Script Work
-
ఇండియాలోనే తొలిసారిగా స్క్రిప్ట్ బ్యాంక్.. లాంచ్ చేసిన భారతీరాజా
తమిళసినిమా: సాధారణంగా డబ్బులు పొదుపు చేసుకోవడానికి, అవసరమైనప్పుడు వాడుకోవడానికి బ్యాంకులను ఉపయోగిస్తుంటాం. అలాంటిది ఇప్పుడు సినిమా దర్శక నిర్మాతల కోసం ఒక కథల బ్యాంకు ప్రారంభమైంది. స్క్రిప్ట్ టిక్ పేరుతో గీత రచయిత మదన్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధనుంజయన్ కలిసి నెలకొల్పారు. ఈ బ్యాంకును ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా శనివారం ఉదయం ప్రారంభించారు. ప్రతిభావంతులైన రచయితల కథనాలను చదివి వాటిలో మంచి కథలను ఎంపిక చేసి చిత్ర నిర్మాణానికి సిద్ధం చేసి దర్శక నిర్మాతలకు అందించే విధంగా ఏర్పాటు చేసిన కొత్త ప్రయత్నమే ఈ బ్యాంక్ అని వెల్లడించారు. ప్రస్తుతం వస్తున్న చాలా చిత్రాల్లో కథ, కథనాలు సరిగ్గా ఉండడం లేదన్నారు. అందుకే చాలా వరకు చిత్రాలు ఫ్లాప్ అవుతున్నాయన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకునే ప్రతిభావంతులైన కథా రచయితలు, దర్శకులు, నిపుణులు అందించిన కథలతో చిత్రాలు చేస్తే కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతారని అన్నారు. అలాంటి ప్రయత్నంతోనే ఈ బ్యాంకును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పలువురు ప్రతిభావంతులైన రచయితలను ప్రోత్సహించడం, వారికి తగిన పారితోషికాన్ని అందించడం తమ లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు. నిర్మాతలు పలు కథలను విని వాటిలో ఒకటి, రెండు ఎంపిక చేసుకోవడం కాకుండా మంచి కథ మాత్రమే చదివి చిత్రాలు చేయడం వల్ల సమయం ఆదా అవుతుందన్నారు. అదే విధంగా తక్కువ సమయంలో పలు చిత్రాలు నిర్మించే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి మంచి కథలను అందించడమే తమ స్క్రిప్ట్ టిక్ బ్యాంకు ఉద్దేశమని పేర్కొన్నారు. Creative initiative 👏#SCRIPTick - India's First Script Bank launched by @offBharathiraja sir - Will be valuable for script Writers & Producers Best wishes@madhankarky @Dhananjayang @karundhel @onlynikil@scriptickindiahttps://t.co/0upoHpY9x7 https://t.co/3Gf8E7Td9u pic.twitter.com/o2HdMaPtP7 — Ajay Srinivasan (@Ajaychairman) February 11, 2023 -
పనులు ప్రారంభం
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు రాజమౌళి. ‘‘నా సినిమాలకు మా నాన్నగారు (ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్) కథలు అందిస్తుంటారు. నేను ఎప్పట్నుంచో ఓ అడ్వెంచర్ స్టోరీ చేయాలనుకుంటున్నాను. రెండు నెలల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ మొదలయ్యాయి’’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి పేర్కొన్నారు. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. -
దుబాయ్‌కు వెళ్లిన మహేశ్ బాబు.. అందుకోసమేనా ?
SSMB29: Mahesh Babu SS Rajamouli To Discuss Script In Dubai: మహేశ్‌బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ షూటింగ్ పూర్తయింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా స్టార్ట్ కావాల్సిన సినిమా షూటింగ్‌కు కాస్త సమయం ఉంది. దీంతో వేసవి వెకేషన్ కోసం ఆయన దుబాయ్ వెళ్లారని తెలిసింది. ఈ వెకేషన్‌ను పూర్తి చేసుకుని వచ్చాక ‘సర్కారువారి పాట’ ప్రమోషన్స్‌లో పాల్గొంటారు మహేశ్. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా దర్శక ధీరుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో సినిమా రావాలని ప్రేక్షకులు, అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అయితే మహేశ్ బాబు లానే జక్కన్న కూడా దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. తమ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన కథా చర్చల్లో భాగంగానే మహేశ్, రాజమౌళి దుబాయ్ వెళ్లారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. చదవండి: ప్రభాస్, మహేశ్ బాబును దాటేసిన విజయ్ దేవరకొండ.. చదవండి: ఈవీ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేశ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రుధిరం, టాల్కం పౌడర్, పోస్కో.. నావల్ల కాదు
AI Usage In Media: రుధిరం మనపైన పగబట్టిందా? రుధిరం చేస్తున్న రణాన్ని మనం ఆపలేమా? రుధిరం ఊడిపడుతుందా? పళ్లు తోముకునే టాల్కం పౌడర్‌లో.. పోస్కో చట్టం.. అఫ్కోర్స్.. ఇలాంటి పొరపాట్లు మానవ సహజం. కానీ, ఇదే తప్పులు చేయడం నా వల్ల కాదు బాబోయ్. నిజం.. నమ్మండి. ఎందుకంటే నేను మనిషిని కాను.. టెక్నాలజీని. నా పేరు అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ. కృత్రిమ మేధస్సు(AI).. నా గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. అయినా ఓసారి నా గురించి మళ్లీ పరిచయం చేసుకుంటా. మనిషికి శారీరక శ్రమ, ఖర్చులను తగ్గిస్తూ.. బోలెడంత సమయాన్ని ఆదా చేసే ఉద్దేశంతో తయారు చేసిన టెక్నాలజీని నేను. ఒక ప్రాజెక్టులో డిజైన్ దగ్గరి నుంచి దాని పనితీరును పర్యవేక్షించడం దాకా ప్రతీది నా పనే. ఇప్పటికే చాలా రంగాలు నామీద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి వాడేసుకుంటున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావడంతో అందరి ఆసక్తి ఇప్పుడు నా మీదే ఉంటోంది. పెట్టిన ఖర్చుకు మూడు, నాలుగు రెట్లు ఆదాయాన్ని వెనకేసుకుంటున్నాయి. అయితే మీడియా రంగంలోనూ నన్ను విస్తృత స్థాయిలో వినియోగించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. అది ఎలాగో మీకు చెప్పాలన్నదే నా ప్రయత్నం. రైటింగ్ మీడియా హౌజ్‌ల కంటే పర్సనల్ బ్లాగులు నడిపించేవాళ్లే నన్ను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు. హెడ్ లైన్స్ రాయడం దగ్గరి నుంచి మొదలుపెట్టి.. టోటల్ స్క్రిప్ట్ రాయడం దాకా అంతా నేనే చూసుకుంటా. తప్పులు లేకుండా అక్షరాల్ని అందించడం, పదాల ఫ్రేమింగ్, ‘సెన్సేషన్’ హెడ్డింగ్‌లకు బదులు ఆ కథనాలకు సరిపోయే అందమైన హెడ్డింగులు అందించడం నా పనే ఇంక. అయితే అంతకంటే ముందు అవతలి వాళ్లు తమకు ఏం కావాలో అనే ఆలోచనలను నాతో పంచుకోవాల్సి ఉంటుంది(కమాండింగ్ రూపంలో). అప్పుడే అందుకు తగ్గ రీసెర్చ్, సెర్చ్ చేసి కావాల్సిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేయగలను నేను. ఏఐ యాంకర్స్ రోబోలకు అడ్వాన్స్డ్ వెర్షన్.. మా ఏఐ రూపాలు. అంటే రోబోటిక్ టెక్నాలజీతో సంబంధం లేకుండా మా ప్రతిరూపాల్ని తయారు చేస్తారన్నమాట. అచ్చం మనుషుల్లాగా అవతలి వాళ్లను భ్రమింపజేస్తూ ఎలాంటి తప్పులు లేకుండా వార్తలను చదివి వినిపిస్తాం. ఇప్పటికే చైనా, దక్షిణ కొరియా లాంటి దేశాలు ప్రైమ్ టైం న్యూస్ యాంకర్లుగా మా సాంకేతికతను వాడేసుకుంటున్నాయి. ఇంతేకాదు టెక్నికల్ డిపార్ట్మెంట్స్లోనూ నెమ్మదిగా మా హవా మొదలవుతోంది ఇప్పుడు. స్టూడియో సెట్స్ గ్రాఫిక్స్‌లో ఇప్పుడు మాకే అగ్రతాంబూలం ఇస్తున్నారు. టెక్నాలజీని ఆదరించే భారత్‌లో అతితొందర్లోనే మమ్మల్ని కాస్తో కూస్తో ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అయితే మేం ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నా.. మమ్మల్ని రూపొందించిన మనుషుల మేధస్సుకే మొత్తం గొప్పదనం దక్కాలని మేమూ కోరుకుంటున్నాం. - ఇట్లు మీ AI రాబోయే రోజుల్లో ఏఐ జనరేటెడ్ కంటెంట్‌కు త్వరలో ఫుల్ డిమాండ్ ఉంటుందనేది నిపుణులు చెప్తున్న మాట. కానీ, ఆటోమేషన్ వల్ల మీడియా రంగంలోనే కాదు.. దాదాపు అన్ని రంగాల్లో ఉద్యోగ భద్రత ఉండదనేది ఒప్పుకోవాల్సిన చేదు నిజం. -
కథలు రాస్తున్నా
‘‘రాబోయే రోజుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఈ సమయాన్ని అసంతృప్తిగా గడపవద్దు. నేనలా చేయను. జీవితంలో నేను సంతోషంగా ఉండటానికి ఇదొక ముఖ్య కారణం’’ అంటున్నారు రాధికా ఆప్టే. ఈ లాక్డౌన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? అనే ప్రశ్నను రాధికా ఆప్టే ముందుంచితే – ‘‘ఎనిమిదేళ్లుగా విరామం లేకుండా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాను. ఈ లాక్డౌన్ వల్ల కాస్త రిలాక్స్ కావడానికి సమయం దొరికినట్లయింది. కొన్ని స్క్రిప్ట్స్ కూడా రాశాను. ఇంకొన్ని రాయాలనుకుంటున్నాను. కానీ సమయం గడిచే కొద్దీ ఈ లాక్‌డౌన్‌తో నాలో కొత్త ఆలోచనలు కలుగుతున్నాయి. సినిమా కెరీర్‌ను పక్కన పెట్టి ఓ రెస్టారెంట్ ఆరంభిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన కూడా వచ్చింది (నవ్వుతూ)’’ అని పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఇటీవల ఓ షార్ట్‌ఫిల్మ్‌ను డైరెక్ట్ చేశారట రాధిక. అది ఓ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా ఎంపికయిందట. ఈ సినిమా వివరాలను త్వరలోనే చెబుతా అన్నారు రాధికా ఆప్టే. -
కథలు వండుతున్నారు
లాక్ డౌన్ సమయాల్లో కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు స్టార్స్. ఒకరు గరిటె పట్టుకుని వంట గదిలోకి అడుగుపెడితే, మరొకరు యోగా మ్యాట్ మీద ధ్యానంపై దృష్టి పెడుతున్నారు. నిత్యా మీనన్ తనలో ఉన్న కథకురాలిని బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారట. కథలు వండే పని మీద ఉన్నారు. ఈ విషయం గురించి నిత్యా మీనన్ మాట్లాడుతూ –‘‘లాక్ డౌన్ వల్ల పరిసరాలు ఎంతో ప్రశాంతంగా మారిపోయాయి. ఈ ప్రశాంతతని ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే కొన్ని కథలు సిద్ధం చేస్తున్నాను. కొంత కాలంగా నా మైండ్‌లో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. యాక్టర్‌గా బిజీగా ఉండటంతో కథలు డెవలప్ చేయలేకపోయాను. వాటిని అభివృద్ధి చేయడానికి ఇది బెస్ట్ టైమ్. వీటితో పాటు కొత్త భాష నేర్చుకుంటున్నాను. సంగీతం కూడా నేర్చుకుంటున్నాను. యోగా చేస్తున్నాను’’ అన్నారు. -
స్క్రిప్ట్ రైటర్ ప్రసంగాలు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, నరేంద్ర మోదీలు ప్రజలకు సత్యదూరమైన మాటలు చెబుతున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. స్క్రిప్ట్ రైటర్ల ప్రసంగాలు.. మసాలా జోడించే అనువాదకులతో ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంకాని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. శుక్రవారం నిజామాబాద్‌లో కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపుబోర్డు కోసం తాను పార్లమెంట్లో ప్రశ్నిస్తే.. రాహుల్‌తో సహా కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు మద్దతు తెలుపలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికల వేళ పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. పసుపు రైతుల పట్ల రాహుల్‌కు చిత్తశుద్ధి ఉంటే ప్రధానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ బాధితులపై రాహుల్ మొసలి కన్నీళ్లు కార్చారని విమర్శించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలు పేదరికం, అక్షరాస్యత వంటి అనేక రంగాల్లో వెనుకబడిందనే విషయాన్ని గమనించాలని కోరారు. పసుపుబోర్డు, ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు, తెలంగాణ పరిశ్రమలకు రాయితీలు వంటి అంశాలపై త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీల పోరాటానికి రాహుల్ మద్దతిస్తారా అని ప్రశ్నించారు. అమరులను చేసింది కాంగ్రెస్సే తెలంగాణ ప్రజల కలను సాకారం చేయకుండా 60 ఏళ్లు జాప్యం చేసింది, తెలంగాణ బిడ్డలను అమరులను చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయేనన్న విషయం గుర్తుంచుకోవాలని కవిత అన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో 22 వేల ఉద్యోగాలిచ్చారని, తమ ప్రభుత్వం నాలుగేళ్లలో 30 వేల ఉద్యోగాలిచ్చిందని వివరించారు. నిజామాబాద్‌లో మాట్లాడుతున్న ఎంపీ కవిత -
క్లైమాక్స్ కూడా రెడీ!
స్టార్టింగ్... ఇంటర్వెల్... క్లైమాక్స్... ఏ సినిమాకైనా ఈ మూడూ ఇంపార్టెంట్. దర్శక–రచయితలు ఎవరికి కథ చెప్పినా... మెయిన్‌గా ఈ మూడూ మిస్ కారు. కానీ, తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ అలా కాదు. ఆయనది సెపరేట్ స్కూల్. ఏ కథ రాసినా, ఇతర రచయితల దగ్గర కథలు తీసుకున్నా... చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు సినిమా క్లైమాక్స్ రాసే అలవాటు ఈయనకు లేదు. సగం షూటింగ్ పూర్తయ్యాక, అప్పటివరకూ వచ్చిన రషెస్ చూసుకుని ఓ ఐడియాకు వచ్చిన తర్వాత క్లైమాక్స్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైమ్... ఓ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే తర్వాతి సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను క్లైమాక్స్‌తో సహా కంప్లీట్ చేశారు గౌతమ్ మీనన్. అదే... తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో, నాలుగు భాషల్లోని నలుగురు హీరోలతో తీయనున్న మల్టీస్టారర్ ఫిల్మ్. ఓ పెళ్లిలో కలసిన నలుగురు స్నేహితులు, అక్కణ్ణుంచి అడ్వంచరస్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఏం జరిగిందనేది ఈ చిత్రకథట! గౌతమ్ మీనన్ మాట్లాడుతూ– ‘‘హీరోలు పృథ్వీరాజ్ (మలయాళం), నాగచైతన్య (తెలుగు), పునీత్ రాజ్‌కుమార్ (కన్నడ), హీరోయిన్లు అనుష్క, తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు కూడా చేశారు. శింబు (తమిళం) గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నా. మంజిమా మోహన్, నివేదా థామస్లలో ఎవరో ఒకరు సినిమాలో నటించే ఛాన్సుంది. ఫస్ట్ టైమ్ నేను క్లైమాక్స్‌తో సహా స్క్రిప్ట్ వర్క్ చేశా’’ అన్నారు. -
రాజుగారి గది
‘జీనియస్’ చిత్రంతో దర్శకునిగా మారిన ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఓంకార్... దర్శకునిగా తన ద్వితీయ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తన తమ్ముడు అశ్విన్ కథానాయకునిగా ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. హారర్ కామెడీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రానికి ‘రాజుగారి గది’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఓ ప్రముఖ టీవీ చానల్ సౌజన్యంతో ఈ చిత్రం రూపొందనుందని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని వినికిడి. వచ్చేనెల తొలివారంలో సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.