
స్లిమ్ కేక్స్
ఏడాదంతా బాగా తిన్నాం...
ఫుల్లుగా లాగించాం...
2016లో పదహారణాల ఫ్యాట్ కుమ్మేశాం.
2017 వస్తోంది!
సన్నగా, నాజూగ్గా అవ్వాలని అందరికీ ఉంది.
కానీ, దానికి కేక్ అడ్డం కాకూడదు కదా!
కండపట్టకుండా పిండేయండి.
కేక్ బెండు తీయండి.
2017లో కేకుల కేక!
స్లిమ్ కేక్... ఎంజాయ్!
ఆరెంజ్ ఆల్మండ్ కేక్
కావల్సినవి: ఉప్పులేని బటర్ – 50 గ్రాములు (కరిగించాలి), ఆరెంజ్ జిస్ట్ (పై తొక్కను సన్నగా తరిగినది) – టేబుల్ స్పూన్, క్యాస్టర్ షుగర్ – కప్పు, గుడ్లు – 2, సెల్ఫ్‌రైజింగ్ ఫ్లోర్/గోధుమపిండి – కప్పు, గసగసాలు – 2 టేబుల్ స్పూన్లు, వెన్న తీసిన పాలు – పావు కప్పు, షుగర్ ఫ్రీ షుగర్ – తగినంత, బాదంపప్పు పలుకులు – పావు కప్పు
తయారీ: ∙అవెన్‌ని 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వేడి చేయాలి. కేక్ బేకింగ్ బౌల్ అడుగున నూనెను స్ప్రే చేసి, పైన బేకింగ్ పేపర్ పరవాలి. దీనిపైన కూడా వంటనూనెను స్ప్రే చేయాలి. ఒక గిన్నెలో బటర్, ఆరెంజ్ జిస్ట్, పంచదార, గిలక్కొట్టిన గుడ్లసొన, పిండి, గసగసాలు, పాలు పోసి బాగా కలపాలి. ∙దీంట్లో బాదంపప్పు పలుకులు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో పోసి 35–40 నిమిషాలు బేక్ చేయాలి. కేక్ బయటకు తీసి, తర్వాత ప్లేట్‌లోకి తీయాలి. ∙చివరగా పంచదార పొడి, వెనిలా ఎక్స్‌ట్రాక్ట్, పాలను కలిపి బాగా గిలక్కొట్టి, కేక్ టాప్ మీద సెట్ చేయాలి. ఆరెంజ్ ముక్కలతో అలంకరించాలి.
బనానా స్లి్పట్ కేక్
కావల్సినవి: లైట్ వెనిలా స్పాంజ్ కేక్ – 1, అయిదు గుడ్డుల్లోని తెల్ల సొన, 3 గుడ్ల పసుపు సొన, సెల్ఫ్‌రైజింగ్ ఫ్లోర్/గోధుమపిండి – అర కప్పు, బేకింగ్ పౌడర్ – టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ – 2 టీ స్పూన్లు, పంచదార – అర కప్పు, వెన్నతీసిన పాలు – ఒకటిన్నర కప్పు, ఫ్యాట్ ఫ్రీ షుగర్ – పావు కప్పు, షుగర్ ఫ్రీ విప్డ్ క్రీమ్ – కప్పు, అరటిపండ్లు – 2 (పలచని ముక్కలుగా కట్ చేయాలి), స్ట్రాబెర్రీలు (పెద్దవి) – 4, షుగర్ ఫ్రీ చాకోలెట్ సిరప్ – 2 టేబుల్ స్పూన్లు
తయారీ: ∙ఒక గిన్నెలో గుడ్ల తెల్లసొన, పసుపుసొన వేసి బాగా గిలకొట్టాలి. బేకింగ్ పాన్‌లో నూనె స్ప్రే చేయాలి. అడుగున బేకింగ్ పేపర్ పరవాలి. ఆ పేపర్‌పై కూడా నూనె స్ప్రే చేయాలి. ∙మరొక గిన్నెలో పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి జల్లించాలి. ∙అవెన్‌ను 350 డిగ్రీల వద్ద∙ప్రీ హీట్ చేయాలి. వెనిలా, గుడ్డులోని పసుపు సొన కలిపి 5 నిమిషాలు మిక్సీలో బ్లెండ్ చేయాలి. దీంట్లో పావు కప్పు పంచదార వేసి, కరిగేంతవరకు గిలకొట్టాలి. దీంట్లో పూర్తి గుడ్ల మిశ్రమం పోసి కలపాలి. ∙బేక్ బౌల్‌లో స్పాంజ్ కేక్ పెట్టి, గరిటతో పాన్‌లో మీద పిండి మిశ్రమం వేయాలి. ∙గిలకొట్టిన గుడ్లసొన ఆ పిండి మీద మరో లేయర్‌గా పోయాలి. తర్వాత గిలకొట్టిన పావు కప్పు షుగర్ ఫ్రీ షుగర్ వేయాలి. దీనిని12 నిమిషాలు బేక్ చేయాలి. బయటకు తీసి వెంటనే బేకింగ్ పేపర్ చివర్లను పట్టుకొని వదులు చేయాలి. ప్లేట్‌లోకి తీసుకొని కట్ చేసి, ఫ్రిజ్‌లో పెట్టి, 10 నిమిషాల తర్వాత బయటకు తీసి విపింగ్ క్రీమ్ పైన రాయాలి. ∙ దీన్ని 2 గంటల సేపు ఫ్రిజ్‌లో ఉంచి తీయాలి. పేపర్‌టవల్ తీసేసి, కేక్ స్లైసులుగా కట్ చేయాలి. తర్వాత సన్నగా కట్ చేసిన అరటిపండు ముక్కలను, స్ట్రా బెర్రీల స్లైసులను, షుగర్ ఫ్రీ చాకోలెట్ సిరప్‌తో అలంకరించాలి.
ఛీజ్ చెర్రీ కేక్
కావల్సినవి: క్యారమెల్ కుకీస్ – 250 గ్రాములు, బటర్ – 40 గ్రాములు (కరిగించాలి), లైట్ క్రీమ్ ఛీజ్ (మెత్తనిది) – 250 గ్రాములు, ఫ్యాట్‌లేని రికోటా ఛీజ్ – 400 గ్రాములు, వెనిలా యోగర్ట్ – 200 గ్రాములు గుడ్లు – 2, వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ – టీ స్పూన్, సిరప్ చెర్రీ – 670 గ్రాములు, ఆరెంజ్ జిస్ట్ – 2 టీ స్పూన్లు, ఆరెంజ్ జ్యూస్ – 1/4 కప్పు, లెమన్ జిస్ట్ – 2 టీ స్పూన్లు, నిమ్మరసం – పావు కప్పు
తయారీ: ∙అవెన్‌ను 170 సెంటీగ్రేడ్‌ల వద్ద వేడిచేయాలి. పాన్ వేడి 150 డిగ్రీల వద్ద ఉండాలి. ∙కుకీస్‌ను మిక్సీలో వేసి పొడి చేయాలి. దీన్ని పాన్ అడుగున బేకింగ్ పేపర్‌పైన చల్లాలి. ∙ఒక గిన్నెలో క్రీమ్ ఛీజ్, రికొట్టా, యోగర్ట్, గుడ్లు, వెనిలా వేసి కలపాలి. 30–35 నిమిషాలు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత 4 గంటలు, లేదా రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ∙చెర్రీ సిరప్, ఆరెంజ్ రిండ్, ఆరెంజ్ జ్యూస్, లెమన్ రిండ్, లెమన్ జ్యూస్ సాస్‌పాన్‌లో వేసి, మరిగించాలి. సిమ్‌లో మరో 6 నిమిషాలు ఉంచాలి. దీంట్లో చెర్రీస్ వేసి దించాలి. వేడి తగ్గాక ఛీజ్ కేక్ బయటకు తీసి, పైన అలంకరించాలి.
ప్రెజర్ కుకర్ కేక్...
అవెన్ లేకుండా ప్రెజర్ కుకర్‌లోనూ కేక్ తయారు చేసుకోవచ్చు. కుకర్ అడుగున కేజీ ఉప్పు లేదా ఇసుక పోయాలి. దీని పైన ఒక కుకర్ బాటమ్ ప్లేట్ ఉంచాలి. మంట పూర్తిగా తగ్గించి, కుకర్‌ని వేడి చేయాలి. కుకర్‌లో చిన్న స్టాండ్ పెట్టి, సులువుగా పట్టేటంత మరొక గిన్నె తీసుకొని కేక్‌మిశ్రమం పోయాలి. కేక్‌మిశ్రమం ఉన్న గిన్నెను కుకర్‌లో జాగ్రత్తగా ఉంచాలి. పైన వెయిట్ పెట్టకుండా కుకర్‌మూత ఉంచాలి. (వెయిట్ పెడితే కుకర్ పేలే ప్రమాదం ఉంటుంది.) సన్నని మంట మీద 30–35 నిమిషాలు కేక్‌ను బేక్ చేసి, మంట తీసేయాలి. కుకర్ వేడి పూర్తిగా తగ్గేవంత వరకు ఉంచి, కేక్ గిన్నెను బయటకు తీయాలి. తర్వాత నచ్చిన విధంగా అలంకరించుకోవాలి.
పియర్ లేయర్ కేక్
కావల్సినవి: గుడ్ల తెల్ల సొన – కప్పు + అర కప్పు, వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ – టీ స్పూన్, షుగర్ ఫ్రీ షుగర్ – కప్పు + 2 టేబుల్ స్పూన్లు, షుగర్‌లెస్ వెనిలా ఆల్మండ్ మిల్క్ – ముప్పావు కప్పు – 2 టేబుల్ స్పూన్లు, పియర్ పండు గుజ్జు – ముప్పావు కప్పు + టేబుల్ స్పూన్, క్యారమెల్ ఫ్లేవర్ – టీ స్పూన్, కొబ్బరి పొడి – కప్పు + పావు కప్పు (పచ్చికొబ్బరిని గ్రైండ్ చేసి, పిండి, పాలు తీయాలి. ఆ పొడిని బ్లాటింగ్ పేపర్ మీద పరిచి, దాదాపు 12 గంటల పాటు ఆరబెట్టాలి. తర్వాత దీన్ని మిక్సర్‌లో వేసి పొడి చేయాలి. ), తీపి లేని ముదురు రంగు కోకా పౌడర్ – పావు కప్పు, తీపిలేని సాధారణ కోకా పౌడర్ – పావు కప్పు, మసాలా – 2 టీ స్పూన్లు (దాల్చిన చెక్క పొడి టీ స్పూన్, జాజికాయ పొడి అర టీ స్పూన్, యాలకులు+లవంగాల పొడి అర టీ స్పూన్), బేకింగ్ పౌడర్ – టీ స్పూన్, బేకింగ్ సోడా – టీ స్పూన్, కళ్ళుప్పు (పొడి చేయాలి)– అర టీ స్పూన్
క్రీమ్‌కి కావల్సినవి: కొబ్బరినూనె/వంటనూనె – టేబుల్ స్పూన్, తియ్యగా లేని వెనిలా ఆల్మండ్ మిల్క్ – ముప్పావు కప్పు, ఆర్గానిక్ స్టేవియా ఎక్స్‌ట్రాక్ట్ – టీ స్పూన్, క్యారమెల్ ఫ్లేవర్ – టీ స్పూన్, బటర్ ఫ్లేవర్ – పావు టీ స్పూన్, కళ్ళుప్పు (పొడి చేయాలి)– పావు టీ స్పూన్, ఆర్గానిక్ బ్రౌన్‌రైస్ పౌడర్ – 100 గ్రాములు, ఎరిత్రిటోల్ పొడి – కప్పు + 1/4 కప్పు
తయారీ: ∙అవెన్‌ను 350 డిగ్రీల వద్ద ప్రీ హీట్ చేయాలి. 200 డిగ్రీల వద్ద బేకింగ్ పాన్‌ను హీట్‌చేయాలి. ∙ గుడ్ల సొన బాగా గిలక్కొట్టి అందులో వెనిలా ఎక్స్‌ట్రాక్ట్, షుగర్‌లెస్ షుగర్ పొడి, బాదం పాలు, పియర్‌పండు గుజ్జు, క్యారమెల్ ఫ్లేవర్ వేసి బాగా కలపాలి. ∙ కుకింగ్ పాన్ అడుగున నూనెను స్ప్రే చేయాలి. ఆ పైన బేకింగ్ పేపర్‌ను పరవాలి. అలాగే పాన్ చుట్టుపక్కల పేపర్‌ను సెట్ చేయాలి. ∙ మరొక గిన్నెలో కొబ్బరి పొడి, కోకాపౌడర్లు, మసాలా పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి జల్లించాలి. ∙ దీంట్లో గుడ్ల మిశ్రమం వేసి బాగా కలపాలి. మిక్సీలో వేసి 20 సెకన్లపాటు బ్లెండ్ చేయాలి. ∙ ఈ మిశ్రమాన్ని పాన్‌లో గరిటెతో వేసి, పైన గరిటెతో చక్కగా సెట్ చేసి, అవెన్‌లో పెట్టాలి. 45 నిమిషాల పాటు బేక్ చేయాలి.
క్రీమ్ తయారీ: ∙అవెన్‌లో ఆల్మండ్ మిల్క్ పోసి 20 సెకండ్లు వేడి చేసి, తీయాలి. దీన్ని గిలకొట్టాలి. తర్వాత ఎక్స్‌ట్రాక్ట్, ఉప్పు, ఎరిథ్రిటాల్ వేసి కలపాలి. దీన్ని కేక్ మీద అప్లై చేసి, ప్రిజ్‌లో పెట్టాలి. 10 నిమిషాల తర్వాత తీసి సర్వ్ చేయాలి.
లైట్ చాకోలెట్ కేక్
కావల్సినవి: అన్‌సాల్టెడ్ బటర్ – 75 గ్రాములు, క్యాస్టర్ షుగర్ – కప్పు, గుడ్లు – 2, గోధుమ పిండి – ఒకటిన్నర కప్పు, కోకాపౌడర్ – పావు కప్పు, సోడా – అర టీ స్పూన్, వెన్నలేని పాలు – కప్పు, కోకాపౌడర్, స్ట్రాబెర్రీలు, చెర్రీలు – అలంకరణకు
తయారీ: ∙అవెన్‌ను 180 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ప్రీ హీట్ చేయాలి. పాన్ తగినది ఎంచుకోవాలి. ∙మిక్సర్‌లో బటర్, షుగర్, గుడ్ల సొన, పిండి, కోకాపౌడర్, సోడా, పాలు వేసి నిమిషం సేపు బ్లెండ్ చేయాలి. ∙ఈ మిశ్రమాన్ని పాన్‌లో పోసి 45–50 నిమిషాలు బేక్ చేయాలి. చల్లారాక ప్లేట్‌లోకి తీసుకొని పైన కోకాపౌడర్ చల్లి, ఆ పైన చెర్రీస్‌తో అలంకరించి సర్వ్ చేయాలి.