ఐస్‌క్రీమ్‌లలో షుగర్ ఎంత ఉంటుందో తెలిసిందే. బరువు తగ్గాలనుకునేవారు వాటిని అస్సలు దగ్గరకు రానియ్యరు. అయితే దీపిక పదుకొనే ఫిట్‌నెస్ ట్రైయినర్ మాత్రం ఐస్‌క్రీమ్‌లను ఆస్వాదిస్తూ బరువు తగ్గొచ్చని చెబుతోంది. అందుకోసం ఏం చేయాలో సవివరంగా చెప్పడమే గాకుండా ఆ ఐస్‌క్రీమ్‌లను ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలిపింది.
సెలబ్రిటీ ఫిట్‌నెస్ శిక్షకురాలు యాస్మిన్ కరాచీవాలా ఐస్‌క్రీంని ఇలా చేసుకుని తింటే కచ్చితంగా బరువు తగ్గుతారని చెబుతోంది. అదేంటి ఐస్‌క్రీంతో బరువు తగ్గడమా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే హెల్తీగా చేసుకుని తింటే కచ్చితంగా బరవు తగ్గుతారని అంటోంది యాస్మిన్.
ఆమె కత్రినా కైఫ్, కరీనా కపూర్, దీపీక పదుకొనే వంటి బాలీవుడ్ ప్రముఖుల ఫిట్‌నెస్ ట్రైనర్ ఆమె. ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడిని వారంటూ ఉండరు. ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేయడం కోసం ఐస్‌క్రీమ్‌ని త్యాగం చేయాల్సిన పనిలేదంటోంది యాస్మిన్. బరువు తగ్గేలా ఐస్‌క్రీంని చేసుకుని తింటే చాలని చెబుతోంది. ఇలా చేస్తే ఆరోగ్యానకి ఆరోగ్యం, మంచి ఫిట్‌నెస్ కూడా మీ సొంతమని నమ్మకంగా చెబుతోంది. ఇంతకీ ఎలా చేయాలంటే..?
కావాల్సిన పదార్థాలు..
యాపిల్స్:4
డార్క్ చాక్లెట్ సిరప్: తగినంత
మాపుల్ సిరప్
బిట్స్ వాల్‌నెట్‌లు
ఐస్‌క్రీం మౌల్డ్‌లు
తయారీ విధానం:
నాలుగు యాపిల్స్‌ని తొక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత వాటిని మెత్తగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కరిగించిన డార్క్ చాక్లెట్‌ని తీసుకోవాలి. దీన్ని ఉడికించిన యాపిల్ ముక్కల్లో వేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐస్‌క్రీమ్ ఫ్లేవర్ వచ్చేలా మాపుల్ సిరఫ్ వేయాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఐస్‌క్రీం మౌల్డ్‌లలో పోసి అలంకరణగా వాల్‌నెట్‌లు వేసి డీప్ ఫ్రీజ్‌లో పెట్టండి అంతే ఆరోగ్యకరమైన ఐస్‌క్రీం డెజర్ట్ రెడీ. పైగా ఇందులో ఎలాంటి షుగర్ వినయోగించ లేదు కాబట్టి బరువు పెరుగుతామన్న భయం ఉండదు. అందులో ఉండే యాపిల్స్ బరువుని అందుపులో ఉంచుతుంది. పైగా రుచి రచికి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి ఐస్‌క్రీమ్ డెజర్ట్‌ని మీరు కూడా ట్రై చేయండి.
(చదవండి: వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?)
Comments
Please login to add a commentAdd a comment