బెస్ట్‌ బీన్స్‌ డిషెస్‌లో.. మన భారతీయ వంటకం ఇదే..! | 50 Best Bean Dishes This Popular Indian Delight On The List | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ బీన్స్‌ డిషెస్‌లో.. మన భారతీయ వంటకం ఇదే..!

Published Fri, Nov 15 2024 2:55 PM | Last Updated on Fri, Nov 15 2024 3:03 PM

50 Best Bean Dishes This Popular Indian Delight On The List

ప్రపంచంలోనే అత్యుత్తమ బీన్స్‌ రెసీపీల్లో మన భారతీయ వంటకం చోటు దక్కించుకుంది. ప్రముఖ ఫుడ్‌ అండ్‌​ ట్రావెల్‌ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్ విడుదల చేసిన 50 అత్యుత్తమ బీన్స్‌ వంటకాల జాబితాలో మన భారతీయ వంటకం కూడా నిలిచింది. ఈసారి నవంబర్‌ 2024 విడుదల చేసిన 50 బెస్ట్‌ బీన్స్‌ ఆహార జాబితా ర్యాకింగ్‌లో మన భారతీయ వంటకం రాజ్మా 14వ స్థానంలో నిలవడం విశేషం. 

గతేడాది ఫుడ్‌ గైడ్‌ ఇచ్చిన బెస్ట్‌ రెసిపీల జాబితాలో రాజ్మా, రాజ్మా చావెల్‌ కూడా చోటు దక్కించుకున్నాయి. ఈ బెస్ట్‌ బీన్స్‌ వంటకాల్లో తొలిస్థానం మెక్సికోకు చెందిన ప్యూరీ బీన్‌ సూప్‌ సోపా తారాస్కా చోటు దక్కించుకుంది. ఆ తర్వాత హైతీకి చెందిన దిరి అక్‌ప్వా రెండో స్థానం కాగా, ఇక మూడో స్థానంలో బ్రెజిల్‌కు చెందిన ఫీజావో ట్రోపీ నిలిచింది. 

ఇంతకు ముందు టేస్ట్ అట్లాస్ 50 బెస్ట్‌ డిప్స్‌ జాబితా విడుదల చేయగా..అందులో రెండు భారతీయ చట్నీలు చోటుదక్కించుకున్నాయి. పైగా వాటిని ఇంట్లోనే మసాలాలతో తయారు చేసే రుచికరమైన చట్నీలుగా అభివర్ణించింది. కాగా,  ఈ రాజ్మా కర్రీ వివిధ సుగంధ ద్రవ్యాలతో చేసిన చిక్కటి గ్రేవీలా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన శాకాహార వంటకాల్లో ఇది ఒకటి.

 

(చదవండి: స్ట్రిక్ట్ డైట్ పాటించకుండానే బరువు తగ్గొచ్చు..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement