Mumbai Fitness Trainer Arrested For Molested By Tollywood Actress, Details Inside - Sakshi
Sakshi News home page

Tollywood Actress: టాలీవుడ్‌ నటిపై ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అత్యాచారం!

Published Wed, Sep 14 2022 2:18 PM | Last Updated on Sat, Sep 17 2022 1:51 PM

Tollywood Actress Molested By Mumbai Fitness Trainer - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

టాలీవుడ్‌కు చెందిన ఓ నటిపై ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో కలకలం రేపింది. ప్రేమ పేరుతో నమ్మించి లైంగికంగా లొంగదీసుకున్నాడని సదరు నటి పోలీసుకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్‌కు చెందిన ఓ నటికి ముంబైలోని కూఫీ పరేడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదిత్య కపూర్‌ అనే ఫిట్‌నెస్‌ ట్రైనర్‌తో పరిచయం ఏర్పడింది.

కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెను లైంగికంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అదిగో..ఇదిగో అంటూ మాట దాటవేస్తూ వచ్చాడు.ఈ విషయంపై ఇటీవల ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. ఆదిత్య కపూర్‌ ఆమెపై దాడి చేశాడు. అసభ్యపదజాలంతో తిడుతూ విచక్షణరహితంగా కొట్టాడు.

(చదవండి: అందుకే ‘నారాయణ నారాయణ’ అని అన్నాను : నాగార్జున)

అంతేకాదు ఇంకోసారి పెళ్లి ప్రస్తావన తెస్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో సదరు నటి పోలీసులను ఆశ్రయించారు. తనతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి వాటితో తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఆదిత్య కపూర్‌ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement