
అక్కినేని వారి ఇంటికి కోడలు అనే కేరాఫ్ శోభితా ధూళిపాలా (Sobhita Dhulipala)ను ఇటీవలే వరించి ఉండొచ్చు గానీ... ఆమె పేరుకు ముందు అత్యంత ప్రాచుర్యం కలిగిన జాతీయ అంతర్జాతీయ బ్రాండ్స్ చేరడం మాత్రం చాలా రోజుల నుంచే ఉంది. అందాల సుందరి కిరీటం దక్కించుకోవడం దగ్గర నుంచి మొదలుపెడితే... ఒకటొకటిగా ఈ తెలుగమ్మాయి దక్కించుకున్న విజయాలు అంత చిన్నవేమీ కావు. బాలీవుడ్, సౌత్ ఇండియన్ సినిమాల నుంచి మంకీ మ్యాన్ వంటి గ్లోబల్ ప్రాజెక్ట్‌లకు కూడా విస్తరించింది ఓ వైపు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో రాణిస్తూనే మరోవైపు కమర్షియల్ బ్రాండ్స్ రూపొందించే ప్రకటనల యాడ్ వరల్డ్ కి కూడా హాట్ ఫేవరెట్‌గా మారింది శోభిత. ఆమె భీమా జ్యువెల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్, అలాగే జాక్వార్ ఇండియా హర్ స్టోరీ ప్రచారాలలో కూడా తళుక్కుమన్నారు.
యాడ్ గల్లీ డాట్ కామ్ ప్రకారం...ఆమె ఇండో–ఫ్యూజన్ ఫ్యాషన్ డిజైనర్ లేబుల్ అయిన క్యుబిక్ ప్రచారాలలో కూడా కనిపించింది. అంతేకాక ఆమె దాసోస్ క్యాబినెట్‌ల ప్రచారాలలో కూడా పాల్గొన్నారు. ఐశ్వర్య, సుష్మితాసేన్, ప్రియాంకచోప్రాలను మినహాయిస్తే.. అందాల సుందరి కిరీటం దక్కించుకున్నవారిలో శోభిత స్థాయి విజయాలు మరెవరూ సాధించలేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ప్రకటనల్లో , యాడ్ వరల్డ్ అయితే ఆమెకి తిరుగేలేదు. నటిగా సరే, ప్రకనటల్లోనూ యాడ్ క్వీన్‌గా ఆమె రాణించడానికి ఏయే అంశాలు దోహదం చేశాయి? దీని గురించి మోడలింగ్, యాడ్ రూపకల్పన నిపుణులు ఏమంటున్నారంటే... అందం...విలక్షణం... ఆమె అందం కళాత్మక సున్నితత్వంల విలక్షణ సమ్మేళనం, అందుకే శోభితా ధూళిపాళ క్లాస్, మాస్‌లకు ఇష్టమైన సెలబ్రిటీగా ఉద్భవించింది, ఒక ప్రత్యేకమైన అద్భుతమైన అందం ఆమె స్వంతం.

డస్కీ కలర్ క్లాసిక్ ఛార్మ్ సాంప్రదాయ మోడల్స్, సెలబ్రిటీల నుంచి శోభితను ప్రత్యేకంగా నిలబెడుతోంది. లగ్జరీ బ్రాండ్‌లు ఆమె విలక్షణమైన రూపాన్ని ఇష్టపడతాయి, ఆమె హై–ఎండ్ ఫ్యాషన్, అందం ఆభరణాల బ్రాండ్‌లకు అనువైన ఎంపికగా మారింది. భారతీయతను ప్రతిబింబిస్తూనే.. ఆమె గ్లోబల్ అప్పీల్ ఆమెను వేర్వేరు ప్రాంతాలలోని వైవిధ్యభరిత అభిరుచులు కలిగిన విభిన్న రకాల వినియోగదారులతో కనెక్ట్ కావాలనుకునే బ్రాండ్‌లకు అనువైన, విలువైన అంబాసిడర్‌గా మార్చింది. ఫ్యాషన్...ఓ స్టోరీ టెల్లింగ్... వ్యక్తిగతంగా ఆమె పాతకాలపు చీరలు, టైలర్డ్ సూట్‌లు లేదా మినిమలిస్టిక్ సిల్హౌట్‌లు లాంటి కాండిడ్ ఫ్యాషన్ సె¯Œ ్సకు ప్రసిద్ధి చెందింది.
ఆమె ఫ్యాషన్‌ను కేవలం ధరించదు దాని ద్వారా ఓ చక్కని కథ చెబుతుంది ఆమె రెడ్ కార్పెట్ ఎడిటోరియల్ లుక్స్ జాగ్రత్తగా క్యూరేట్ చేయబడినట్లు అనిపిస్తుంది, తద్వారా హస్తకళను ప్రదర్శించే హెరిటేజ్ బ్రాండ్‌లకు ఆమె సరైన ప్రతినిధిగా మారింది. ఆమెకు ఇంటెలక్చ్యువల్ లుక్స్ ఓ వరం. ఆమె తరచుగా సాహిత్యం, కళ చరిత్ర గురించి అనర్గళంగా మాట్లాడుతుంది, ఇవి ఆమెను కేవలం ఒక గ్లామర్ క్వీన్‌గా మాత్రమే కాకుండా ఆలోచనా పటిమ కలిగిన శక్తివంతమైన మహిళగా చూపిస్తోంది. ఈ మేధోపరమైన ఆకర్షణ ఆమెను సంస్కారవంతమైన, వివేకం గల వినియోగదారులను లక్ష్యంగా చేసుకునే బ్రాండ్‌లు ఎంచుకోవడానికి కారణమవుతోంది. శోభితా ధూళిపాలా ఆధునిక అందపు స్టైలిష్ లుక్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచుతుందని నిరూపితం కావడమే ఆమె మరిన్ని బ్రాండ్స్‌తో పనిచేసేందుకు ఉపకరిస్తోంది.