సాగనివ్వకండి బ్యూటిప్‌ | Beauty Tips For Skin Face Pack | Sakshi
Sakshi News home page

సాగనివ్వకండి బ్యూటిప్‌

Published Fri, Jan 24 2020 3:08 AM | Last Updated on Fri, Jan 24 2020 3:08 AM

Beauty Tips For Skin Face Pack - Sakshi

వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై చర్మం సాగుతుంటుంది. దాంతో మనసు ఎంత ఉత్సాహంగా ఉరకలేస్తున్నా, ఎదుటి వారికి మాత్రం ముడతలను చూడగానే మీ వయసు ఇట్టే తెలిసి పోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి.

స్ట్రాబెర్రీ: ఈ పండ్లలో చర్మాన్ని బిగుతుగా చేసే గుణం ఉంటుంది. ఇది 100 శాతం నేచురల్‌ ట్రీట్‌మెంట్‌. 5–6 స్ట్రాబెర్రీలను తీసుకొని గ్రైండ్‌ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో కొద్దిగా శనగపిండి వేసి ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే సరి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ముడతలు తగ్గుతాయి.

గుడ్డు తెల్లసొన, పెరుగు: ముడతలు మటుమాయం చేయడానికి గుడ్డు బాగా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్‌ స్ఫూన్‌ పెరుగులో రెండు గుడ్ల తెల్ల సొనను వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖంపై ఉన్న మడతల వద్ద, మెడకు అప్లై చేయాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతూ ముడతలు తగ్గుతాయి.

బియ్యం పిండి: చర్మంపై ముడతలను తొలగించేందుకు రెండు టేబుల్‌ స్పూన్ల బియ్యం పిండిలో రెండు టేబుల్‌ స్పూన్ల రోజ్‌ వాటర్‌ లేదా గ్రీన్‌ టీ పోసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంతో ఫేస్‌ ప్యాక్‌ వేసుకోవాలి. 20–30 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement