లఢక్‌: ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశృతి.. ఐదుగురు జవాన్లు మృతి | army soldiers Deceased during tank exercise near LAC in Ladakh | Sakshi
Sakshi News home page

లఢక్‌: ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశృతి.. ఐదుగురు జవాన్లు మృతి

Published Sat, Jun 29 2024 11:47 AM | Last Updated on Sat, Jun 29 2024 1:17 PM

army soldiers Deceased during tank exercise near LAC in Ladakh

లఢక్‌: దేశ సరిహద్దుల్లోని లఢక్‌లో ఇండియన్‌ ఆర్మీ  నిర్వహించిన యుద్ధ విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. యుద్ధ ట్యాంక్‌ ఓ నది దాటుతూ విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా నీటీ ప్రవాహం పెరిగింది.

 

దీంతో యుద్ధట్యాంక్‌లో ఉన్న ఐదుగురు జవాన్లు నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈఘటన లేహ్‌కు 148 కిలోమీటర్ల​ దూరంలో దౌలత్‌ బేగ్‌ ఓల్డీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో టీ-72  యుద్ధ ట్యాంక్‌కు ప్రమాదం జరిగినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. 

‘‘ ప్రమాద సమయంలో ఐదుగురు ఆర్మీ జవాన్లు యుద్ధట్యాంక్‌లో ఉన్నారు.  ఒకరు జూనియర్‌  కమిషన్డ్‌ అధికారి, నలుగురు జవాన్లు ఉన్నారు. గాలింపు చర్యల్లో ఒక్క జవాన్‌ మృతదేహం లభించింది. మిగతావారి  కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’’ అని రక్షణ శాఖ తెలిపింది. 

గతేడాది ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్.. లేహ్ జిల్లాలోని కియారీ సమీపంతో లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారితో సహా తొమ్మిది మంది సైనికులు మృతి చెందారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement