పండ్లలో రారాజు మామిడి పండు. దీనితో చాలా చోట్ల పలు రకాల రెసీపీలు, స్వీట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రలో అయితే మామిడి తాండ్ర వంటి వివిధ రకా స్వీట్లను తయారు చేస్తారు. ఇక కొన్ని చోట్ల చట్నీలు, డిజర్ట్‌లు చేస్తుంటారు. అలాంటి భారతీయ వంటకాలన్నింటికి ప్రపంచ వేదికపై గుర్తింపు లభించింది. టేస్ట్ అట్లాస్ ఇంత వరకు బెస్ట్ కర్రీ, బెస్ట్ డిజార్ట్ వంటి ర్యాకింగ్‌లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలానే ఈసారి మ్యాంగోతో తయారు చేసే ఉత్తమ వంటకాల జాబితా ఇచ్చింది.
వాటిలో రెండు భారతీయ వంటకాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అవి రెండు తొలి టాప్ 10 జాబితాలోనే ర్యాంకులు పొందాయి. ముఖ్యంగా పశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌లలో రుచికరమైన వంటకంగా పేరుగాంచిన ఆమ్రాస్ తొలి స్థానం నిలిచింది. ఇది ప్యూరీ విత్ మ్యాంగో జ్యూస్‌తో తయారు చేస్తారు. ఈ జ్యూస్‌ని పొడి అల్లం లేదా ఏలుకులతో జత చేసి కూడా తయారు చేస్తారు. ఈ జాబితాలోనే భారతీయ మామిడి చట్నీ కూడా ఐదో స్థానం దక్కించుకోవడం విశేషం.
ఈ చట్నీని దాల్చిన చెక్కలు, యాలకులు, బ్రౌన్ షుగర్, వెనిగర్ వంటి వాటితో తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ చట్నీ తయారీలో కొద్దిపాటి వైవిధ్యాలు కూడా ఉన్నాయి. ఇక ది బెస్ట్ మ్యాంగో రెసీపీల జాబితాలో థాయిలాండ్‌కు చెందిన మ్యాంగో స్టిక్కీ రైస్ రెండో స్థానం దక్కించుకుంది. ఈసారి టేస్ట్ అట్లాస్ ఇచ్చిన వరల్డ్‌లోనే 50 బెస్ట్ మ్యాంగో రెసీపీలలో భారతీయ మామిడి వంటకాలే తొలి పది స్థానాల్లో నిలవడం విశేషం.
(చదవండి: ఆ సమస్యలు ఉంటే.. పెరుగుతో ఈ ఆహారాలు జత చెయ్యొద్దు!)
Comments
Please login to add a commentAdd a comment