
దేశ రాజధాని నగరం ఢిల్లీని భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున 4.0 తీవ్రతతో భూకంపం సంభవించడం జనం భయంతో పరుగులుతీశారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సమీపంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు. బలమైన ప్రకంపనలతో చాలా మంది నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం సమయంలో ఇళ్ల బయట నిలబడి ఉన్న వ్యక్తులు వణుకుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి నష్టం లేదా ప్రాణనష్టం జరగలేదు.
ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిపై చాలామంది ఆందోళనవ్యక్తం చేశారు . ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఢిల్లీ భూకంపంపై పలు మీమ్స్‌ను సృష్టించారు. #earthquake హ్యష్‌ట్యాగ్‌తో రూపొందించిన మీమ్స్ వైరల్‌గా మారాయి. ఢిల్లీలో నెలకొన్ని పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయి. పొద్దున్న కాలుష్యం, సాయంత్రం గ్రహణం, రాత్రికి భూకంపం అంటూ నిరాశను ప్రకటించారు.
Money is the second thing you need to survive in Delhi, the first is still the courage to live in that city#earthquake pic.twitter.com/E4Jq0XqKY6
— isHaHaHa (@hajarkagalwa) February 17, 2025
#earthquake #Delhi
earthquake to Delhi people: pic.twitter.com/vAYLFraIZo
— Yash Khandelwal (@yashk1140) February 17, 2025
ఢిల్లీలో జీవించడానికి కావాల్సింది డబ్బులు కాదు భయ్యా, ముందు ధైర్యం కావాలి అంటూ మీమ్ తయారు చేశారు. రెండు నెలలకోసారి టెక్నో ప్లేట్స్ ఢిల్లీ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయంటూ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేశారు. మరోవైపు ఒక పక్క ప్రాణ భయంతో ఢిల్లీ వాసులు అల్లాడిపోతే, సామాజిక మాధ్యమాల్లో కొందరు నెటిజన్లు మీమ్స్ సృష్టిస్తూ కామెడీ చేయడం విమర్శలకు దారి తీసింది.
Tectonic plates in Delhi NCR in every few months : #earthquake pic.twitter.com/vDJSw14sI3
— UmdarTamker (@UmdarTamker) February 17, 2025
సాధారణంగా మీమ్స్‌ను జనాలకు వినోదం పండిస్తాయి. మానసిక ఉల్లాసాన్నిస్తాయి. చాలా తక్కువ సమయంలో సంబంధిత సమాచారాన్ని చేరవేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల వ్యవహార శైలిపై వేసే మీమ్స్ ఆలోచన రగిలిస్తాయి. క్రికెట్‌మ్యాచ్‌లు, సినిమా రివ్యూల్లో వచ్చే మీమ్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. చాలా క్రియేటివ్‌గా ఉండే ఈ మీమ్స్ ఒకవైపు సమాచారాన్ని ఇస్తూనే, మరోవైపు బోలెడంత హాస్యాన్ని పండిస్తాయి.
भूकंप कुछ ऐसा ही था आज Delhi NCR में, बहुत तेज #earthquake pic.twitter.com/pGhsanaidT
— बलिया वाले 2.0 (@balliawalebaba) February 17, 2025
Comments
Please login to add a commentAdd a comment