Army soldiers
-
లఢక్: ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశృతి.. ఐదుగురు జవాన్లు మృతి
లఢక్: దేశ సరిహద్దుల్లోని లఢక్‌లో ఇండియన్ ఆర్మీ నిర్వహించిన యుద్ధ విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. యుద్ధ ట్యాంక్ ఓ నది దాటుతూ విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా నీటీ ప్రవాహం పెరిగింది.Indian Army T-72 Tank with Mine Trawler in Ladakh near LAC.. pic.twitter.com/A0rDfJY2rK— Vivek Singh (@VivekSi85847001) June 2, 2024 దీంతో యుద్ధట్యాంక్‌లో ఉన్న ఐదుగురు జవాన్లు నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈఘటన లేహ్‌కు 148 కిలోమీటర్ల దూరంలో దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో టీ-72 యుద్ధ ట్యాంక్‌కు ప్రమాదం జరిగినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ‘‘ ప్రమాద సమయంలో ఐదుగురు ఆర్మీ జవాన్లు యుద్ధట్యాంక్‌లో ఉన్నారు. ఒకరు జూనియర్ కమిషన్డ్ అధికారి, నలుగురు జవాన్లు ఉన్నారు. గాలింపు చర్యల్లో ఒక్క జవాన్ మృతదేహం లభించింది. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’’ అని రక్షణ శాఖ తెలిపింది. గతేడాది ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్.. లేహ్ జిల్లాలోని కియారీ సమీపంతో లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో జూనియర్ కమిషన్డ్ అధికారితో సహా తొమ్మిది మంది సైనికులు మృతి చెందారు. -
ఆర్మీ జవాన్ల విషాదాంతం
కాశీబుగ్గ : దేశరక్షణలో సేవలందిస్తున్న ఇద్దరు ఆర్మీ జవాన్లు వేర్వేరు కారణాలతో మృత్యువాతపడ్డారు. ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సాయం కోసం వేడుకుంటూ హృదయ విదారకరంగా మృతిచెందగా.. మరొకరు తాను విధులు నిర్వహిస్తున్న చోటే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు. దీంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. లారీ కింద నలిగిపోయి.. సోంపేట మండలం జీడిపుట్టుగ గ్రామానికి చెందిన చెల్లూరి చైతన్య (28) ఇటీవల సీఆర్పీఎఫ్ జవాన్‌గా ఎంపికయ్యాడు. శిక్షణ పూర్తి చేసుకుని సెలవు నిమిత్తం స్వగ్రామానికి వచ్చాడు. పలాసలో ఉంటున్న తన పెద్దమ్మను కలిసి ఆశీర్వాదం తీసుకునేందుకు మంగళవారం బైక్‌పై బయలుదేరాడు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కోసంగిపురం జాతీయ రహదారి వంతెన దిగువ ప్రాంతానికి వచ్చే సరికి ఇసుక లారీ ఢీకొట్టింది. చక్రాలమధ్య ఇరుక్కుపోవడంతో సగభాగం నుజ్జయిపోయి విలవిల్లాడాడు. తనను రక్షించాలని వేడుకున్నా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్సు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడ్ని పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అధిక మొత్తంలో రక్తాన్ని కోల్పోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చైతన్య మృతి చెందాడు. చైతన్య తండ్రి మరణించగా.. తల్లి కష్టపడి ఇద్దరు కుమారులను చదివించింది. మరో సోదరుడు తేజ చదువుతున్నాడు. చైతన్యకు ఉద్యోగం రావడంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా మారాడు. ఇంతలోనే విధి కన్నెర్రచేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగిందో.. పలాస మండలం టెక్కలిపట్నం పంచాయతీ మోదుగులపుట్టి గ్రామం కొత్తవీధికి చెందిన మద్దిల జోగారావు (40) జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్ యూనిట్లో జేసీఓ కేడర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్య చేసుకున్నట్లు మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. జోగారావుకు తండ్రి ఇది వరకే మరణించారు. తల్లి ఆదెమ్మ, భార్య హేమాకుమారి, టెన్త్ చదువుతున్న కుమార్తె చాందిని, ఎనిమిదో తరగతి చదువుతున్న లక్ష్మివరప్రసాద్లు గ్రామంలోనే ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. జమ్మూ కాశ్మీర్ నుంచి బుధవారం సాయంత్రానికి మృతదేహం స్వగ్రామానికి చేరుకోనుందని సమాచారం. -
చలిపులికి సవాలు విసురుతూ....
మైనస్ 16 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లో చలికి చేతులు కొంకర్లు పోతాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టం. అలాంటి వాతావరణంలో పుషప్‌లు చేయడం అంత వీజీ కాదు. అయితే ప్రముఖ ఫిట్నెస్ కోచ్ నేహా బంగియాకు అలాంటి వాతావరణం అవరోధం కాలేదు. కశ్మీర్‌కు వెళ్లిన నేహా అక్కడి ఆర్మీ సోల్జర్తో కలిసి స్పీడ్‌గా పుషప్‌లు చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. ‘ఇలాంటి అతిశీతల వాతావరణంలో కొన్నిరోజులు ఉండడానికే మాకు కష్టంగా అనిపించింది. మన సైనికులు మాత్రం ఇలాంటి వాతావరణాన్ని కూడా తట్టుకొని దేశంకోసం పనిచేస్తున్నారు’ అని కాప్షన్లో రాసింది నేహా బంగియా. -
ఆర్మీ జవాన్ కిడ్నాప్.. హత్య
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో సాయుధ ముఠా ఒకటి ఆర్మీ జవాన్‌ను పొట్టనబెట్టుకుంది. రాష్ట్రంలోని ఇంఫాల్ పశి్చమ జిల్లా తరుంగ్ గ్రామానికి చెందిన సిపాయి సెర్తో థంగ్‌థంగ్ కొమ్.. కంగ్పొక్పి జిల్లా లీమఖోంగ్లోని ఆర్మీ డిఫెన్స్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన ప్లటూన్‌లో విధులు నిర్వర్తిస్తన్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన సెలవుపై స్వగ్రామానికి చేరుకున్నారు. శనివారం ఉదయం ఇంట్లో ఉన్న ఆయనను గుర్తు తెలియని సాయుధులు తుపాకీతో బెదిరించి తమ వాహనంలో తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం ఖునింగ్‌థెక్ గ్రామ సమీపంలో నుదుటిపై బుల్లెట్ గాయంతో ఆయన విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించారు. -
ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో నమ్మించి, యువతిని మోసం చేసిన ఆర్మీ ఉద్యోగి
సాక్షి, వికారాబాద్: సమాజంలో అందరికీ స్ఫూర్తిగా నిలవాల్సిన ఆర్మీ ఉద్యోగి ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన దోమ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఐనాపూర్‌కు చెందిన యువతి (20)తో దాదాపూర్‌కు చెందిన ఆర్మీ ఉద్యోగి రామకృష్ణ (24)కు సంవత్సరం క్రితం ఫేస్ బుక్‌లో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. వారం క్రితం స్వగ్రామానికి వచ్చిన రామకృష్ణ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో వీరి ప్రేమ శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి రామకృష్ణ యువతికి ఫోన్ చేసి గ్రామ శివారులోకి తీసుకెళ్లగా అది గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని పట్టుకున్నారు. దీంతో గ్రామస్తుల సమక్షంలో పెళ్లి విషయం మాట్లాడే ప్రయత్నం చేశారు. రామకృష్ణ వ్యవహారశైలి అనుమానాస్పదంగా కనిపించడంతో మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు కాపీను ఎస్ఐ చింపివేశారని బాధితురాలు ఆరోపించారు. కేసును నీరుగార్చే యత్నం రామకృష్ణ తనను మోసం చేశారని ఫిర్యాదు చేయడానికి వస్తే అతని బంధువు కానిస్టేబుల్ మాటలను నమ్మి ఫిర్యాదు కాపీని చించివేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఉన్నతాధికారులు రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎస్ఐ విశ్వజన్‌ను వివరణ కోరగా.. బాధితురాలు ఫిర్యాదు మేరకు రామకృష్ణపై 376, 420 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: కదులుతున్న డొంక -
తైవాన్‌లో పెరుగుతున్న టెన్షన్... ఉక్రెయిన్‌లా పోరు సాగించలేం
Taiwan's previous government reduced compulsory service from one year: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్ నాన్సీ తైవాన్ పర్యటన ఎంతటి ఉద్రిక్తలకు దారితీసిందో తెలిసిందే. నాన్సీ పర్యటనతో చైనా యుద్ధానికి సై అంటూ వార్నింగ్‌లు ఇస్తూ.. తైవాన్ సరిహద్దు, జలసంధిలో పెద్ద ఎత్తున్న సైనిక కసరత్తులు, సైనిక విన్యాసాలు చేపట్టింది. ప్రపంచ దేశాలకు మరో యుద్ధం మొదలవుతుందేమో అన్నంత భయాన్ని కలిగించింది చైనా. సాక్షాత్తు అమెరికానే ఇది తమ వ్యక్తిగత సందర్శనని చెబుతున్నప్పటికీ చైనా శాంతించ లేదు. పైగా అక్కడ తైవాన్ సరిహద్దుల వెంబడి తమ సైనికులను మోహరింపచేసి.... అన్ని పనులు పూర్తి చేశాం, ఏ క్షణమైన యుద్ధానికి రెడీ అంటూ పెద్ద బాంబు పేల్చింది. దీంతో తైవాన్‌లో సర్వత్ర భయాలు, ఆందోళనలు మొదలయ్యాయి. వాస్తవానికి ఎప్పటికైన చైనా తమ దేశంపై దండయాత్ర చేసి లాగేసుకుంటుందని భయపుడుతూనే ఉంది తైవాన్. కానీ ఇప్పుడూ చైనా తైవాన్ సరిహద్దుల్లో సాగిస్తున్న తాజా పరిణామాలతో ఆ భయాలు మరింత అధికమయ్యాయి. గతంలో తైవాన్ స్వచ్ఛంద దళాన్ని సృష్టించే లక్ష్యంతో ఒక ఏడాది నిర్బంధ సేవను అమలు చేసింది. కానీ ఇప్పుడు ఆ నిర్బంధ సేవను నాలుగు నెలలకు తగ్గించింది. వాస్తవానికి ఈ నాలుగు నెలల సమయం నిర్బంధ సైనిక శిక్షణకు సరిపోదు. ఈ మేరకు ఒక హెన్నీ చెంగ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంజెంట్ మాట్లాడుతూ..తాను నాలుగు నెలల సైనిక శిక్షణ పూర్తి చేశాను కానీ ఎక్కువ కాలం రాత పనిలోనే గడిపినట్లు చెబుతున్నాడు. తమ పని యుద్ధం చేయడం కాబట్టి తుపాకి పట్టుకుని కాల్చడం నేర్పిస్తే సరిపోతుంది కానీ ఆ శిక్షణ ఇవ్వలేదని వాపోయాడు. అదీగాక ప్రస్తుతం తైవాన్‌లో సైనిక బలగం కూడా తక్కువగానే ఉంది. దీంతో తైవాన్ అధ్యక్షురాలు యంత్రాంగం త్సాయ్ ఇంగ్-వెన్ సైనిక సేవనను పునరుద్ధరించాలా లేదా అనేదానిపై తీవ్ర సందిగ్ధంలో ఉంది. తైవాన్ నేషనల్ డిఫెన్స్ ప్రకారం సైనిక శిక్షణను పెంచడం తోపాటు జెట్ విమానాలు, యాంటీ షిప్ క్షిపణులు పెద్ద మొత్తంలో ఇప్పటికే తైవాన్ కొనుగోలు చేసింది కానీ అవి ఏ మాత్రం సరిపోవని తేల్చి చెప్పింది. అదీగాక ఉక్రెయన్లా యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు తైవాన్ ప్రజలు సిద్ధంగా లేరని తైపీ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ చెబుతున్నారు. అంతేకాదు రైఫిల్ పట్టుకోవడమే కాదు, శిక్షణ ద్వారా సముహంగా యుద్ధ పరిస్థితులను ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలి అప్పుడే వారికి భవిష్యత్తులో ప్రతిఘటించాలనే ఆశ ఉంటుందన్నారు. ఏది ఏదీమైన చైనా తైవాన్‌ని తీవ్ర భయాందోళనలు గురిచేసి సంకటస్థితిలోకి నెట్టేసింది, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలయడం లేదని తైవాన్ ఆర్మీ ఆవేదనగా పేర్కొంది. (చదవండి: -
అసలేం జరిగింది.. 7.30కు కుటుంబంతో ఫోన్ మాట్లాడాడు.. 12 గంటలు అయ్యేసరికి..
సాక్షి,నందిగాం: మండలంలోని మొండ్రాయివలస పంచాయతీ సుబ్బమ్మపేటకు చెందిన ఆర్మీ జవాన్ కోనారి ధర్మారావు(37) తను విధులు నిర్వహిస్తున్న అరుణాచల్ ప్రదేశ్‌లో ఆత్మహ త్య చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోనారి సూరయ్య, సాయమ్మ దంపతులకు ఇద్దరు మగ పిల్లల్లో చిన్న వాడైన ధర్మారావు 2003లో ఆర్మీలో చేరారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో మూడేళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల గ్రామంలో జరిగిన సంబరాలకు 50 రోజులు సెలవుపై వచ్చి జూన్ 26న ఇంటి నుంచి బయల్దేరి విధులకు వెళ్లారు. ఈ నెల 2న ఉదయం 7.30కు భార్య, కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం 12 గంటలకు అధికారులు ధర్మారావు ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తను కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. భార్య, కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండే ధర్మారావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియడం లేదు. ఆర్మీ అధికారులు మృతదేహాన్ని సోమవారం ఉదయం సుబ్బమ్మపేటకు తీసుకువచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య పార్వతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ధర్మారావు సోదరుడు కూడా గతంలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ఇలా బలవన్మరణాలకు పాల్పడడంతో స్థానికులు విచారం వ్యక్తం చేశారు. చదవండి: ఎన్హెచ్ఏఐ కొత్త కార్యాచరణ.. పార్కింగ్ స్థలం లేకపోతే మూతే -
కశ్మీర్లో కాల్పులు, ముగ్గురు జవాన్ల వీర మరణం
కశ్మీర్ : జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లతో పాటు ఒక బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందారు. ఆపరేషన్‌లో భాగంగా ఎల్ఓసీకి సమీపంలోని మాచిల్ సెక్టార్ వద్ద ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాగా శనివారం అర్ధరాత్రి అనుమానాస్పద కదలికలు ఉన్నట్లు గుర్తించిన పెట్రోలింగ్ బలగాలు ఆ ప్రాంతంలో నిఘాను ఏర్పాటు చేశాయి. ఇలా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. -
పౌర రక్షణే ధ్యేయంగా పంచప్రాణాలు పణంగా...
కల్నల్ శర్మ.. కూతురికి వంద ప్రామిస్‌లు చేశాడు. మేజర్ అనూజ్.. భార్యకు ‘లవ్యూ’ చెబుతూనే ఉన్నాడు. ఎస్సై సాగిర్.. పిల్లల్ని ఈద్ ప్రార్థన మర్చిపోవద్దన్నాడు. జవాన్లు రాజేశ్, దినేశ్.. ప్రతిజ్ఞ చేసి మరీ ఆర్మీకి వచ్చారు. శనివారం... జమ్మూ–కశ్మీర్లో.. భారీ ఉగ్రపోరు..! పౌరుల్ని రక్షించేందుకు ప్రాణాలు వదిలారు వీళ్లైదుగురు. ప్రామిస్‌లు, ప్రేమ, ప్రార్థన, ప్రతిజ్ఞ.. ఏమైనట్లు? నెరవేరినట్లే. ప్రాణ జ్యోతులు.. కళ్ల వెలుగులైనట్లే. ఉత్తర కశ్మీర్ అడవుల్లోకి నలుగురు ముష్కరులు దిగబడ్డారని మే 1న ఇంటిలిజెన్స్ రిపోర్ట్! గాలింపు మొదలైంది. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ–కశ్మీర్ పోలీసులు చాంగిముల్లాను ఒక ఇంటిని చుట్టుముట్టారు. అందులో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. మహిళలు, పిల్లలు వారికి బందీగా ఉన్నారు. మిగతా ఇద్దరు ఉగ్రవాదులు అప్పటికే తప్పించుకున్నారు. హంద్వారా మండలం రజ్వార్ ప్రాంతంలోని అటవీ గ్రామం చాంగిముల్లా. శనివారం మధ్యాహ్నం 3.45కి ఎన్కౌంటర్ మొదలైంది. కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనూజ్ సూద్, జవాన్లు నాయక్ రాజేశ్ కుమార్, లాన్స్ నాయక్ దినేశ్ సింగ్, జమ్మూ–కశ్మీర్ పోలీస్ సబ్–ఇన్స్పెక్టర్ సాగిర్ అహ్మద్ పఠాన్ క్వాజీ ఆ ఆపరేషన్‌లో ఉన్నారు. ఒక ఉగ్రవాదిని హతం చేశారు. బందీలుగా ఉన్న పౌరుల్ని బయటికి రప్పించారు. ఇంకొక ఉగ్రవాది లోపలే ఉండిపోయాడు. ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది. తుపాకులు, గ్రెనేడ్ల చప్పుళ్లు. సాయంత్రం ఆరుగంటలకు నిశ్శబ్దం! అప్పటికే చీకటి పడుతోంది. ఆదివారం తెల్లారే మళ్లీ పోరు మొదలైంది. రెండో ఉగ్రవాదీ హతమయ్యాడు. అయితే భారత్ తన బలగాలనూ కోల్పోయింది. 21వ రాష్ట్రీయ రైఫిల్స్ దళ కమాండర్ కల్నల్ శర్మతో పాటు ఆయన బృందంలోని నలుగురూ అమరులయ్యారు. వీరమరణం పొందిన ఐదుగురిలో కల్నల్ శర్మ (44), మేజర్ అనూజ్ (30), ఎస్సై సాగిర్ (41) సీనియర్లు. మిగతా ఇద్దరు రాజేశ్ (29), దినేశ్ (24) యువ జవాన్లు. కల్నల్ శర్మది రాజస్థాన్. ఆర్మీ అంటే పిచ్చి. పట్టుబట్టి పదమూడు ప్రయత్నాలు చేసి ఆర్మీలోకి వచ్చారు. డేర్ డెవిల్ అని పేరు. ఇప్పటికి ముప్పైమందిని మట్టుపెట్టాడు. ఏడేళ్ల కూతురు ఉంది. బ్యారక్స్‌లో సాటి సైనికులతో ఎప్పుడూ తన కూతురు గురించే మురిపాల గొప్పలు. తమన్నా ఆ చిన్నారి పేరు. అతడి ఆలోచనల ప్రపంచం ఎప్పుడూ కూతురు చుట్టూనే తిరుగుతుండేది. కూతురితో కలిసి ఇటీవల దిగిన ఫొటో అతడి వాట్సాప్‌లో డిస్ప్లే పిక్‌గా ఉంది. తండ్రి ఒడిలో కూర్చొని అతడి మెడ చుట్టూ చేతులు వేసి నవ్వుతుంటుంది ఆ ఫొటోలో తమన్నా. చివరిసారిగా కూతురితో కలిసి జైపుర్‌లో పిజ్జా తిన్నాడు. తమన్నాకు షాపింగ్ అంటే ఇష్టం. స్పోర్ట్స్ షూ కొనిపించుకునేది. తండ్రీకూతుళ్లిద్దరూ కలిసి కామిక్ యానిమేషన్ సినిమాలు చూసేవారు. ‘‘కల్నల్ శర్మకు తన కూతురంటే ఎంత ప్రాణం అంటే.. ఫోన్ మొదలైనప్పట్నుంచీ ప్రామిస్‌లు చేస్తూనే ఉంటాడు’’ అని చెబుతుండేవారు శర్మ పై అధికారి. శర్మ భార్య పల్లవి. ఆదివారమే ఆమెకు భర్త మరణం గురించి తెలిసింది. ‘‘మార్చిలో హోలీ పండక్కి ఇంటికి వచ్చారు. ఆర్మీలో ఉన్నవాళ్లకు డ్యూటీ ముఖ్యం. డ్యూటీలో ఏం జరిగినా అది డ్యూటీలో భాగమే’’ అని కూతుర్ని గుండెలకు చేర్చుకుని తనకొస్తున్న పరామర్శలకు బదులిస్తున్నారావిడ. భార్య ఆకృతితో మేజర్ అనూజ్ మేజర్ అనూజతో కొద్ది రోజుల క్రితమే అతడి తండ్రి చంద్రకాంత్ సూద్ ఫోన్లో మాట్లాడారు. లాక్డౌన్ అయ్యాక ఇంటికి వస్తానని తండ్రితో చెప్పారు అనూజ్. వాళ్ల కుటుంబం పంజాబ్‌లోని నభాలో ఉంటోంది. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఆయన. మేజర్ అనూజ్‌కి కూడా కల్నల్ శర్మలా ఆర్మీలో చేరడం ఒక కల. 2017లో పెళ్లయింది. అనూజ్ భార్య ఆకృతి. పుణెలోని ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ధర్మశాలలో పుట్టింట్లో ఉన్నారు. పెళ్లయిన నాలుగేళ్లకే అనూజ్ జమ్మూ–కశ్మీర్ వెళ్లిపోయాడు. కుటుంబాన్ని నిర్మించుకోడానికి ఫోన్లోనే ఏవో కలల్ని అల్లుకుంటున్నారు. ఇటీవల కూడా ఆ కలల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారు. లాక్డౌన్ తర్వాత అతడు రావలసి ఉంది. అతడికి బదులుగా అతడు లేడన్న కబురొచ్చింది. వెంటనే ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్) నుంచి మెట్టినింటికి ప్రయాణమయ్యారు ఆకృతి. ఎస్సై సాగిర్ అహ్మద్ స్వరాష్ట్రం జమ్మూ–కశ్మీరే. కుప్వారా జిల్లాలోని త్రాడ్ గ్రామం. 1999లో కానిస్టేబుల్‌గా చేరారు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపులోకి కోరి మరీ మారారు. ఉగ్రవాదంపై పోరాడే గ్రూపు అది. సాగిర్ది పెద్ద కుటుంబం. ముగ్గురు కూతుళ్లు, కొడుకు, తల్లిదండ్రులు. పిల్లలు పైచదువులకు వచ్చారు. వాళ్లను ఆర్మీలో చేర్చాలని ఆయన తపన. భక్తి పరుడు. ఈద్ ప్రార్థనలను మర్చిపోవద్దని పిల్లలకు గుర్తు చేస్తుంటాడు. ఎన్కౌంటర్ అనగానే డిపార్ట్మెంట్లో మొదట సాగిర్ పేరే వస్తుంది. ధైర్యస్థుడిగా, సాహసిగా పేరుంది. షేర్–ఎ–కశ్మీర్ పోలీస్ మెడల్, రాష్ట్రపతి పతకం అందుకున్నారు. జవాన్లు నాయక్ రాజేశ్ కుమార్, లాన్స్ నాయక్ దినేశ్ సింగ్‌లు ఇద్దరూ కూడా సైన్యంలో పని చేసిన కుటుంబాల వారే. రాజేశ్‌ది పంజాబ్. 3 గార్డ్స్ పేరెంట్ యూనిట్లో పని చేస్తున్నాడు. తల్లి బదామీదేవి చిన్నప్పుడు అతడికి పోరాట యోధుల కథలు చెప్పి సైన్యంపై ఆసక్తి కలిగించారు. దినేశ్‌ది ఉత్తరాఖండ్. 17 గార్డ్స్ పేరెంట్ యూనిట్లో చేస్తున్నాడు. అతడు ఆర్మీలో చేరేందుకు అతడి తల్లి తులసీదేవి స్ఫూర్తినిచ్చారు. తల్లుల ఆజ్ఞపై భరతభూమికి కంటికి రెప్పలా చూసుకుంటామని ప్రతిజ్ఞ చేసి ఆర్మీలో చేరారు ఈ యువకులిద్దరు. దేశ సైనికుల ప్రాణత్యాగాలు వృథాగా పోవు. దేశంలోని ప్రతి ఇల్లూ సైనికుడిదే. ప్రతి కుటుంబంలోనూ సైనికుడు సభ్యుడే. దీపం ఒక దీపాన్ని వెలిగించినట్లుగా అమర వీరులనుంచి ప్రసరించే స్ఫూర్తి వెలుగు.. హద్దు మీరిన ఉగ్రవాదంపై పోరాటానికి బాటలు వేసి భావితరాల వారి చేత బదులు ఇప్పిస్తుంది. అంతకంతా తీర్చుకుంటుంది. -
ఆర్మీ జవాన్ కాల్పులు.. మహిళకు గాయాలు
-
ఆర్మీ సిపాయిపై చిన్నారి ఫిర్యాదు
తమిళనాడు, వేలూరు: తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలుకా మంగళాపురం గ్రామానికి చెందిన ఏయుమలై కుమార్తె రేణుగ(27). ఈమెకు క్రిష్ణాపురానికి చెందిన నాగేంద్రన్(30)కు 2012లో వివాహమైంది. దంపతులకు యోగిశ్రీ (8), ధనశ్రీ(2) ఇద్దరు కుమార్తెలున్నారు. నాగేంద్రన్ గుజరాత్లో ఆర్మీ సిపాయిగా పనిచేస్తున్నాడు. వీరందరూ కలిసి గుజరాత్‌లోనే నివసిస్తున్నారు. గత నెల 27న రేణుగ ఆత్మహత్య చేసుకున్నట్లు ఏయుమలైకి సమాచారం వచ్చింది. ఆయన ఆక్కడకు వెళ్లి రేణుగ మృత దేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు క్రిష్ణాపురానికి తీసుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఆయన మనుమరాలు యోగీశ్రీ అమ్మపై నాన్న కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడని తెలిపింది. ఆశ్చర్యపోయిన ఏయుమలై బంధువులతో కలిసి తిరువణ్ణామలై కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టర్ కందస్వామికి వినతి పత్రం అందజేశాడు. ఆ వినతిలో.. తనకు నలుగురు కుమార్తెలున్నారని, అందులో మూడో కుమార్తె రేణుగను 2012 జూన్ 6వ తేదీన క్రిష్ణాపురానికి చెందిన శేఖర్ కుమారుడు నాగేంద్రన్‌కు వివాహం చేసినట్టు తెలిపారు. నాగేంద్రన్ గుజరాత్లో ఆర్మీ సిపాయిగా పనిచేస్తున్నందున తన కుమార్తె కూడా వారితో పాటు ఉండేదన్నారు. నాగేంద్రన్ తన కుమార్తెను తరచూ వరకట్నం కోసం వేధింపులకు గురిచేసే వాడని, గత 27వ తేదీన తన సెల్‌పోన్‌కు కాల్ వచ్చిందన్నారు. అందులో తన కుమార్తె సిలిండర్ పేలి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేర్పించామని తెలిపారన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి గుజరాత్‌కు వెళ్లామని, అప్పటికే తన కుమార్తె మృతి చెందినట్లు తెలిపారన్నారు. తర్వాత మృత దేహాన్ని గ్రామానికి తీసుకొచ్చామని చెప్పారు. ఇంటికి వచ్చిన అనంతరం తన మనుమరాలు అసలు విషయం తెలిపిందన్నారు. భర్త నాగేంద్రన్ కిరోసిన్ పోసి నిప్పు పెట్టి ఆత్మహత్యగా చిత్రికరించినట్లు తెలిపినట్టు వెల్లడించారు. వినతిని స్వీకరించిన కలెక్టర్ ఎస్పీకి సిపారస్సు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో దీపావళి సంబరాలు
-
భారతీయుడవని నిరూపించుకో..!
అతను 30 ఏళ్లు ఇండియన్ ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేశారు. లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి, పాక్ సరిహ్ద్ధుల వరకూ, కశ్మీర్ నుంచి బంగ్లా, చైనా బోర్డర్ వరకూ పనిచేశారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉన్నారు. ఆర్మీలో సర్వీసు పూర్తి చేసుకుని 2016 అక్టోబర్ రిటైర్ అయ్యారు. ఇప్పుడ అతన్ని నువ్వు భారతీయుడవేనా? ఇండియన్ అయితే నిరూపించుకో? అంటూ అసోం పోలీసులు నోటీసులు జారీ చేశారు. గువాహటి : మహమ్మద్ అబ్దుల్ హక్.. అసోంలోని కళహికాష్ గ్రామవాసి. 30 ఏళ్ల పాటు భారతీయ సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేసి.. జూనియర్ కమిషనష్డ్ ఆఫీసర్ హోదాలో రిటైర్ అయ్యారు. విశ్రాంతీ జీవితం గడుపుతున్న దశలో అతనికి ఊహించని షాక్ తగిలింది. నిన్ను అనుమానాస్పద ఓటర్‌గా గుర్తిస్తూ నీ ఓటు హక్కు తొలగిస్తున్నాం.. నువ్వు అసలు భారతీయుడవేనా? అయితే నిన్ను నువ్వు నిరూపించుకో? ఇండియన్ అని చెప్పే ఆధారాలు చూపించు.. అని ఫారినర్స్ ట్రిబ్యునల్ నుంచి హక్కు నోటీసులు అందాయి. హక్కేకాక అతని భార్య అయిన ముంతాజ్ బేగంకి సైతం ఇటువంటి నోటీసులు అందాయి. భారత ప్రభుత్వం 1971 తరువాత బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారిని గుర్తించేందుకు ఇటువంటి నోటీసులు జారీ చేసి ఉండొచ్చని చెప్పారు.. నేను పుట్టకతోనే భారతీయుడను.. మా నాన్న మఖ్బూల్ ఆలీపేరు 1966 ఓటర్ల జాబితాలో ఉంది. అంతేకాక 1961, 1962లో జరిపిన గ్రామాల సర్వేలోనే మా కుటుంబం పేరు ఉంది. ఇక నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) రికార్డుల్లో మా అమ్మ రహిమాన్ నీసా పేరుంది. మేం వలస వచ్చినవాళ్లం కాదు అని హక్ స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ నుంచి వచ్చిన సమన్తు చూపుతూ.. నేను 1986లో ఇండియన్ ఆర్మీలో మెకానికల్ ఇంజినీర్‌గా చేరాను. అప్పటి నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తూ.. జూనియర్ కమిషన్ట్ అధికారిగా 2016 అక్టోబర్‌లో రిటైర్ అయ్యాను. ఉద్యోగంలో భాగంగా.. నేను ఎల్ఇండో-చైనా బోర్డర్ అయిన తవాంగ్‌లోనూ, ఇక లక్నో, కోటా, సికింద్రాబాద్‌లోనూ పనిచేశాను. , -
దేశ రక్షణలో మన సైనికుడు
రైతు బిడ్డలు...సైన్యంలో జవానులు ఆర్మీ వైపు మొగ్గుచూపుతున్న ఆత్మకూరు యువత ‘‘జననీ జన్మభూమిశ్చ...స్వర్గాదపీ గరీయసి...ఏ తల్లి నిను కన్నదో...ఆ తల్లినే భూమి భారతి గొప్పదిరా’’...అంటూ ఓ సినీకవి..మాతృభూమి గురించి రాసిన మాటలు ఆ యువకుల మనసుల్లో నాటుకు పోయాయి. అందుకే ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రులను వీడి...దేశసేవలో సరిహద్దులో సమరానికి సిద్ధమయ్యారు. ఒకరిని చూసి మరొకరు...ఒకరి వెంట మరొకరు ఇలా...ఆత్మకూరు యువత దేశ సేవలో తరిస్తుండగా...వారిని కన్నవాళ్లంతా గర్వంతో పొంగిపోతున్నారు. - ఆత్మకూరు: దేశ రక్షణ వ్యవస్థలో భారత సైనిక దళం (ఇండియన్ ఆర్మీ) ఒకటి. ఈ విభాగం ప్రధాన కర్తవ్యం... భూ భాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ దేశ సరిహద్దుల భద్రతను పర్యవేక్షించడం. ఇలా దేశ రక్షణలో పాలుపంచుకునేందుకు ఆత్మకూరు మండలానికి చెందిన పలువురు యువకులు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తుండడంతో మండలంలో సైనికుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే 150 మందికి పైగా యువకులు ఆర్మీలో సేవలందిస్తున్నరాు. కన్న వారి కలలను సహకారం చేస్తూ...దేశ రక్షణలో మేముసైతం అంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టమైనా...ఇష్టపడి.. భారత సైనిక దళాల్లో పనిచేయడం అంత సులువైన విషయం కాదు. కఠోర శిక్షణ...ప్రతికూల పరిస్థితుల్లో విధుల నిర్వహణ..ఇలా ప్రతిదీ కష్టంతో కూడుకున్నదే. సరిహద్దులో కాపాలా ఉండే సైనికులకు పగలు..రాత్రి తేడా ఉండదు..నిరంతరం నిఘా ఉంచాల్సిందే. కొండలు..మంచు పర్వతాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. రక్తం గడ్డకట్టే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలి. అయినప్పటికీ యువత ఇష్టపడి మరీ దేశ రక్షణలో పాలుపంచుకుంటున్నారు. ఒక్కోసారి కుటుంబీకులతో మాట్లాడటం కూడా నెలల తరబడి కుదరదు. ఇక వివాహితులైతే కుటుంబాన్ని వదిలి విధులకు వెళ్లాల్సిన పరిస్థితులుంటాయి. అయినప్పటికీ దేశ రక్షణ కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ ముక్తకంఠంతో చెబుతున్నారు. ప్రోత్సాహిస్తున్న తల్లిదండ్రులు సైనికుడి ప్రాణం..గాల్లో దీపంలాంటింది...ఎప్పుడు యుద్ధం వస్తుందో...ఎక్కడ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు. నిత్యం ప్రాణాలతో చెలగాలం. అందుకే తమ బిడ్డలను ఆర్మీలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రారు. కానీ ఆత్మకూరు మండలలలోని చాలా మంది తల్లిదండ్రులు దేశ భద్రత కోసం తమ బిడ్డలను పునాదిరాళ్లుగా మలుస్తున్నారు. ఆర్మీలో ఉద్యోగం కోసం శిక్షణ కేంద్రాల్లో చేర్పిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. దేశరక్షణకు ప్రాణాలైనా ఆర్పిస్తా నాకు సైన్యంలో ఉద్యోగం వచ్చి నాలుగు సంవత్సరాలవుతోంది. విధి నిర్వహణలో భాగంగా చాలా రాష్ట్రాల్లో పనిచేశాను. ప్రస్తుతం ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్నాను. ఆర్మీలో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. దేశ రక్షణకు ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధం -కొండారెడ్డి గర్వంగా ఉంది ఇండియన్ ఆర్మీలో పని చేయడం గర్వంగా ఉంది. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కష్టపడి చదివించారు. వారి కష్టాన్ని చూసి పట్టుదలతో శ్రమించి ఉద్యోగం సంపాదించా. సైనికుడిగా మంచిపేరు తెచ్చుకుని నా తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూడటానికి ఎంత కష్టమైనా భరిస్తా. - మనోజ్ ప్రభాకర్‌రెడ్డి నా జీవితం దేశరక్షణకే నాకు 19 సంవత్సరాల వయసులోనే ఆర్మీలో ఉద్యోగం వచ్చింది . బెంగళూర్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నా. దేశ రక్షణ కోసం జీవితాంతం పని చేయడానికి సిద్ధం. పుట్టిన ఊరికి, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావడమే నాధ్యేయం . - కార్తిక్ -
యుద్ధ విధుల్లో మహిళ
మహిళలు సైనికులుగా పోరాట విధులను నిర్వహించగలరా? ఎడతెగని ఈ చర్చ ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన ట్టే ఉంది. మహిళలకు పోరాట విధులను అప్పగిస్తామని, రిక్రూట్మెంట్ కూడా మొదలైందని మన ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఇటీవల తెలిపారు. ఆదే సాకారమైతే జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, ఇజ్రాయెల్ దేశాల సరసన భారత్ కూడా త్రివిధ బలగాలలోని దాదాపు అన్ని విభాగాలలోనూ మహిళలకు ప్రవేశం కల్పించిన దేశంగా సగర్వంగా నిలవగలుగుతుంది. 1992లోనే మన సైన్యం మహిళలకు తలు పులు తెరిచినా వారి నియామకాలను వైద్య, విద్య, న్యాయ విభాగాలకు, సిగ్నలింగ్, ఇంజనీరింగ్ వంటి సాంకేతిక విభాగాలకు పరిమితం చేసింది. 2015లో వైమానిక, నావికా బలగాలు మహిళలను పోరాట విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించి, అమలు చేస్తున్నాయి. సైన్యం తాజాగా తీసుకున్న నిర్ణయం కూడా నేరుగా మహి ళలను పోరాట విధులలో నియమించాలని కాదు. ముందుగా వారిని సైనిక పోలీసు విధులలోకి తీసుకుంటారు. అంటే కంటోన్మెంట్లు, సైనిక సంస్థలలో పోలీసు విధు లనూ, యుద్ధ సమయాల్లో శరణార్థులు, యుద్ధ ఖైదీల బాధ్యతలను నిర్వహిస్తారు. ఇప్పటికే సశస్త్ర సీమా బల్ వంటి పారా మిలిటరీ బలగాలలో మహిళలు సరిహద్దు లలో కఠోర విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. 2010లో లెఫ్టినెంట్ జనరల్ మితాలి మధుమిత కాబూల్‌లోని మన దౌత్య కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో ప్రాణాలకు తెగించి 11 మంది సైనికుల ప్రాణాలను కాపా డారు. ఆమె అప్పుడు విద్యా విభాగంలో పని చేస్తున్న సైనికాధికారి. అంతేకాదు, రెండున్నర దశాబ్దాల మన మహిళా సైన్యం చరిత్రలో ఏకైక శౌర్య పతక విజేత ఆమె ఒక్కరే! అందుకు కారణం, సైన్యంలోని ఇతర మహిళలకు అలాంటి ధైర్యసాహ సాలు కొరవడటం కాదు, వాటిని ప్రదర్శించే అవకాశాలను కల్పించకపోవడం. పైగా విద్య, వైద్యం తప్ప మరే విభాగంలోనూ మహిళలకు, పురుషులకు వలే 5 నుంచి 14 ఏళ్ల స్వల్ప కాలిక సర్వీసు ముగిశాక పర్మనెంట్ కమిషన్డ్ అధికారులుగా పనిచేసే అవకాశాన్ని కల్పించడం లేదు. పురుషులతో సమానంగా కఠోరమైన శిక్షణను పొంది, అన్ని కష్టాలకు ఓర్చి, కుటుంబాలకు దూరమై పనిచేస్తే... పెన్షన్‌కు అర్హతనిచ్చే 20 ఏళ్లయినా పని చెయ్యకుండానే గెంటేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేసే మహిళా సైనికాధికారులకు కొదవలేదు. స్వల్పకాలిక సర్వీసు ముగిశాక కూడా సైనిక విధులలో కొనసాగాలని కోరుకునే మహిళలను సైనిక విధులకు దూరం చేయడంలోని సహేతుకత ఏమిటో అంతుబట్టదు. పని ప్రదేశాలలో వివక్ష అన్ని చోట్లా ఉన్నదే. అది సైన్యంలోని మహిళలపట్ల ఉండకూడదు అనుకోవడం అత్యాశ గానీ, చాలా సందర్భాల్లో మహిళా సైనికులకు ప్రత్యేకంగా మరుగు దొడ్లు సైతం ఏర్పాటు చేయలేకపోవడాన్ని ఏమనాలి? రావత్ ఆశిస్తున్నట్టు మహిళా జవాన్లు పోరాట యోధులుగా శిక్షణ పొంది రావడాన్ని చూడాలంటే.. ఇప్పటికే సైన్యంలో ఉన్న మహిళల్లో పలువురు ఐదేళ్ల కనీస సర్వీసు కాలవ్యవధి గడిచాక, గరిష్ట పరిమితి దాటకుండానే పదవీ విరమణ చేసేలా నిరుత్సాహపరిచే ఈ పరిస్థితులను మార్చక తప్పదని గుర్తించడం అవసరం. సైనిక పోలీసులుగా మహిళలు తన విధులను విజయవంతంగా నెరవేర్చ డంలో దృఢసంకల్పాన్ని, శక్తిసామర్థ్యాలను ప్రదర్శించాలని, ఆ తర్వాతనే మహి ళలను పోరాట విధుల్లోకి తీసుకుంటామని రావత్ అన్నారు. దీంతో మహిళలు పోరాట సైనికులుగా మారడానికి ఇంకా ఎంత కాలం పడుతుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసు బలగాల్లో, సైన్యంలో, పారా మిలిటరీ బలగాల్లో దశాబ్దాల తరబడి సమర్థవంతంగా పురుషులకు ధీటుగా పనిచేస్తున్న మహిళలు ఇంకా ఏం రుజువు చేసుకోవాలి? సైనిక రంగంలో ఆధునిక సాంకేతికత పాత్ర నానాటికీ పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగానే సాయుధ బలగాలలో శారీరక దారుఢ్యం ప్రాధాన్యం తగ్గుతోంది. అయినా మన సైనిక నాయకత్వం మహిళలను పోరాట విధులలోకి తీసుకోడానికి బదులు అంతకు ముందు ఈ సైనిక పోలీసు మజిలీని ఎందుకు ఎంచుకుంది? పదవీ విరమణ చేసిన మహిళా సైనికాధికారులు సహజం గానే సంధిస్తున్న సమంజసమైన ప్రశ్నలివి. ఆచితూచి మాట్లాడటం కంటే వివాదాస్పద వ్యాఖ్యలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపించే రావత్ అసలు ఉద్దేశాలపై సైతం సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కశ్మీర్లో రాళ్లు రువ్వే మూకలలోని మహిళలతో మహిళా సైనిక పోలీçసులయితే సమర్థవంతంగా తలపడగలరనీ, ఇతర పౌర ఆందోళనలలో సైతం సైన్యం మహిళలను ఎదుర్కొనవలసి వస్తున్నందున సైనిక మహిళా పోలీసులు చాలా ఉపయోగకరమని రావత్ చేసిన వ్యాఖ్యలే ఆ అను మానాలకు తావిస్తున్నాయి. అంతర్గత అశాంతి, ఆందోళనలను అదువు చేయడంలో సైన్యం ఇకపై ఇప్పటికంటే విస్తృతమైన పాత్రను నిర్వహించాల్సి ఉంటుందని స్ఫురించేలా చేస్తున్నాయి. అంతర్గత శాంతిభద్రతల పరిరక్షణ కోసం సైన్యాన్ని ఎక్కువగా ఉపయోగించడం వాంఛనీయం కాదనేదే ఇంతవరకు మన సైనిక బల గాల నాయకత్వం వైఖరి. నిజానికి అది మన సైన్యాన్ని, పాకిస్తాన్ సైన్యానికి పూర్తి విభిన్నమైదిగా నిలిపే విశిష్టతలలో ఒకటి. అనుద్దేశపూర్వకంగానే అయినా రావత్ వ్యాఖ్యలు మన సైన్యం ఆ వైఖరికి భిన్నమైన వైఖరిని చేపడుతున్నదా? అనే సందే హాన్ని రేకెత్తిస్తున్నది. పౌర అశాంతి, ఆందోళనలను నియంత్రించడంలో సైన్యం పాత్ర తాత్కాలికమైనది. అందుకోసం శాశ్వత ప్రాతిపదికపై మహిళా సైనిక పోలీ సుల ఏర్పాటు అసంగతం కాదా? అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు బహిరం గంగా మాట్లాడేటప్పుడు సూటిగా, సరళంగా, అస్పష్టతకు, అపార్థాలకు తావు లేకుండా ఉండటం అత్యావశ్యకం. కశ్మీర్ అశాంతిపైనా, మానవ రక్షణ కవచం ఉదంతంపైనా చేసిన వ్యాఖ్యలతో రావత్ ఇప్పటికే అనవసర వివాదాలకు కేంద్రమై రచ్చకెక్కారు. ఇకనైనా ఆయన భారత సైనిక సత్సాంప్రదాయాలకు తగ్గట్టు మాటలు తగ్గించి, కార్యదక్షతను చూపిస్తే ఆయనకు, మన సైన్యానికి, దేశానికి కూడా గౌరవం. -
పోలీస్‌స్టేషన్‌పై ఆర్మీ జవాన్ల దాడి
నాసిక్: మహారాష్ట్రలోని ఉపానగర్ పోలీస్‌స్టేషన్‌పై ఆర్మీ జవాన్లు బుధవారం విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్టేషన్ ఆవరణలో తమ వాహనాన్ని పార్కింగ్ చేసుకోవడానికి మంగళవారం రాత్రి పోలీసులు అనుమతించకపోడంతో దాదాపు 150 మంది జవాన్లు బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. అక్కడున్న మహిళా పోలీసుపై అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డొచ్చిన పోలీసులందరినీ చితకబాదారు. ఈ ఘటనపై ఆర్మీ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ఆరుగురు జవాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.