Army exercise
-
లఢక్: ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశృతి.. ఐదుగురు జవాన్లు మృతి
లఢక్: దేశ సరిహద్దుల్లోని లఢక్‌లో ఇండియన్ ఆర్మీ నిర్వహించిన యుద్ధ విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. యుద్ధ ట్యాంక్ ఓ నది దాటుతూ విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా నీటీ ప్రవాహం పెరిగింది.Indian Army T-72 Tank with Mine Trawler in Ladakh near LAC.. pic.twitter.com/A0rDfJY2rK— Vivek Singh (@VivekSi85847001) June 2, 2024 దీంతో యుద్ధట్యాంక్‌లో ఉన్న ఐదుగురు జవాన్లు నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈఘటన లేహ్‌కు 148 కిలోమీటర్ల దూరంలో దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో టీ-72 యుద్ధ ట్యాంక్‌కు ప్రమాదం జరిగినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ‘‘ ప్రమాద సమయంలో ఐదుగురు ఆర్మీ జవాన్లు యుద్ధట్యాంక్‌లో ఉన్నారు. ఒకరు జూనియర్ కమిషన్డ్ అధికారి, నలుగురు జవాన్లు ఉన్నారు. గాలింపు చర్యల్లో ఒక్క జవాన్ మృతదేహం లభించింది. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’’ అని రక్షణ శాఖ తెలిపింది. గతేడాది ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్.. లేహ్ జిల్లాలోని కియారీ సమీపంతో లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో జూనియర్ కమిషన్డ్ అధికారితో సహా తొమ్మిది మంది సైనికులు మృతి చెందారు. -
మమత సెల్ఫ్ గోల్!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ లో టోల్ గేట్ల వద్ద కేంద్ర బలగాల మొహరింపు వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీదే తప్పని ఆర్మీ నిరూపించింది. తమకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర బలగాలను తమ రాష్ట్రంలోకి పంపించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మమత ఆందోళన చేశారు. దీంతో కేంద్ర బలగాలను పశ్చిమ బెంగాల్ నుంచి ఉపసంహరించారు. అయితే బెంగాల్ ప్రభుత్వ విభాగాల అభ్యర్థన మేరకే బలగాలను పంపించామని ఆర్మీ వెల్లడించింది. బెంగాల్ లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి తమకు అందిన నాలుగు లేఖలను ఆర్మీ విడుదల చేసింది. బెంగాల్ జీఓసీకి చెందిన మేజర్ జనరల్ సునీల్ యాదవ్ ఈ లేఖలను విడుదల చేశారు. బెంగాల్ ప్రభుత్వ కార్యాలయాల నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నాకే బలగాలను పంపించామని ఆయన వెల్లడించారు. బెంగాల్ కు కేంద్ర బలగాలు పంపించడానికి వారం ముందే (నవంబర్ 24న) అనుమతులు పొందామని చెప్పారు. ఆర్మీ వివరణతో మమత ఖంగుతిన్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర బలగాలు మొహరించారని హడావుడి చేసిన ఆమె సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టైంది. ఇప్పుడెలా స్పందిస్తారో చూడాలి.