Fitness Trainer
-
స్ట్రిక్ట్ డైట్ పాటించకుండానే బరువు తగ్గొచ్చు..!
బరువు తగ్గడం అంటే.. స్ట్రిక్ట్ డైట్, వ్యాయామాలు అనే అనుకుంటాం. అందుకే చాలామంది బరువు తగ్గడం విషయమై చాలా భయపడుతుంటారు. కొందరూ ప్రయత్నించి మధ్యలోనే అమ్మో..! అని చేతులెత్తేస్తారు. సెలబ్రిటీలు, ప్రముఖులు, మంచి ఫిట్నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో వెయిట్ లాస్ అవ్వగలరు కానీ సామాన్యులకు సాధ్యం కాదనే భావన ఉంటుంది చాలామందికి. కానీ ఇక ఆ భయాలేమి వద్దంటున్నారు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్, ఫోర్త్ లెవెల్ 4 సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ సుప్రతిమ్ చౌదరి. ఎలాంటి కఠిన ఆహార నియమాలు పాటించాల్సిన పని లేకుండానే తొందగా బరువు తగ్గొచ్చని నమ్మకంగా చెబుతున్నారు. అదెలాగో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..!.ఫిట్నెస్ ట్రైనర్ సుప్రతిమ్కు ఇన్‌స్టాలో 10 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆయన సోషల్ మీడియా వేదికగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి షేర్ చేసుకోవడమే గాక తన ఫాలోవర్లకు ఈజీగా బరువు తగ్గే చిట్కాలను గురించి చెబుతుంటారు. View this post on Instagram A post shared by supratim chowdhury (@thesupratim_official) ఇటీవలే తన వెయిట్ లాస్ జర్నీలో దాదాపు 20 కిలోల బరువు వరకు ఎలా తగ్గాననేది కూడా హైలెట్ చేశారు. ఆయన అందుకోసం స్ట్రిక్ట్ డైట్ అవసరం లేదని ఈ అమూల్యమైన ఐదు రూల్స్‌ని పాటిస్తే చాలు తొందరగా బరవు తగ్గిపోతారని అన్నారు. ముందుగా తాను ఎలాంటి నియమాలు పాటించారో వివరించారు. ఆ తర్వాల ఎలాంటి డైట్ లేకుండా ఎలా బరువు తగ్గొచ్చొ వివరించారు. View this post on Instagram A post shared by supratim chowdhury (@thesupratim_official) మొదటిది: రాత్రి ఏడు గంటల్లోపు డిన్నర్ ముగించటం.. రెండు: ప్రతిరోజూ 3-4 లీటర్ల నీరు త్రాగాలి.మూడు: ప్రతిరోజూ 50 శాతం తక్కువగా తినడానికి ప్రయత్నించండి నాలుగు: ప్రతిరోజూ 30-40 నిమిషాలు చాలా సాధారణ వ్యాయామలు ఐదు: ఒత్తడి లేకుండా ఉండటంఈ నియమాలను అనుసరించే తాను బరువు తగ్గగలిగానని సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. అలాగే మరొక వీడియోలో ఎలాంటి కఠిన ఆహార నియమాలు లేకుండా ఎలా బరువు తగ్గొచ్చొ తెలిపారు. దానికి కూడా ఐదు రూల్స్‌ని తప్పనిసరిగా పాటించాలన్నారు. అవేంటంటే.. ఎలాంటి డైట్ లేకుండా.. మొదటిది: ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినండి.రెండు: భోజన సమయాలను సరి చేయండిమూడు: భోజనంలో అన్ని రకాల మాక్రోన్యూట్రియెంట్లను జోడించాలి(ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, గ్రీన్ సలాడ్లు ఉండాలి)నాలుగు: ఒక్కసారే వడ్డించుకోండి మరోసారి తీసుకునే యత్నం చెయ్యొద్దుఐదు: తినే సమయంలో ఎలాంటి పరికరాలు ఉపయోగించవద్దుఅలాగే ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారు వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా చిప్స్, కుకీలు, ఫాస్ట్‌ఫుడ్‌కి దూరంగా ఉండమని సూచించారు ఫిట్నెస్ ట్రైనర్ సుప్రతిమ్.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. (చదవండి: ఏం ట్విస్ట్..?: కన్నతల్లి పక్కనే ఉన్నా..! పాపం ఆ కొడుకు..) -
ఐస్‌క్రీమ్‌తో బరువు తగ్గొచ్చా?: దీపికా పదుకొనే ఫిట్నెస్ ట్రైనర్
ఐస్‌క్రీమ్‌లలో షుగర్ ఎంత ఉంటుందో తెలిసిందే. బరువు తగ్గాలనుకునేవారు వాటిని అస్సలు దగ్గరకు రానియ్యరు. అయితే దీపిక పదుకొనే ఫిట్నెస్ ట్రైయినర్ మాత్రం ఐస్‌క్రీమ్‌లను ఆస్వాదిస్తూ బరువు తగ్గొచ్చని చెబుతోంది. అందుకోసం ఏం చేయాలో సవివరంగా చెప్పడమే గాకుండా ఆ ఐస్‌క్రీమ్‌లను ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలిపింది. సెలబ్రిటీ ఫిట్నెస్ శిక్షకురాలు యాస్మిన్ కరాచీవాలా ఐస్క్రీంని ఇలా చేసుకుని తింటే కచ్చితంగా బరువు తగ్గుతారని చెబుతోంది. అదేంటి ఐస్‌క్రీంతో బరువు తగ్గడమా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే హెల్తీగా చేసుకుని తింటే కచ్చితంగా బరవు తగ్గుతారని అంటోంది యాస్మిన్. ఆమె కత్రినా కైఫ్, కరీనా కపూర్, దీపీక పదుకొనే వంటి బాలీవుడ్ ప్రముఖుల ఫిట్నెస్ ట్రైనర్ ఆమె. ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడిని వారంటూ ఉండరు. ఫిట్నెస్ మెయింటెయిన్ చేయడం కోసం ఐస్‌క్రీమ్‌ని త్యాగం చేయాల్సిన పనిలేదంటోంది యాస్మిన్. బరువు తగ్గేలా ఐస్క్రీంని చేసుకుని తింటే చాలని చెబుతోంది. ఇలా చేస్తే ఆరోగ్యానకి ఆరోగ్యం, మంచి ఫిట్నెస్ కూడా మీ సొంతమని నమ్మకంగా చెబుతోంది. ఇంతకీ ఎలా చేయాలంటే..?కావాల్సిన పదార్థాలు..యాపిల్స్:4డార్క్ చాక్లెట్ సిరప్: తగినంతమాపుల్ సిరప్బిట్స్ వాల్నెట్లుఐస్క్రీం మౌల్డ్లుతయారీ విధానం: నాలుగు యాపిల్స్‌ని తొక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత వాటిని మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కరిగించిన డార్క్ చాక్లెట్‌ని తీసుకోవాలి. దీన్ని ఉడికించిన యాపిల్ ముక్కల్లో వేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐస్‌క్రీమ్ ఫ్లేవర్ వచ్చేలా మాపుల్ సిరఫ్ వేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఐస్‌క్రీం మౌల్డ్‌లలో పోసి అలంకరణగా వాల్నెట్లు వేసి డీప్ ఫ్రీజ్‌లో పెట్టండి అంతే ఆరోగ్యకరమైన ఐస్‌క్రీం డెజర్ట్ రెడీ. పైగా ఇందులో ఎలాంటి షుగర్ వినయోగించ లేదు కాబట్టి బరువు పెరుగుతామన్న భయం ఉండదు. అందులో ఉండే యాపిల్స్ బరువుని అందుపులో ఉంచుతుంది. పైగా రుచి రచికి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి ఐస్‌క్రీమ్ డెజర్ట్‌ని మీరు కూడా ట్రై చేయండి. View this post on Instagram A post shared by Yasmin Karachiwala | Celebrity Fitness Instructor (@yasminkarachiwala)(చదవండి: వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?) -
గుర్తుపెట్టుకుని మరీ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన తారక్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. ఆర్ఆర్ఆర్తో అభిమానులకు ఫుల్ మీల్స్ పంచిన ఆయన ప్రస్తుతం దేవర సినిమాతో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కానుంది. దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్లో వార్ 2 మూవీలోనూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మీదునియాలో టాక్ నడుస్తోంది. బర్త్‌డే సెలబ్రేట్ చేసిన తారక్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన ఫిట్నెస్ ట్రైనర్ బర్త్‌డే గుర్తుపెట్టుకుని మరీ సెలబ్రేట్ చేశాడు. ఈ విషయాన్ని హీరో ట్రైనర్ కుమార్ మన్నవ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఎమోషనలయ్యాడు. 'నా పుట్టినరోజు గుర్తుపెట్టుకున్నారు. నేను ఎలాంటి ఫుడ్ తింటానో తెలుసుకుని ఆరోగ్యకరమైన కేక్ తీసుకొచ్చారు. పెద్ద స్టార్ అయినప్పటికీ ఎంతో ఒదిగి ఉంటారు. మీ గురించి ఏమని చెప్పను.. మీరు నాపై, నా కుటుంబంపై చూపించే ప్రేమకు.. మన అనుబంధానికి ఉప్పొంగిపోయాను. మీ గురించి ఏమని చెప్పను.. వినయ విధేయతకు, ప్రేమకు మీరు నిలువెత్తు నిర్వచనం. మీతో కలిసి పని చేయడం సంతోషంగా భావిస్తున్నాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. మా అన్న బంగారం.. అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kumar Mannava (@kumarmannava) చదవండి: చాలాసార్లు కడుపులోనే బిడ్డను కోల్పోయిన అమీర్ ఖాన్ మాజీ భార్య -
'స్టార్ హీరో కూతురు అయ్యుండి.. ఇలాంటి బట్టలు వేసుకుందేంటి'?
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. ఆరోజు మరింత అందంగా, ప్రత్యేకంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. వారికి సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. వారి వివాహ వేడుకకు ఎలాంటి దుస్తులు, ఆభరణలు ధరిస్తారు అని తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతుంటారు. దీనికి తగ్గట్లు గానే కొన్ని నెలల ముందు నుంచే తారలు ప్రముఖ డిజైనర్లతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. అయితే ఎంత ప్రత్యకంగా కనిపించాలని ఆరాటపడినా కొన్నిసార్లు మిస్‌ఫైర్ అవుతుంటుంది. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ విషయంలోనూ ఇదే జరిగిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గత రాత్రి(జనవరి3)న ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖర్‌తో ఇరాఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లు ధరించిన కాస్ట్యూమ్స్‌పై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తుంది. వరుడు బ్లూ కలర్ షేర్వానీలో కనిపించగా, వధువు ఇరాఖాన్ సింపుల్‌గా పటియాలా-చోలి దుస్తుల్లో కనిపించింది. అయితే స్టార్ హీరో కూతురు అయ్యిండి ఇలాంటి బట్టలు వేసుకుందేంటి? అర్జెంట్‌గా ఈమెకు స్టైలిస్ట్ అవసరం ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Pinkvilla (@pinkvilla) ఎంత సింప్లిసిటీ ప్రదర్శించినా పెళ్లంటే కాస్తైనా గౌరవం ఉండాలి కదా? జాగింగ్ చేస్తూ నుపుర్ పెళ్లి వేడుకకు రావడం ఏంటి? జిమ్ డ్రెస్‌లో పెళ్లి తంతు ముగించడం ఏంటి? కనీసం బట్టలు అయినా పద్దతిగా వేసుకున్నారా అంటే అదీ లేదు. ఇదేదో కొత్తరకం స్టైల్ అనుకుంటున్నారేమో, చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది మీ డ్రెస్సింగ్ అంటూ కొత్త జంటపై విమర్శలు గుప్పిస్తున్నారు.ఇంతకుముందు అయితే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా పెళ్లి దుస్తుల్లో సంప్రదాయక ఎరుపురంగు ఉండేలా చూసుకునేవారు. కానీ ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు పెళ్లికి కొంచెం ట్రెండు మార్చి డిఫరెంట్ కలర్స్‌ని ఎంచుకున్నారు. అనుష్క శర్మ నుంచి పరిణితి చోప్రా వరకు.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పేస్టల్ కలర్స్ ట్రెండ్ అవుతున్నాయి. కానీ ఇరాఖాన్ ఇలా నీలం రంగు దుస్తుల్లో, కొల్హాపురి చప్పల్స్‌తో కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. అయినా ఎవరి వ్యక్తిగత ఇష్టాలు, అభిప్రాయాలు వారివి. నిజం చెప్పాలంటే ఈ జంట హంగు, ఆర్భాటాలతో కాకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకోవడం ఆదర్శమని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
స్టార్ హీరో కూతురి పెళ్లి.. బనియన్ మీదే వివాహం!
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్- నిర్మాత రీనా దత్తాల కూతురు ఇరా ఖాన్ పెళ్లి పీటలెక్కింది. తన ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను వివాహం చేసుకుంది. బుధవారం(జనవరి 3న) నాడు ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్లో ఇరు కుటుంబాలు, దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అదే రోజు గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. జాగింగ్ చేస్తూ మండపానికి.. ఇక వరుడు ఫిట్నెస్ ట్రైనర్ కావడంతో పెళ్లి జరిగే చోటుకు జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. దాదాపు 8 కి.మీ. జాగింగ్ చేసుకుంటూ వచ్చిన అతడు దుస్తులు కూడా మార్చుకోకుండా టీషర్ట్‌పైనే పెళ్లి వేడుకలు కానిచ్చేశాడు. రిసెప్షన్‌కు మాత్రం కొత్త బట్టల్లో దర్శనమిచ్చాడు. ఈ పెళ్లిలో ఆమిర్ ఖాన్ ఇద్దరు మాజీ భార్యలు సందడి చేశారు. రెండో మాజీ భార్య అయిన కిరణ్ రావుకు ఆప్యాయంగా నుదుటన ముద్దు పెడుతూ ఫోటోలకు పోజిచ్చాడీ హీరో. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకపోతే సెలబ్రిటీలు, సన్నిహితుల కోసం ఈ నెల 13న ముంబైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. 2022లో ఎంగేజ్మెంట్.. కాగా నుపుర్ శిఖరే.. ఆమిర్ ఖాన్‌కు ఫిట్నెస్ ట్రైనర్‌గా పని చేశాడు. అలా అతడికి ఇరాతో పరిచయం ఏర్పడింది. కరోనా సమయంలో ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2022 నవంబర్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇన్నాళ్లకు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్, మొదటి భార్య రీనా దత్తాల సంతానమే ఇరా ఖాన్. ఆమిర్- రీనా దంపతులకు జునైద్ ఖాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమిర్.. 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. వీరు కూడా 2022లో విడిపోయారు. After marriage ceremony of daughter #IraKhan during photoshoot #AamirKhan kisses #KiranRao what a moment love and Peace 🥰🥰#NupurShikhare #ReenaDutta #celebrity #wedding #celebration pic.twitter.com/lrUEUR7wB5 — sdn (@sdn7_) January 4, 2024 View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: విజయ్ సినిమాలో ఇన్ని సర్‌ప్రైజులా.. ఫ్యాన్స్‌కు పండగే! -
ఫిట్నెస్ మ్యాజిక్ పిల్ ఏమీ కాదు
పాతికేళ్లకు పైగా ఫిట్నెస్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు యాస్మిన్ కరాచీవాలా. బాలీవుడ్ తారలకు ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉన్న యాస్మిన్‌కి ముంబైతో పాటు విదేశాల్లోనూ ఫిటెనెస్ స్టూడియోలు ఉన్నాయి.ఫిట్‌నెస్‌కు సంబంధించిన తన అనుభవాలను పుస్తకాల రూపంలో తీసుకు వచ్చి రైటర్‌గానూ గుర్తింపు పొందారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రివల్యూషనైజ్ యువర్ వర్కౌట్ కార్యక్రమానికి వచ్చిన ఈ ముంబై ఫిట్నెస్ ట్రైనర్ ‘53 ఏళ్ల వయసులోనూ చాలా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు ఆ సీక్రెట్ ఏంటో మాకూ చెప్పండి’ అంటే ఎన్నో విషయాలను మన ముందుంచారు. నంబర్ వన్ ట్రైనర్ కత్రీనా కైఫ్, దీపికా పదుకొణె, కరీనా కపూర్.. వంటి ప్రముఖ బాలీవుడ్ తారలకు నంబర్‌వన్ ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ కరాచీవాలా. జర్మన్ పిలేట్స్ కాన్సెప్ట్‌ను మన దేశంలో మొదటిసారి ప్రవేశపట్టి, బిఎఎస్ఐ సర్టిఫికెట్ పొందింది. ఎన్నో ఫ్యాషన్ అండ్ బ్యూటీ అవార్డ్‌లను సొంతం చేసుకోవడంతో పాటు వరల్డ్ ఉమెన్ లీడర్షిప్ అవార్డ్‌ను అందుకున్న ఘనత యాస్మిన్ది. స్కల్ప్›్ట అండ్ షేప్, పర్ఫెక్ట్ 10 పేరుతో తీసుకొచ్చిన పుస్తకాలు పాఠకులకు ఫిట్నెస్ జ్ఞానాన్ని అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ‘‘(నవ్వుతూ) నాకు ముగ్గురు పిల్లలున్నారు. పెద్దబ్బాయికి 26, చిన్నబ్బాయికి 23 ఏళ్లు. అమ్మాయికి పెళ్లైంది. 26 ఏళ్లుగా వ్యాయామంపై దృష్టి పెడుతున్నాను. వ్యాయామాలు నేర్పిస్తున్నాను. సరైన ఆహారం, సరైన వ్యాయామం, సరైన జీవనశైలిని అలవర్చుకుంటే ఎవ్వరైనా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉండచ్చు. ఫిట్నెస్ అనేది కేవలం బరువు తగ్గించుకోవడానికి ఉపయోగించే మ్యాజిక్ పిల్ కాదు షాప్‌కి వెళ్లి కొనుక్కోవడానికి. ఫిట్‌గా మారాలంటే కృషి చేయాల్సిందే. కృషికి మూలం నన్ను చూసి మా అబ్బాయిలు ఇద్దరూ ఫిట్నెస్ పట్ల ఆసక్తి పెంచుకున్నారు. వాళ్లూ ఈ రంగంలో బిజీగా ఉన్నారు. నచ్చింది చేయడం మన జీవనశైలి అవుతుంది. ఇష్టం లేనిది చేయడం భారం అనిపిస్తుంది. ఫిట్నెస్ అనేది ట్రెండ్ కాదు. అదొక జీవన విధానం. మనం దానిని ఎలా తీసుకుంటే, అది మనల్ని అలా మార్చేస్తుంది. నేను ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉండాలని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. నా చిన్నతనం నుంచి నేను గమనించినవాటిలో మా నాన్న రోజూ వాకింగ్, అమ్మ యోగా చేయడం చూసేదాన్ని. కానీ, (నవ్వుతూ) నేను మాత్రం చేసేదాన్ని కాదు. ఎవ్వరూ ఇష్టపడని బద్దకిష్టులలో నేనూ ఒకరిగా ఉండేదాన్ని. డిగ్రీ పూర్తయిన కొన్నాళ్లకు ఓ రోజు నా ఫ్రెండ్ హెల్త్ క్లబ్‌కి తీసుకెళ్లింది. అయిష్టంగానే అక్కడికి వెళ్లాను. ఆ హెల్త్క్లబ్కు వెళ్లే ముందు వరకు ఎన్నడూ వ్యాయామం చేసింది లేదు. ఏదో ఒక సాకుతో ఫిట్నెస్ యాక్టివిటీస్‌కి దూరంగా ఉండేదాన్ని. అలాంటిది సరదాగా హెల్త్ క్లబ్లో చేసిన ప్రయత్నాలు దారిలో పడేలా చేశాయి. అప్పటినుంచి ఇన్నేళ్లుగా నన్ను నేను మలుచుకుంటూ ఇంకొందరిని మారుస్తున్నాను. చురుకైనా మార్పులంటే.. ఫిట్‌గా ఉండటానికి, వ్యాయామంప్రారంభించాలంటే ముందు మన శరీర బలాన్ని అదేవిధంగా పరిమితులను అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా కృషి చేయాలనే జిజ్ఞాసను, నిబంధననూ బ్రెయిన్‌కు అందించాలి. మనల్ని మనం ఎలా చూసుకోవాలను కుంటున్నామో ముందు దానిని గుర్తించాలి. అప్పుడు సరైన కృషి చేయగలం. కొందరు జిమ్‌కి వెళితే వ్యాయామం సాధ్యం అనుకుంటారు. ఇంకొందరు నాకు సినిమా తారల్లాంటి శరీరం కావాలి అని కలలు కంటుంటారు. ఇలాంటివారు తమ రోజువారి యాక్టివిటీలో మార్పులు చేసుకోవాలి. బద్ధకం పోవడానికి, చురుగ్గా మారడానికి స్పోర్ట్స్ హాబీని పెంచుకోవాలి. ఫిట్నెస్, వాకర్స్ .. వంటి గ్రూపుల్లో చేరాలి. ఏదోవిధంగా ప్రతిరోజూ చురుగ్గా ఉండేలా మార్పులు చేసుకోవాలి. వీటితోపాటు రోజువారీ వదుల్చుకోలేని కొన్ని విషాలకు దూరంగా ఉండాలి. ఎలాంటి విషాలు.. చక్కెర క్యాన్సర్‌కు ఆహారం. అంతేకాదు, అనేకవ్యాధులకు ప్రధాన కారణం కూడా. చాలా మంది ఉదయాన్నే షుగర్ కలిపిన టీ లేదా కాఫీతో రోజును మొదలుపెడతారు. అదే అనారోగ్యాలకు దగ్గర చేస్తుంది. అందుకని, ముఖ్యంగా రిఫైన్డ్ షుగర్‌ని పూర్తిగా దూరం పెట్టాలి. దీనికి బదులు బెల్లం, తేనె తీసుకోవచ్చు. ఇక నూనెలో వేయించిన సమోసాలు, బోండాలు.. వంటి వేపుడు పదార్థాలు తీసుకోకూడదు. వేడుకల సమయాల్లో ‘ఏముందిలే, ఈ ఒక్కరోజుకు అంటూ ఐస్‌క్రీమ్, షుగర్ బేస్డ్ వంటి ఎన్నో పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ శరీరానికి హాని చేసేవే. సవాళ్లను అధిగమించాలంటే.. నాకు ముంబై, గుర్గావ్, ఢిల్లీ, ఇండోర్, ఢాకా, దుబాయ్‌లలో ఫిట్నెస్ స్టూడియోలు ఉన్నాయి. ఇంకా మరికొన్ని ఫిట్నెస్ స్టూడియోలుప్రారంభించాలనే లక్ష్యంగా ఉన్నాను. వ్యాయామం మొదలుపెట్టిన రోజున ఇవేవీ అప్పుడు అనుకోలేదు. బలం ఎంత అనేది బరువులు ఎత్తడంలో మాత్రమే కాదు మన లోపల ఉన్న శక్తిని గుర్తించాలి. అప్పుడు సవాళ్లను అధిగమించడం కూడా సులువు అవుతుంది. మెరుగైన ఆరోగ్యం, ఫిట్నెస్ మనల్ని శక్తి–అభివృద్ధి వైపుగా నడిపిస్తుంది. ఒక్కరోజులో ఏదీ మారదు. మనం ఎంచుకున్న మార్గంలో నిరంతరం కృషి చేస్తుంటే విజయం సొంతం అవుతుంది. శారీరక వ్యాయామం మైండ్‌ను కూడా చురుగ్గా ఉంచుతుంది కాబట్టి వాయిదా వేయకుండా ఈ రోజే దినచర్యలో భాగం చేసుకోండి’’ అని వివరించారు ఈ ఫిట్నెస్ ట్రైనర్. – నిర్మలారెడ్డి ఫొటోలు: నోముల రాజేష్ రెడ్డి -
చలిపులికి సవాలు విసురుతూ....
మైనస్ 16 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లో చలికి చేతులు కొంకర్లు పోతాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టం. అలాంటి వాతావరణంలో పుషప్‌లు చేయడం అంత వీజీ కాదు. అయితే ప్రముఖ ఫిట్నెస్ కోచ్ నేహా బంగియాకు అలాంటి వాతావరణం అవరోధం కాలేదు. కశ్మీర్‌కు వెళ్లిన నేహా అక్కడి ఆర్మీ సోల్జర్తో కలిసి స్పీడ్‌గా పుషప్‌లు చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. ‘ఇలాంటి అతిశీతల వాతావరణంలో కొన్నిరోజులు ఉండడానికే మాకు కష్టంగా అనిపించింది. మన సైనికులు మాత్రం ఇలాంటి వాతావరణాన్ని కూడా తట్టుకొని దేశంకోసం పనిచేస్తున్నారు’ అని కాప్షన్లో రాసింది నేహా బంగియా. -
స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ:తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు
కరోనా మహమ్మారి చాలామంది జీవితాల్లో తీరని దుఃఖాన్ని, సంక్షోభాన్ని మిగిల్చింది. కానీ కొంతమందిలో మాత్రం వినూత్న ఆలోచనలకు పునాది వేసింది. అలా లాక్డౌన్లో లాక్ అయిన ఒక కొత్త జంట సరికొత్త ఆలోనచలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. అతికొద్ది సమయంలోనే కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు. ఇదే రియా అండ్ రౌనక్ సక్సెస్ స్టోరీ. రియా నిహాల్ సింగ్, రౌనక్ సింగ్ ఆనంద్ వివాహ బంధంలోకి అలా అడుగు పెట్టారో లేదో 2020లో దేశం కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ మొదలైంది. దీంతో కొత్త జంట ఇంటికే పరిమితం కావడంతో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న వారి ఆశయానికి బ్రేక్ పడింది. కానీ బిజినెస్ చేయాలన్న ఆలోచన వారిని ఊరికే ఉండనీయ లేదు. ఫిట్నెస్ ఔత్సాహికులైన ఇద్దరూ హోమ్ జిమ్ని స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ తాము కాలేజీ రోజుల్లో అమెరికాలో ఉపయోగించిన స్మార్ట్ ఫిట్నెస్ పరికరాలు మార్కెట్లో అందుబాటులో లేవు. మరోవైపు పెద్దగా నాణ్యతలేని ఉత్పత్తులను కొనుగోలు చేయడమా, లేదంటే లక్షల రూపాయలు వెచ్చించి దిగుమతి చేసుకోవడమా అనే రెండు ఆప్షన్లు మాత్రమే కనిపించడంతో మీమాంసలో పడి పోయారు. ఈ క్రమంలో మార్కెట్లో తమలాంటి చాలామంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని గ్రహించారు. అప్పటికే తండ్రి ఆటో కాంపోనెంట్స్ తయారీ సంస్థకు బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రౌనక్, మార్కెట్ డిమాండ్నుచూసి, తన సొంతహోమ్ ఫిట్నెస్ పరికరాల కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అలా భార్యతో కలిసి డైరెక్ట్-టు-కస్టమర్ బ్రాండ్ ఫ్లెక్స్‌నెస్ట్ ని ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా ఇంటర్నెట్లో నాణ్యమైన ఫిట్నెస్ పరికరాలను విక్రయిస్తూ పాపులర్ అవ్వడమే కాదు. కేవలం మూడేళ్లలో ఒక బ్రాండ్ నేమ్‌ను తీసుకొచ్చారు. 2021లో ఫ్లెక్స్నెస్ట్ను ఆవిష్కృతమైంది. యోగా మ్యాట్లు,ఎడ్జస్టబుల్ డంబెల్లతో ప్రారంభమై ఆ తరువాత తొలి బ్లూటూత్ కనెక్టెడ్ ఎక్సర్సైజ్ స్పిన్ బైక్, ఫ్లెక్స్‌నెస్ట్ రోవర్స్ ట్రెడ్మిల్స్ను పరిచయం చేశారు.అలా ఏడాదిన్నరలో వారి పోర్ట్‌ఫోలియోలో దాదాపు 12 ఉత్పత్తులను జోడించారు. గుర్గావ్లో కేవలం అయిదుగురి స్టాఫ్‌తో కార్యకలాపాలు ప్రారంభించిన తొలి ఏడాదిలోనే కంపెనీ రూ.37.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. (18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్) 2022 జనవరిలోనే వారి ఆదాయం రికార్డు ఆదాయం రూ.3.83 కోట్లను సాధించారు. హోమ్ వర్కౌట్ జిమ్ ఉత్పత్తులతో టాప్‌లో నిలిచింది. ఇపుడిక రూ. 100 కోట్ల ఆదాయాన్ని ఈ జంట ఆశిస్తోంది. వీరి ఉత్పత్తుల్లో దాదాపు సగం టైర్ 1 నగరాల్లో అమ్ముడవుతున్నాయి. ప్రధానం జర్మనీ, చైనా, తైవాన్‌ల ఉత్పత్తులను విక్రయిస్తారు. ఈ సేల్స్‌లో 70 శాతం వెబ్సైట్, 30శాతం ఇతర ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌ల నుండే జరుగుతాయి. 70వేలకు పైగా కస్టమర్లను సొంతం చేసుకున్న కంపెనీ, యాప్ ద్వారా వర్చువల్ శిక్షణ తరగతులను అందిస్తారు. (జియో సినిమా షాకిచ్చిందిగా: ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ షురూ) ఫిట్నెస్ బ్రాండ్ ఫ్లెక్స్ నెస్ట్ FlexDubs లాంచ్‌తో ఆడియో మార్కెట్లోకి కూడా ప్రవేశించింది. జర్మనీలో తయారైన AI- ఎనేబుల్డ్ వాయిస్ అసిస్టెన్స్ బ్లూటూత్ ఇయర్ఫోన్లు లాంచ్ చేసింది. అమెరికాలో పరిచయం, ప్రేమ రియా నిహాల్ సింగ్ ఎమోరీ యూనివర్శిటీ నుండి ఎకనామిక్స్ పట్టా, జార్జియా విశ్వవిద్యాలయం నుంచి థియేటర్ స్టడీస్ (2012-2016)లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసింది. పాఠశాల విద్యను ఢిల్లీలోని వసంత్ వ్యాలీ స్కూల్ నుండి పూర్తి చేసింది. వ్యాపారవేత్త కావడానికి ముందు, రియా ఎన్డీటీవీలోనూ, పబ్లిక్ రిలేషన్స్ విభాగంలోనూ పనిచేసింది. రౌనక్ బర్కిలీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ , డ్యూక్ విశ్వవిద్యాలయంలో మేనేజ్మెంట్లో పీజీ చేశారు. 2015లో కాలేజీలో చదువుతున్నప్పుడు అమెరికాలో పప్రేమలో పడిన ఈ లవ్‌బర్డ్స్ 2020 జనవరిలో వివాహం చేసుకున్నారు. రౌనక్ తండ్రి కార్ కాంపోనెంట్ తయారీ కంపెనీ యజమాని. రియా కూడా ఢిల్లీలోని ప్రముఖ వ్యాపార కుటుంబం నుండి వచ్చింది. ఆమె తండ్రి గుర్మీత్ నిహాల్ సింగ్ బట్టల ఎగుమతిదారు. అలా ఇద్దిరిదీ వ్యాపార కుటుంబాల నేపథ్యం కావడంతో ఈ జంటకు మరింత కలిసి వచ్చింది. -
చీరకట్టులో.. ఆమెను తెగ తిట్టిపోస్తున్నారు
సామాజిక కళంకం(Social Stigma)..ను పక్కకు తోసేసి రాణిస్తున్న వాళ్లను ఎందరో!. అలా అన్ని రంగాల్లో మహిళల జోరు కూడా కనిపిస్తోంది. ఫిట్నెస్ మీద మక్కువ పెంచుకున్న రీనా సింగ్ వర్కవుట్ వీడియోలు ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. అందుకు ఒక ప్రత్యేక కారణ ఉంది కూడా!. ‘‘ఇది ఆరంభం మాత్రమే..’’ అంటూ గులాబీ రంగు చీరలో ఆమె వర్కవుట్స్ చేసిన వీడియో.. ఇన్‌స్టాగ్రామ్‌లో దుమ్మురేపుతోంది. చీరకట్లు వర్కవుట్స్‌కి లక్షల్లో వ్యూస్, లైకులతు రాబట్టింది ఆ వీడియో. స్వతహాగా ఫిట్నెస్ ట్రైనర్ అయిన ఆమె.. అలా రకరకాల బరువులెత్తడం, ఎక్సర్సైజులు చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 33 మిలియన్ వ్యూస్, పది లక్షల లైకులను దాటేసి వీడియో దూసుకుపోతోంది. అయితే.. అదే సమయంలో ఆమె తీరును తప్పుబడుతున్నవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇలాంటి స్టంట్లు ప్రమాదరకరంతో కూడుకున్నవని ఆమెకు సూచిస్తున్నారు. ఇలా చీరకట్టులో చేయడం సాహసమేనని, స్ఫూర్తిగా తీసుకుని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రమాదకరంగా మారొచ్చని కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వీడియోలు చేయడం ఆపేయాలంటూ ఆమెను మందలిస్తున్నారు. View this post on Instagram A post shared by Reena Singh (@reenasinghfitness) View this post on Instagram A post shared by Reena Singh (@reenasinghfitness) -
టాలీవుడ్ నటిపై అత్యాచారం!
టాలీవుడ్‌కు చెందిన ఓ నటిపై ఫిట్నెస్ ట్రైనర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో కలకలం రేపింది. ప్రేమ పేరుతో నమ్మించి లైంగికంగా లొంగదీసుకున్నాడని సదరు నటి పోలీసుకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్‌కు చెందిన ఓ నటికి ముంబైలోని కూఫీ పరేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిత్య కపూర్ అనే ఫిట్నెస్ ట్రైనర్‌తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెను లైంగికంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అదిగో..ఇదిగో అంటూ మాట దాటవేస్తూ వచ్చాడు.ఈ విషయంపై ఇటీవల ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. ఆదిత్య కపూర్ ఆమెపై దాడి చేశాడు. అసభ్యపదజాలంతో తిడుతూ విచక్షణరహితంగా కొట్టాడు. (చదవండి: అందుకే ‘నారాయణ నారాయణ’ అని అన్నాను : నాగార్జున) అంతేకాదు ఇంకోసారి పెళ్లి ప్రస్తావన తెస్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో సదరు నటి పోలీసులను ఆశ్రయించారు. తనతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి వాటితో తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఆదిత్య కపూర్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
బతకడం కష్టమని పెదవి విరిచారు.. కట్‌చేస్తే
''ఎన్ని కష్టాలు కవ్వించినా సరే...మనిషి గుండెలో ఆత్మవిశ్వాసం అనే జెండా రెపరెపలాడుతూనే ఉండాలి. పెదాలపై చిరునవ్వు ధగధగమని మెరుస్తూనే ఉండాలి..'' హరియాణాలోని ఝజ్జార్లో ఆ వీధికి వెళ్లి ‘చురుకైన పిల్లాడు ఎవరు?’ అనే ప్రశ్నకు అన్ని జవాబులు ఒకే దిక్కు వెళ్లేవి. ఆ అబ్బాయి పేరు తిన్కేష్ కౌశిక్. తొమ్మిదేళ్ల వయసులో దురదృష్టకరమైన రోజు ఒక ప్రమాదంలో రెండు కాళ్లు, ఎడమ చేయిని పోగోట్టుకున్నాడు. బతకడం కష్టం అని పెదవి విరిచారు వైద్యులు. ‘కచ్చితంగా బతుకుతాడు’ అనే ఆత్మబలంతో ఉన్నారు తల్లిదండ్రులు. చివరికి వారి ఆత్మబలమే నెగ్గింది. చికిత్స జరిగిన మూడు సంవత్సరాల కాలంలో పిల్లాడిని కంటికి రెప్పలా కాచుకున్నారు. ఆ తరువాత....అమ్మ సహాయంతో రోజూ బడికి వెళ్లడం మొదలుపెట్టాడు కౌశిక్. పాఠాలు వినడం తప్ప స్నేహితులతో ఆటలు లేవు. అయితే స్నేహితులెప్పుడూ అతడిని చిన్నచూపు చూడలేదు. రకరకాల ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూ కూడా కౌశిక్‌కు కృత్రిమ కాలు సమకూర్చారు తల్లిదండ్రులు. దీనివల్ల బరువైన పనులు చేసే అవకాశం లేనప్పటికి తనకు తానుగా కాలేజికి వెళ్లడానికి ఉపకరించింది. డిగ్రీ పూర్తయిన తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు కౌశిక్. శారీరకశ్రమ లేకపోవడంతో బాగా బరువు పెరిగాడు. ఈ బరువు తనకు అదనపు సమస్యగా మారింది. దీంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. కొంతకాలం తరువాత... గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన రెండు కిలోమీటర్ల మారథాన్‌లో తాను పాల్గొన్న వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. అది వైరల్ అయింది. ఈ వీడియోను చూసి స్పందించిన హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ ప్రోస్థటిక్ లెగ్స్‌ను స్పాన్సర్ చేసింది. ఇది తన జీవితంలో టర్నింగ్‌పాయింట్‌గా నిలిచింది.ఫిట్నెస్ ట్రైనర్ కావాలనేది తన లక్ష్యంగా మారింది. నాగ్‌పుర్ కేంద్రంగా పనిచేసే ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ కమ్యూనిటీ ‘ఫిట్టర్’తో తన ఫిట్నెస్ జర్నీ మొదలైంది. స్విమ్మింగ్ నుంచి సైకిలింగ్ వరకు అక్కడ శిక్షణ తీసుకున్నాడు. ఈ క్రమంలో నొప్పుల బాధలు ఇంతా అంతా కాదు. అయితే ట్రైనర్స్ ఉత్తేజకరమైన మాటలతో అతడిని నిరాశకు లోనుకానివ్వలేదు. సింగిల్ హ్యాండ్‌తో పవర్ఫుల్ స్ట్రెంత్‌ను ఎలా సమకూర్చుకోవచ్చు అనే కోణంలో కోచ్ కమల్శర్మ ఎన్నో వీడియోలను తనకు షేర్ చేశాడు. అవి తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ఫిట్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్‌లో పాల్గొనడం కౌశిక్‌కు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఐసిఎన్–ఇండియాకు అథ్లెట్ అంబాసిడర్‌గా నియామకం కావడంతో తనలో గట్టి ఆత్మవిశ్వాసానికి పునాది పడింది. ఇక నేపాల్‌లో బంగీ జంప్ చేయడం తన ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడికో తీసుకెళ్లింది. లద్దాఖ్‌లో దివ్యాంగుల కోసం ఫిట్నెస్ క్లాసులు నిర్వహించాడు కౌశిక్. తన అనుభవాలను వారితో పంచుకున్నాడు. అపారమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగించాడు. ఫిట్నెస్ ట్రైనర్ కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. అయితే తన కల అక్కడితో ఆగిపోలేదు. ఆస్ట్రేలియాలో పర్వతారోహణ చేయాలనేది తన తాజా కల. గట్టి సంకల్పబలం ఉన్నవారికి తమ కలను నెరవేర్చుకోవడం కష్టమేమీ కాదు కదా! -
'ఆ హీరో ఫిజిక్ ది బెస్ట్..రష్మికను బలవంతంగా గెంటేస్తా'
‘‘ప్రేక్షకులకు, అభిమానులకు వాళ్లు బిగ్ స్టార్స్. నేను థియేటర్లో సినిమా చూసినప్పుడూ నాకు వాళ్లు బిగ్ స్టార్సే. కానీ నా జిమ్‌కి వస్తే స్టూడెంట్స్’’ అంటున్నారు కుల్దీప్ సేథీ. చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ, కార్తికేయ, రష్మికా మందన్నా, రాశీ ఖన్నా... ఇలా పలువురు స్టార్స్‌కు ఫిట్నెస్ గురు ఆయన. స్టార్ స్టూడెంట్స్‌తో తన టీచింగ్ అనుభవాలను కుల్దీప్ ఇలా పంచుకున్నారు. ♦ 2004లో రామ్‌చరణ్ పరిచయమయ్యారు. అప్పుడు ఆయనకు ట్రైనింగ్ మొదలుపెట్టాను. ‘చిరుత’ సమయంలో బ్యాంకాక్‌కు వెళ్లి ట్రైన్ చేశాను. ‘మగధీర’ అప్పుడు రాజమౌళి సార్ ఓ స్కెచ్ ఇచ్చారు. పాత్ర ప్రకారం షోల్డర్స్ ఉండాలి, చెస్ట్ ఎక్కువ ఉండకూడదు వంటి జాగ్రత్తలతో చరణ్ ఫిజిక్‌ని తీర్చిదిద్దాను. అలా చరణ్‌కి నేను నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవిని కూడా ట్రైన్ చేసే లక్ దక్కింది. ♦ చిరంజీవి డూప్స్ లేకుండా యాక్షన్ సీన్స్ చేస్తుంటారు. అందువల్ల ఫిజికల్‌గా తరచూ ఇబ్బందులు పడుతుంటారు. అయితే కెమెరా ముందైనా, జిమ్లోనైనా ఆ కష్టం ఆయనలో కనిపించేది కాదు. ఇప్పటికీ చాలామంది యూత్ ఆయనలా వర్కవుట్స్ చేయలేరు. ♦ స్టార్స్ అందరూ నాకిష్టమే. అయితే విజయ్ దేవరకొండతో మరింత కనెక్ట్ అయ్యాను. విజయ్‌కి ‘లైగర్’కి ట్రైన్ చేస్తున్నాను. విజయ్ ఎన్ని వర్కవుట్స్ ఇచ్చినా నిశ్శబ్దంగా చేసేస్తాడు. అయితే అతను పూర్ ఈటర్. తినమని నేనే ఫోర్స్ చేస్తుంటా. ఎంత పెద్ద స్టార్ అయినా మన నుంచి స్పెషల్ ట్రీట్మెంట్ కోరుకోడు. ♦ కార్తికేయ ఫిజిక్ ది బెస్ట్. అతన్ని నేను ట్రైన్ చేస్తున్నాను కానీ.. తనను చూసి నేను ఇన్స్పైర్ అవుతుంటాను. ♦ చాలా త్వరగా తాను చేసే వర్కవుట్స్ బోర్ కొట్టేస్తాయి రాఖీ ఖన్నాకి. ఎప్పటికప్పడు మారుస్తూ ఉండాలి. ఇక రష్మిక అయితే చాలు.. చాలు... అంటున్నా ఇంకా వర్కవుట్స్ చేస్తానంటుంది. బలవంతంగా గెట్ అవుట్ అంటూ జిమ్ నుంచి పంపేస్తా (నవ్వుతూ). చదవండి : హీరోయిన్ త్రిషను అరెస్ట్ చేయాలి..హిందూ సంఘాల ఫిర్యాదు చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించిన హీరో సుదీప్ -
చీరకట్టులో పల్టీలు కొడుతూ.. నెటిజన్లు ఫిదా!
జైపూర్: భారతీయ సాంప్రదాయంలో చీరకట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అమ్మాయిల అందం చీర కట్టులో డబుల్ అవుతుందనడంలో సందేహం లేదు. అదే చీర కట్టులో స్టంట్స్ చేస్తే ఎలా ఉంటుంది? సివంగి దూకినట్టు కదా..! మరి ఆ సివంగి తలకిందులుగా జంప్ చేస్తే..! తాజాగా ఓ యువతి చీర కట్టులో చేసిన స్టంట్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎరుపు రంగు చీరకట్టుకుని బ్యాక్‌ఫ్లిప్ చేస్తున్న యువతిని చూసిన చుట్టు పక్కల వారు నోళ్లు వెళ్లబెట్టారు. కాగా జైపూర్‌కి చెందిన మిషా శర్మ అనే ఫిట్నెస్ ట్రైనర్ ఈ ఫీట్‌ను చేసి ఔరా అనిపించింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 3 కోట్ల మంది నెటిజన్లు వీక్షించగా.. లక్షల మంది లైక్ కొట్టి, కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘యువతి చేసిన ఈ ఫీట్ నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి.’’ అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ‘‘అబ్బా! ఫీట్ అదిరిపోయింది. నా గుండె జారిపోయింది.’’ అంటూ చమత్కరించాడు. కాగా నెటిజన్ల కామెంట్స్ పై మిషా శర్మ స్పందిస్తూ.. ‘‘3 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే సరియైన మార్గదర్శకత్వం లేకుండా ఈ విన్యాసాలు ప్రదర్శిస్తే ప్రమాదకరంగా ఉంటాయి. అందువల్ల, మీరు శిక్షణ లేకుండా అలాంటి ఫ్లిప్స్ చేయవద్దు’’ అని ఆమె సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by MISHA SHARMA 🇮🇳 (@mishaa_official_) -
అత్తింటి వాళ్లు, భర్త కూడా వ్యతిరేకమే.. విడాకులు.. ఆపై
చదువులు పూర్తై ఉద్యోగం వచ్చి, పెళ్లయ్యేంత వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడే సాంప్రదాయం ఉన్న మనదేశంలో... జార్ఖండ్‌లోని సింద్రీకి చెందిన సుదీప్త మండల్ పదహారేళ్ల వయసులో సొంతూరు వదిలి ఎవరికీ భారం కాకుండా తన కాళ్ల మీద తను నిలబడేందుకు ఢిల్లీ చేరింది. అక్కడ ఓ ప్లాట్‌ను అద్దెకు తీసుకుని ఉంటూ... ఓ న్యూస్పేపర్లో జర్నలిస్టుగా చేరింది. ఏడాది తరువాత జర్నలిస్టు ఉద్యోగాన్ని మానేసి, లైవ్ థియేటరికల్ షో ‘జంగూరా’లో ఆర్టిస్ట్‌గా 1400 షోలకు పనిచేసింది. మరోపక్క ఫిట్నెస్ క్లాసులు చెబుతుండేది. 2014లో వివాహం అవ్వడంతో ఢిల్లీ నుంచి మకాం ముంబైకి మారింది సుదీప్త. పెళ్లయ్యాక జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేందుకు అత్తింటివారు ఒప్పుకునేవారు కాదు. భర్త కూడా సుదీప్తను తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఆమె మాట వినక పోవడంతో భార్యాభర్తల ఘర్షణ హింసాత్మకంగా మారుతుండేది. ఇద్దరి మధ్యా గొడవలు తారాస్థాయికి చేరడంతో... భర్త నుంచి విడిపోవాలనుకుని విడాకులకు అప్లై చేసింది. కానీ అత్తింటి వారికి విడాకులు ఇవ్వడం ఇష్టం లేక దాదాపు రెండేళ్లపాటు సాగదీసి తరువాత విడాకులు ఇచ్చారు. సెలబ్రెటీ ట్రైనర్‌గా.. మానసికంగానే గాక ఆర్థికంగానూ దెబ్బతిన్న సుదీప్త కొద్ది బ్రేక్ తర్వాత ఎలాగైనా మంచి ఫిట్నెస్ ట్రైనర్‌గా ఎదగాలని నిర్ణయించుకుంది... తాను దాచుకున్న డబ్బుతో ఫిట్నెస్ నైపుణ్యాలైన జుంబా, పైలట్స్, ఫంక్షనల్ ట్రైనింగ్‌లో శిక్షణ తీసుకుంది. శిక్షణ పూర్తయిన దగ్గర నుంచి డైలీ వివిధ రకాల మెంటార్స్‌కు ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇచ్చేది. సరికొత్త ఫిట్నెస్ ఐడియాలతో సుదీప్త బాగా పాపులర్ అయ్యింది. ఆమె దగ్గర శిక్షణ తీసుకునేవారిలో సెలబ్రిటీలు కూడా ఉండడం విశేషం. ముంబైలో సెలబ్రెటీ ఫిట్ నెస్ కోచ్‌గా, అష్టాంగ యోగా టీచర్‌గా సుదీప్త రాణిస్తోంది. ఎకోఫ్రెండ్లీ... పర్యావరణానికి హానీ జరగకుండా జీవించాలని నిర్ణయించుకుని 2018 నుంచి ఎకో ఫ్రెండ్లీ జీవన శైలిని అనుసరించడం మొదలు పెట్టింది సుదీప్త. నూనె వాడని వీగన్ ఆహారం తీసుకోవడంతో పాటు, తన దగ్గర ఉన్న బట్టలు, పుస్తకాలు, ఫర్నీచర్‌లో సగభాగాన్ని దానం చేసింది. పోషకాహారం, లైఫ్‌స్టైల్ కోచింగ్ గురించి మరింత లోతుగా తెలుçసుకుని ఫిటెనెస్, హోలిస్టిక్ వెల్నెస్ వీడియోలను అప్ లోడ్ చేస్తోంది. తను చేయగలిగిన సాయం చేయడంతోపాటు, ఫిట్‌గా ఉండాలని గోల్స్ పెట్టుకునేవారికి ఆన్లైన్ ఫిట్నెస్ క్లాసులు నిర్వహించడం, వ్యక్తిగత సెషన్లు నిర్వహిస్తూ జుంబా, పార్కుర్, ఫంక్షనల్ ఫిట్‌నెస్‌లపై శిక్షణ ఇస్తోంది. ‘‘ప్రతిమహిళలో సహజసిద్ధమైన బలం, శక్తి లోతుగా దాగి ఉంటాయి. వాటిని మనం మేల్కొల్పినప్పుడే ఏదైనా సాధించగలుగుతాం’’ అని సుదీప్త మహిళలకు పిలుపునిస్తోంది. -
జిమ్ ట్రైనర్‌తో మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న నటి
నటి, మోడల్ పార్వతీ నాయర్‌కు సోషల్ మీడియాలో బాగానే క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్లతో కుర్రాల మతులు పోగొడుతుంది ఈ మలమాళీ ముద్దుగుమ్మ. తాజాగా మాల్దీవులకు వెళ్లిన భామ అక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో జిమ్ ట్రైనర్ మైఖేల్‌తో కలిసి పార్వతీ చేసిన రొమాంటిక్ స్టంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో మైఖేల్‌తో కలిసి ఓ వీడియో తీస్తుండగా, అతను సడెన్‌గా పార్వతిని గాల్లోకి పైకెత్తాడు. దీంతో షాక్ అయిన నటి..ఇది సడెన్ సర్ప్రైజ్ అంటూ ఆ వీడియోను షేర్ చేసింది. ట్రైనర్ మైఖేల్ సైతం ఈ వీడియోను షేర్ చేస్తూ..సడెన్‌గా ఆమెను లిఫ్ట్ చేయగానే పార్వతీ చాలా షాకింగ్‌కి గురయ్యిందని చెప్పుకొచ్చాడు. కాగా గత కొన్ని రోజులుగా పలువురు సెలబ్రిటీలు హాలీడే ట్రిప్ పేరుతో మాల్దీవులకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో కరోనా విజృంభిస్తున్నా ఏమాత్రం భాద్యత లేకుండా సెలబ్రిటీలు ఇలా విహారయాత్రలకు వెళ్లడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) చదవండి : అల్లు అర్జున్ను దారుణంగా అవమానించిన దిల్ రాజు! అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్ -
‘మహేశ్‌బాబు వయసు తగ్గుతోంది’
మహేశ్‌బాబు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంటున్నారు ఆయన ఫిట్నెస్ ట్రైనర్ మినాష్ గబ్రిఏల్. మహేశ్ గురించి మినాష్ మాట్లాడుతూ– ‘‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ కోసం మేం దుబాయ్ వచ్చి 30 రోజులయింది. ఇక్కడి కొచ్చాక ఒక్కరోజు కూడా జిమ్‌ను మిస్ చేయలేదు మహేశ్. షూటింగ్ పూర్తి చేసుకోవడం, వర్కౌట్ చేయడం ఆయన దినచర్య. వర్కౌట్స్ సాయంత్రాలు చేస్తున్నాం. సెట్లో ఎంత శ్రమించినా వర్కౌట్స్ దగ్గర రాజీపడరు. 2019 నుంచి ఆయనకు ఫిట్నెస్ ట్రైనర్‌గా చేస్తున్నాను. గాయాలతో బాధపడి, అందులో నుంచి బయటపడి మరింత ఫిట్‌గా మారుతున్న ఆయన జర్నీ అద్భుతం. అందరి వయసు పెరుగుతున్నా మహేశ్ వయసు తగ్గుతోంది’’ అన్నారు. View this post on Instagram A post shared by Minash Gabriel (@minash.gabriel) -
కండలు అమ్మాయిలకూ అందమే..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సినిమా తారలు, టీవీ, సోషల్ మీడియా సెలబ్రిటీస్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా పెద్ద పెద్ద కంపెనీలు నియమించుకుంటూ ఉంటాయి. సాధారణంగా ఫిట్నెస్ ట్రైనర్స్‌కు ఈ అవకాశం దక్కడం అరుదు. ఈ నేపధ్యంలో సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్, హైదరాబాద్‌కు చెందిన కిరణ్ డెంబ్లా... కాలిఫోర్నియా ఆల్మండ్స్కు ప్రచారకర్తగా మారడం విశేషం. ఇటీవల తాప్సీ పన్ను, పూజా హెగ్డే తదితర హీరోయిన్ల మస్క్యులర్ ఫిజిక్ మెట్రో నగరాల్లో నివసించే యువతులకు బాగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కిరణ్ డెంబ్లాని సదరు సంస్థ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు కరోనా దెబ్బకు కుదేలైన హైదరాబాద్ ఫిట్నెస్ ఇండస్ట్రీకి, ట్రైనర్లకు కిరణ్ డెంబ్లా నియామకం కొంత ఊపిరిలూదిందని చెప్పొచ్చు. ఈ నేపధ్యంలో కాలిఫోర్నియా ఆల్మండ్స్ ఆధ్వర్యంలో నగరం కేంద్రంగా నిర్వహించిన వర్చువల్ సదస్సులో మహిళా బాడీ బిల్డర్, సిక్స్‌ప్యాక్ తో ఆకట్టుకునే కిరణ్ డెంబ్లా పాల్గొని యువతులకు స్ఫూర్తిని అందించారు. కండలు తిరిగిన శరీరం పురుషులకు మాత్రమే అందాన్నిస్తుందని అనుకోవడం సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు.. అమ్మాయిలూ, మధ్య వయసు మహిళలు కూడా మస్క్యులర్ బాడీతో అందంగా ఉంటారన్నారు. అదంతా చూసే మైండ్‌లో ఉంటుదని ఆరోగ్యకరమైన చర్మం, కండరాలు ఎవరికైనా అవసరమే అన్నారామె. కరోనా తర్వాత వ్యక్తిగతంగా మాత్రమే కాదు కుటుంబమంతా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాల్సిన పరిస్థితులొచ్చాయన్న ఆమె.. వ్యాధినిరోధక శక్తి పెరిగేందుకు ప్రాణయామ వంటి శ్వాస కోస వ్యాయామాలు, విటమిన్ ఇ, జింక్, ఐరన్, వర్కవుట్‌కి ముందూ తర్వాత తగినంత ప్రొటీన్స్ కోసం ఆల్మండ్స్, ఎగ్ వైట్స్..వంటివి తీసుకోవాలని సూచించారు. మహిళలు జిమ్‌కి వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే స్క్వాట్స్, సిటప్స్, లంజెస్, యాబ్స్, జంపింగ్ జాక్స్... చేసుకోవచ్చునని, కేవలం రెసిస్టెన్స్ బ్యాండ్‌తో కూడా బోలెడు వర్కవుట్లు చేయవచ్చునని కూడా ఆమె స్పష్టం చేశారు. చదవండి: స్టైలిష్‌గా కాబోయే అమ్మ .. -
‘జిమ్’దగీ బదల్‌గయా..
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా నగర ఫిట్నెస్ రంగం రూపు రేఖలు మార్చేస్తోంది. వ్యాయామ ప్రియులలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తూ శిక్షకులు, జిమ్ నిర్వాహకులను కొత్త రూట్ పట్టిస్తోంది. ఓ వైపు జిమ్ సెంటర్లను మూత పడేలా చేస్తూనే మరోవైపు శిక్షకులలో మాత్రం జోష్ నింపుతోంది. సాక్షి, సిటీబ్యూరో కరోనా మహమ్మారి దెబ్బకు అమాంతం కుప్పకూలిన సిటీ ఫిట్నెస్ రంగం.. లాక్డౌన్ సడలింపుల తర్వాత కూడా పూర్తిగా కోలుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మరోవైపు ఈ రంగంలో కొత్త కొత్త మార్పులు రావడానికి కరోనా బాటలు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. చదవండి: సిటీలో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు.. జిమ్స్ ‘లాక్’... నగరంలో ఏడాదికి ముందు కనిపించిన జిమ్స్ సందడి ఇప్పుడు కానరావడం లేదు. ఏడాది క్రితం వరకూ నగరంలో రోజుకో జిమ్, నెలకో ఫిట్నెస్ సెంటర్ అన్నట్టుగా ప్రారంభాలు జరుగుతుండేవి. ఇప్పుడు అది తిరగబడింది. ఎటు చూసినా జిమ్/పిట్నెస్ సెంటర్ల మూసివేతే కనపడుతోంది. దేశవ్యాప్తంగా పేరొందిన ఓ బ్రాండెడ్ జిమ్ కంపెనీ నగరంలోని తమ అన్ని శాఖలనూ మూసివేసింది. దాదాపు రూ.500 కోట్లకు పైగా బ్యాంకు రుణాలు చెల్లించలేని పరిస్థితిలో దేశవ్యాప్తంగా ఉన్న 200 హెల్త్ క్లబ్స్‌తో పాటు సిటీలో కూడా క్లోజ్ చేసేసింది. జూబ్లీహిల్స్‌లోని బీట్స్ జిమ్ మూతపడింది. రోడ్ నెం 36లోని చట్నీస్ హోటల్ ఎదురుంగా ఉండే మరో ఫేమస్ జిమ్, దేశవ్యాప్తంగా బ్రాంచిలు నిర్వహిస్తూ నాలుగేళ్ల క్రితం నగరంలోనూ ఏర్పాటైన మరో జిమ్, 24గంటలూ సేవలందిస్తానంటూ అందుబాటులోకి వచ్చిన మరో అత్యాధునిక హెల్త్ క్లబ్ ఇంకా అనేక బ్రాండెడ్ ఫిట్నెస్ సెంటర్లు తీవ్రమైన నష్టాలతో నడుస్తున్నాయి. ఇప్పటికే ఇవి బ్యాంకు రుణాల విషయంలో కేసులు ఎదుర్కొంటున్నాయి. ట్రైనర్స్ ఖుష్... కరోనా కారణంగా ఫిట్నెస్ ఇండస్ట్రీ కుదేలైనప్పటికీ జిమ్‌లో సభ్యులకు వర్కవుట్ శిక్షణ అందించే ట్రైనర్స్‌కు మాత్రం కలిసి వచ్చింది. లాక్ డౌన్ తర్వాత చాలా మంది ట్రైనర్లకు పర్సనల్ ట్రైనింగ్ ఆఫర్లు వెల్లువెత్తాయి. కస్టమర్ల ఇళ్లకు వెళ్లి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా జిమ్‌లో నెలవారీ జీతానికి కనీసం ఐదు నుంచి పది రెట్లు ఆదాయం, దానితో పాటే ఎవరి దగ్గరా పనిచేసే అవసరం లేకపోవడం వంటి లాభాలు కలుగుతుండడంతో అనుభవజ్ఞులైన ట్రైనర్లకు కరోనా పరోక్షంగా మేలు చేసిందనాలి. లాక్ డౌన్ సడలింపుల తర్వాత జిమ్‌లు తెరుచుకున్నా... పలువురు ట్రైనర్లు తమ ఉద్యోగాలకు గుడ్‌బై చెప్పేశారు. అంతేకాకుండా జిమ్స్‌లో శిక్షణ అందించేటప్పుడు పలువురు మెంబర్స్‌తో ఏర్పడిన ఫ్రెండ్షిప్ తో వారికి పర్సనల్ ట్రైనర్లుగా అవకాశాలు చేజిక్కించుకున్నారు. ఈ కారణంగా జిమ్స్‌కు అటు మెంబర్స్‌తో పాటు ఇటు ట్రైనర్స్ కూడా తగ్గిపోయారు. పరికరాల బిజినెస్ జోష్... డంబెల్స్, బెంచ్‌ప్రెస్, ట్రెడ్ మిల్, బార్రాడ్స్...వగైరా ఎక్విప్మెంట్ వ్యాపారానికి కరోనా ఊపునిచ్చింది. ఎన్నడూ లేనంతగా హోమ్ జిమ్స్ ఏర్పాటు చేసుకోవడానికి సిటిజనులు ఆసక్తి చూపించడంతో జిమ్ ఎక్విప్మెంట్ వ్యాపారం ఊపందుకుంది. ముఖ్యంగా ట్రెడ్మిల్, వర్కవుట్ సైకిల్స్ బాగా సేల్ అయ్యాయని నగరానికి చెందిన ఓ ఎక్విప్మెంట్ సంస్థ ప్రతినిధి చెప్పారు. నెట్..వర్కవుట్... ఇంట్లోనే వ్యాయామాలు చేయడానికి నగరవాసులు అలవాటుపడుతూ వర్కవుట్ గురించి తెలుసుకోవడానికి యూ ట్యూబ్ లో వీడియోలను వీక్షిస్తున్నారు. యోగా, ఎరోబిక్స్, జుంబా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, బాడీ వెయిట్ వర్కవుట్స్... వంటివి చేసే విధానాల గురించి తెలుగులో తెలియజెప్పే వీడియోలకు డిమాండ్ పెరిగింది. దీంతో నగరానికి చెందిన పలువురు జిమ్ ట్రైనర్లు యూ ట్యూబ్ చానెల్స్ ప్రారంభించారు. చిన్న, మధ్య తరహా జిమ్స్ పడుతూ లేస్తూ నడుస్తున్నప్పటికీ..మొత్తం మీద వ్యాపార పరంగా చూస్తే మాత్రం ఫిట్నెస్ రంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందనేది నిర్వివాదం. అయితే ఇది రూ.కోట్ల టర్నోవర్ చేసే సంస్థలకే ఎక్కువ నష్టాలు తెచ్చి పెట్టింది. ఆరోగ్యార్థుల్లో అవగాహన పెరగడం, హోమ్ జిమ్స్ పట్ల ఆసక్తి వంటి మంచి మార్పులకూ కరోనా దోహదం చేసింది. ఈ నష్టాల నుంచి కోలుకుని మరో ఏడాదిలోపే ఫిట్నెస్ ఇండస్ట్రీ పూర్వవైభవం సంతరించుకోడం తథ్యమని ఫిట్ నెస్ ట్రైనర్ విజయ్ గంధం ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఫిట్నెస్ ట్రైనర్ మృతి
-
సెలబ్రిటీల ఫిట్నెస్ ట్రైనర్ మృతి
చండీఘడ్: మోడల్, బాడీ బిల్డర్, సెలబ్రిటీల ఫిట్నెస్ ట్రైనర్ సత్నాం ఖత్రా(31) హఠాత్తుగా మరణించారు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు విడిచినట్లు అతని కోచ్ రోహిష్ ఖేరా వెల్లడించారు. ఆయన మరణం సినిమా పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. 1989లో పంజాబ్‌లోని భాడ్సన్లో ఓ గ్రామంలో సత్నాం ఖత్రా జన్మించారు. మెలితిరిగిన కండలతో వీరుడిగా కనిపించే ఆయన మోడల్‌గా రాణించారు. ఖత్రా ఫిట్నెస్ క్లబ్‌కు ఫిట్నెస్ కోచ్‌గా వ్యవహరించేవారు, ఎందరో సెలబ్రిటీలకు ఫిట్నెస్ ట్రైనర్‌గా పని చేశారు. అదే సమయంలో డ్రగ్స్ బారిన పడ్డారు. ఈ విషయం తెలిసి అతని కుటుంబ సభ్యులు వెంటనే సత్నాంను డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించారు. అక్కడ చికిత్స తీసుకుని రికవరీ అయిన సత్నాం మాదక ద్రవ్యాలకు గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత మరింత ఫోకస్‌తో తన వృత్తిలో తిరిగి చేరారు. (చదవండి: రణ్‌బీర్ జిరాక్స్ ఇక లేరు) ఈ సందర్భంగా శారీరక వ్యాయామం చేయాలని చెప్తూనే డ్రగ్స్ వంటి అనారోగ్యాన్ని కలిగించే అలవాట్లను మానుకోవాలని యువతకు సందేశమిచ్చేవారు. త్వరలోనే ఆయన స్వంత బ్రాండ్‌తో ఫిట్నెస్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేశారు. ఇంతలోనే ఆయన అకాల మరణం చెందడం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు లక్షలకు పైగా ఫాలోయర్లను సంపాదించుకున్న సత్నాం మరణంపై అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ఫిట్నెస్ ఉన్న వ్యక్తికి గుండెపోటు రావడమేంటని సందేహాలు వెలిబుచ్చుతున్నారు. డ్రగ్స్ మాఫియానే అతని చావుకు కారణమయ్యుంటుందా? అని చర్చిస్తున్నారు. (చదవండి: సంజనపై రియా కామెంట్స్: నటి ఆగ్రహం) -
ఇలాంటి డ్రెస్ వేసుకొని పార్క్‌కు వస్తారా?
బెంగుళూరు : పార్క్‌కు జాగింగ్ చేద్దామని వచ్చిన ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ దంపతులకు చేదు అనుభవం ఎదురైన ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి మహిళ ధరించిన దుస్తులపై అభ్యంతరం తెలుపుతూ నానా రభస చేశాడు. అయితే ఆ దంపతులు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న బందువుకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బెంగుళూరులోని జేపీ పార్క్‌కు ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఒక మహిళ తన భర్తతో కలిసి జాగింగ్‌కు వచ్చింది. ఆమె జిమ్‌లో ఫిట్నెస్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన వార్మ్ప్ ప్రారంభించగా, తన భర్త జాగింగ్‌కు వెళ్లాడు. తన వార్మప్ పూర్తయిన తర్వాత స్వెటర్‌ను విప్పేసి ఆమె భర్త కోసం ఎదురుచూస్తుంది. కాగా సదరు మహిళ ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్ కావడంతో తన వర్కౌట్లను ఆమె భర్త వీడియాలు తీసి యూట్యూబ్‌లో షేర్ చేస్తుంటాడు. ఇదే సమయంలో టూ వీలర్‌పై ఒక యాబై ఏళ్ల వయసున్న వ్యక్తి పార్క్‌కి వచ్చాడు. మహిళ వేసుకున్న దుస్తులను గమనించి తన బండిని పార్క్ చేసి ఆ వ్యక్తి మహిళ దగ్గరకు వచ్చాడు. 'ఇలాంటి దుస్తులు వేసుకొని ఎవరైనా పార్క్‌కు వస్తారా.. ఇది క్లబ్ కాదు ప్యామిలీలు వచ్చే చోటు' అంటూ ఆమెపై విరుచుకుపడ్డాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మహిళ భర్త వ్యక్తి దగ్గరకు వచ్చి తన భార్య ఏమి అభ్యంతరకరమైన దుస్తులు వేసుకోలేదని పేర్కొన్నాడు. అయితే ఇదేమి వినకుండా సదరు వ్యక్తి వారిద్దరిపై దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్యంగా మాట్లాడాడు.అంతటితో ఊరుకోకుండా పక్కనున్న వారి దగ్గరికి వెళ్లి మహిళ వేసుకొచ్చిన దుస్తులపై చర్చించాడు. అయితే ఇదే విషయమై మహిళ మాట్లాడుతూ.. 'ఒక ఫిట్నెస్ ఇన్‌స్ట్రక్టర్‌గా నేను వేసుకొచ్చిన దుస్తులు అంత అసభ్యకరంగా ఏమి లేవు. అయినా ఇన్ని రోజులుగా పార్క్‌కు వస్తున్నా ఎవరు తన దుస్తులపై అభ్యంతరం చెప్పలేదు. కానీ ఆ వ్యక్తి ఎందుకలా ప్రవర్తించాడో మాకు అర్థం కాలేదంటూ' తెలిపారు. ఆ వ్యక్తి ప్రవర్తనపై సదరు మహిళ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న బందువుకు తెలిపింది. దీంతో అతను ఈ విషయాన్ని డీసీపీ ఎన్ శశికుమార్‌కు చెప్పడంతో పోలీసులు వెళ్లి ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. అయితే ఆ వ్యక్తి మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణ చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు చేయకుండానే వివాదం సద్దుమణిగింది. -
ఇది మా విజయధారణ
‘హిజాబ్’ అంటే స్త్రీలు ధరించే శిరోవస్త్రం. కొందరి దృష్టిలో ఇది చాందసానికి ప్రతీక. కొందరి దృష్టిలో ఇది అస్తిత్వానికి, ఆత్మవిశ్వాసానికి ఆలంబన. ‘హిజాబ్’ ధరించే చదువులో, ఉద్యోగంలో, ఉపాధిలో విజయం సాధించగలమని నిరూపిస్తున్నారు కొందరు స్త్రీలు. ముంబైకి చెందిన సాదియాది కూడా అలాంటి విజయగాథే. హిజాబ్ కేవలం మా వస్త్రధారణ కాదు.. విజయధారణ అంటుంది ఆమె. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ సినిమా గుర్తుంది కదా. హిందీ సినిమా. అందులో ఒక అమ్మాయి తండ్రి అభిప్రాయానికి వ్యతిరేకంగా, అతనికి తెలియకుండా, తల్లి సహాయంతో గిటార్ కొనుక్కొని.. హిజాబే కాదు.. బుర్ఖా కూడా వేసుకొని పాటలు పాడుతూ యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ సీక్రెట్‌గా సూపర్ స్టార్ అవుతుంది. రియల్ లైఫ్‌లో కూడా అలాంటి హిజాబ్ స్టార్ ఉంది. జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌గా సాదియా. (ఇన్సెట్లో) సాదియా ముంబై– జోగేశ్వరి (వెస్ట్)లోని ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్’ జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తూ చేయిస్తూ చెమటలు కక్కుతూ తల మీద నుంచి హిజాబ్ (శిరో వస్త్రం) తీయకుండా జిమ్ చేస్తున్న వాళ్లకు సూచనలిస్తూ కనిపించే ఆ అమ్మాయి పేరు సాదియా. ఈమె ఫిట్నెస్ ట్రైనర్ మాత్రమే కాదు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పిస్తుంది. హిజాబ్‌తో ఇటువంటి పనుల్లో ఆడపిల్లలు కనిపించడం అరుదు. కాని సాదియా ఇది నాకు మామూలే అన్నట్టు ఉంంది. ‘అవును.. ఈ సంప్రదాయ వస్త్రధారణ నా ప్రోగ్రెస్‌కు అడ్డుగా అనిపించలేదెప్పుడూ. పైగా నాలో ధైర్యాన్ని నింపింది. అడ్డంకులను ఎదుర్కొంటూ నా లక్ష్యాన్ని చేరుకునే సాహసాన్నిచ్చింది’ అని చెప్తుంది. ‘ఐయామ్ ఏ విన్నర్ విత్ హిజాబ్’ అంటుంది సాదియా. మిగిలిన వివరాలు.. సాదియా వాళ్లది మధ్యతరగతి కుటుంబం. తండ్రి రియల్ ఎస్టేట్ ఏజెంట్. తల్లి స్కూల్ టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. నిజానికి ఈ ఫిట్నెస్ ట్రైనింగ్, మార్షల్ఆర్ట్స్ సాదియా వాళ్లక్క సైమా చేసేదట. తల్లిదండ్రులు ‘మనింట్లో ఆడపిల్లలకు ఇవి తగవు’ అని వారించేసరికి సైమా సైలెంట్ అయిపోయింది. కాని అక్క చేసిన విన్యాసాలు చూస్తూ పెరిగిన సాదియా మాత్రం ఆ అభిరుచిని కెరీర్‌గా మలచుకొని కొనసాగిస్తోంది. ‘వేరే చెప్పక్కర్లేదు కదా.. ఈ రోజు నేనిలా ఉండడానికి స్ఫూర్తి మా అక్కయ్యే అని’ అంటుంది సాదియా. మరి తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదా? ‘చెప్పారు. ఏ సంప్రదాయం రీత్యా వాళ్లు వద్దన్నారో ఆ సంప్రదాయంతోనే కంటిన్యూ చేస్తానని స్థిరంగా చెప్పా. అలా చెప్పే ధైర్యమూ ఇదిగో నా ఈ హిజాబే ఇచ్చింది’ అంటుంది హిజాబ్‌ను చూపిస్తూ. ఆ సాహసంతోనే అమ్మానాన్నను ఒప్పించుకుంది. అయితే ఫిట్నెస్ పట్ల సాదియాకున్న ప్రీతి, మార్షల్ ఆర్ట్స్ అంటే ఆమెకు ఉన్న మక్కువను చూసిన ఒక మౌల్వి (మత గురువు) ‘అమ్మాయిలు వినమ్రంగా, నాజూగ్గా ఉండాలి కాని ఈ వ్యాయామాలు అవీ చేస్తూ అబ్బాయిలా ఉండకూడదు’ అంటూ నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశాడు. ‘నేను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికే ఇవి చేస్తున్నాను తప్ప కండలు చూపించుకోవడానిక్కాదు’ అని నిర్మొహమాటంగా జవాబిచ్చింది మౌల్వీకి. సమాజంలో ఉన్న భ్రమలకు వ్యతిరేకంగా పోరాడ్డం సాదియా నైజం. ఇదంతా హిజాబ్ చలవే అంటుంది మళ్లీ నవ్వుతూ. ఆమె ధైర్యానికి, శరీరాన్ని స్ప్రింగ్‌లా వంచే ఆమె విన్యా సాలకు ఇన్‌స్టాగ్రామ్‌లో మూడువేల అయిదువందల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆమె పరిచయం ఎందుకు? ఫిబ్రవరి ఒకటవ తేదీ– వరల్డ్ హిజాబ్ డే. ఆ సందర్భంగా ముంబైకి చెందిన ‘అల్ హాది’ అనే స్వచ్ఛంద సంస్థ హిజాబ్ విజయగాథల సమావేశం ఒకటి నిర్వహించనుంది. ‘హిజాబ్ సాధికారతకు చిహ్నం కాని అణచివేతకు కాదు’ అనే పేరుతో ముంబైలోనే వైబీ చవాన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని చేయనుంది. అందులో సాదియాలా హిజాబ్ ధరించి విజయం సాధించిన మరికొందరు స్త్రీలను సత్కరించనుంది. వీరిలో కాలిగ్రఫి ఆర్టిస్ట్ సల్వా రసూల్, కరాటే రెఫ్రీ షహీన్ అఖ్తర్, విద్యావేత్త అస్మా జైదీ, రాజకీయవేత్త ఫాతీమా ముజఫ్ఫర్, నృత్యకారిణి, బ్లాగర్ హలీమా షైఖ్ వంటి హిజాబ్ విన్నర్స్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సాదియా పాల్గొన తన హిజాబ్ విజయ గాథను వినిపించి తనలాంటి యువతకు స్ఫూర్తినివ్వబోతోంది. ‘మనం ఎంచుకున్న జీవితాన్ని మనం దక్కించుకోవడం అవసరం. సంప్రదాయం ఎప్పుడూ ఏ అడ్డంకినీ సృష్టించదు. సంప్రదాయాన్ని అర్థం చేసుకుంటే దాని ఆసరాతోనే ముందుకు సాగొచ్చు’ అని చెబుతోంది సాదియా. వీరిద్దరూ... చిన్నప్పటి నుంచీ చిత్రకళ పట్ల ఆసక్తి పెంచుకున్న సల్వా రసూల్ తన అభిరుచికి తగ్గట్లే సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చిత్రకళలో పట్టా పుచ్చుకున్నారు. ఈమె అరబిక్ ఆర్ట్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కాలిగ్రఫి కళలో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సల్వా ‘ఈ కళలో నాకు స్ఫూర్తి ఈ దేశ వారసత్వ సంపదే’ అంటుంది. ఆమె వేసిన చిత్రాలు సౌత్ ఆఫ్రికా, పశ్చిమాసియా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా వంటి దేశాల్లో గొప్ప గొప్ప భవంతులకు రాజసాన్నిస్తున్నాయి. సల్వా రసూల్ ఇక అస్మా జైదీ టీచర్ ట్రైనర్. రచయిత్రి. చదువు మీద పిల్లలకు ఆసక్తి కలిగించేందుకు ఆమె చేపట్టిన ‘చదువుదాం’ అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ‘బోధన అనేది నా ఉద్యోగం కాదు.. నా ప్యాషన్. మన దేశ భవిష్యత్తు పిల్లలే. వాళ్లను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. దానికే నా జీవితం అంకితం’ అంటుంది అస్మా జైది. అస్మా జైదీ -
పాక్ క్రికెటర్లకు... బిర్యానీ, స్వీట్స్ బంద్
లాహోర్: ఇకపై పాకిస్తాన్ క్రికెటర్ల ఆహార నియమావళి పూర్తిగా మారిపోనుంది. ఫిట్నెస్ ప్రమాణాలు పెంచి ఆటగాళ్లు మైదానంలో మరింత చురుగ్గా ఉండేలా చేసేందుకు బిర్యానీతో పాటు నూనె ఎక్కువగా వాడి వండే రెడ్ మీట్, మిఠాయిలకు దూరంగా ఉంచాలని హెడ్ కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బా ఉల్ హక్ యోచిస్తున్నాడు. జాతీయ శిబిరంతో పాటు దేశవాళీ టోరీ్నల్లో ఈ మేరకు డైట్ అమలు చేయాలని అతడు కోరాడు. వన్డే ప్రపంచ కప్‌లో జూన్ 16న టీమిండియాతో కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ క్రికెటర్లు పిజ్జాలు–బర్గర్లు తింటున్న వీడియోను అభిమాని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జంక్ ఫుడ్ నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనికితోడు కప్‌లో పాక్ ఆటగాళ్ల ఫిట్నెస్ పైనా జోకులు పేలాయి. వీటన్నిటి కారణంగా మిస్బా... డైట్‌పై దృష్టి పెట్టాడు. పాక్ ఈ నెల 27 నుంచి స్వదేశంలో శ్రీలంకతో వన్డే, టి20 సిరీస్ ఆడనుంది. -
వంద రోజుల చాలెంజ్!
‘‘సవాళ్లను స్వీకరించడం నా జాబ్ హక్కు. అందుకు ఎందాకైనా వెళ్తాను’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. అనడమే కాదు ఆ చాలెంజ్‌కు గడువు కూడా ఫిక్స్ చేసేశారు. విషయమేంటంటే వంద రోజుల్లో ఫిట్‌గా మారిపోవాలని కాజల్ నిశ్చయించుకున్నారు. అందుకే ఈ చాలెంజ్ కూడా టేకప్ చేశారు. ఈ చాలెంజ్ గురించి కాజల్ మాట్లాడుతూ – ‘‘యాక్టర్సే కాదు అందరూ ఫిట్‌గా ఉండాలి. నా శరీరాన్ని నేను అద్భుతంగా తయారు చేసుకోవాలనుకుంటున్నాను. అందులో భాగంగా ఈ చాలెంజ్ తీసుకుంటున్నాను. నా కోచ్ శ్రీరామ్ పర్యవేక్షణలో దీన్ని మొదలుపెడుతున్నాను. ఏం తినాలి? ఏ ఎక్సర్సైజ్లు చేయాలి? అనేవి చాలా శ్రమతో కూడుకున్న పనులు. వాటిని కూడా చాలా తేలిక చేస్తున్నారు ఆయన. ఈ చాలెంజ్‌లో అసహజత్వానికి చోటే లేదు. కేవలం న్యాచురల్‌గా లభించే న్యూట్రిషన్స్తోనే ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నాను. ఎలాంటి మార్పు కనిపిస్తుందో వంద రోజుల్లో చూద్దాం’’ అని పేర్కొన్నారు. -
ఫిజిక్ ఉంటే ఫిట్నెస్ ఉన్నట్టు కాదు..
సాక్షి, సిటీబ్యూరో: టాలీవుడ్, బాలీవుడ్ హీరోలైన మహేశ్‌బాబు, రితిక్ రోషన్, రణ్వీర్ సింగ్‌లకు ఆయన ఫిట్నెస్ మంత్రం నేర్పిస్తున్నాడు. ఆ రంగంలో తనదైన ముద్రతోనే ముందుకు సాగుతున్నాడు. నాలుగేళ్లుగా నగరానికి వస్తూ పోతున్నాడు. ఆయన ఎవరో కాదు ఫిట్నెస్ ట్రెయినర్ ముస్తఫా అహ్మద్. ప్రస్తుతం ముంబైలో ఫిట్నెస్ సెంటర్ నిర్వహిస్తున్న ముస్తఫా అహ్మద్ ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు ఇటీవల నగరానికి వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు ఫిట్నెస్ సూచనలు చేశారు. అవి ఆయన మాటల్లోనే.. ఫిజిగ్గా ఉంటేనే సరిపోదు.. ఫిజిక్ ఉంటే ఫిట్నెస్ ఉన్నట్టు కాదు. ఫిజిక్ ఫిట్‌నెస్‌లో ఒక భాగం మాత్రమే. ఆరోగ్యంగా ఫీల్ అవుతూ ఒక ఆరోగ్యవంతుడు చేయగలిగిన పనులన్నీ చేయడమే ఫిట్నెస్. అరగంటలో 5 కి.మీ పరిగెత్తడం, కొంత బరువు ఎత్తగలగడం, ఫ్రీగా శరీరాన్ని కదిలించగలగడం ఇవన్నీ కలిపితే ఫిట్నెస్. ఎవరైతే సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉంటారో వారికి తక్కువ శిక్షణ అవసరం. శరీరానికి అవసరమైన ఆహారం కరెక్టుగా తీసుకుంటే శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా, చలాకీగా ఉండవచ్చు. మూడు ముఖ్య సూచనలు.. 7 నుంచి 8 గంటల నిద్ర మొదటిది. రెండోది స్థానికంగా దొరికే ఆహారం తినటం. మనం తినే ఆహారంలో 60 శాతం లోకల్‌గా దొరికేది తినాలి. వెస్ట్రన్ ఆహార పదార్థాల జోలికి వెళ్లవద్దు. స్థానిక ఆహారం వల్ల శరీరానికి ఎక్కువ మేలు కలుగుతుంది. మూడోది పనిచేసే చోట అయినా, ఇంట్లో అయినా కదులుతూ, నడుస్తూ ఉండటం. జిమ్‌కి వెళ్లకపోయినా ఫర్వాలేదు. మెట్లు వాడవచ్చు. నడవండి. దుకాణానికి వెళ్లి మీరే సరుకులు తెచ్చుకోండి. ఫ్యాట్ ఫ్రీ అంటే కొనేయొద్దు.. చాలా మంది ఇళ్లలో, ఫ్రిజ్‌లలో అనేక ఫ్యాట్ ఫ్రీ ఫుడ్ ప్రొడక్టŠస్ కొని తెచ్చి పెట్టుకుంటారు. ఫ్యాట్ అన్ని సార్లూ చెడ్డది కాదు. నెయ్యితో మంచి ఫ్యాట్ లభిస్తుంది, నెయ్యితో వంటలు చేసుకోవచ్చు. ఈ మధ్య చాలా మంది అర్థం చేసుకుంటున్నారు. నెమ్మదిగా మార్పు వస్తోంది. ఫిట్‌నెస్‌లో హైదరాబాద్.. నవాబ్‌ల నగరం ఇది. మిగతా నగరాలతో పోల్చితే ఇక్కడ ఫిట్నెస్ గురించి పెద్దగా పట్టించుకోరు అనే మాట మారుతోంది. ఇక్కడ మార్పు వస్తోంది. ఫిట్నెస్ విషయంలో ఢిల్లీ, ముంబై స్థాయికి హైదరాబాద్ మరో 3, 4 ఏళ్లలో చేరుకోవచ్చు. ఇక్కడి వారికి ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంంది. ఇలా చేస్తే మంచిది.. ⇔ సీట్లో కూర్చుని, వర్క్‌ప్లేస్‌లో కూడా ఫిట్నెస్ పొందడానికి ఎన్నో చెయ్యొచ్చు. ఇంటర్నెట్లో వేల మార్గాలున్నాయి. ⇔ ఫిట్నెస్ కావాలంటే స్కిల్ కన్నా విల్ అవసరం. ఎవరైనా ఏమైనా అనుకుంటారనే ఆలోచన అనవసరం. మీరు మీ కోసం వర్క్ చేయండి. ⇔ టీనేజ్‌లో, ఏ ఏజ్‌లో అయినా ఏం తింటున్నారో చూసుకోండి. అవసరమైన మార్పులు చేసుకోండి. తర్వాత మంచి ట్రెయినర్ ఉన్న జిమ్‌లో చేరండి. 6 నెలల్లో మీకు నేర్పిస్తారు. తర్వాత మీరు స్వయంగా చేసుకోవచ్చు. ⇔ ఇక సన్నగా, లావుగా లేదా అనుకున్న తీరులో శరీరాకృతి మారడానికి వారి వారి జెనెటిక్స్, మెటబాలిజమ్‌ని బట్టి టైం పడుతుంది. కానీ కరెక్టు ఆహారం, వ్యాయామ శిక్షణ వల్ల మార్పులు మాత్రం2, 3 నెలల్లోనే కనిపిస్తాయి. ⇔ ఇక చిన్న పిల్లలకి క్రీడలు అలవాటు చేస్తే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఆటోమెటిక్‌గా పెరుగుతుంది. ఇది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. టీనేజ్‌లో పిల్లలను తప్పకుండా ఆటల్లోకి పంపాలి. ⇔ గర్భిణులు సైతం వ్యాయామం చేయొచ్చు. డెలివరీ తర్వాత 40 రోజుల తర్వాత ఇంట్లోనే చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేసుకోవచ్చు.