![Jaipur Woman Performs Backflip In Saree Video Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/15/1saree-women.gif.webp?itok=fdoWhzcZ)
జైపూర్: భారతీయ సాంప్రదాయంలో చీరకట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అమ్మాయిల అందం చీర కట్టులో డబుల్ అవుతుందనడంలో సందేహం లేదు. అదే చీర కట్టులో స్టంట్స్ చేస్తే ఎలా ఉంటుంది? సివంగి దూకినట్టు కదా..! మరి ఆ సివంగి తలకిందులుగా జంప్ చేస్తే..! తాజాగా ఓ యువతి చీర కట్టులో చేసిన స్టంట్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎరుపు రంగు చీరకట్టుకుని బ్యాక్‌ఫ్లిప్ చేస్తున్న యువతిని చూసిన చుట్టు పక్కల వారు నోళ్లు వెళ్లబెట్టారు. కాగా జైపూర్‌కి చెందిన మిషా శర్మ అనే ఫిట్‌నెస్ ట్రైనర్ ఈ ఫీట్‌ను చేసి ఔరా అనిపించింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 3 కోట్ల మంది నెటిజన్లు వీక్షించగా.. లక్షల మంది లైక్ కొట్టి, కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘యువతి చేసిన ఈ ఫీట్ నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి.’’ అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ‘‘అబ్బా! ఫీట్ అదిరిపోయింది. నా గుండె జారిపోయింది.’’ అంటూ చమత్కరించాడు. కాగా నెటిజన్‌ల కామెంట్స్ పై మిషా శర్మ స్పందిస్తూ.. ‘‘3 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే సరియైన మార్గదర్శకత్వం లేకుండా ఈ విన్యాసాలు ప్రదర్శిస్తే ప్రమాదకరంగా ఉంటాయి. అందువల్ల, మీరు శిక్షణ లేకుండా అలాంటి ఫ్లిప్స్ చేయవద్దు’’ అని ఆమె సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment