లాహోర్: ఇకపై పాకిస్తాన్ క్రికెటర్ల ఆహార నియమావళి పూర్తిగా మారిపోనుంది. ఫిట్‌నెస్ ప్రమాణాలు పెంచి ఆటగాళ్లు మైదానంలో మరింత చురుగ్గా ఉండేలా చేసేందుకు బిర్యానీతో పాటు నూనె ఎక్కువగా వాడి వండే రెడ్ మీట్, మిఠాయిలకు దూరంగా ఉంచాలని హెడ్ కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బా ఉల్ హక్ యోచిస్తున్నాడు. జాతీయ శిబిరంతో పాటు దేశవాళీ టోరీ్నల్లో ఈ మేరకు డైట్ అమలు చేయాలని అతడు కోరాడు. వన్డే ప్రపంచ కప్‌లో జూన్ 16న టీమిండియాతో కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ క్రికెటర్లు పిజ్జాలు–బర్గర్లు తింటున్న వీడియోను అభిమాని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జంక్ ఫుడ్ నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనికితోడు కప్‌లో పాక్ ఆటగాళ్ల ఫిట్‌నెస్ పైనా జోకులు పేలాయి. వీటన్నిటి కారణంగా మిస్బా... డైట్‌పై దృష్టి పెట్టాడు. పాక్ ఈ నెల 27 నుంచి స్వదేశంలో శ్రీలంకతో వన్డే, టి20 సిరీస్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment