బరువు తగ్గడం అంటే.. స్ట్రిక్ట్ డైట్, వ్యాయామాలు అనే అనుకుంటాం. అందుకే చాలామంది బరువు తగ్గడం విషయమై చాలా భయపడుతుంటారు. కొందరూ ప్రయత్నించి మధ్యలోనే అమ్మో..! అని చేతులెత్తేస్తారు. సెలబ్రిటీలు, ప్రముఖులు, మంచి ఫిట్‌నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో వెయిట్ లాస్ అవ్వగలరు కానీ సామాన్యులకు సాధ్యం కాదనే భావన ఉంటుంది చాలామందికి. కానీ ఇక ఆ భయాలేమి వద్దంటున్నారు ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్, ఫోర్త్ లెవెల్ 4 సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ సుప్రతిమ్ చౌదరి. ఎలాంటి కఠిన ఆహార నియమాలు పాటించాల్సిన పని లేకుండానే తొందగా బరువు తగ్గొచ్చని నమ్మకంగా చెబుతున్నారు. అదెలాగో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..!.
ఫిట్‌నెస్ ట్రైనర్ సుప్రతిమ్‌కు ఇన్‌స్టాలో 10 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆయన సోషల్ మీడియా వేదికగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి షేర్ చేసుకోవడమే గాక తన ఫాలోవర్లకు ఈజీగా బరువు తగ్గే చిట్కాలను గురించి చెబుతుంటారు.
ఇటీవలే తన వెయిట్ లాస్ జర్నీలో దాదాపు 20 కిలోల బరువు వరకు ఎలా తగ్గాననేది కూడా హైలెట్ చేశారు. ఆయన అందుకోసం స్ట్రిక్ట్ డైట్ అవసరం లేదని ఈ అమూల్యమైన ఐదు రూల్స్‌ని పాటిస్తే చాలు తొందరగా బరవు తగ్గిపోతారని అన్నారు. ముందుగా తాను ఎలాంటి నియమాలు పాటించారో వివరించారు. ఆ తర్వాల ఎలాంటి డైట్ లేకుండా ఎలా బరువు తగ్గొచ్చొ వివరించారు.
మొదటిది: రాత్రి ఏడు గంటల్లోపు డిన్నర్ ముగించటం..
రెండు: ప్రతిరోజూ 3-4 లీటర్ల నీరు త్రాగాలి.
మూడు: ప్రతిరోజూ 50 శాతం తక్కువగా తినడానికి ప్రయత్నించండి
నాలుగు: ప్రతిరోజూ 30-40 నిమిషాలు చాలా సాధారణ వ్యాయామలు
ఐదు: ఒత్తడి లేకుండా ఉండటం
ఈ నియమాలను అనుసరించే తాను బరువు తగ్గగలిగానని సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. అలాగే మరొక వీడియోలో ఎలాంటి కఠిన ఆహార నియమాలు లేకుండా ఎలా బరువు తగ్గొచ్చొ తెలిపారు. దానికి కూడా ఐదు రూల్స్‌ని తప్పనిసరిగా పాటించాలన్నారు. అవేంటంటే..
ఎలాంటి డైట్ లేకుండా..
మొదటిది: ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినండి.
రెండు: భోజన సమయాలను సరి చేయండి
మూడు: భోజనంలో అన్ని రకాల మాక్రోన్యూట్రియెంట్లను జోడించాలి(ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, గ్రీన్ సలాడ్‌లు ఉండాలి)
నాలుగు: ఒక్కసారే వడ్డించుకోండి మరోసారి తీసుకునే యత్నం చెయ్యొద్దు
ఐదు: తినే సమయంలో ఎలాంటి పరికరాలు ఉపయోగించవద్దు
అలాగే ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారు వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా చిప్స్, కుకీలు, ఫాస్ట్‌ఫుడ్‌కి దూరంగా ఉండమని సూచించారు ఫిట్‌నెస్ ట్రైనర్ సుప్రతిమ్.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.
(చదవండి: ఏం ట్విస్ట్..?: కన్నతల్లి పక్కనే ఉన్నా..! పాపం ఆ కొడుకు..)
Comments
Please login to add a commentAdd a comment