
గాయాలతో బాధపడి, అందులో నుంచి బయటపడి మరింత ఫిట్‌గా మారుతున్న ఆయన జర్నీ అద్భుతం
మహేశ్‌బాబు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంటున్నారు ఆయన ఫిట్‌నెస్ ట్రైనర్ మినాష్ గబ్రిఏల్. మహేశ్ గురించి మినాష్ మాట్లాడుతూ– ‘‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ కోసం మేం దుబాయ్ వచ్చి 30 రోజులయింది. ఇక్కడి కొచ్చాక ఒక్కరోజు కూడా జిమ్‌ను మిస్ చేయలేదు మహేశ్. షూటింగ్ పూర్తి చేసుకోవడం, వర్కౌట్ చేయడం ఆయన దినచర్య.
వర్కౌట్స్ సాయంత్రాలు చేస్తున్నాం. సెట్‌లో ఎంత శ్రమించినా వర్కౌట్స్ దగ్గర రాజీపడరు. 2019 నుంచి ఆయనకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా చేస్తున్నాను. గాయాలతో బాధపడి, అందులో నుంచి బయటపడి మరింత ఫిట్‌గా మారుతున్న ఆయన జర్నీ అద్భుతం. అందరి వయసు పెరుగుతున్నా మహేశ్ వయసు తగ్గుతోంది’’ అన్నారు.