ్రాములు (కరిగించాలి), లైట్ క్రీమ్ ఛీజ్ (మెత్తనిది) – 250 గ్రాములు, ఫ్యాట్లేని రికోటా ఛీజ్ – 400 గ్రాములు, వెనిలా యోగర్ట్ – 200 గ్రాములు గుడ్లు – 2, వెనిలా ఎక్స్ట్రాక్ట్ – టీ స్పూన్, సిరప్ చెర్రీ – 670 గ్రాములు, ఆరెంజ్ జిస్ట్ – 2 టీ స్పూన్లు, ఆరెంజ్ జ్యూస్ – 1/4 కప్పు, లెమన్ జిస్ట్ – 2 టీ స్పూన్లు, నిమ్మరసం – పావు కప్పు తయారీ: ∙అవెన్‌ను 170 సెంటీగ్రేడ్ల వద్ద వేడిచేయాలి. పాన్ వేడి 150 డిగ్రీల వద్ద ఉండాలి. ∙కుకీస్‌ను మిక్సీలో వేసి పొడి చేయాలి. దీన్ని పాన్ అడుగున బేకింగ్ పేపర్‌పైన చల్లాలి. ∙ఒక గిన్నెలో క్రీమ్ ఛీజ్, రికొట్టా, యోగర్ట్, గుడ్లు, వెనిలా వేసి కలపాలి. 30–35 నిమిషాలు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత 4 గంటలు, లేదా రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ∙చెర్రీ సిరప్, ఆరెంజ్ రిండ్, ఆరెంజ్ జ్యూస్, లెమన్ రిండ్, లెమన్ జ్యూస్ సాస్పాన్లో వేసి, మరిగించాలి. సిమ్‌లో మరో 6 నిమిషాలు ఉంచాలి. దీంట్లో చెర్రీస్ వేసి దించాలి. వేడి తగ్గాక ఛీజ్ కేక్ బయటకు తీసి, పైన అలంకరించాలి. ప్రెజర్ కుకర్ కేక్... అవెన్ లేకుండా ప్రెజర్ కుకర్లోనూ కేక్ తయారు చేసుకోవచ్చు. కుకర్ అడుగున కేజీ ఉప్పు లేదా ఇసుక పోయాలి. దీని పైన ఒక కుకర్ బాటమ్ ప్లేట్ ఉంచాలి. మంట పూర్తిగా తగ్గించి, కుకర్ని వేడి చేయాలి. కుకర్‌లో చిన్న స్టాండ్ పెట్టి, సులువుగా పట్టేటంత మరొక గిన్నె తీసుకొని కేక్మిశ్రమం పోయాలి. కేక్మిశ్రమం ఉన్న గిన్నెను కుకర్‌లో జాగ్రత్తగా ఉంచాలి. పైన వెయిట్ పెట్టకుండా కుకర్మూత ఉంచాలి. (వెయిట్ పెడితే కుకర్ పేలే ప్రమాదం ఉంటుంది.) సన్నని మంట మీద 30–35 నిమిషాలు కేక్‌ను బేక్ చేసి, మంట తీసేయాలి. కుకర్ వేడి పూర్తిగా తగ్గేవంత వరకు ఉంచి, కేక్ గిన్నెను బయటకు తీయాలి. తర్వాత నచ్చిన విధంగా అలంకరించుకోవాలి. పియర్ లేయర్ కేక్ కావల్సినవి: గుడ్ల తెల్ల సొన – కప్పు + అర కప్పు, వెనిలా ఎక్స్ట్రాక్ట్ – టీ స్పూన్, షుగర్ ఫ్రీ షుగర్ – కప్పు + 2 టేబుల్ స్పూన్లు, షుగర్‌లెస్ వెనిలా ఆల్మండ్ మిల్క్ – ముప్పావు కప్పు – 2 టేబుల్ స్పూన్లు, పియర్ పండు గుజ్జు – ముప్పావు కప్పు + టేబుల్ స్పూన్, క్యారమెల్ ఫ్లేవర్ – టీ స్పూన్, కొబ్బరి పొడి – కప్పు + పావు కప్పు (పచ్చికొబ్బరిని గ్రైండ్ చేసి, పిండి, పాలు తీయాలి. ఆ పొడిని బ్లాటింగ్ పేపర్ మీద పరిచి, దాదాపు 12 గంటల పాటు ఆరబెట్టాలి. తర్వాత దీన్ని మిక్సర్‌లో వేసి పొడి చేయాలి. ), తీపి లేని ముదురు రంగు కోకా పౌడర్ – పావు కప్పు, తీపిలేని సాధారణ కోకా పౌడర్ – పావు కప్పు, మసాలా – 2 టీ స్పూన్లు (దాల్చిన చెక్క పొడి టీ స్పూన్, జాజికాయ పొడి అర టీ స్పూన్, యాలకులు+లవంగాల పొడి అర టీ స్పూన్), బేకింగ్ పౌడర్ – టీ స్పూన్, బేకింగ్ సోడా – టీ స్పూన్, కళ్ళుప్పు (పొడి చేయాలి)– అర టీ స్పూన్ క్రీమ్‌కి కావల్సినవి: కొబ్బరినూనె/వంటనూనె – టేబుల్ స్పూన్, తియ్యగా లేని వెనిలా ఆల్మండ్ మిల్క్ – ముప్పావు కప్పు, ఆర్గానిక్ స్టేవియా ఎక్స్ట్రాక్ట్ – టీ స్పూన్, క్యారమెల్ ఫ్లేవర్ – టీ స్పూన్, బటర్ ఫ్లేవర్ – పావు టీ స్పూన్, కళ్ళుప్పు (పొడి చేయాలి)– పావు టీ స్పూన్, ఆర్గానిక్ బ్రౌన్‌రైస్ పౌడర్ – 100 గ్రాములు, ఎరిత్రిటోల్ పొడి – కప్పు + 1/4 కప్పు తయారీ: ∙అవెన్‌ను 350 డిగ్రీల వద్ద ప్రీ హీట్ చేయాలి. 200 డిగ్రీల వద్ద బేకింగ్ పాన్‌ను హీట్చేయాలి. ∙ గుడ్ల సొన బాగా గిలక్కొట్టి అందులో వెనిలా ఎక్స్ట్రాక్ట్, షుగర్‌లెస్ షుగర్ పొడి, బాదం పాలు, పియర్పండు గుజ్జు, క్యారమెల్ ఫ్లేవర్ వేసి బాగా కలపాలి. ∙ కుకింగ్ పాన్ అడుగున నూనెను స్ప్రే చేయాలి. ఆ పైన బేకింగ్ పేపర్‌ను పరవాలి. అలాగే పాన్ చుట్టుపక్కల పేపర్‌ను సెట్ చేయాలి. ∙ మరొక గిన్నెలో కొబ్బరి పొడి, కోకాపౌడర్లు, మసాలా పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి జల్లించాలి. ∙ దీంట్లో గుడ్ల మిశ్రమం వేసి బాగా కలపాలి. మిక్సీలో వేసి 20 సెకన్లపాటు బ్లెండ్ చేయాలి. ∙ ఈ మిశ్రమాన్ని పాన్‌లో గరిటెతో వేసి, పైన గరిటెతో చక్కగా సెట్ చేసి, అవెన్‌లో పెట్టాలి. 45 నిమిషాల పాటు బేక్ చేయాలి. క్రీమ్ తయారీ: ∙అవెన్‌లో ఆల్మండ్ మిల్క్ పోసి 20 సెకండ్లు వేడి చేసి, తీయాలి. దీన్ని గిలకొట్టాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్, ఉప్పు, ఎరిథ్రిటాల్ వేసి కలపాలి. దీన్ని కేక్ మీద అప్లై చేసి, ప్రిజ్‌లో పెట్టాలి. 10 నిమిషాల తర్వాత తీసి సర్వ్ చేయాలి. లైట్ చాకోలెట్ కేక్ కావల్సినవి: అన్సాల్టెడ్ బటర్ – 75 గ్రాములు, క్యాస్టర్ షుగర్ – కప్పు, గుడ్లు – 2, గోధుమ పిండి – ఒకటిన్నర కప్పు, కోకాపౌడర్ – పావు కప్పు, సోడా – అర టీ స్పూన్, వెన్నలేని పాలు – కప్పు, కోకాపౌడర్, స్ట్రాబెర్రీలు, చెర్రీలు – అలంకరణకు తయారీ: ∙అవెన్‌ను 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ప్రీ హీట్ చేయాలి. పాన్ తగినది ఎంచుకోవాలి. ∙మిక్సర్‌లో బటర్, షుగర్, గుడ్ల సొన, పిండి, కోకాపౌడర్, సోడా, పాలు వేసి నిమిషం సేపు బ్లెండ్ చేయాలి. ∙ఈ మిశ్రమాన్ని పాన్‌లో పోసి 45–50 నిమిషాలు బేక్ చేయాలి. చల్లారాక ప్లేట్లోకి తీసుకొని పైన కోకాపౌడర్ చల్లి, ఆ పైన చెర్రీస్తో అలంకరించి సర్వ్ చేయాలి. -
పెదవులు గులాబీ రంగు
బ్యూటిప్స్ పెదవులు పగిలి బాధ పెడుతుంటే... నేతిని కొద్దిగా వేడి చేసి, పెదవులపై మృదువుగా పూయాలి. ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి. రోజూ ఇలా చేస్తే వారం తిరిగేసరికల్లా సమస్య తగ్గిపోతుంది. స్ట్రాబెర్రీని పేస్ట్‌లా చేసి, అందులో కాస్త పాల క్రీమ్ వేసి కలపాలి. దీన్ని పడుకోబోయేముందు పెదవులకు అప్లై చేసి, ఉదయాన్నే శుభ్రంగా కడుక్కోవాలి. నల్లని పెదవులు ఉన్నవారు తరచూ ఇలా చేస్తూ ఉంటే... నలుపు పోయి, పెదవులు గులాబీ రంగులోకి మారతాయి. -
స్ట్ట్రాబెర్రీలతో ఎన్నెన్నో ప్రయోజనాలు!
పరిపరి శోధన కంటికి మేలు కలగాలంటే క్యారట్ తినాలని తెలుసు. గర్భవతులకు పాలకూర వంటి ఆకుకూరల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ మేలు కలిగిస్తుందని తెలుసు. అలాంటి మేళ్లు ఎన్నో కలగలసి ఒక్క స్ట్రాబెర్రీ పండ్లలోనే ఉన్నాయని తాజా అధ్యయనాల్లో తెలిసింది. స్ట్రాబెర్రీల వల్ల కలిగే అనేక ప్రయోజనాలు ఇవే... మంచి చూపు కోసం వయసు పెరుగుతున్న కొద్దీ చూపునకు సంబంధించిన కొన్ని మార్పులు వచ్చి కంటిచూపు కాస్త తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను సాధారణంగా ఏజ్ రిలేటెడ్ విజన్ లాస్ లేదా ఏజ్ రిలేటెడ్ మాలిక్యులార్ డీజనరేషన్ అంటుంటారు. కానీ ఇలా వయసు పెరిగే కొద్దీ చూపు తగ్గే సమస్యను తగ్గించడానికి స్ట్రాబెర్రీ పండ్లు బాగా ఉపయోగపడతాయని తాజా అధ్యయనాల్లో తేలింది. ఈ పండ్లలో ఉండే విటమిన్-సి వల్ల చూపు తగ్గే సమస్య నివారితమవుతుంది. క్రమం తప్పకుండా స్ట్రాబెర్రీలు తినడం వల్ల ఈ సమస్యను దాదాపు 36 శాతానికి పైగా నివారించవచ్చని తేలింది. ఈ అధ్యయన ఫలితాలను ‘ఆర్కైవ్స్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీ’లో ప్రచురించారు. క్యాన్సర్ నివారణ కోసం స్ట్రాబెర్రీలలో ఉండే యాంథోసయనిన్, ఎలాజిక్ యాసిడ్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్ల వల్ల అనేక రకాల క్యాన్సర్లు నివారితమవుతాయని తేలింది. ఇదే విషయాన్ని ‘జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్, ఫుడ్ కెమిస్ట్రీ’లో ప్రచురించారు. స్ట్రాబెర్రీలు తినేవారిలో ఊపిరితిత్తులు, ఈసోఫేగస్, రొమ్ము క్యాన్సర్లు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువని ఈ అధ్యయనంలో తెలిసింది. గర్భవతుల కోసం గర్భధారణ ప్లాన్ చేసుకున్న స్త్రీలకు, గర్భం వచ్చిందని తెలిసిన మహిళలకు డాక్టర్లు రాసే ముఖ్యమైన పోషకం ఫోలిక్ యాసిడ్. ఇది పుట్టబోయే పిల్లల్లో వెన్ను సంబంధిత లోపమైన స్పైనాబైఫిడా వంటి సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు... ఫోలిక్ యాసిడ్ ఎర్రరక్తకణాలు వృద్ధిచెందడానికి, మూడ్స్‌ను మెరుగుపరచే సెరటోనిన్ వంటి మెదడు రసాయనాలు స్రవించడానికి కూడా ఉపయోగపడుతుంది. స్ట్రాబెర్రీలతోనూ ఫోలిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు వచ్చే ప్రయోజనాలే స్ట్రాబెర్రీలతో కలుగుతయంటున్నారు పరిశోధకులు. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. స్ట్రాబెర్రీస్ కొందరిలో అలర్జీలను కలిగిస్తాయి. దాంతో అవి సరిపడని వారిలో ఎగ్జిమా, చర్మం మీద దద్దుర్లు, తలనొప్పి, నిద్రలేమి కలిగే అవకాశం ఉన్నందున స్ట్రాబెర్రీలతో అలర్జీ వచ్చే వారు మాత్రం దీని నుంచి దూరంగా ఉండాలి. -
పొడి చర్మానికి హనీ ప్యాక్
బ్యూటిప్స్ చర్మాన్ని పొడిబారకుండా కాపాడడంలో మొదటి స్థానం తేనెదే. తేనె కలిపిన ప్యాక్ వేసుకుంటే ముఖంలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. నాలుగు కీరదోస ముక్కలు, ఒక టేబుల్ స్పూను కమలాపండు రసం, ఒక స్ట్రాబెర్రీ, ఒక టీ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ మీగడ కాని పెరుగు కాని తీసుకోవాలి. అన్నింటినీ కలిపి మిక్సీలో బ్లెండ్ చేసు కోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. కీరకాయ, కమలారసం, స్ట్రాబెర్రీ చర్మానికి తాజాదనాన్నిస్తాయి. తేనె, పెరుగు మాయిశ్చరైజర్‌గా పని చేస్తాయి. బంతిపువ్వు రెక్కలు(ఒక పువ్వు), ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూను పాలు కాని మీగడ కాని తీసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. వారానికి ఒకటి-రెండు సార్లు మాత్రమే వాడాలి. బంతిపూలు దొరకని రోజుల్లో సెలెండ్యులా క్రీమ్ వాడవచ్చు. ఇది మార్కెట్లో దొరుకుతుంది. -
అతిభారీ స్ట్రాబెర్రీ
తిక్క లెక్క ఎర్రగా నిగనిగలాడే స్ట్రాబెర్రీ పళ్లు మామూలుగా ఒక్కొక్కటి ఐదారు గ్రాముల బరువు తూగడమే ఘనం. అలాంటిది ఈ ఫొటోలో కనిపిస్తున్న గజ స్ట్రాబెర్రీ ఏకంగా 250 గ్రాముల బరువు తూగింది. మామూలుగా స్ట్రాబెర్రీలు సెంటీమీటరు కంటే తక్కువ ఎత్తులోనే ఉంటాయి. ఇది ఏకంగా 8 సెంటీమీటర్ల ఎత్తు, 12 సెంటీమీటర్ల పొడవుతో ఉంది. దీని చుట్టుకొలత దాదాపు 30 సెంటీమీటర్లు ఉంది. జపాన్‌లోని ఫుకోకాకు చెందిన కోజి నకావో అనే రైతు తోటలో పండిన ఈ స్ట్రాబెర్రీ ప్రపంచంలోనే అతి భారీ స్ట్రాబెర్రీగా గిన్నెస్ రికార్డు సాధించింది. -
మరోసారి గొంతు సవరించిన సిద్ధార్థ
హైదరాబాద్ : ప్రముఖ నటుడు సిద్ధార్థ మరోసారి గొంతు సవరించుకున్నాడు. సినీ గేయ రచయిత నుంచి నటుడుగా మారిన అతడి స్నేహితుడు పీ ఏ విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న స్ట్రాబెర్రీ చిత్రంలో సిద్ధార్థ ఓ గీతాన్ని ఆలపించాడు. సిద్ధార్థతో తనకు గల అనుబంధాన్ని ఈ సందర్భంగా పీఏ విజయ్ మంగళవారం విలేకర్లతో పంచుకున్నారు. సిద్ధార్థ తనకు చిన్నప్పటి నుంచి తెలుసునని తెలిపారు. పాట పాడతావా అని అడగటమే ఆలస్యం... సిద్ధార్థ వెంటనే ఒప్పేసుకున్నాడు.... ఆ పాట సిద్ధార్థ పాడటం... రికార్డు చేయడం అంతా కేవలం ఆరు గంటల్లో అయిపోయిందని విజయ్ వెల్లడించారు. సిద్ధార్థ గొప్ప నటుడే కాదు... మంచి సింగర్ కూడా అంటూ కితాబ్ ఇచ్చారు. స్ట్రాబెర్రీ కథను గతంలో ఎప్పుడో రాశానని ... అయితే కంపోజర్ తాజ్ నూర్, తాను మంచి స్నేహితులమని చెప్పారు. ఓ రోజు తాను ఈ చిత్ర కథపై అనుకోకుండా తాజ్‌తో చర్చించానని గుర్తు చేసుకున్నారు. ఆ వెంటనే అతడు పాటలు కంపోజ్ చేయడానికి సిద్ధమై పోయాడని చెప్పారు. అలా చిత్రంలోని పాటలు కంపోజింగ్ చిత్ర షూటింగ్ కంటే ముందే ప్రారంభమైందన్నారు. ఇంతకు ముందు వచ్చిన తన చిత్రంలోని అన్ని పాటలు బాగున్నాయన్నారు. అయితే ఈ చిత్రంలోని పాటలు చాలా డిఫరేంట్‌గా ఉండాలని తాజ్ నూర్ తాను అనుకున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఇచ్చాడని... ఒక్కటి మాత్రమే ఇప్పటికి పూర్తయిందని తెలిపారు. ఈ థ్రిల్లర్ కామెడి చిత్రంలో విజయ్, అవని మోదీ, సముద్రఖణి, తంబి రామయ్య కీలక పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. -
స్ట్రాబెరీ సింగర్‌గా సిద్దార్ధ్
-
చేదు కాకరకాయ... చాక్లెట్లా ఉంటే..!
కాకరకాయ కూర తింటున్నప్పుడు ముక్కుకు ఏం వాసనొస్తుంది.. కాకరకాయ కూరదే వస్తుంది. ఇంకేం వస్తుంది అని అంటున్నారా.. అది కాకుండా మీకెంతో ఇష్టమైన చాక్లెట్ సువాసన వస్తే.. దొండ కాయకు వెనీలా.. చికెన్ ముక్కకు స్ట్రాబెర్రీ.. గోరుచిక్కుడుకు పల్లీ.. అవును మరీ. చిత్రంలోని అరోమా ఫోర్క్‌తో తింటే.. మీరేది తిన్నా.. మీకు నచ్చిన సువాసనే వస్తుంది. దీన్ని కెనడాకు చెందిన మాలిక్యూల్-ఆర్ ఫ్లేవర్స్ సంస్థ తయారుచేసింది. ఈ ఫోర్క్తోపాటు 21 విభిన్న రకాల సువాసనలతో కూడిన చిన్నపాటి సీసాలు, ఆ ద్రవాన్ని పీల్చుకునే పేపర్లు వస్తాయి. ఈ ఫోర్క్ మధ్య ఉన్న రంధ్రంలో మనకు కావాల్సిన ఫ్లేవర్ తాలూకు ద్రవాన్ని వేస్తే.. అందులోని పేపర్ దాన్ని పీల్చుకుని.. మనం తిన్నప్పుడు ఆ సువాసనను వెదజల్లుతుంది. అంతేకాదు.. ఆ రోజు కూరలో అల్లం వేయడం మర్చిపోయామనుకోండి.. ఇందులోని అల్లం ఫ్లేవర్ ద్రవాన్ని ఫోర్క్ రంధ్రంలో వేస్తే.. తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ వచ్చి.. కూరలో అల్లం మిస్ అయిన భావనను తొలగిస్తుందట. నాలుగు ఫోర్క్‌లు, 21 సువాసనల సీసాలతో కూడిన సెట్ ధర రూ.3,600. -
సహజ కాంతి...
పండ్లు, కూరగాయలు, వాటి నుంచి వచ్చే నూనెలను సౌందర్య లేపనాలుగా ఉపయోగిస్తే చర్మం సహజకాంతితో మెరిసిపోతుంది. దానిమ్మ: చర్మం ముడతలు పడనివ్వని యాంటీ ఏజింగ్ కాంపౌండ్స్ దానిమ్మలో పుష్కలం. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ -సి సమృద్ధిగా ఉన్న దానిమ్మ ఓట్స్ లేదా పెరుగుతో కలిపితే మేలైన ఫేస్ ప్యాక్ తయారవుతుంది. మలినాలను, మృతకణాలను తొలగించడమే కాదు చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. తయారి: 2 టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలు, కప్పు ఓట్స్ కలిపి మిక్సర్‌లో వేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమా న్ని ఒక గిన్నెలోకి తీసుకొని, అందులో 2 టేబుల్ స్పూన్ల తేనె, 2 టేబుల్ స్పూన్ల మజ్జిగ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఐదు నిమిషాలు ఉంచి, కడిగేయాలి. స్ట్రాబెర్రీ: విటమిన్ -సి సహజ సిద్ధమైన యాంటీ ఏజింగ్ కాంపౌండ్స్ గల స్ట్రాబెర్రీ మాస్క్ వల్ల రెట్టింపు అందాన్ని పొందవచ్చు. ఎండకు కమిలిన, మృతకణాలున్న చర్మాన్ని సాధారణస్థితికి తీసుకువచ్చి యవ్వనకాంతిని పెంచుతుంది. తయారి: కప్పుడు తాజా స్ట్రాబెర్రీలను మిక్సర్‌లో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. దీంట్లో కప్పు పెరుగు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మెత్తటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవచ్చు. పెరుగు: పెరుగు వల్ల జీర్ణకోశానికి మేలు కలుగుతుంది. తయారి: కప్పుడు పెరుగు, 2-3 చుక్కల బాదంనూనె, టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 20 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా తయారవుతుంది. తేనె: ఫేసియల్ ట్రీట్మెంట్లో తేనెను మించిన మాయిశ్చరైజర్ లేదని చెప్పవచ్చు. పొడి చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది. తయారి: చిన్న గిన్నెలో తగినంత తేనె తీసుకొని, సన్నని మంట మీద మరిగించాలి. పూర్తిగా చల్లారాక (వేలికి అద్దుకొని వేడిని పరీక్షించాలి) ముఖమంతా రాసుకోవాలి. పదిహేను నిమిషాలు ఉంచి, వెచ్చని నీటితో తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. చర్మం కాంతిగా, మృదువుగా మారుతుంది.