
SSMB29: Mahesh Babu SS Rajamouli To Discuss Script In Dubai: మహేశ్‌బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ షూటింగ్ పూర్తయింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా స్టార్ట్ కావాల్సిన సినిమా షూటింగ్‌కు కాస్త సమయం ఉంది. దీంతో వేసవి వెకేషన్ కోసం ఆయన దుబాయ్ వెళ్లారని తెలిసింది. ఈ వెకేషన్‌ను పూర్తి చేసుకుని వచ్చాక ‘సర్కారువారి పాట’ ప్రమోషన్స్‌లో పాల్గొంటారు మహేశ్. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా దర్శక ధీరుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో సినిమా రావాలని ప్రేక్షకులు, అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అయితే మహేశ్ బాబు లానే జక్కన్న కూడా దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. తమ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన కథా చర్చల్లో భాగంగానే మహేశ్, రాజమౌళి దుబాయ్ వెళ్లారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
చదవండి: ప్రభాస్, మహేశ్ బాబును దాటేసిన విజయ్ దేవరకొండ..
చదవండి: ఈవీ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేశ్
Comments
Please login to add a commentAdd a comment