
మైనస్ 16 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్‌లో చలికి చేతులు కొంకర్లు పోతాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టం. అలాంటి వాతావరణంలో పుషప్‌లు చేయడం అంత వీజీ కాదు. అయితే ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ నేహా బంగియాకు అలాంటి వాతావరణం అవరోధం కాలేదు.
కశ్మీర్‌కు వెళ్లిన నేహా అక్కడి ఆర్మీ సోల్జర్‌తో కలిసి స్పీడ్‌గా పుషప్‌లు చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. ‘ఇలాంటి అతిశీతల వాతావరణంలో కొన్నిరోజులు ఉండడానికే మాకు కష్టంగా అనిపించింది. మన సైనికులు మాత్రం ఇలాంటి వాతావరణాన్ని కూడా తట్టుకొని దేశంకోసం పనిచేస్తున్నారు’ అని కాప్షన్‌లో రాసింది నేహా బంగియా.
Comments
Please login to add a commentAdd a comment