![Mahesh Babu Flying To Dubai For Sarkaru Vaari Paata Shooting - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/17/Mahesh-babu.jpg.webp?itok=6tZ0i7zB)
దుబాయ్ వెళ్లడానికి రెడీ అవుతున్నారు మహేశ్‌బాబు. ఫ్యామిలీతో అప్పుడప్పుడూ హాలిడే ట్రిప్ వెళ్తారు కదా.. ఈ ప్రయాణం అది కాదు. ‘సర్కారువారి పాట’ షూటింగ్ కోసమే దుబాయ్ వెళ్తున్నారట. పరుశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను ఈ నెకాఖరున దుబాయ్‌లో ఆరంబించాలనుకుంటున్నారని తెలిసింది. అక్కడ ఇరవై రోజుల పాటు చిత్రీకరణ జరిపి, హైదరాబాద్ వస్తారట. అనంతరం ఇక్కడి ఓ ప్రముఖ స్టూడియో వేసిన భారీ సెట్‌లో పాట చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని సమాచారం.
(చదవండి : మహేశ్ బాబు అందానికి సీక్రెట్ అదే : విష్ణు)
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ స్టోరీ సాగుతోందని.. మహేశ్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం.ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment