సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సినిమా తారలు, టీవీ, సోషల్ మీడియా సెలబ్రిటీస్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా పెద్ద పెద్ద కంపెనీలు నియమించుకుంటూ ఉంటాయి. సాధారణంగా ఫిట్‌నెస్ ట్రైనర్స్‌కు ఈ అవకాశం దక్కడం అరుదు. ఈ నేపధ్యంలో సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్, హైదరాబాద్‌కు చెందిన కిరణ్ డెంబ్లా... కాలిఫోర్నియా ఆల్మండ్స్‌కు ప్రచారకర్తగా మారడం విశేషం. ఇటీవల తాప్సీ పన్ను, పూజా హెగ్డే తదితర హీరోయిన్ల మస్క్యులర్ ఫిజిక్ మెట్రో నగరాల్లో నివసించే యువతులకు బాగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కిరణ్ డెంబ్లాని సదరు సంస్థ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు కరోనా దెబ్బకు కుదేలైన హైదరాబాద్ ఫిట్‌నెస్ ఇండస్ట్రీకి, ట్రైనర్లకు కిరణ్ డెంబ్లా నియామకం కొంత ఊపిరిలూదిందని చెప్పొచ్చు.
ఈ నేపధ్యంలో కాలిఫోర్నియా ఆల్మండ్స్ ఆధ్వర్యంలో నగరం కేంద్రంగా నిర్వహించిన వర్చువల్ సదస్సులో మహిళా బాడీ బిల్డర్, సిక్స్‌ప్యాక్ తో ఆకట్టుకునే కిరణ్ డెంబ్లా పాల్గొని యువతులకు స్ఫూర్తిని అందించారు. కండలు తిరిగిన శరీరం పురుషులకు మాత్రమే అందాన్నిస్తుందని అనుకోవడం సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు.. అమ్మాయిలూ, మధ్య వయసు మహిళలు కూడా మస్క్యులర్ బాడీతో అందంగా ఉంటారన్నారు.
అదంతా చూసే మైండ్‌లో ఉంటుదని ఆరోగ్యకరమైన చర్మం, కండరాలు ఎవరికైనా అవసరమే అన్నారామె. కరోనా తర్వాత వ్యక్తిగతంగా మాత్రమే కాదు కుటుంబమంతా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాల్సిన పరిస్థితులొచ్చాయన్న ఆమె.. వ్యాధినిరోధక శక్తి పెరిగేందుకు ప్రాణయామ వంటి శ్వాస కోస వ్యాయామాలు, విటమిన్ ఇ, జింక్, ఐరన్, వర్కవుట్‌కి ముందూ తర్వాత తగినంత ప్రొటీన్స్ కోసం ఆల్మండ్స్, ఎగ్ వైట్స్..వంటివి తీసుకోవాలని సూచించారు. మహిళలు జిమ్‌కి వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే స్క్వాట్స్, సిటప్స్, లంజెస్, యాబ్స్, జంపింగ్ జాక్స్... చేసుకోవచ్చునని, కేవలం రెసిస్టెన్స్ బ్యాండ్‌తో కూడా బోలెడు వర్కవుట్లు చేయవచ్చునని కూడా ఆమె స్పష్టం చేశారు.
చదవండి: స్టైలిష్‌గా కాబోయే అమ్మ ..
Comments
Please login to add a commentAdd a comment