
ఇటీవలే కుటుంబంతో కలసి హాలిడేకు వెళ్లారు మహేశ్‌బాబు. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో దుబాయ్‌లో ఓ వారం పాటు చిన్న ట్రిప్‌ను ఎంజాయ్ చేశారు. దీపావళిని కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ట్రిప్‌కి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. తాజాగా దుబాయ్‌కి బై చెప్పేశారు. ట్రిప్ ముగించుకుని ఇండియా తిరిగొచ్చారు.
‘‘తెల్లవారుజాము 3 గంటలకు ఇంత బాగా ఎవరు కనబడతారు? ఇంత అందమైన వ్యక్తి ఎదురుగా కూర్చుంటే టైమ్ ఎలా గడిచిపోతోందో కూడా తెలియదు. జీవితం చాలా అందంగా ఉంది. ప్రేమ కోసం బతకాలి’’ అంటూ ఎయిర్ పోర్ట్‌లో తీసిన భర్త ఫొటోను షేర్ చేశారు నమ్రత. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా కమిట్ అయ్యారు మహేశ్. త్వరలోనే ఈ చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ శాతం అమెరికాలోనే జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment