
గుడ్లను ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. వాటితో డెజెర్ట్‌ల దగ్గర నుంచి వివిధ రకాల వంటకాల వరకు పలు రకాలు చేసుకుని ఆస్వాదిస్తుంటా. అలాంటి గుడ్డు వంటకాలలో ది బెస్ట్‌గా భారతీయ వంటకం నిలిచింది. ప్రతి ఏడాది ది బెస్ట్ డెజర్ట్, బెస్ట్ కర్రీ వంటి వాటికి ర్యాంకులిచ్చి మరీ జాబితాను విడుదల చేసే ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఈ గుడ్డు వంటకాల జాబితానను కూడా విడుదల చేసింది.
ఇది ప్రపంచంలోనే టాప్ వంద గుడ్డు వంటకాల జాబితాను వెల్లడించింది. వాటిలో మన భారతీయ వంటకం మసాలా అమ్మేట్ 22వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. మొదటి 50 బెస్ట్ గుడ్డు వంటకాల్లో మసాలా ఆమ్లేట్ స్థానాన్ని సంపాదించుకుంది. ఈ జాబితాలో జపాన్‌కి చెందిన అజిత్‌సుకే టమాగో అనే గుడ్డు వంటకం అగ్రస్థానంలో నిలిచింది. ఈ అజితసుకే టమాగో అనేది మిరిన్, సోయా సాస్‌తో నానబెట్టి ఉకించిన గుడలతో చేసే సంప్రదాయ జపనీస్ వంటకం ఇది. ఇక నోరూరించే మన భారతీయ మసాలా అమ్మెట్ తయారీ ఎలాగో చూద్దామా..!
దీనిని గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, కొత్తిమీర, కారం, పసుపు పొడితో తయారు చేస్తారు. అన్ని పదార్థాలను గుడ్లతో కలిపి, ఆ మిశ్రమాన్ని పాన్‌లో (సాధారణంగా వెన్న లేదా నూనెతో) వండుతారు. ఈ స్పైసీ ఆమ్లెట్‌ను సాంప్రదాయకంగా పావ్ లేదా బ్రెడ్‌తో అల్పాహారంగా వడ్డిస్తారు. తాజాగా వండిన రోటీతో కూడా తినవచ్చు. చాలా మంది దీనిని టమోటా కెచప్ లేదా కొత్తిమీర-పుదీనా చట్నీతో ఆస్వాదిస్తారు. వీధి దుకాణాలలో ఈ వంటకాన్ని ఎక్కువగా విక్రయిస్తుంటారు. కొందరూ టమోటాలను కూడా ఉపయోగిస్తారు.
చివరగా ప్రపంచంలోని టాప్ 10 గుడ్డు వంటకాల జాబితా ఏంటంటే..
అజిత్సుకే టమాగో (జపాన్)
టోర్టాంగ్ టాలాంగ్ (ఫిలిప్పీన్స్)
స్టాకా మే అయ్గా (గ్రీస్)
స్ట్రాపట్సదా (గ్రీస్)
ఇస్పానక్లి యుమూర్త (టర్కీ)
టోర్టిల్లా డి బెటాన్జోస్ (స్పెయిన్)
యుఎస్ఎ బెనెడిక్ట్ (జపాన్)
షక్షౌకా (ట్యునీషియా ప్రాంతాలు)
మెనెమెన్ (టర్కీ)
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment